'నదిలో గల్లంతైన విద్యార్ధులు బతికిలేనట్టే'
'నదిలో గల్లంతైన విద్యార్ధులు బతికిలేనట్టే'
Published Wed, Jun 11 2014 5:46 PM | Last Updated on Sat, Sep 2 2017 8:38 AM
మండి( హిమాచల్ ప్రదేశ్): బియాస్ నదిలో గల్లంతైన విద్యార్ధులు ఇక బతికి లేనట్టేనని జాతీయ విపత్తు సంస్థ అధికారి జైదీప్ సింగ్ అన్నారు. 18 మంది గజ ఈతగాళ్లతో గాలింపు చర్యలు చేపట్టామని జైదీప్ సింగ్ తెలిపారు. గాలింపు చర్యల్లో రేపు కొన్ని మృతదేహాలు బయటపడే అవకాశముందని ఆయన తెలిపారు.
బియాస్ నదిలో ఉదయం పూట నదిలో నీళ్లు తక్కువగా ఉంటున్నాయని, అదే సమయంలో గాలింపునకు ఆస్కారం ఉంటోందని జైదీప్ సింగ్ అన్నారు. విద్యార్ధుల గాలింపు చర్యలపై అధికారులతో హిమాచల్ ప్రదేశ్ సీఎం వీరభద్ర సింగ్ మరోసారి సమీక్ష జరిపారు.
రిజర్వాయర్లకు మూడు కిలోమీటర్ల పరిధిలో సైరన్ వినిపించేలా ఏర్పాట్లు చేయాలని సీఎం వీరభద్ర సింగ్ ఆదేశించారు. తీరం వెంబడి హెచ్చరిక బోర్డులు పెట్టాలని కూడా అధికారులకు సూచించారు. కనీసం 500 మంది జవాన్లను గాలింపు కోసం వినియోగించాలని హోంశాఖను తెలంగాణ హోంమంత్రి నాయిని నర్సింహరెడ్డి కోరారు.
Advertisement