suryaprasad
-
108 సిబ్బందితో జీవీకే చర్చలు సఫలం
సాక్షి, హైదరాబాద్: వేతనాలు పెంచాలని, 12 గంటల పని నుంచి ఎనిమిది గంటలకు కుదించాలని గత 35 రోజులుగా సమ్మె చేస్తున్న 108 కాంట్రాక్టు సిబ్బందితో జీవీకే- ఈఎంఆర్ఐ యాజమాన్యం జరిపిన చర్చలు ఎట్టకేలకు ఫలించాయి. కార్మిక శాఖ అదనపు కమిషనర్ సూర్యప్రసాద్ ఆధ్వర్యంలో గురువారం ఇరువర్గాల మధ్య చర్చలు జరిగాయి. సిబ్బంది డిమాండ్లలో పనిగంటల విషయంలో తామేమీ మాట్లాడలేమని, ఉద్యోగుల వేతనాలను మాత్రం ఏడాదికి రూ.కోటీ 20 లక్షలకు పెంచుతామని జీవీకే యాజమాన్యం అంగీకరించింది. దీని ప్రకారం ఒక్కో ఉద్యోగికి నెలకు దాదాపు రూ.300 మేర వేతనం పెరగనుంది. తొలగించిన 336 మంది ఉద్యోగులను తిరిగి విధుల్లోకి తీసుకునేందుకు, ఉద్యోగులపై పెట్టిన కేసులు ఎత్తి వేసేందుకు కూడా అంగీకరించడంతో 108 సిబ్బంది సమ్మె విరమిస్తున్నట్లు యూనియన్ నాయకులు ప్రకటించారు. 24 గంటల్లోగా విధుల్లో చేరాలని కోరారు. -
108 సిబ్బందితో చర్చలు విఫలం.. నేడు మళ్లీ చర్చలు
ప్రధాన డిమాండ్లపై కుదరని రాజీ.. సాక్షి, హైదరాబాద్: 108 సిబ్బంది సమస్యలపై అదనపు లేబర్ కమిషనర్ సూర్యప్రసాద్ సమక్షంలో జీవీకే యాజమాన్యం, 108 సర్వీసెస్ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ యూనియన్ ఆధ్వర్యంలో బుధవారం జరిగిన చర్చలు విఫలమయ్యాయి. హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్‌రోడ్‌లోని టి.అంజయ్య కార్మిక సంక్షేమ భవన్లో సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 9 గంటలవరకు జరిగిన చర్చల్లో సిబ్బంది ప్రధాన డిమాండ్లు.. కనీస వేతనం రూ.15 వేలు, అదనపు పనికి అదనపు వేతనం తదితర అంశాలపై జీవీకే యాజమాన్యం, యూనియన్ ప్రతి నిధుల మధ్య రాజీ కుదరలేదు. దీంతో గురువారం మధ్యాహ్నం 12 గంటలకు ఉభయపక్షాలతో మళ్లీ చర్చలు జరపాలని కార్మిక శాఖ నిర్ణయించింది. తాజా చర్చల్లో జీవీకే, ఈఎంఆర్ఐ ప్రతినిధులు భట్టాచార్య, మూర్తి, 108 యూనియన్ ప్రతినిధులు భూపాల్, అప్పిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.