survey officers
-
ఏసీబీ వలలో మరో అవినీతి తిమింగలం
-
ఏసీబీ అధికారుల మీదకు కుక్కను వదిలాడు..
సాక్షి, అమరావతి : ప్రభుత్వ ఉద్యోగాన్ని అడ్డం పెట్టుకుని కోట్లకు పడగలెత్తిన మాజీ అధికారి ఆయన. అవినీతికి పాల్పడ్డి పెద్ద ఎత్తున అక్రమ ఆస్తులు వెనకేసున్నారనే సమచారంతో ఏసీబీ అధికారులు... సదరు మాజీ అధికారి ఇంటిపై దాడులు నిర్వహించాలని వచ్చారు. అయితే ఆ దాడులను అడ్డుకునేందుకు అ మాజీ అధికారి ఏకంగా తన పెంపుడు కుక్కను ఏసీబీ అధికారులపై వదిలాడు. యజమాని తిండితిన్న కుక్క విశ్వాసం చూపిస్తూ... ఏసీబీ అధికారులపై దాడి చేసింది. దీంతో ఏసీబీ అధికారులు భయంతో అక్కడ నుంచి పరుగులు తీశారు. అనంతరం స్థానిక పోలీసుల సాయంతో మాజీ అధికారి ఇంటి తలుపులు పగులగొట్టి సోదాలు చేపట్టారు. వివరాల్లోకి వెళ్తే విజయనగరం జిల్లాలో సర్వే విభాగంలో సర్వేయర్‌గా పని చేసిన గేదెల లక్ష్మీ గణేశ్వరరావు నివాసంపై ఏసీబీ అధికారులు శనివారం దాడులు నిర్వహించారు. ఈ దాడులు నిర్వహించడానికి ముందు గణేశ్వరరావు ఏసీబీ అధికారులపై పెంపుడు కుక్కను ఉసికొల్పారు. దీంతో అధికారులు పరుగు లంకించుకున్నారు. అనంతరం ఆయనగారు మాత్రం ఇంటికి తాళం వేసుకుని దర్జాగా లోపల కూర్చున్నారు. దీంతో ఏసీబీ అధికారులు స్థానిక పోలీసుల సహాయంతో తలుపులు పగలకొట్టి ఇంట్లోకి ప్రవేశించారు. ఆదాయానికి మించి ఆస్తులున్నాయని వచ్చిన ఫిర్యాదు మేరకు లక్ష్మీ గణేశ్వరరావుకు సంబంధించి...17 ప్రాంతాల్లో ఏకకాలంలో ఏసీబీ అధికారులు దాడులు చేశారు. హైదరాబాద్, విశాఖ పట్నం, విజయనగరం, తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల్లోని బంధువులు, స్నేహితుల ఇళ్లలో ఏసీబీ సోదాలు నిర్వహించారు. కాగా లక్ష్మీ గణేశ్వరరావుపై ఇప్పటికే పలు ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో ఆయనను ఉన్నతాధికారులు విధుల నుంచి తప్పించారు. -
ఆ ఒక్కరోజు సమగ్ర కుటుంబ సర్వే
- అందరూ అందుబాటులో ఉండాల్సిందే.. - కుటుంబ సర్వే’ పై అధికారుల కసరత్తు - అధికారులను అప్రమత్తం చేసిన ఇన్చార్జి కలెక్టర్ ముకరంపుర : సమగ్ర కుటుంబ సర్వే ప్రామాణికంగా అర్హులకు సంక్షేమ ఫలాలు అందించాలనే సదుద్దేశంతో ప్రభుత్వ నూతన కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. గతంలో ఎప్పుడూ లేనట్టుగా ఒక్క రోజులోనే రాష్ట్రం మొత్తం సర్వే నిర్వహించాలని నిర్ణయించడంతో 19వ తేదీ ప్రాధాన్యం సంతరించుకుంది. ఉద్యోగులంతా భాగస్వాములై ప్రతీ ఇంటిగడప తొక్కనున్నారు. ఆ రోజు అందరూ స్థానికంగా అందుబాటులో ఉంటేనే భవిష్యత్తులో ఎలాంటి ఇబ్బందులు ఉండవని అధికారులు సూచిస్తున్నారు. అందుబాటులో ఉండేలా అందరికీ అవగాహన కల్పించేందుకు సిద్ధమవుతున్నారు. ఈ మేరకు ఆదివారం ఇన్చార్జి కలెక్టర్ సర్ఫరాజ్ అహ్మద్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఆర్డీవోలు, తహశీల్దార్లను అప్రమత్తం చేశారు. ఆయా నియోజకవర్గాల్లో ఎన్ని ఇళ్లు ఉన్నాయి? ఎంత మంది సిబ్బంది ఉన్నారు? సర్వేకు ఎంత మంది అవసరం అనే అంశాలను యుద్ధప్రాతిపదికన నివేదిక రూపంలో పంపించాలని ఆదేశించారు. కసరత్తు సర్వేకోసం ప్రభుత్వ శాఖలు, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల వివరాలు సేకరించే పనిలో జిల్లా యంత్రాంగం నిమగ్నమైంది. నాలుగో తరగతి ఉద్యోగులనుంచి ఉన్నతాధికారుల వరకు 30,878 మంది ఉద్యోగులున్నట్లు జాబితా సిద్ధం చేశారు. సగటున ఒక్కో ఉద్యోగి 26 కుటుంబాల వివరాలు నమోదు చేయాల్సి ఉంటుంది. గ్రామాలు, మండల కేంద్రాలు, పురపాలక, నగరపాలక సంస్థల వారీగా క్రోడీకరించి వివరాలను ఎన్నికల బ్యాలెట్లు, ఈవీఎంల మాదిరిగా సీల్ వేసి వారం రోజుల సమయంలో డాటాను ప్రభుత్వ వెబ్సైట్లో అప్లోడ్ చేయనున్నారు. 2011 జనాభా లెక్కల ప్రకారం జిల్లాలో 9.70 లక్షల ఇళ్లు ఉన్నాయి. మరో 50 వేల నుంచి లక్షలోపు ఇళ్లు పెరిగే అవకాశముంది. 9.70 లక్షల కుటుంబాలకు 37,307 మంది సిబ్బంది అవసరమవుతారని అంచనా.. గతంలో జరిగిన సర్వేలో ఒక్కొక్కరు 40 కుటుంబాలు సర్వే చేసినట్లు అధికారులు చెబుతున్నా.. అవన్నీ తప్పుల తడకలేనని కొత్త ప్రభుత్వం కొట్టిపారేసింది. ఈ క్రమంలో లెక్కాపత్రం పక్కాగా ఉండాలని, పారదర్శకంగా సర్వే చేయకపోతే తగిన చర్యలకు బాధ్యులవుతారని సీఎం హెచ్చరికలు జారీ చేశారు. ప్రభుత్వం 70 అంశాలతో రూపొందించిన ఫార్మాట్లోని ప్రశ్నలకు కుటుంబసభ్యులు నిజాయతీగా సమాధానమిస్తే మేలు జరిగే అవకాశముంది. కుటుంబసభ్యులు తప్పుడు సమాచారమిచ్చినా క్రిమినల్ చర్యలకు ఆస్కారముంది. ఈ సర్వే ప్రామాణికంగా తీసుకుని రేషన్‌కార్డులు, పింఛన్లు, గృహాలు, భూములు తదితర వాటిని లబ్ధిదారులకు మంజూరు చేస్తారు. ఉపాధి నిమిత్తం, ఇతరత్రా అవసరాల దృష్ట్యా చాలా మంది స్వస్థలాలనుంచి ఇతర ప్రాంతాలకు వెళ్లారు. దీంతో ఎప్పుడు సర్వే చేసినా వివరాలు సక్రమంగా ఉండక ఇబ్బందులు కలుగుతున్నాయి. ఈ నేపథ్యంలో 19న అందరూ అందుబాటులో ఉండేలా ప్రభుత్వం సెలవు ప్రకటించింది. తప్పనిసరిగా అందుబాటులో ఉండాలని సూచించింది. అయితే కుటుంబం మొత్తం అందుబాటులో ఉండాలా? లేక ఒక్కరు ఇంటి వద్దే ఉండి సర్వే అధికారులకు వివరాలు చెబితే సరిపోతుందా అనే విషయమై స్పష్టత లేదు. 19నాడు అత్యవసర పని నిమిత్తం ఇతర ప్రాంతాలకు వెళ్లాల్సి వచ్చేవారి వివరాలు ఎలా తీసుకుంటారనేది ఆసక్తికరంగా మారింది. నెలల తరబడి వలస వెళ్లేవారి విషయంలో ఏం చేస్తారనేది తెలియడం లేదు. వివరాల సేకరణపై ప్రభుత్వం మరికొంత స్పష్టత ఇవ్వాలని ప్రజలు కోరుతున్నారు. -
‘సర్వే’శా నీవే దిక్కు!
విజయనగరం ఫోర్ట్, న్యూస్‌లైన్: ఈ చేత్తో ఇచ్చి.. ఆ చేత్తో లాక్కున్న చందంగా ప్రభుత్వం వ్యవహరిస్తోంది. దరఖాస్తు చేసిన వారందరికీ ఇళ్లు మంజూరు చేస్తున్నట్టు ప్రకటించిన ప్రభుత్వం ఇప్పుడు ఆ భారాన్ని తగ్గించుకునేందుకు యత్నిస్తోంది. అనర్హుల పేరిట చాలా ఇళ్లు రద్దు చేయాలన్న యోచనతోనే మళ్లీ సర్వే చేస్తున్నారని మూడో విడత రచ్చబండలో ఇళ్ల కోసం దరఖాస్తు చేసుకున్న వారు ఆందోళన చెందుతున్నారు. చేసేది లేక సర్వే అధికారులపై భారం వేసి బిక్కుబిక్కుమంటూ ఎదురుచూస్తున్నారు. మొదటి, రెండో విడతల రచ్చబండ సందర్భంగా సర్వే నిర్వహించి, అర్హులను తొలగించి ఇళ్లు మంజూరు చేశారు. ఆ రెండు విడతల్లో లక్షా 80 వేల దరఖాస్తులు వచ్చాయి. వీటిలో 50 వేల మందిని అనర్హులుగా ప్రకటించారు. తరువాత నియోజకవర్గానికి రెండు వేలు చొప్పున తొమ్మిది నియోజకవర్గాల్లో 18 వేల మందికి, తరువాత మరో ఎనిమిది వేల మందికి కలిపి మొత్తం 26 వేల మందికి ఇళ్లు మంజూరు చేసి చేతులు దులిపేసుకున్నారు. మిగిలిన లక్షకు పైబడిన దరఖాస్తులు బుట్టదాఖలయ్యాయి. అయితే ఏ ప్రయోజనం ఆశించో.. ఏమో.. మూడో విడతలో జిల్లాలో దరఖాస్తు చేసుకున్న 62 వేల మందికీ ఎటువంటి సర్వే లేకుండానే ఇళ్లు మంజూరు చేస్తున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. మొదట, రెండో విడత కలిపి కేవలం 26వేల ఇళ్లు మంజూరుచేయగా మూడో విడతలో పెద్ద ఎత్తున 62 వేల మందికి ఇళ్లు మంజూరు చేసినట్టు ప్రభుత్వం ప్రకటించింది. దీంతో జిల్లాలో ఇల్లులేని నిరుపేదలు ఆనందంతో ఉబ్బితబ్బిబ్బయ్యారు. అయితే వారి సొంత ఇంటి కల నెరవేరే పరిస్థితి కనిపించడంలేదు. అంత భారాన్ని మోయడానికి ప్రభుత్వం సంసిద్ధంగా లేదు. ఆ సంఖ్యను తగ్గించేందుకు యత్నాలు ప్రారంభించింది. దీనిలో భాగంగా సర్వే నిర్వహిస్తున్నారు. రద్దుకు యత్నాలు 62 వేల ఇళ్లకు బిల్లులు చెల్లించవలసి వస్తే సుమారు రూ.450 కోట్లు విడుదల చేయాలి. అయితే ఇంత పెద్ద మొత్తాన్ని భరించేందుకు సర్కార్ పెద్దలు ఇష్ట పడటం లేదని తెలిసింది. భారం తగ్గించుకోవడానికి వీలుగా అనర్హుల పేరుతో జాబితాను తగ్గించేందుకు యత్నిస్తున్నట్టు సమాచారం. ముగ్గురు అధికారులతో సర్వే: తహశీల్దార్, ఎంపీడీఓ, మండల గృహనిర్మాణశాఖ ఏఈలతో కూడిన బృందం సర్వే ప్రారంభించింది. ఇప్పుడు దరఖాస్తు చేసుకున్న వారికి ఇంతకు ముందు ఇల్లు మంజూరు అయిందా, అయితే ఏ పథకంలో మంజూరయింది వంటి వివరాలతో కూడిన సర్వేను చేపడుతున్నారు. సర్వే సభ్యులు అనర్హులుగా తేల్చితే వారి ఇంటిని రద్దుచేస్తారు. గతంలోనూ ఇంతే సకాలంలో నిర్మించలేదన్న కారణంతో ఇందిరమ్మ, ఫేజ్-1, 2, 3 లలో మంజూరయిన వాటిలో జిల్లా వ్యాప్తంగా 25 వేలు ఇళ్లను 2012లో రద్దు చేశారు. వాటి స్థానంలో కొత్త వారికి ఇల్లు మంజూరు చేస్తామని చెప్పారు. అయితే ఇంతవరకు ఒక్కరి కూడా మంజూరు చేయలేదు. సర్వే విషయాన్ని గృహనిర్మాణశాఖ పీడీ యు.కె.కుమార్ వద్ద ‘న్యూస్‌లైన్’ ప్రస్తావించగా ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాలు మేరకే సర్వే చేపడుతున్నామని చెప్పారు. సర్వేలో అనర్హులుగా తేలితే జాబితా నుంచి తొలిగిస్తామని తెలిపారు.