Support programs
-
తేరుకుంటున్న చెన్నై
► కూలిన చెట్ల మధ్య జన జీవనం ►సహాయ కార్యక్రమాలు ముమ్మరం ►రెండు నౌకల్లో ఆహారం ►మరో రెండు రోజులు వర్షాలు ►నేడు విద్యాసంస్థలకు సెలవు వర్దా తుపాను తీవ్రతతో తమిళనాడు ప్రజలు తల్లడిల్లిపోయారు.కూలిపోయిన భారీ వృక్షాల మధ్య చిక్కుకుపోయారు. బైటకు వచ్చే వీలులేక ఇళ్లలోనే బందీలుగా మారిపోయారు. తినేందుకు అన్నం, తాగేందుకు నీళ్లు లేక తిప్పలు పడుతున్నారు. సాక్షి ప్రతినిధి, చెన్నై: వర్దా తుపాను తమిళనాడులోని నాలుగు జిల్లాల ప్రజలను వణికించింది. తుపాను తీరం దాటే సమయంలో గంటకు 130–140 కిలో మీటర్ల వేగంతో వీచిన బలమైన గాలులకు భయపడిపోయిన ప్రజలు సోమవారం రాత్రి వరకు ఎవ్వరూ ఇళ్ల నుంచి బైటకు రాలేదు. ముందు జాగ్రత్త చర్యగా విద్యుత్ సరఫరా నిలిపివేయడంతో రాత్రంతా ప్రజలు చిమ్మచీకట్లో గడిపారు. తెల్లారేసరికి సా«ధారణ పరిస్థితులు నెలకొని ఉంటాయని ఆశించిన ప్రజలు రోడ్లలోని పరిస్థితులను చూసి బిత్తరపోయారు. ఎటుచూసినా నేలకొరిగిన భారీ వృక్షాలు, విద్యుత్ స్తంభాలు. వాటికింద పడి నలిగిపోయిన కార్లు, ఆటోలు, ద్విచక్ర వాహనాలు దర్శనమిచ్చాయి. చెన్నై, తిరువళ్లూరు, కాంచీపురం తదితర జిల్లాల ప్రజలు వర్దా తుపానుతో విలవిల్లాడిపోయారు. తుపానులో చిక్కుకున్న పది వేల మందిని సహాయక బృందాలు రక్షించాయి. చెన్నై పరిసరాల్లో సిటీ బస్సులు, ఆటో, లోకల్ రైళ్ల రవాణా పూర్తిగా స్తంభించిపోయింది. తుపాను తీవ్రస్థాయికి చేరుకోవడంతో బస్సుల్లోని ప్రజలను మధ్యలోనే దించి వేశారు. దీంతో ఇతర ప్రాంతాల నుంచి నగరానికి వచ్చిన ప్రజలు రాత్రంతా చీకట్లోనే గడిపి, తెల్లారిన తరువాత కిలోమీటర్ల దూరం నడిచి గమ్యాలకు చేరుకున్నారు. అనేక చోట్ల ఇళ్లు, వ్యాపార సంస్థల పైకప్పులు గాలికి ఎగిరిపోయాయి. చెన్నై ప్రజలు ఎంతగానో ఇష్టపడే అందమైన పనగల్ పార్కు అందవిహీనంగా మారిపోయింది. పూర్తిస్థాయిలో విద్యుత్ పునరుద్ధరణకు మూడు రోజులు పడుతుందని విద్యుత్‌శాఖా మంత్రి తంగమణి ప్రకటించారు. మంగళవారం సాయంత్రానికి నగరంలో పాక్షికంగా విద్యుత్ పునరుద్ధరణ చేశారు. తిరువొత్తియూరు, ఎన్నూరులలో సముద్రంలో కెరటాలు ఎగిసిపడుతున్నాయి. సోమవారం ఒక్కరోజునే చెన్నైలో 38 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. కాంచీపురం పుదూరు వద్ద వరద ప్రవాహంలో కొట్టుకుపోతున్న 9 మందిని మంగళవారం సాయంత్రం స్థానిక గజ ఈతగాళ్లు రక్షించారు. చెంగల్పట్టు జిల్లాలో వెయ్యి ఇళ్లు నీటమునిగాయి.తుపాను తాకిడితో నిత్యావసర వస్తువుల ధరలు మరింత ప్రియంగా మారిపోయాయి. అరలీటర్ పాల పాకెట్టు ధర రూ.50 పలికింది. తుపాను బాధితుల సహాయార్థం రెండు నౌకల్లో ఆహార పదార్థాలు చెన్నైకి చేరుకున్నాయి. మరో రెండు రోజులు వర్షాలు చెన్నై నగరాన్ని వణికించిన వర్దా తుపాను తీరం దాటి సోమవారం అర్ధరాత్రి కర్ణాటక వైపు పయనించినా రాష్ట్రంలో మరో రెండురోజులు వర్షాలు పడే అవకాశం ఉందని చెన్నై వాతావరణ శాఖ డైరెక్టర్ బాలచంద్ర¯ŒS మంగళవారం తెలిపారు. చెన్నైతోపాటూ ఉత్తరాది జిల్లాల్లో వర్షాలు కొనసాగే అవకాశం ఉందని ఆయన అన్నారు. చెన్నై, తిరువళ్లూరు, కాంచీపురం జిల్లాల్లో విద్యాసంస్థలకు బుధవారం కూడా ప్రభుత్వం సెలవు ప్రకటించింది. -
జమ్మూలో యుద్ధప్రాతిపదికన సహాయం
శ్రీనగర్: జలవిలయంతో తీవ్రంగా దెబ్బతిన్న జమ్మూ కాశ్మీర్లో సహాయకచర్యలు యుద్ధప్రాతిపదికన కొనసాగుతున్నాయి. 86 విమానాలు, పలు హెలికాప్టర్లతో ఈ సహాయక చర్యలు చేపట్టారు. ఇప్పటివరకూ వరద బాధితులకు 4లక్షల లీటర్ల మంచినీరు సరఫరా చేయగా, 800 టన్నుల ఆహారాన్ని అందజేశారు. ఇందులో 1.31 లక్షల ఆహార పొట్లాలను పంపిణీ చేశారు. ఇదిలా ఉండగా, నీటిని శుభ్రపరిచేందుకు 13 టన్నుల నీటిని శుద్ధిచేసే టాబ్లెట్లను కూడా వరద బాధితులకు అందజేశారు. జమ్మూలో జలదిగ్బంధమైన ప్రాంతాలకు యంత్రాలను, జనరేటర్లను తరలించే మురిగి నీటిని తొలగించేందుకు యత్నాలు చేస్తున్నారు. వరద ముంపుకు గురైన వారిని 224 బోట్లు ద్వారా సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. ఇప్పటికే చాలామందిని రక్షించి సురక్షిత ప్రాంతాలకు తరలించగలిగినా.. ఇంకా భారీగా ప్రజలు జలదిగ్బంధంలోనే ఉన్నారు. వర్షాలు తగ్గుముఖం పట్టడంతో భారీ ఎత్తున సహాయ కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. మరో వైపు, వరదనీరు తగ్గనిచోట్ల బాధితులు ఇంకా ఇళ్లపైకప్పులపైనే గడుపుతున్నారు. భారీవర్షాలు వరదల్లో కొండచరియలు విరిగిపడటం, ఇళ్లుకూలడం వంటి సంఘటనల్లో ఇప్పటివరకూ దాదాపు 200మంది ప్రాణాలు కోల్పోయారు. సహాయ కార్యక్రమాల్లో సైన్యం, ఎన్డీఆర్ఎఫ్, నావికాదళం నిర్విరామంగా పాల్గొంటున్నాయి. -
యుద్ధప్రాతిపదికన సహాయం
కాశ్మీర్ జలవిలయం మృతుల సంఖ్య 200 25,000 మంది సుర క్షిత ప్రాంతాలకు తరలింపు శ్రీనగర్/జమ్మూ: గత అరవైఏళ్లలో కనీవినీ ఎరుగని స్థాయిలో సంభవించిన వరద బీభత్సంతో అతలాకుతలమైన జమ్మూ కాశ్మీర్లో యుద్ధప్రాతిపదికన సహాయ కార్యక్రమాలు కొనసాగుతూ ఉన్నాయి. మరో వైపు కాశ్మీర్ లోయలో లక్షలాది మంది ఇంకా వరద ప్రాంతాల్లో చిక్కుకుపోయి ఉన్నారు. రాజధాని శ్రీనగర్‌కు దేశంతో టెలి కమ్యూనికేషన్లు దెబ్బతినడంతో పరిస్థితి మరింత విషమించింది. వరదల్లో మృతుల సంఖ్య 200కు చేరుతోంది. సహాయ కార్యక్రమాలకోసం మరిన్ని జాతీయ విపత్తు ప్రతిస్పందన దళం (ఎన్డీఆరెఫ్) బృందాలను కేంద్రం హుటాహుటిన పంపించింది. సహాయ కార్యక్రమాల్లో తొలిసారిగా నావికాదళం కూడా ప్రవేశించింది. ఇప్పటివరకూ సైన్యం, వైమానికదళం, ఎన్డీఆర్ఎఫ్, జమ్మూ కాశ్మీర్ సంస్థలు కలసి 25వేలమందిని సురక్షిత ప్రాంతాలకు తరలించాయి. గత మంగళవారం నుంచి కురుస్తున్న కుండపోత వర్షాల అనంతరం సోమవారం శ్రీనగర్‌సహా కాశ్మీర్ లోయలోని ఇతర ప్రాంతాల్లో జల్లులు మాత్రమే కురవడం కొంత ఉపశమనం కలిగించింది. చాలావరకూ వరద ప్రాంతాల్లో నీరు క్రమంగా తగ్గుముఖం పట్టింది. శ్రీనగర్‌లోని దాల్ సరస్సులో మాత్రం నీటిమట్టం పెరుగుతోంది. అయితే, కాశ్మీర్‌లోయ ముప్పు ఇంకా తొలగిపోలేదని సైన్యం అధికారులు తెలిపారు. వరదనీటినుంచి తప్పించుకునేందుకు శ్రీనగర్‌లో పలువురు ఇంకా తమ ఇళ్లపైకప్పులపైన, పై అంతస్తులపైన గడుపుతున్నారు. కాశ్మీర్‌లోయకు, దేశంలోని ఇతర ప్రాంతాలతో టెలికమ్యూనికేషన్లు తె గిపోవడంతో శాటిలైట్ వ్యవస్థ ద్వారా మొబైల్ సర్వీసులను పునరుద్ధరించేందుకు బీఎస్ఎన్ఎల్, సైన్యం, వైమానికదళం యుద్ధప్రాతిపదికన కృషిచేస్తున్నాయి. వరదలతో ఇంట ర్నెట్ అనుసంధానం కూడా దెబ్బతిన్నదని అధికారులు తెలిపారు. సైన్యం, ప్రభుత్వ అధికారులు ప్రస్తుతానికి శాటిలైట్ ఫోన్లతోనే పనులు నిర్వర్తిస్తున్నారు. తిరిగి పనిచేస్తున్న 90 టవర్లు కాశ్మీర్‌లోయలోని త్రీ-జీ టెలికం సర్వీసుకు సంబంధించిన 90 టవర్లు తిరిగి పనిచేయడం ప్రారంభించాయి. కీలకమైన కమ్యూనికేషన్ టవర్ల పునరుద్ధరణకోసం 10 వీశాట్ వ్యవస్థలను విమానాలద్వారా తరలిస్తున్నట్టు ఓ అధికారి చెప్పారు. లోయ రోడ్లను పునరుద్ధరించేందుకు ఏడురోజుల వ్యవధి పడుతుందన్నారు. కాగా, కాశ్మీర్ వరద పరిస్థితిపై ప్రధాని నరేంద్రమోడీ సత్వరం స్పందించిన తీరు, తీసుకున్న చర్యలపట్ల కాంగ్రెస్ నేతలు దిగ్విజయ్, ఆజాద్ హర్షం వ్యక్తం చేశారు.