National Disaster Response Force
-
Uttarakhand tunnel collapse: నిట్టనిలువుగా డ్రిల్లింగ్ మొదలు
న్యూఢిల్లీ: ఉత్తరాఖండ్‌లోని ఉత్తరకాశీ సొరంగంలో 41 మంది కార్మికులను కాపాడేందుకు సహాయక బృందాలు మరో ప్రణాళికను పట్టాలెక్కించాయి. రెండు మూడు రోజులుగా శిథిలాల గుండా సమాంతరంగా చేసిన డ్రిల్లింగ్ పనులను ప్రస్తుతానికి పక్కనబెట్టేశారు. కొండ పై నుంచి నిట్టనిలువుగా 86 మీటర్ల డ్రిల్లింగ్ పనులను ఆదివారం మధ్యాహ్నం మొదలు పెట్టారు. ‘మొదలెట్టి నిలువుగా 20 మీటర్లకుపైగా డ్రిల్లింగ్ చేశాం. భారీ బండలు లాంటివి అడ్డుప డకపోతే నవంబర్ 30వ తేదీకల్లా డ్రిల్లింగ్ పూర్తి అయ్యే అవకాశ ముంది. 85 మీటర్ల వరకు డ్రిల్లింగ్ చేశాక సొరంగం పైకప్పుకు చేసిన కాంక్రీట్, ఉక్కు రాడ్ల నిర్మాణాన్ని ఛిద్రం చేసి మార్గం సుగమం చేయాల్సి ఉంది’’ అని జాతీయ విపత్తు నిర్వహణ ప్రాధికార సంస్థ(ఎన్డీఎంఏ) సభ్యుడు మాజీ లెఫ్టినెంట్ జనరల్ సయ్యద్ అతా హస్నాయిన్ చెప్పారు. ‘‘ఇప్పటికి మొత్తంగా ఆరు రకాల రెస్క్యూ ప్లాన్లను అమలుచేశాం. అయినా సరే మొదటిదే అన్నింటికన్నా ఉత్తమం, సురక్షితం. సమాంతరంగా తవ్వే ప్లాన్‌ను మళ్లీ అమలుచేస్తాం. దాదాపు 62 మీటర్ల మేర సొరంగం కూలింది. ఇందులో 47 మీటర్ల వరకు శిథిలాల గుండా ఆగర్ మెషీన్‌తో డ్రిల్లింగ్ చేశాం. కూలినభాగంలోని కాంక్రీట్ నిర్మాణ రాడ్లు.. డ్రిల్లింగ్ మెషీన్ బ్లేడ్లను ముక్కలుచేశాయి. దాంతో 47 మీటర్లవరకు ఉన్న మెషీన్‌ను వెనక్కి లాగాం. 15 మీటర్లు లాగాక మెషీన్ విరిగిపోయి ముక్కలు లోపలే ఉండిపోయాయి. ప్లాస్మా, గ్యాస్ కట్టర్లతో ముక్కలను విడివిడిగా కట్‌చేసి బయటకు తీస్తున్నాం. 23 మీటర్లవరకు ముక్కలను తొలగించాం. మొత్తం పొడవునా బ్లేడ్ల ముక్కలను తీయడానికి ఒక రోజంతా పట్టొచ్చు. ముక్కలన్నీ తీసేశాక అదే మార్గంలో భారత సైన్యంలోని మద్రాస్ యూనిట్ ఇంజనీర్లు, ట్రెంచ్‌లెస్ ఇంజనీరింగ్ సంస్థల సంయుక్త బృందం మ్యాన్యువల్‌గా తవ్వడం మొదలుపెడుతుంది’’ అని వివరించారు. ‘‘ 62 మీటర్ల శిథిలాల గుండా ఇప్పటికే 47 మీటర్ల డ్రిల్లింగ్ పూర్తయింది. మెషీన్ బ్లేడ్లు తొలగించాక మిగతా 15 మీటర్లను మ్యాన్యువల్‌గా తవ్వితే కార్మికులు చిక్కుకున్న చోటుకు చేరుకోవచ్చు’’ అని ఆయన వెల్లడించారు. గత 14 రోజులుగా చిక్కుకుపోయిన కార్మికులను బయటకు తెచ్చేందుకు సహాయక సిబ్బంది అవిశ్రాంతంగా పనిచేస్తున్నారు. ఛార్‌ధామ్ ప్రాజెక్టులో భాగంగా రోడ్డుమార్గంలో ప్రయాణ దూరాన్ని తగ్గించేందుకు సిల్క్యారా–బార్కోట్ మార్గంలో సొరంగం నిర్మిస్తుండగా నవంబర్ 12వ తేదీన లోపల కొంత భాగం కూలిపోవడంతో కార్మికులు రెండు కిలోమీటర్ల పొడవైన భాగంలో చిక్కుకుపోయారు. -
సొరంగంలో చిక్కుకున్న వారిని బయటకు తెస్తారు ఇలా...
ఉత్తరాఖండ్‌లో టన్నెల్ కూలిన ప్రమాదంలో చిక్కుకున్న 41 మంది కార్మికులు గత 13 రోజులుగా శిథిలాల కిందే బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. ఉత్తర్‌కాశీలో సిల్క్యారా టన్నెల్ కూలిన ఘటనలో బాధితులను కాపాడేందుకు సహాయక బృందాలు అలుపెరుగని ప్రయత్నాలు చేస్తున్నాయి. ఇంకా కొన్ని గంటల్లో 41 మందిని బయటకు తీసుకొచ్చే అవకాశం ఉంది. వీరికి తక్షణమే వైద్య సహాయం అందించేందుకు ఘటన స్థలంలో అంబులెన్సులు, ప్రత్యేక పడకలు, ఔషధాలు, ఆక్సిజన్ కిట్లు అందుబాటులో ఉంచారు. ప్రస్తుతం టన్నెల కూలిన స్థలిలో సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో టన్నెల్లో ఉండిపోయిన కార్మికులను రాళ్ల శిథిలాల నుంచి బయకు తీసుకొచ్చే పద్దతి గురించి అధికారులు వెల్లడించారు. పెద్ద పైపు ద్వారా చక్రాలు కలిగిన స్ట్రేచర్‌ను కార్మికుల వద్దకు చేర్చి.. ఒకరి తర్వాత ఒకరిని బయటకు తీసుకురానున్నట్లు తాజాగా తెలిపారు. ఈ మేరకు జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ(ఎన్డీఆర్ఎఫ్) ఓ వీడియో విడుదల చేసింది .వెల్డింగ్ చేసిన పైపులో స్ట్రెచర్ మీద కార్మికులు వెల్లికిలా పడుకొని ఉంటే దానిని తాడుతో ఎన్డీఆర్ఎఫ్ అధికారులు బయటకు లాగనున్నారు. చదవండి: నేవీ మాజీ అధికారుల మరణశిక్షపై ఊరట #WATCH | | Uttarkashi (Uttarakhand) tunnel rescue: NDRF demonstrates the movement of wheeled stretchers through the pipeline, for the rescue of 41 workers trapped inside the Silkyara Tunnel once the horizontal pipe reaches the other side. pic.twitter.com/mQcvtmYjnk — ANI (@ANI) November 24, 2023 కాగా నవంబర్ 12 టన్నెల్‌లోని కొంతభాగం కూలడంతో 41 మంది కార్మికులు ఈ ప్రమాదంలో చిక్కుకున్న విషయం తెలిసిందే. అప్పటి నుంచి సాగుతున్న సహాయక చర్యలకు ఆటంకాలు ఎదురవుతున్నాయి. డ్రిల్లింగ్ సమయంలో రాళ్లు కులడం వంటి కారణాలతో కార్మికులను రక్షించడం సవాలుగా మారుతోంది. ప్రస్తుతం చిన్న చిన్న పైపుల ద్వారా సొరంగంలో చిక్కుకుపోయిన కార్మికులకు ఆహారం, నీరు, మెడిసిన్ అందిస్తున్నారు. ఇటీవల స్టీల్ పైపు ద్వారా చిన్న కెమెరాను లొపలికి పంపించడంతో సొరంగంలో చిక్కుకున్న కార్మికుల ముఖాలు తొలిసారి కనిపించిన సంగతి విదితమే. -
Uttarkashi Tunnel: డ్రిల్లింగ్ పనులకు మళ్లీ ఆటంకం
న్యూఢిల్లీ: ఉత్తరాఖండ్‌లోని సిల్క్యారా సొరంగంలో ఇంకొన్ని మీటర్లు డ్రిల్లింగ్ చేస్తే కార్మికులు చిక్కుకున్న చోటుకు చేరుకోవచ్చన్న ఆశల నడుమ అనుకోని అవాంతరం ఎదురైంది. 25 టన్నుల బరువైన భారీ డ్రిల్లింగ్ మెషీన్ అమర్చిన ‘వేదిక’కు పగుళ్లు రావడంతో డ్రిల్లింగ్‌ను ఆపేశారు. బిగించిన వేదిక సరిగా లేకుంటే డ్రిల్లింగ్ మెషీన్ అటుఇటూ కదులుతూ కచి్చతమైన దిశలో డ్రిల్లింగ్ సాధ్యపడదు. అప్పుడు అసలుకే మోసమొస్తుంది. అందుకే ముందుజాగ్రత్తగా డ్రిల్లింగ్‌ను ఆపేశారు. ‘ మరికొన్ని గంటల్లో లేదా రేపటి కల్లా ఈ ఆపరేషన్ విజయవంతంగా పూర్తవుతుంది’ అని జాతీయ విపత్తు నిర్వహణ ప్రాధికార సంస్థ(ఎన్డీఎంఏ) సభ్యుడు లెఫ్టినెంట్ జనరల్ సయ్యద్ అతా హస్నయిన్ గురువారం సాయంత్రం చెప్పారు. ‘మనం చేస్తున్నది యుద్ధంలాంటిదే. ఖచి్చతంగా ఫలానా సమయంలోగా ఈ ఆపరేషన్ పూర్తిచేసి అందర్నీ బయటకు తెస్తామని ముందుగానే జోస్యం చెప్పడం సరైన విధానం కాదు’ అని ఆయన వ్యాఖ్యానించారు. జాతీయ విపత్తు స్పందన దళం(ఎన్డీఆర్ఎఫ్) సభ్యులు సొరంగం వద్దే ఉండి, లోపలున్న కారి్మకులను బయటకు తీసుకువచ్చే విషయంలో రిహార్సల్ చేస్తున్నారని హస్నయిన్ తెలిపారు. కారి్మకులను బయటకు తీసుకొచ్చే క్రమంలో అనుకోని విధంగా కాల హరణం జరుగుతున్నందున సమాంతర డ్రిల్లింగ్‌లో అనుకోని అవాంతరాలు ఎదురైతే ప్రత్యామ్నాయ ఏర్పాట్లను చేపట్టామన్నారు. ఇందుకోసం అదనంగా యంత్రాలను తెప్పిస్తున్నామని వివరించారు. బార్కోట్ వైపు నుంచి డ్రిల్లింగ్ పనులను 9.10 మీటర్ల మేర పూర్తి చేసినట్లు అధికారులు తెలిపారు. ఈ పనులు నిరాటంకంగా కొనసాగుతున్నాయని వారు వెల్లడించారు. డ్రిల్లింగ్ పనులు జరుగుతున్న టన్నెల్ ప్రాంతం -
మృత్యుంజయుడు.. ఈ బుడతడు
ఆగ్రా: ప్రమాదవశాత్తూ బోరు బావిలో పడిన మూడున్నరేళ్ల బాలుడిని సహాయక బృందాలు విజయవంతంగా కాపాడాయి. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని ధరిౖయె గ్రామంలో సోమవారం చోటు చేసుకుంది. ఉదయం 7.30 గంటల సమయంలో ఆడుకుంటున్న బాలుడు దగ్గర్లో ఉన్న పొలంలోని బోరు బావిలో పడిపోయాడు. ఈ విషయం వెంటనే అధికారులకు తెలియడంతో ఆర్మీ, ఎన్డీఆర్ఎఫ్, పోలీసు బలగాలు రంగంలోకి దిగాయి. 130 అడుగుల లోతున్న బోరుబావిలో 90 అడుగుల వద్ద బాలుడు చిక్కుకున్నాడు. అధికారులు బోరుబావికి సమాంతరంగా భూమిని తవ్వి బాలున్ని సురక్షితంగా బయటకు తీశారు. బాలుడు ప్రస్తుతం వైద్యుల పర్యవేక్షణలో ఉన్నాడని జిల్లా కలెక్టర్ ప్రభు ఎన్ సింగ్ తెలిపారు. ఉదయం 8.30కి ప్రారంభమైన ఆపరేషన్ సాయంత్రం 4.35 గంటలకు ముగిసిందని ఆగ్రా ఎస్ఎస్పీ మునిరాజ్ తెలిపారు. తన కుమారున్ని తిరిగి ప్రాణాలతో చూడటం ఆనందంగా ఉందని బాలుడి తండ్రి ఛోటేలాల్ చెప్పారు. ఆరేడేళ్లుగా మూతబడి ఉన్న బోరు బావిని తిరిగి కొత్త బోరు వేసేందుకు తెరవడంతో ఈ ఘటన చోటు చేసుకుంది. చదవండి: Ayodhya: రూ.400 కోట్లతో బస్‌స్టేషన్ -
ఇండియాలో తొలిసారి కాపాడే మహిళా దళాలు
‘రెస్క్యూ ఆపరేషన్’ అనే మాట వినే ఉంటారు. విపత్తులలో.. విలయాలలో.. వైపరీత్యాలలో.. ప్రాణాలకు తెగించడం. ప్రమాదంలో ఉన్నవారి ప్రాణాలు కాపాడటం. ఈ పనిలో ఇప్పటివరకు పురుషులే ఉన్నారు. ఇకపై మహిళలూ రెస్క్యూలోకి దిగబోతున్నారు! తొలి బ్యాచ్‌లో 100 మహిళలు శిక్షణ పొంది ‘ఏ క్షణానికైనా’ సిద్ధంగా ఉన్నారు. ఆపదలో ఆదుకునేవాళ్లను ఆపద్బాంధవులు అంటారు. మన దేశానికి అధికారిక ఆపద్బాంధవి.. ‘జాతీయ విపత్తు రక్షణ దళం’. నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ (ఎన్.డి.ఆర్.ఎఫ్.) ఈ జాతీయ దళం పేరుకు ఆపద్బాంధవి అయినప్పటికీ ఇందులో ఇంతవరకు మరీ చిన్నస్థాయిలో తప్ప ప్రత్యక్షంగా ప్రాణాలు కాపాడే ‘డిజాస్టర్ కంబాట్’లో మహిళా సిబ్బంది లేరు. ‘రెస్క్యూ ఆపరేషన్లోకి మహిళల్ని తీసుకుని రిస్క్ చెయ్యలేం’ అనేవాళ్లు అధికారులు. ‘‘ఇది ‘హై–ప్రెషర్’ జాబ్, మగవాళ్లు మాత్రమే చేయగలరు’ అని కూడా! నీటిలో కొట్టుకుపోతున్న వాళ్లను హెలికాప్టర్ల నుంచి పైకి లాగడమే కాదు, కొన్నిసార్లు నడుముకు కట్టుకుని కూడా ఒడ్డుకు చేర్చవలసి ఉంటుంది. అదుపుతప్పి వ్యాపిస్తున్న మంటలను దారికి తేవడమే కాదు, కొన్నిసార్లు మంటల్లో చిక్కుకున్న వాళ్ల కోసం ఆ మంటల్లోకే వెళ్లవలసి ఉంటుంది. భూకంపాలప్పుడు శిథిలాల కింద ఉన్నవారిని కనిపెట్టడమే కాదు, సమయం మించిపోక ముందే ప్రాణాలతో వారిని బయటికి తేవాలి. ఇంకా.. రోడ్డు ప్రమాదాలు, విమాన ప్రమాదాల్లో క్షతగాత్రులైన వారిని స్ట్రెచర్ల మీదే కాదు, అవసరం అయితే భుజాలపై మోసుకుని కూడా అంబులెన్స్‌లోకి ఎక్కించవలసి ఉంటుంది. ప్రతి క్షణమూ విలువైనదే కనుక ప్రతి ప్రయత్నమూ బలమైనదే కావాలి. ఆ బలం మహిళలకు ఉండదు అనుకునేవారు. అయితే ఆ ఆలోచనా ధోరణి మారింది. ఎన్.డి.ఆర్.ఎఫ్. తన బలం పెరగాలంటే రెస్క్యూ టీమ్‌లలో మహిళలు తప్పనిసరిగా ఉండాలని భావిస్తోంది. ఫలితమే ‘జాతీయ విపత్తు రక్షణ దళం’లోకి మహిళల చరిత్రాత్మక రంగ ప్రవేశం. ∙∙ తొలిసారి శిక్షణ పొంది వచ్చిన ఈ వంద మంది మహిళా బృందాన్ని ఉత్తరప్రదేశ్‌లోని గర్హ్ ముక్తేశ్వర్ పట్టణంలో గంగానది పొడవున గస్తీ విధుల్లో నియమించారు. ఆపద నుంచి కాపాడే పడవల్ని నడపడం, అవసరమైతే అప్పటికప్పుడు వాటికి మరమ్మతులు చేయడం, ప్రమాదవశాత్తూ నీటిలో పడిపోయినవారిని గాలించి ఆ పడవల్లో ఒడ్డుకు చేర్చడం వంటివన్నీ వారు విజయవంతంగా పూర్తి చేసిన శిక్షణ లో భాగమే. వీళ్లు కాక మరో వందమందికి పైగా మహిళలకు ఎన్.డి.ఆర్.ఎఫ్. డైరెక్టర్ జనరల్ ఎస్.ఎన్.ప్రధాన్ శిక్షణ ఇప్పించబోతున్నారు. ఈ మొత్తం 200 మందీ ఇన్స్పెక్టర్లుగా, సబ్ ఇన్స్పెక్టర్లుగా, కానిస్టేబుళ్లుగా తమ విధులు నిర్వర్తిస్తారు. నిబంధనల ప్రకారం ప్రతి వెయ్యిమంది సిబ్బందిలో 108 మంది మహిళల్ని మాత్రమే చేర్చుకునేందుకు తనకున్న అధికారం మేరకే ఈ నియామకాలు చేపట్టగలిగారు ఎన్.డి.ఆర్.ఎఫ్. డీజీ. లేకుంటే ఇంకా ఎక్కువమందినే తీసుకునేవారు. ‘‘మహిళలు రెస్క్యూ టీమ్‌లో ఉండటం వల్ల ప్రత్యేకమైన ఆపత్సమయ ప్రయోజనాలు ఉన్నాయి. మహిళల్ని కాపాడేందుకు మహిళలే చొరవ చూపగలరు. ఇంకా ప్రత్యేకమైన సందర్భాలలో మహిళల్ని మహిళలే ఆదుకోవడం అవసరమౌతుంది కూడా’’ అని ప్రధాన్ అంటున్నారు. ‘‘మహిళా బృందం, పురుష బృందం రెండూ ప్రధానమే. అయితే స్త్రీ, పురుషులు కలిసి ఉండే బృందాన్ని ఏర్పాటు చేసేందుకే మొగ్గు చూపుతున్నాం. ప్రాణాల్ని రక్షించేటప్పుడు స్త్రీ పురుషులిద్దరూ కలిసి పని చేయడం వల్ల తక్షణ ఫలితాలు ఉంటాయి’’ అంటారు ప్రధాన్. -
వైజాగ్ ఘటన: ఆ ప్రచారం నమ్మొద్దు
న్యూఢిల్లీ: విశాఖపట్నంలోని ఎల్జీ పాలీమర్స్ పరిశ్రమ నుంచి రెండోసారి విషవాయువు లీకైనట్టు జరుగుతున్న ప్రచారాన్ని కేంద్రం ఖండించింది. రెండోసారి గ్యాస్ లీక్ కాలేదని జాతీయ విపత్తు స్పందన దళం(ఎన్డీఆర్ఎఫ్) డైరెక్టర్ జనరల్ ఎస్ఎన్ ప్రధాన్ స్పష్టం చేశారు. రసాయన వాయువును తసట్థం(న్యూట్రలైజ్) చేసే ప్రక్రియ జరుగుతున్నప్పుడు కొద్దిగా పొగ వస్తుందని, దీన్ని గ్యాస్‌గా పొరబడటం సరికాదని వివరించారు. రెండోసారి గ్యాస్ లీకైనట్టు జరుగుతున్న ప్రచారాన్ని నమ్మొద్దని ప్రజలకు సూచించారు. అనవసర ప్రచారంతో జనాన్ని భయభ్రాంతులకు గురిచేయొద్దని మీడియాను కోరారు. విషవాయువు ప్రభావిత ప్రాంతాల్లో సాధారణ పరిస్థితులను తీసుకొచ్చేందుకు రోడ్‌మ్యాప్‌ను రూపొందించినట్టు వెల్లడించారు. దీనిపై ఆంధ్రప్రదేశ్ పర్యాటక శాఖ మంత్రి అవంతి శ్రీనివాస్ తమతో మాట్లాడారని ప్రధాన్ వెల్లడించారు. ఎన్డీఆర్ఎఫ్ దళాలను పూర్తిస్థాయిలో వైజాగ్‌లో మొహరించామని, అన్నిరకాలుగా సహాయం అందిస్తామని ఆయన హామీయిచ్చారు. (గ్యాస్ లీక్.. 12కు చేరిన మృతులు) కాగా, విశాఖ గ్యాస్ లీకేజీ ఘటనపై ఏపీ పరిశ్రమల శాఖ కార్యదర్శి కరికలవలవన్ నేతృత్వంలోని కమిటీ శుక్రవారం మధ్యాహ్నం విచారణ ప్రారంభించింది. గ్యాస్ లీకేజీ ప్రమాదానికి గల కారణాలను ఈ కమిటీ విచారించనుంది. మరోవైపు ఇలాంటి దుర్ఘటనలు పునరావృతం కాకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకునేందుకు ఐఏఎస్ అధికారి, పర్యావరణ, అటవీ మంత్రిత్వ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి నీరభ్ కుమార్ ప్రసాద్ అధ్యక్షతన ఏపీ ప్రభుత్వం హైకమిటీని ఏర్పాటు చేసింది. విశాఖ దుర్ఘటనపై స్పందించిన దక్షిణ కొరియా -
జమ్మూలో యుద్ధప్రాతిపదికన సహాయం
శ్రీనగర్: జలవిలయంతో తీవ్రంగా దెబ్బతిన్న జమ్మూ కాశ్మీర్లో సహాయకచర్యలు యుద్ధప్రాతిపదికన కొనసాగుతున్నాయి. 86 విమానాలు, పలు హెలికాప్టర్లతో ఈ సహాయక చర్యలు చేపట్టారు. ఇప్పటివరకూ వరద బాధితులకు 4లక్షల లీటర్ల మంచినీరు సరఫరా చేయగా, 800 టన్నుల ఆహారాన్ని అందజేశారు. ఇందులో 1.31 లక్షల ఆహార పొట్లాలను పంపిణీ చేశారు. ఇదిలా ఉండగా, నీటిని శుభ్రపరిచేందుకు 13 టన్నుల నీటిని శుద్ధిచేసే టాబ్లెట్లను కూడా వరద బాధితులకు అందజేశారు. జమ్మూలో జలదిగ్బంధమైన ప్రాంతాలకు యంత్రాలను, జనరేటర్లను తరలించే మురిగి నీటిని తొలగించేందుకు యత్నాలు చేస్తున్నారు. వరద ముంపుకు గురైన వారిని 224 బోట్లు ద్వారా సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. ఇప్పటికే చాలామందిని రక్షించి సురక్షిత ప్రాంతాలకు తరలించగలిగినా.. ఇంకా భారీగా ప్రజలు జలదిగ్బంధంలోనే ఉన్నారు. వర్షాలు తగ్గుముఖం పట్టడంతో భారీ ఎత్తున సహాయ కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. మరో వైపు, వరదనీరు తగ్గనిచోట్ల బాధితులు ఇంకా ఇళ్లపైకప్పులపైనే గడుపుతున్నారు. భారీవర్షాలు వరదల్లో కొండచరియలు విరిగిపడటం, ఇళ్లుకూలడం వంటి సంఘటనల్లో ఇప్పటివరకూ దాదాపు 200మంది ప్రాణాలు కోల్పోయారు. సహాయ కార్యక్రమాల్లో సైన్యం, ఎన్డీఆర్ఎఫ్, నావికాదళం నిర్విరామంగా పాల్గొంటున్నాయి. -
యుద్ధప్రాతిపదికన సహాయం
కాశ్మీర్ జలవిలయం మృతుల సంఖ్య 200 25,000 మంది సుర క్షిత ప్రాంతాలకు తరలింపు శ్రీనగర్/జమ్మూ: గత అరవైఏళ్లలో కనీవినీ ఎరుగని స్థాయిలో సంభవించిన వరద బీభత్సంతో అతలాకుతలమైన జమ్మూ కాశ్మీర్లో యుద్ధప్రాతిపదికన సహాయ కార్యక్రమాలు కొనసాగుతూ ఉన్నాయి. మరో వైపు కాశ్మీర్ లోయలో లక్షలాది మంది ఇంకా వరద ప్రాంతాల్లో చిక్కుకుపోయి ఉన్నారు. రాజధాని శ్రీనగర్‌కు దేశంతో టెలి కమ్యూనికేషన్లు దెబ్బతినడంతో పరిస్థితి మరింత విషమించింది. వరదల్లో మృతుల సంఖ్య 200కు చేరుతోంది. సహాయ కార్యక్రమాలకోసం మరిన్ని జాతీయ విపత్తు ప్రతిస్పందన దళం (ఎన్డీఆరెఫ్) బృందాలను కేంద్రం హుటాహుటిన పంపించింది. సహాయ కార్యక్రమాల్లో తొలిసారిగా నావికాదళం కూడా ప్రవేశించింది. ఇప్పటివరకూ సైన్యం, వైమానికదళం, ఎన్డీఆర్ఎఫ్, జమ్మూ కాశ్మీర్ సంస్థలు కలసి 25వేలమందిని సురక్షిత ప్రాంతాలకు తరలించాయి. గత మంగళవారం నుంచి కురుస్తున్న కుండపోత వర్షాల అనంతరం సోమవారం శ్రీనగర్‌సహా కాశ్మీర్ లోయలోని ఇతర ప్రాంతాల్లో జల్లులు మాత్రమే కురవడం కొంత ఉపశమనం కలిగించింది. చాలావరకూ వరద ప్రాంతాల్లో నీరు క్రమంగా తగ్గుముఖం పట్టింది. శ్రీనగర్‌లోని దాల్ సరస్సులో మాత్రం నీటిమట్టం పెరుగుతోంది. అయితే, కాశ్మీర్‌లోయ ముప్పు ఇంకా తొలగిపోలేదని సైన్యం అధికారులు తెలిపారు. వరదనీటినుంచి తప్పించుకునేందుకు శ్రీనగర్‌లో పలువురు ఇంకా తమ ఇళ్లపైకప్పులపైన, పై అంతస్తులపైన గడుపుతున్నారు. కాశ్మీర్‌లోయకు, దేశంలోని ఇతర ప్రాంతాలతో టెలికమ్యూనికేషన్లు తె గిపోవడంతో శాటిలైట్ వ్యవస్థ ద్వారా మొబైల్ సర్వీసులను పునరుద్ధరించేందుకు బీఎస్ఎన్ఎల్, సైన్యం, వైమానికదళం యుద్ధప్రాతిపదికన కృషిచేస్తున్నాయి. వరదలతో ఇంట ర్నెట్ అనుసంధానం కూడా దెబ్బతిన్నదని అధికారులు తెలిపారు. సైన్యం, ప్రభుత్వ అధికారులు ప్రస్తుతానికి శాటిలైట్ ఫోన్లతోనే పనులు నిర్వర్తిస్తున్నారు. తిరిగి పనిచేస్తున్న 90 టవర్లు కాశ్మీర్‌లోయలోని త్రీ-జీ టెలికం సర్వీసుకు సంబంధించిన 90 టవర్లు తిరిగి పనిచేయడం ప్రారంభించాయి. కీలకమైన కమ్యూనికేషన్ టవర్ల పునరుద్ధరణకోసం 10 వీశాట్ వ్యవస్థలను విమానాలద్వారా తరలిస్తున్నట్టు ఓ అధికారి చెప్పారు. లోయ రోడ్లను పునరుద్ధరించేందుకు ఏడురోజుల వ్యవధి పడుతుందన్నారు. కాగా, కాశ్మీర్ వరద పరిస్థితిపై ప్రధాని నరేంద్రమోడీ సత్వరం స్పందించిన తీరు, తీసుకున్న చర్యలపట్ల కాంగ్రెస్ నేతలు దిగ్విజయ్, ఆజాద్ హర్షం వ్యక్తం చేశారు. -
మృతదేహాలను వెతికేందుకు మానవ రహిత విమానాలు
మండి( హిమాచల్ ప్రదేశ్): హిమాచల్‌ప్రదేశ్ బియాస్ నది దుర్ఘటనలో మృతి చెందిన 18 మంది విద్యార్థులను వెతికేందుకు మానవ రహిత విమానాన్ని వినియోగించుకోనున్నట్టు జాతీయ విపత్తు సంస్థ వెల్లడించింది. నదిలో మునిగిపోయిన విద్యార్ధుల ఆచూకీని తెలుసుకునేందుకు ఉపరితలం నుంచి మానవ రహిత విమానం ద్వారా ఫోటోలు తీయడానికి వినియోగించనున్నారు. విద్యార్ధుల మృతదేహాలను గుర్తించేందుకు రిమోట్ సెన్సింగ్ ద్వారా విమానం ఫోటోలు తీయడానికి, నీటి అడుగు భాగంలో పనిచేసే కెమెరాల వినియోగం, ప్రమాద ఘటనా స్థలంలో హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేసేందుకు జాతీయ విపత్తు సంస్థ నిర్ణయం తీసుకుంది. -
'నదిలో గల్లంతైన విద్యార్ధులు బతికిలేనట్టే'
మండి( హిమాచల్ ప్రదేశ్): బియాస్ నదిలో గల్లంతైన విద్యార్ధులు ఇక బతికి లేనట్టేనని జాతీయ విపత్తు సంస్థ అధికారి జైదీప్ సింగ్ అన్నారు. 18 మంది గజ ఈతగాళ్లతో గాలింపు చర్యలు చేపట్టామని జైదీప్ సింగ్ తెలిపారు. గాలింపు చర్యల్లో రేపు కొన్ని మృతదేహాలు బయటపడే అవకాశముందని ఆయన తెలిపారు. బియాస్ నదిలో ఉదయం పూట నదిలో నీళ్లు తక్కువగా ఉంటున్నాయని, అదే సమయంలో గాలింపునకు ఆస్కారం ఉంటోందని జైదీప్ సింగ్ అన్నారు. విద్యార్ధుల గాలింపు చర్యలపై అధికారులతో హిమాచల్ ప్రదేశ్ సీఎం వీరభద్ర సింగ్ మరోసారి సమీక్ష జరిపారు. రిజర్వాయర్లకు మూడు కిలోమీటర్ల పరిధిలో సైరన్ వినిపించేలా ఏర్పాట్లు చేయాలని సీఎం వీరభద్ర సింగ్ ఆదేశించారు. తీరం వెంబడి హెచ్చరిక బోర్డులు పెట్టాలని కూడా అధికారులకు సూచించారు. కనీసం 500 మంది జవాన్లను గాలింపు కోసం వినియోగించాలని హోంశాఖను తెలంగాణ హోంమంత్రి నాయిని నర్సింహరెడ్డి కోరారు.