Suresh Rao
-
చెన్నై గుండె ఆపరేషన్ వైద్య బృందంలో
బళ్లారి టౌన్ : భారత వైద్య చరిత్రలోనే చెన్నై బీజీఎస్ గ్లోబల్ ఆస్పత్రిలో బుధవారం జరిగిన అరుదైన గుండె ఆపరేషన్ వైద్య బృందంలో బళ్లారి మెడికల్ కళాశాలలో చదివిన డాక్టర్ సురేష్ రావు పాల్గొనడం బళ్లారి జిల్లా వాసులు గర్వించదగ్గ విషయం. 1993లో బళ్లారి మెడికల్ కళాశాలలో విద్యాభ్యాసం చేసిన సురేష్‌రావు గుండె ఆపరేషన్‌లో పాలు పంచుకోవడం తమకు ఎంతో గర్వకారణమని విమ్స్ డెరైక్టర్ డాక్టర్ లక్ష్మినారాయణరెడ్డి, ప్రిన్సిపాల్ డాక్టర్ విద్యాధర్ కిన్నాళ, ఐఎంఏ అధ్యక్షుడు డాక్టర్ సీ.యోగానందరెడ్డి పేర్కొన్నారు. ఈ మేరకు వారు గురువారం ఓ ప్రకటన విడుదల చేశారు. ప్రమాదానికి గురైన ఓ మహిళ గుండెను తీసి బెంగళూరు నుంచి విమానంలో చెన్నైకి తీసుకెళ్లి అతి తక్కువ వ్యవధిలోనే మరొకరికి ఆపరేషన్ చేసి పెట్టడం సంతోషించదగ్గ విషయమని తెలిపారు. ఓ పేద కుటుంబం నుంచి వచ్చిన సురేష్‌రావు బళ్లారి మెడికల్ కళాశాలలో ఎంబీబీఎస్ చదివి ఉన్నత స్థానానికి ఎదిగినందుకు తాము ఎంతో గర్విస్తున్నామని పేర్కొన్నారు. -
సురేశ్ రావు అనారోగ్యంతో బాధపడుతున్నారు: అనురాగ్ శర్మ
హైదరాబాద్: ఆత్మహత్యకు పాల్పడిన ఇంటిలిజెన్స్ డీఎస్పీ సురేష్‌రావు గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారని డీజీపీ అనురాగ్ శర్మ మీడియాకు తెలిపారు. యశోదా ఆస్పత్రిలో సురేశ్ రావు భౌతికకాయానికి నివాళులర్పించిన తర్వాత మీడియాతో అనురాగ్ శర్మ మాట్లాడారు. 15 రోజుల క్రితమే యశోదలో చికిత్స తీసుకున్నారని, ఈరోజే సురేష్‌రావు డ్యూటీకి వచ్చాడు అని అనురాగ్‌శర్మ తెలిపారు. కేసీఆర్ కు గతంలో భద్రతాధికారిగా పనిచేసిన సురేశ్ రావు శుక్రవారం మధ్యాహ్నం ఆత్మహత్యకు పాల్పడ్డారు. ప్రస్తుతం సురేశ్ రావు ఇంటలిజెన్స్ డీఎస్పీగా సేవలందిస్తున్నారు. ఆయన మృతికి కేసీఆర్, ఇతర పోలీసు అధికారులు సంతాపం తెలిపారు. -
కేసీఆర్ మాజీ చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ ఆత్మహత్య
హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ వద్ద ఛీప్ సెక్యూరిటీ అఫీసర్ గా సేవలందించిన సురేశ్ రావు శుక్రవారం మధ్యాహ్నం ఆత్మహత్య చేసుకున్నారు. తన సర్వీస్ రివాల్వర్ తో కాల్చుకున్నట్టు పోలీసులు తెలిపారు. సురేశ్ రావు పరిస్థితి విషమంగా మారడంతో ఆస్పత్రికి తరలించారు. అయితే అప్పటికే మరణించినట్టు వైద్యులు తెలిపారు. గత కొద్దికాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న సురేశ్ కుమార్ విధులకు దూరంగా ఉన్నట్టు తెలిసింది. ఇటీవలే ఇంటిలిజెన్స్ విభాగంలో డీఎస్పీగా విధుల్లో చేరినట్టు సమాచారం. ఆత్మహత్యకు కారణాలు తెలియాల్సి వుంది.