Suseenthiran
-
దర్శకుడు సుశీంద్రన్ రూ.5 లక్షల విరాళం
సాయం చేయాలనే మనసుంటే చాలు. అందుకు తగిన డబ్బులు సమకూర్చడానికి మార్గాలు చాలానే ఉంటాయి. దర్శకుడు సుశీంద్రన్ అలాంటి కార్యానికి శ్రీకారం చుట్టారు. వెన్నిల కబడ్డీ కుళు చిత్రంతో దర్శకుడిగా పరిచయమైన సుశీంద్రన్ ముఖ్యమంత్రి స్టాలిన్ విజ్ఞప్తి మేరకు కరోనా నివారణ నిధికి తన వంతు సాయం అందించాలని భావించారు. వెన్నిలా ఫీచర్ సినిమాస్ పేరుతో ఇటీవల పది రోజులు నటన, దర్శకత్వ శాఖలో ఆన్లైన్లో శిక్షణ తరగతులు నిర్వహించారు. తద్వారా వచ్చిన రూ.5 లక్షలను చెక్కు రూపంలో కరోనా నివారణ నిధికి ఆదివారం నటుడు, శాసనసభ్యుడు ఉదయనిధి స్టాలిన్‌కు అందజేశారు. చదవండి: మాస్ టైటిల్.. మైండ్ బ్లోయింగ్ లుక్ -
‘ఇస్మార్ట్’ బ్యూటీకి చేదు అనుభవం.. అందరి ముందే..
ఇస్మార్ట్ శంకర్ ఫేం, హాట్ బ్యూటీ నిధి అగర్వాల్‌కు చేదు అనుభవం ఎదురరైంది. హీరో శింబుతో కలిని నిధి అగర్వాల్ ఈశ్వరన్ అనే తమిళ మూవీలో నటిస్తున్న విషయం తెలిసిందే. ప్రముఖ నిర్మాత బాలాజీ కబా నిర్మించిన ఈ చిత్రానికి సుశీంద్రన్ దర్శకత్వం వహించారు. కె.భారతీరాజా వంటి సీనియర్ స్టార్ డైరెక్టరు కీలకమైన పాత్ర పోషించగా, నందితా శ్వేత, ఇతర తారాగణం నటించారు. కాగా, ఇటీవల జరిగిన ఈ మూవీ ఆడియో ఫంక్షన్లో చిత్ర దర్శకుడు ఆమెను కాస్త ఇబ్బంది పెట్టాడు. దీంతో ఈ ఇష్యూ కోలివుడ్లో చర్చనీయాంశంగా మారింది. అసలు ఏం జరిగిందంటే.. సినిమా ప్రమోషన్లో భాగంగా ఇటీవల ఈశ్వరన్ ఆడియో ఫంక్షన్ జరిగింది. ఇందులో హీరోయిన్ నిధి అగర్వాల్ స్టేజీపై మాట్లాడుతుండగా.. దర్శకుడు సుశీంద్రన్ పదే పదే మధ్యలో కలుగజేసుకుంటూ 'శింబు మామ ఐ లవ్యు' అని చెప్పు అంటూ అడ్డుపడుతూ బలవంత పెట్టారు. దీంతో నిధి కాస్త ఇబ్బంది పడినట్లుగా కనిపించింది. ప్రస్తుతం ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయింది. వీడియో చూసిన నెటిజన్లు దర్శకుడి ప్రవర్తనను తప్పుపడుతూ కామెంట్లు చేస్తున్నారు. దీంతో ఈ ఇష్యూపై దర్శకుడు సుశీంద్రన్ స్పందిస్తూ.. సినిమాలో శింబును ఉద్దేశించి నిధి 'మామా ఐ లవ్యూ' అని చెప్పే డైలాగ్ ఉంటుందని, దాన్ని హైలైట్ చేద్దామనే ఆడియో ఫంక్షన్లో అలా చెప్పనని వివరణ ఇచ్చారు. కాగా, ఈ చిత్రం ఈ నెల 13న విడుదలకానుంది. -
ఆ కోరిక నెరవేరింది
తెలుగులో చిత్రం చేయాలన్న కోరిక కేరాఫ్ సూర్యతో నెరవేరిందని వైవిధ్యభరిత చిత్రాల దర్శకుడు సుశీంద్రన్ సంతోషం వ్యక్తం చేశారు. వెన్నెల కబడ్డీ కుళు చిత్రం ద్వారా ఈయన దర్శకుడిగా పరిచయమయ్యారు. కార్తీ హీరోగా తెరకెక్కించిన నాన్ మహాన్ అల్ల చిత్రం తెలుగులో నా పేరు శివ పేరుతో అనువాదం అయ్యి రెండు భాషల్లోనూ ఆయనకు మంచి పేరు తెచ్చిపెట్టింది. అప్పటి నుంచి తాను తెలుగులో చిత్రం చేయాలని కోరుకున్నా అది నెరవేరలేదని దర్శకుడు సుశీంద్రన్ సోమవారం విలేకరులతో వెల్లడించారు. ఈయన తాజాగా దర్శకత్వం వహించిన చిత్రాన్ని తమిళంలో నెంజిల్ తుణివిరుందాల్, తెలుగులో కేరాఫ్ సూర్య పేరుతో తెరక్కెంచారు. నటుడు సందీప్‌కిషన్ కథానాయకుడిగా నటించిన ఈ చిత్రం నిర్మాణ కార్యక్రమాలు పూర్తి చేసుకుంది. ఈ వివరాలను దర్శకుడు తెలుపుతూ దీపావళి పండుగ అంటే తకు చాలా ఇష్టం అన్నారు. 1991లో రజనీకాంత్ నటించిన దళపతి చిత్రాన్ని చూసేందుకు స్నేహితునితో కలిసి సైకిల్ తొక్కుకుంటూ వెళ్లి, ఇంట్లో దెబ్బలు తిన్నా కూడా తొలిసారిగా దీపావళి పండగను ఎంజాయ్ చేశానన్నారు. ఆ తరువాత చెన్నైకి రావడంతో కొన్నేళ్లు దీపావళికి దూరంగా ఉన్నానని, మళ్లీ తన తొలి చిత్రం వెన్నెలా కబడ్డీ కుళు చిత్ర విడుదల సందర్భంగా 2009లో దీపావళి వేడుకను జరుపుకున్నాన్నారు. అప్పటి నుంచి వరసగా దీపావళిని కుటుంబ సభ్యులతో ఆనందంగా జరుపుకుంటున్నాన్నారు. పాండినాడు చిత్రం 2013లో దీపావళి సందర్భంగా విడుదలై తనకు ఘన విజయాన్ని అందించిందన్నారు. కాగా తాజా చిత్రం నెంజిల్ తుణివిరుందాల్ను ఈ దీపావళికి విడదల చేయాలనుకున్నా, అనివార్య కారణాల వల్ల వాయిదా పడిందన్నారు. ఈ చిత్రం తప్పక విజయం సాధిస్తుందనే నమ్మకం తనకు ఉందన్నారు. ప్రస్తుతం ఎంజీనా అనే చిత్రం నిర్మాణంలో ఉందని సుశీంద్రన్ తెలిపారు. -
కొత్త అల ఈ ప్రేమరా...
‘‘ఇప్పటివరకు మేం అందించిన సినిమాలన్నీ దాదాపు మ్యూజికల్ హిట్సే. ఈ సినిమా కూడా కచ్చితంగా ఆ జాబితాలో చేరుతుంది’’ అని చెప్పారు నిర్మాత సురేష్ కొండేటి. ఎస్.కె. పిక్చర్స్ పతాకంపై ఇప్పటివరకు తొమ్మిది చిత్రాలు తీసిన సురేష్, పదో సినిమాగా ‘ప్రేమించాలి’ని అందిస్తున్నారు. సుశీంద్రన్ దర్శకత్వంలో సంతోష్, మనీషా యాదవ్ జంటగా నటించిన ఈ చిత్రానికి యువన్‌శంకర్ రాజా పాటలు స్వరపరిచారు. ‘కొత్త అల ఈ ప్రేమరా.. కొంటె కల ఈ ప్రేమరా..’ అనే టైటిల్ సాంగ్‌ను ఇటీవల హైదరాబాద్‌లో రికార్డ్ చేశారు. సురేష్ మాట్లాడుతూ -‘‘నా గత చిత్రం ‘మహేష్’కి ‘మది మోసే మౌనాన్ని...’లాంటి పాట రాసిన పులగం చిన్నారాయణ ఈ ప్రేమ పాటను కూడా బాగా రాశారు. ‘మెలికల్ తిరుగుతుంటే అమ్మాయి..’, ‘కిర్రాకు కిర్రాకు’ పాటల ద్వారా మంచి క్రేజ్ సంపాదించుకున్న నరేంద్ర అద్భుతంగా పాడారు. యూత్ పదే పదే పాడుకునే విధంగా ఈ పాట ఉంటుంది. ఇంకా ఇతర పాటలు కూడా సినిమాకి ఎస్సెట్ అవుతాయి. అతి త్వరలో పాటలను, త్వరలో సినిమాను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం’’ అని చెప్పారు.