Supreme Reddy
-
గాలి జనార్ధన్ రెడ్డి బెయిల్ కేసు రేపటికి వాయిదా
ఢిల్లీ:మైనింగ్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న గాలి జనార్ధన్ రెడ్డి బెయిల్ కేసుపై తీర్పును సుప్రీంకోర్టు మంగళవారానికి వాయిదా వేసింది. జనార్ధన్ రెడ్డి బెయిల్ కు సంబంధించి సీబీఐ కొన్నిషరతులను సుప్రీంకు అందజేసింది. గాలి జనార్ధన్ రెడ్డి బళ్లారికి వెళ్లకూడదని ఆ షరతుల్లో పేర్కొంది. దీంతోపాటు కోర్టు విచారణకు సహకరించాలని, పాస్ పోర్టను అప్పగించాలని కూడా సీబీఐ తెలిపింది. సీబీఐ పేర్కొన్న షరతులను ఆఫిడవిట్ రూపంలో ఇవ్వాలని సీబీఐని సుప్రీంకోర్టు ఆదేశించింది. -
'గాలి' కేసులో యాదగిరికి సుప్రీం బెయిల్!
న్యూఢిల్లీ: ఓబులాపురం మైనింగ్ కంపెనీ యజమాని గాలి జనార్ధన్ రెడ్డి బెయిల్ కోసం ముడుపులు చెల్లించారనే కేసులో రౌడీషీటర్ యాదగిరికి సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసింది. యాదగిరి కేసు విచారణ కోసం ట్రయల్ కోర్టు ఆరు వారాల్లోగా న్యాయమూర్తిని నియమించాలని సుప్రీం ఆదేశించింది. ఈ కేసును ఏడాదిలోగా కేసు విచారణ పూర్తి చేయాలని కోర్టు వెల్లడించింది. తదుపరి విచారణను ఆరువారాలకు సుప్రీం కోర్టు వాయిదా వేసింది.