యుద్ధప్రాతిపదికన సహాయం | PM Modi visits Kashmir after floods kill 200 | Sakshi
Sakshi News home page

యుద్ధప్రాతిపదికన సహాయం

Published Tue, Sep 9 2014 1:40 AM | Last Updated on Sat, Sep 2 2017 1:04 PM

యుద్ధప్రాతిపదికన సహాయం

యుద్ధప్రాతిపదికన సహాయం

కాశ్మీర్ జలవిలయం మృతుల సంఖ్య 200
25,000 మంది సుర క్షిత ప్రాంతాలకు తరలింపు

 
శ్రీనగర్/జమ్మూ: గత అరవైఏళ్లలో కనీవినీ ఎరుగని స్థాయిలో సంభవించిన వరద బీభత్సంతో అతలాకుతలమైన జమ్మూ కాశ్మీర్‌లో యుద్ధప్రాతిపదికన సహాయ కార్యక్రమాలు కొనసాగుతూ ఉన్నాయి. మరో వైపు కాశ్మీర్ లోయలో లక్షలాది మంది ఇంకా వరద ప్రాంతాల్లో చిక్కుకుపోయి ఉన్నారు. రాజధాని శ్రీనగర్‌కు దేశంతో టెలి కమ్యూనికేషన్లు దెబ్బతినడంతో పరిస్థితి మరింత విషమించింది. వరదల్లో మృతుల సంఖ్య 200కు చేరుతోంది. సహాయ కార్యక్రమాలకోసం మరిన్ని జాతీయ విపత్తు ప్రతిస్పందన దళం (ఎన్డీఆరెఫ్) బృందాలను కేంద్రం హుటాహుటిన పంపించింది. సహాయ కార్యక్రమాల్లో తొలిసారిగా నావికాదళం కూడా ప్రవేశించింది.

ఇప్పటివరకూ సైన్యం, వైమానికదళం, ఎన్డీఆర్‌ఎఫ్, జమ్మూ కాశ్మీర్ సంస్థలు కలసి 25వేలమందిని సురక్షిత ప్రాంతాలకు తరలించాయి. గత మంగళవారం నుంచి కురుస్తున్న కుండపోత వర్షాల అనంతరం సోమవారం శ్రీనగర్‌సహా కాశ్మీర్ లోయలోని ఇతర ప్రాంతాల్లో జల్లులు మాత్రమే కురవడం కొంత ఉపశమనం కలిగించింది. చాలావరకూ వరద ప్రాంతాల్లో నీరు క్రమంగా తగ్గుముఖం పట్టింది. శ్రీనగర్‌లోని దాల్ సరస్సులో మాత్రం నీటిమట్టం పెరుగుతోంది. అయితే, కాశ్మీర్‌లోయ ముప్పు ఇంకా తొలగిపోలేదని సైన్యం అధికారులు తెలిపారు. వరదనీటినుంచి తప్పించుకునేందుకు శ్రీనగర్‌లో పలువురు ఇంకా తమ ఇళ్లపైకప్పులపైన, పై అంతస్తులపైన గడుపుతున్నారు.

 కాశ్మీర్‌లోయకు, దేశంలోని ఇతర ప్రాంతాలతో టెలికమ్యూనికేషన్లు తె గిపోవడంతో శాటిలైట్ వ్యవస్థ ద్వారా మొబైల్ సర్వీసులను పునరుద్ధరించేందుకు బీఎస్‌ఎన్‌ఎల్, సైన్యం, వైమానికదళం యుద్ధప్రాతిపదికన కృషిచేస్తున్నాయి. వరదలతో ఇంట ర్‌నెట్ అనుసంధానం కూడా దెబ్బతిన్నదని అధికారులు తెలిపారు. సైన్యం, ప్రభుత్వ అధికారులు ప్రస్తుతానికి శాటిలైట్ ఫోన్లతోనే పనులు నిర్వర్తిస్తున్నారు.  

తిరిగి పనిచేస్తున్న 90 టవర్లు

కాశ్మీర్‌లోయలోని త్రీ-జీ టెలికం సర్వీసుకు సంబంధించిన 90 టవర్లు తిరిగి పనిచేయడం ప్రారంభించాయి. కీలకమైన కమ్యూనికేషన్ టవర్ల పునరుద్ధరణకోసం 10 వీశాట్ వ్యవస్థలను విమానాలద్వారా తరలిస్తున్నట్టు ఓ అధికారి చెప్పారు. లోయ రోడ్లను పునరుద్ధరించేందుకు ఏడురోజుల వ్యవధి పడుతుందన్నారు.  కాగా, కాశ్మీర్ వరద పరిస్థితిపై ప్రధాని నరేంద్రమోడీ సత్వరం స్పందించిన తీరు, తీసుకున్న చర్యలపట్ల కాంగ్రెస్ నేతలు దిగ్విజయ్,  ఆజాద్  హర్షం వ్యక్తం చేశారు.
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement