తీవ్ర నేరాల కేసుల్లో మెతక వైఖరా?
న్యూఢిల్లీ: తీవ్ర నేరాలకు సంబంధించిన కొన్ని కేసుల్లో నేరస్తులపట్ల హైకోర్టులు ఉదాసీనంగా వ్యవహరిస్తున్నాయని సుప్రీంకోర్టు ఆవేదన వ్యక్తం చేసింది. నేరస్తులకు నామమాత్రపు శిక్షలతో సరిపెడుతున్నాయని పేర్కొంది. అంతరాత్మను కుదిపేసే ఇటువంటి వైఖరిని హైకోర్టులు విడనాడాలని సూచించింది. రాజస్థాన్లో 1982లో సుమేర్సింగ్ అనే వ్యక్తిపై సూరజ్భాన్ అనే వ్యక్తి కత్తితో దాడి చేసి మణికట్టు వరకూ చేతిని తెగనరికాడు. హత్యాయత్నం నేరం కింద ట్రయల్ కోర్టు సూరజ్భాన్కు ఐదేళ్ల జైలుశిక్ష విధించగా రాజస్థాన్ హైకోర్టు మాత్రం దోషికి కేవలం 7 రోజుల శిక్ష విధించి చేతులు దులుపుకుంది. దీనిపై బాధితుడు సుప్రీంకోర్టును ఆశ్రయించగా హైకోర్టు తీర్పును సర్వోన్నత న్యాయస్థానం తప్పుబట్టింది. దోషికి రెండేళ్ల కఠిన శిక్షతోపాటు రూ. ఐదు వేల జరిమానా విధించింది