Suspicions death
-
విశాఖ బీచ్‌లో వివాహిత డెడ్‌బాడీ కలకలం.. ఏం జరిగింది?
సాక్షి, విశాఖపట్నం: విశాఖ బీచ్‌లో మహిళ డెడ్‌బాడీ కలకలం సృష్టించింది. వైఎంసీఏ బీచ్‌లో అనుమానాస్పద స్థితిలో యువతి మృతదేహం కనిపించడం స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. కాగా, మృతురాలిని పెదగంట్యాడకు చెందిన శ్వేతగా గుర్తించారు. వివరాల ప్రకారం.. వివాహిత శ్వేత మంగళవారం మిస్ అయినట్టు న్యూపోర్టు పోలీసు స్టేషన్లో కేసు నమోదైంది. ఈ క్రమంలో శ్వేత కోసం పోలీసులు గాలిస్తున్నారు. కాగా, బుధవారం ఉదయం విశాఖ ట్రీ టౌన్ పోలీసు స్టేషన్ పరిధిలో ఈ మృతదేహాం లభ్యమైనట్టు సమాచారం వచ్చింది. అయితే, నిన్న అర్ధరాత్రి సముద్రపు అలల తాకిడి మృతదేహాం కొట్టుకువచ్చినట్టు గుర్తించారు. కానీ, మహిళ మృతదేహాంపై గాయాలు, ఒంటిపై దుస్తులు లేకపోవడంతో పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఎవరైనా హత్య చేశారా? అని పోలీసులు అనుమానిస్తున్నారు. మరోవైపు.. శ్వేత భర్త ఐటీ ఉద్యోగి. ఆమె 5 నెలల గర్భిణి అని కుటుంబ సభ్యులు చెబుతున్నారు. తాజాగా శ్వేత మృతదేహాం లభ్యమైన ఈ నేపథ్యంలో కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. శ్వేత ఆత్మహత్య చేసుకుందా?.. లేక ఎవరైనా అఘాయిత్యానికి పాల్పడ్డారా? అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నట్టు తెలిపారు. -
ఏపీ ఫోరెన్సిక్ మాజీ డైరెక్టర్ శివకుమార్ అనుమానాస్పద మృతి
-
మరో మహిళతో భర్త వివాహేతర సంబంధం..భార్యను పట్టించుకోకపోవడంతో..
సాక్షి, మహబూబ్‌నగర్: ఓ వివాహిత అనుమానాస్పదంగా మృతి చెందింది. మండలంలోని చంద్రవంచలో ఈ సంఘటన చోటుచేసుకుంది. ఎస్సై నరేందర్ కథనం ప్రకారం.. మండల పరిధిలోని చంద్రవంచ గ్రామానికి చెందిన బోడ తాయప్ప, ఆయన భార్య గోపమ్మ(38) తరచూ గొడవ పడేవారు. ఇటీవల తాయప్ప వేరే మహిళతో అక్రమ సంబంధం పెట్టుకొని భార్యను పట్టించుకోవడం లేదు. అప్పుడప్పుడు ఇంటికి వచ్చి వెళ్లిపోయేవాడు. దీంతో భార్య గోపమ్మ తన పిల్లలతోకలిసి అత్తామామల వద్దే ఉంటోంది. చదవండి: మైనేమ్ ఈజ్ సుజి, ఐ యామ్ సింగిల్.. అంటూ వీడియో కాల్ చేసి.. దుస్తులు తీసేసి.. ఈ క్రమంలోనే ఈనెల 27న రాత్రి ఇంట్లో పురుగుల మందు తాగింది. ఈ విషయాన్ని అత్తామామలు గోపమ్మ తల్లిగారి కుటుంబానికి ఫోన్లో సమాచారం ఇచ్చారు. కానీ అదేరోజు అర్ధరాత్రి పరిస్థితి విషమించి చనిపోయినట్లు మరోమారు సమాచారం ఇచ్చారు. భర్త, అతని కుటుంబ సభ్యులే బలవంతంగా పురుగుల మందు తాగించి హత్య చేశారని మృతురాలి సోదరుడు కండయ్య పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు సంఘటనపై వివాహిత అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. చదవండి: ఇప్పుడే వస్తానమ్మా... అంటివి కదా కొడుకా! -
ఎన్నో అనుమానాలు.. ‘మొహంపై గీతలు, రక్తం, కన్ను గుడ్డు లేదు’
సాక్షి, రాజేంద్రనగర్: సెల్లార్లో ఆడుకుంటూ అదృశ్యమైన బాలుడు గుంతలో శవమై తేలిన మృతిపై తమకు అనుమానాలున్నాయని తల్లితండ్రులు అపర్ణ, శివశంకర్ అన్నారు. న్యూఫ్రెండ్స్ కాలనీలోని కేఆర్ అపార్ట్మెంట్లో వారు నివసిస్తుండగా గురువారం మధ్యాహ్నం ఇద్దరు కుమారులు సెల్లార్లో ఆడుకుంటూ అనీష్ (6) కనిపించకుండా పోయిన విషయం తెలిసిందే. మరుసటి రోజు అతను ఓ గుంతలో పడి శవమై కనిపించాడు. ఆదివారం బాలుడి తల్లితండ్రులు విలేకరులతో మాట్లాడుతూ.. తమ కుమారుడి మొహంపై గీతలు ఉన్నాయని, రక్తం కారిందని, కన్ను గుడ్డు లేదని తెలిపారు. ఇన్ని అనుమానాలు ఉన్నా పోలీసులు మాత్రం ఆడుకుంటూ పడి మృతి చెందినట్టు కేసును మూసివేసే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. తమ కుమారుడిని ఎవరో చంపి అందులో వేసినట్టు తమకు అనుమానాలు ఉన్నాయని ఆ దిశగా దర్యాప్తు చేపట్టాలని వారు డిమాండ్ చేశారు. చదవండి: కూతుళ్లే పుట్టారని వేధింపులు.. తల్లి, ఇద్దరు పిల్లల ఆత్మహత్య -
తువ్వాలులో జీఏవైరు పెట్టి మెడకు బిగించి హత్య
సాక్షి, సాలూరు: సాలూరు పట్టణంలో ఈ నెల 21న జరిగిన వివాహిత అనుమానాస్పద మృతి కేసును పోలీసులు ఛేదించారు. అనుమానంతో భర్తే హత్య చేసినట్టు నిర్ధారించారు. నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. పట్టణ పోలీస్ స్టేషన్లో శనివారం ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో హత్య వివరాలను సీఐ అప్పలనాయుడు, ఎస్ఐ ఫకృద్దీన్లు వెల్లడించారు. పట్టణంలోని చినహరిజనపేటకు చెందిన వివాహిత సారిక సంధ్య విజయనగరంలోని కన్నవారింటికి వెళ్లిన ప్రతిసారి పది, పదిహేనురోజుల పాటు ఉండిపోయేది. దీనిపై భర్త గణేష్ అనుమానం పెంచుకున్నాడు. ఈ విషయంలో తరచూ భార్యాభర్తల మధ్య గొడవలు జరిగేవి. రాఖీ పూర్ణిమ రోజున సోదరునికి రాఖీ కట్టడానికి విజయనగరం వెళ్లేందుకు సంధ్య సిద్ధమౌతోంది. అప్పటికే భార్యపై అనుమానంతో ఉన్న గణేష్ తువ్వాలిలో జీఏ వైరు పెట్టి సంధ్య మెడకు బిగించి హతమార్చాడు. తనకేమీ తెలియనట్టు సంధ్య మృతిచెందిందంటూ ఆమె కుటుంబ సభ్యులకు సమా చారం ఇచ్చాడు. మృతికి గంట ముందు రాఖీ కట్టేందుకు వస్తున్నానంటూ సోదరుడికి సంధ్య సమాచారం ఇవ్వడం, ఇంతలోనే చనిపో యిందని గణేష్ తెలియజేయడంతో అనుమానం వచ్చింది. పోలీసులకు ఫిర్యాదు చేశారు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసిన పోలీసులు తమదైన శైలిలో విచారణ కొనసాగించారు. నిందితుడు హత్య చేసినట్టు అంగీకరించాడని, కోర్టులో హజరుపర్చుతామని సీఐ తెలిపారు. చదవండి: కొరమీను, నాటు కోడి, రొయ్య, మటన్ ఖీమా.. ఈ పచ్చళ్లు టేస్ట్ చేశారా నేడు విశాఖకు సింధు.. స్టీల్‌ప్లాంట్ ఉన్నతాధికారులతో సమావేశం -
సచివాలయం ఉద్యోగి అనుమానాస్పద మృతి
సాక్షి, కందుకూరు: గ్రామ సచివాలయం ఉద్యోగి అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. ఈ సంఘటన పట్టణ శివారు లుంబినీవనం వద్ద శనివారం వెలుగుచూసింది. కుటుంబ కలహాల నేపథ్యంలో మనస్తాపంతో ఆత్మహత్య చేసుకున్నాడా లేక మరేదైనా కారణం ఉందా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మృతుడి బంధువులు, పోలీసుల కథనం ప్రకారం.. మండలంలోని కొండికందుకూరుకు చెందిన పిర్ల మాలకొండయ్య రెండో కుమారుడు రాఘవ (32) ప్రస్తుతం మండలంలోని కోవూరు సచివాలయంలో వెల్ఫేర్ అసిస్టెంట్‌గా విధులు నిర్వర్తిస్తున్నాడు. శుక్రవారం సచివాలయ కార్యదర్శికి ఫోన్ చేసిన రాఘవ తాను విధులకు రావడం లేదని, సెలవు కావాలని కోరాడు. సెలవు చీటీ పంపాలని కార్యదర్శి సూచించారు. ఆ తర్వాత రాఘవ నుంచి ఎటువంటి సమాధానం రాలేదు. శుక్రవారం మధ్యాహ్నం మూడు గంటల ప్రాంతంలో తనకు వాంతులు అవుతున్నాయని, ఆస్పత్రికి వెళ్లి వస్తానని కుటుంబ సభ్యులకు చెప్పిన రాఘవ కందుకూరు పట్టణానికి వచ్చాడు. ఆ తర్వాత తిరిగి రాత్రికి ఇంటికి చేరుకోలేదు. రాత్రి అంతా ఎదురు చూసిన కుటుంబ సభ్యులు శనివారం ఉదయానికి కూడా ఇంటికి రాకపోవడం, పోన్ స్విచ్ ఆఫ్ అని వస్తుండటంతో కుటుంబ సభ్యులు వెతుకుతూ కందుకూరు వైపు బయల్దేరారు. తండ్రి మాలకొండయ్య పట్టణ శివారు ప్రాంతం లుంబినీవనం కాలనీకి వచ్చే సరికి రాఘవ ద్విచక్ర వాహనం రోడ్డు పక్కన పడి ఉండటం గమనించాడు. ద్విచక్ర వాహనం ఆధారంగా వెతుకుతూ వెళ్లిన మాలకొండయ్యకు కొద్ది దూరంలో జామాయల్ తోటలో రాఘవ నిర్జీవంగా పడి ఉండటం గమనించాడు. చనిపోయినట్లు గుర్తించి వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చాడు. రాఘవది ఆత్మహత్యా లేక మరేదైనా ఇతర కారణం ఉందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రేమ వ్యవహారం కోణంలోనూ అనుమానాలున్నాయి. అదే గ్రామానికే చెందిన ఓ వివాహితతో సన్నిహితంగా ఉంటున్నాడు. ఈ విషయంలో పలుమార్లు రెండు కుటుంబాల మధ్య ఘర్షణ కూడా చోటు చేసుకున్నట్లు సమాచారం. ఈ విషయంలో కుటుంబ సభ్యులు మందలించడంతో మనస్తాపం చెంది ఆత్మహత్య చేసుకున్నాడనే అనుమానాలు కుటుంబ సభ్యులు, పోలీసులు వ్యక్తం చేస్తున్నారు. అనుమానాస్పద మృతి కింద కేసు నమోదు చేసిన పోలీసులు ప్రధానంగా ఆత్మహత్య చేసుకున్నాడనే కోణంలోనే దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహం పడి ఉన్న తీరు, మృతుడి ఒంటిపై ఎలాంటి గాయాలు లేకపోవడం వంటి కారణాల ఆధారంగా ఆత్మహత్య చేసుకుని ఉంటాడని భావిస్తున్నట్లు పోలీసులు చెప్తున్నారు. ఈ కేసుకు సంబంధించి అన్ని విషయాలు సేకరిస్తున్నామని, అన్ని కోణాల్లోనూ దర్యాప్తు చేస్తున్నట్లు డీఎస్పీ కండే శ్రీనివాసులు తెలిపారు. సంఘటన స్థలాన్ని పరిశీలించిన డీఎస్పీ సచివాలయ ఉద్యోగి మృతి వార్త తెలుసుకున్న డీఎస్పీ కండే శ్రీనివాసులు, సీఐ శ్రీరామ్‌లు సంఘటన స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. స్థానికులను అడిగి సమాచారం తెలుసుకోవడంతో పాటు కుటుంబ సభ్యుల నుంచి వివరాలు సేకరిస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ఏరియా హాస్పటల్‌కు తరలించారు. సచివాలయ ఉద్యోగి మృతికి సంబంధించి పూర్తి వివరాలు తెలుసుకోవాల్సి ఉందని డీఎస్పీ తెలిపారు. -
అశ్రునయనాలతో అంతిమ వీడ్కోలు
సాక్షి, కరీంనగర్ : కరీంనగర్ పరిధిలోని అల్గునూర్‌లో గల కాకతీయ కాలువలో జలసమాధి అయిన కుటుంబానికి సోమవారం అశ్రునయనాల మధ్య అంతిమ వీడ్కోలు పలికారు. పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్‌రెడ్డి తన చెల్లెలు రాధ మృతదేహంపై పుట్టింటి పట్టుచీరను కప్పి.. తోడబుట్టిన చెల్లెను ఇలా చూడాల్సి వస్తుందని అనుకోలేదని బాధపడ్డారు. రాధతో పాటు సత్యనారాయణరెడ్డి మృతదేహానికి పట్టుపంచ, కోడలు వినయశ్రీ మృతదేహంపై పట్టుచీర కప్పి చివరిసారి వీడ్కోలు పలుకుతూ విషాదంలో మునిగిపోయారు. కడసారిగా కన్నీటి వీడ్కోలు.. సత్యనారాయణరెడ్డి కుటుంబంతో బంధం, స్నేహం ఉన్న వారందరూ అలకాపూరికాలనీలోని శాంతినిలయంలో అంత్యక్రియలు జరగడంతో తండోపతండాలుగా తరలివచ్చారు. పట్టుకొని ఏడ్చేందుకు మృతదేహాలు కుళ్లిపోవడంతో ఆప్యాయంగా కడసారి కన్నీటి వీడ్కోలు పలుకుదామంటే కూడా అవకాశం లేదని బంధువులు రోదించారు. అందరితో అత్మీయంగా... సత్యానారయణరెడ్డి కుటుంబం అందరితో ఆత్మీయంగా కలుపుగోలుగా ఉండేదని బ్యాంక్‌కాలనీలో ఆయన ఇంటి వద్ద ఉండేవారు తెలిపారు. నవ్వుతూ పలకరించేవాడని ఇరుగుపొరుగు ఉన్న వారు, వారి స్థిరాస్తి వ్యాపారం చేసే స్నేహితులు గుర్తుచేసుకొని బాధపడ్డారు. తన కొడుకు శ్రీనివాస్‌రెడ్డి మృతిచెందనప్పటి నుంచి మనోవేదనకు గురై రాధ పాఠశాలకు ఎక్కువగా వెళ్లడం లేదని, దాదాపుగా 80 శాతం వరకు మెడికల్ లీవ్‌లోనే ఉందని, ఇప్పుడు కూడా జనవరి 7 నుంచి మెడికల్ లీవ్పెట్టినట్లు మల్కాపూర్ ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయులు తెలిపారు. ముగ్గురు మృతిచెందారని వార్త తెలియడంతోనే బ్యాంకుకాలనీలో మృతుల ఇంటికి పెద్ద ఎత్తున బంధువులు తరలివచ్చారు. తాళం వేసి ఉండడంతో ఘటనస్థలానికి వెళ్లారు. పోస్టుమార్టం జరిగే వరకూ ఉండి అలకాపూరి శ్మశానంలో అంత్యక్రియలకు హాజరయ్యారు. ఆత్మహత్యేనని అనుమానం..? జనవరి 25 తేదీన సుల్తానాబాద్‌కు చెందిన వస్త్రవ్యాపారి శ్రీనివాస్‌గౌడ్– స్వరూప దంపతులు ఆసుపత్రి కని వచ్చి తిరిగి సుల్తానాబాద్ వెళ్లే క్రమంలో కాకతీయ కాలువ వద్ద చేపలు కొనుగోలు చేసి తిరిగివెళ్లే క్రమంలో కాలువలో పడి మృతి చెందారు. అది జరిగినా రెండో రోజే సత్యనారాయణరెడ్డి కారు కాకతీయ కాలువలో పడటంతో కుటుంబంతో సహా ఆత్మహత్యకు పాల్పడ్డాడని పలువురు చర్చించుకున్నారు. ఇది ఇలా ఉండగా సత్యనారాయణరెడ్డి బంధువులు కొందరు మాత్రం ఆత్మహత్య చేసుకునేంత పరిస్థితులు వారికి లేవని, అకస్మాత్తుగా జరిగిన రోడ్డు ప్రమాదమేనని పేర్కొంటున్నారు. బ్యాంకుకాలనీలో సత్యనారాయణరెడ్డి ఇల్లు సీసీ కెమెరాలు పరిశీలిస్తే.. జనవరి 27న మధ్యాహ్నం ఆయన దుకాణంలో పనిచేసే నర్సింగ్ అనే వ్యక్తిని పిలిపించుకొని కారులో బట్టలు, రైస్ కుక్కర్, సిలిండర్, బెడ్షీట్లతో పాటు పలు వస్తువులు పెట్టించుకున్నాడు. తర్వాత 3.15 నిమిషాలకు సత్యానారయణరెడ్డి భార్య రాధ ఫోన్లో నుంచి నర్సింగ్కు ఫోన్ చేసి తన ఫోన్లో బ్యాలెన్స్ అయిపోయిందని రూ.599 ప్యాకేజ్ వెయించాలని చెప్పాడు. అదే నర్సింగ్‌తో మాట్లాడిన చివరికాల్ కాగా, దాదాపుగా 4 నుంచి 5గంటల సమయంలో కరీంనగర్ నుంచి బయలు దేరినట్లు తెలుస్తోంది. 27 తేదీన సీసీ కెమెరాలు కరీంనగర్ నుంచి కాకతీయ కాలువ వరకు పోలీసులు పరిశీలిస్తే అసలు ప్రమాదం ఏ సమయంలో జరిగి ఉంటుందనే విషయాలు తెలిసే అవకాశాలున్నాయి. పలువురి పరామర్శ.. సత్యనారాయణరెడ్డి కుటుంబం మృత్యువాత పడడంతో వారి బంధువులను పలువురు పరామర్శించి అంత్యక్రియల్లో పాల్గొన్నారు. ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ పాడే మోశారు. ఎమ్మార్పీఎస్ రాష్ట్ర నాయకులు అవునూరి ప్రభాకర్, జిల్లా అధ్యక్షుడు కొట్టెపెల్లి గంగరాజు, నీర్ల శ్రీనివాస్, ఎస్టీ సంఘాల నాయకులు కుతాడి శివరాజ్, కుతాడి శ్రీనివాస్, ఎంఎస్ఎఫ్ నాయకులు మాతంగి రమేష్, ఎంఆర్పీఎస్ నాయకులు సముద్రాల శ్రీను, దండు అంజయ్య, మధు, మాట్లా శ్యాం తదితరులు పాల్గొన్నారు. 24 గంటల్లో ఆరుగురి మరణవార్త.. 24 గంటల్లో మూడు ఘటనలకు సంబందించి మొత్తం ఆరుగురు మరణించారన్న వార్త విని కరీంనగర్ ప్రజలు ఆందోళన చెందుతున్నారు. 16వ తేదీ ఉదయం కరీంనగర్ పట్టణం సుభాష్‌నగర్‌కు చెందిన దంపతులు శ్రీనివాస్, స్వరూప అల్గునూర్ బ్రిడ్జి వద్ద లారీ ఢీకొట్టడంతో కారు బ్రిజ్జి కిందపడి శ్రీనివాస్ మృత్యువాతపడగా అక్కడ విధులు నిర్వహిస్తున్న కానిస్టేబుల్ చంద్రశేఖర్ అనుకోకుండా జారీ పడి చనిపోయాడు. అది మరువక ముందే అదే రోజు రాత్రి గన్నేరువరం మండల కేంద్రానికి చెందిన పరాంకుశం వెంకటనారాయణ ప్రదీప్, కీర్తనలు కాకతీయ కాలువలో పడగా ప్రదీప్ ప్రమాదం నుంచి బయటపడగా, కీర్తన ప్రవాహంలో కొంత దూరం కొట్టుకుపోయి ప్రాణాలు వదిలింది. వీరి ఆచూకీ కనుక్కునేందుకు కాలువ నీటి ప్రవాహం తగ్గించడంతో 17 తేదీన ఉదయం సత్యనారయాణరెడ్డి కుటుంబంతో సహా కారులోనే మృతదేహాలు కుళ్లిపోయి బయటపడటం 24 గంటల్లో ఆరుగురు చనిపోయారని వరుసగా ఇలాంటి సంఘటనలు జరుగుతున్నాయని ప్రజలు చర్చింకున్నారు. -
కుటుంబం జలసమాధి..
సాక్షి ప్రతినిధి, కరీంనగర్ : కరీంనగర్‌లోని కాకతీయ కాలువలో ఓ కుటుంబం జలసమాధి అయింది. కారు కాలువలో పడటంతో ముగ్గురు మృతిచెందారు. అయితే, సంఘటన జరిగిన 21 రోజుల తర్వాతే ఈ విషయం వెలుగు చూసింది. ఆదివారం రాత్రి బైక్ కాలువలోకి దూసుకెళ్లి ఓ మహిళ గల్లంతయ్యారు. ఆమె కోసం గాలించేం దుకు నీటి ప్రవాహం తగ్గించడంతో ప్రమాదానికి గురైన కారు బయటపడింది. పోలీసులు క్రేన్‌తో కారును బయటకు తీయగా, అందులో కుళ్లిపోయిన స్థితిలో మూడు మృతదేహాలు కనిపించాయి. మృతులను పెద్దపల్లి శాసనసభ్యుడు దాసరి మనోహర్‌రెడ్డి సోదరి రాధ (50), ఆమె భర్త సత్యనారాయణరెడ్డి (55), వారి కుమార్తె సహస్ర (21)గా గుర్తించారు. మృతదేహాలకు అక్కడే పోస్టుమార్టం చేశారు. అనంతరం స్మశానానికి తరలించి అంత్యక్రియలు నిర్వహించారు. అయితే, ఇది ప్రమాదవశాత్తు జరిగిన సంఘటనా లేక ఇతరత్రా కారణాలు ఏమైనా ఉన్నాయా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మూడు వారాలుగా వారు కనిపించకపోయినా, కుటుంబసభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేయకపోవడం గమనార్హం. ఘటనా స్థలంలో ఉన్న పరిస్థితులను బట్టి దీనిని ప్రమాదంగానే భావించి కేసు నమోదు చేసినట్టు ఎస్ఐ నరేష్‌రెడ్డి తెలిపారు. కుమార్తెను హైదరాబాద్ తీసుకెళ్దామని... సత్యనారాయణరెడ్డి కరీంనగర్లో సాయితిరుమల ఆగ్రో ఏజెన్సీస్ సీడ్స్ ఆండ్ ఫెస్టిసైడ్స్ పేరుతో వ్యాపారం నిర్వహిస్తున్నారు. ఆయన భార్య రాధ కొత్తపల్లి మండలం మల్కాపూర్ ప్రైమరీ పాఠశాలలో టీచర్‌గా పనిచేస్తున్నారు. బీటెక్ చదువుదున్న వారి కుమారుడు శ్రీనివాస్‌రెడ్డి నాలుగేళ్ల క్రితం సిరిసిల్లలో జరిగిన ఓ రోడ్డు ప్రమాదంలో మృతిచెందాడు. కుమార్తె వినయశ్రీ నిజామాబాద్‌లోని మేఘన డెంటల్ కాలేజీలో బీడీఎస్ చివరి సంవత్సరం చదువుతోంది. త్వరలోనే చదువు పూర్తికానున్న నేపథ్యంలో హైదరాబాద్‌లో మూడు నెలలపాటు హౌస్‌సర్జన్ శిక్షణ ఇప్పించాలని తండ్రి నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలో జనవరి 26న ఆయన హైదరాబాద్ వెళ్లి కుమార్తె కోసం కొంపల్లిలో ఓ ఇంటిని అద్దెకు తీసుకున్నారు. అందులో కొన్ని సామాన్లు సర్ది ఇంటికి తిరిగి వచ్చారు. మరుసటిరోజు సాయంత్రం 4 గంటల సమయంలో భార్య, కూతురుతో కలిసి బ్యాంకు కాలనీలోని ఇంటి నుంచి ఏపీ15బీఎన్ 3438 అనే నెంబర్ గల కారులో హైదరాబాద్ బయలుదేరారు. ఆ తర్వాత వారి నుంచి ఎలాంటి సమాచారం లేదు. బంధువులు ఎన్నిసార్లు కాల్ చేసినా ఫోన్లు స్విఛాప్ వచ్చాయి. దీంతో నాలుగైదు రోజుల తర్వాత వారి నివాసానికి వెళ్లి సమీపంలోని సీసీ కెమెరాలు పరిశీలించారు. ముగ్గురూ కలిసి కారులో వెళ్లినట్టు గుర్తించారు. అయినప్పటికీ అనుమానంతో ఇంటితాళం పగలగొట్టి లోపలకి వెళ్లి చూశారు. అనుమానాస్పదంగా ఏమీ లేకపోవడంతో ఏదైనా టూర్‌కి వెళ్లి ఉంటారని భావించి మరో తాళం వేసి వెళ్లిపోయారు. ఎమ్మెల్యే దాసరి మనోహర్‌రెడ్డిని ఓదారుస్తున్న సీపీ కమలాసన్‌రెడ్డి టూర్ వెళ్తున్నానని చెప్పిన వినయశ్రీ.. జనవరి 26వ తేదీ కంటే ముందు వినయశ్రీ ఇంటికి వచ్చింది. తాము టూర్‌కు వెళ్తున్నట్టు తన స్నేహితురాళ్లకు చెప్పింది. నాలుగైదు రోజులు గడిచినా ఆమె రాకపోవడంతో వారు ఫోన్ చేశారు. అది స్విఛాఫ్ వచ్చింది. సుమారు వారం రోజులకు ఈ విషయం ఎమ్మెల్యే మనోహర్‌రెడ్డికి తెలియంతో ఆయన తన చెల్లెలి కుటుంబం ఎక్కడుందో తెలుసుకునే ప్రయత్నాలు చేశారు. పనిమనిషిని అడగ్గా.. పది పదిహేను రోజులు టూర్ వెళ్తున్నట్టుగా తనకు చెప్పారని ఆమె వెల్లడించింది. హైదరాబాద్‌లో ఇల్లు అద్దెకు తీసుకున్న కొంపల్లిలో విచారించగా అక్కడికి కూడా రాలేదని తెలిసింది. ఫోన్ ట్రాకింగ్ చేసి చూస్తే కరీంనగర్‌లోనే సిగ్నల్ చూపించింది. అయితే, తరచూ యాత్రలకు వెళ్లే అలవాటున్న చెల్లెలు కుటుంబం దుబాయ్ వెళ్లి ఉండొచ్చని ఎమ్మెల్యే భావించినట్లు ఆయన బంధువులు తెలిపారు. అయితే ఇంత జరిగినా పోలీసులకు మాత్రం ఎవరూ ఫిర్యాదు చేయలేదు. సత్యనారాయణరెడ్డి స్నేహితుడు ఒకరు కరీంనగర్ మూడవ పట్టణ పోలీస్‌స్టేషన్‌కు వెళ్లినప్పటికీ, సీఐ లేకపోవడంతో లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేయకుండానే తిరిగి వచ్చారు. విషయం వెలుగుచూసింది ఇలా.. ఆదివారం రాత్రి పరాంకుశం వెంకటనారాయణ ప్రదీప్, కీర్తన దంపతులు బైక్‌పై కరీంనగర్ నుంచి గన్నేరువరం బయల్దేరారు. అల్గునూర్ శివారులోని కాకతీయ కాలువ వద్దకు రాగానే బైక్ లైటు వెలుతురుకు భారీగా పురుగులు వచ్చాయి. అవి ప్రదీప్ కళ్లలో పడటంతో బైక్ అదుపుతప్పి కాలువలోకి దూసుకెళ్లింది. అదే సమయంలో అటు వెళ్తున్న ఎల్ఎండీ పెట్రోలింగ్ పోలీసులు కాలువలో కొట్టుకుపోతున్న ప్రదీప్‌ను కాపాడారు. కీర్తన గల్లంతయ్యారు. దీంతో ఆమె కోసం గాలించేందుకు ఎస్సారెస్పీ అధికారులతో మాట్లాడి కాలువకు నీటి విడుదల నిలిపివేయించారు. గజఈతగాళ్లు కీర్తన కోసం గాలించగా.. మానకొండూరు మండలం ముంజపల్లి వద్ద ఆమె మృతదేహం లభించింది. కాలువలో నీటి ప్రవాహం తగ్గడంతో గతనెల 27న అందులో పడిపోయిన సత్యనారాయణరెడ్డి కారు బయట పడింది. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడకు చేరుకుని కారుని బయటకు తీయించారు. కారు నెంబర్ ఆధారంగా అది సత్యనారాయణరెడ్డి పేరున ఉన్నట్టు గుర్తించారు. ఆయన ఎమ్మెల్యే దాసరి మనోహర్‌రెడ్డికి స్వయానా బావ అని తెలుసుకుని ఆయనకు సమాచారం ఇచ్చారు. సంఘటన స్థలానికి హుటాహుటిన వచ్చిన మనోహర్‌రెడ్డి.. కారును పరిశీలించి తన బావ కారుగా నిర్ధారించారు. అందులో ఉన్న మూడు మృతదేహాలను చూసి కన్నీటిపర్యంతమయ్యారు. గతనెల 27న ఇంట్లో నుంచి వెళ్లారని, అప్పటినుంచి తెలిసినవారి ఇళ్లలో ఆరా తీస్తున్నట్టు చెప్పారు. హైదరాబాద్ వెళ్తున్నట్టు పొరుగువారికి చెప్పారని, ఆ క్రమంలో ప్రమాదవశాత్తు కాలువలో పడి ఉంటారని పేర్కొన్నారు. సంఘటనపై తమకు ఎలాంటి అనుమానాలు లేవని, ఆత్యహత్య చేసుకునేందు ఇబ్బందులు కూడా వారికి లేవని వెల్లడించారు. ఆత్మహత్యకు అవకాశం తక్కువే! సత్యనారాయణరెడ్డి కుటుంబం మృత్యువాత పడడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నా.. అది ప్రమాదమేనని పోలీసులు భావిస్తున్నారు. ఇరుకుగా ఉన్న వంతెనపైకి రాకముందే కారు పూర్తిగా ఎడమవైపు వచ్చి కాలువలో పడి ఉంటుందని నిర్ధారణకు వచ్చారు. ఒకవేళ రెయిలింగ్‌ను తాకి కారు ప్రమాదానికి గురై ఉంటే రోడ్డుపై వెళ్లేవారికి తెలిసేదని అంటున్నారు. జరిగిన సంఘటనను పరిశీలిస్తే ఆత్మహత్య చేసుకునే పరిస్థితి కొంచెం కూడా కనిపించడంలేదని పోలీసులు చెబుతున్నారు. పైగా ఆత్మహత్య చేసుకోవాలనుకునేవారు అనామకులుగా చనిపోవాలని భావించరని, కారుతోపాటు కాలువలోకి వెళ్లాలనుకోరన్నది వారి వాదన. అక్కడ సమీపంలోని సీసీ కెమెరాలు పరిశీలిస్తే ఏం జరిగిందో తెలిసే అవకాశం ఉంది. కారులో సామాన్లు సర్ది వచ్చాను గతనెల 27న మా సార్లు వాళ్ళు ఊరెళుతున్నారని చెప్పడంతో బెడ్షీట్లు, రైస్కుక్కర్తోపాటు కొని సామాన్లు కారులో పెట్టి వచ్చాను. అదేరోజు సాయంత్రం సత్యనారాయణరెడ్డి సారు రాధ మేడం ఫోన్ నుంచి నుంచి కాల్ చేసి తన ఫోన్లో బ్యాలెన్స్ అయిపోయిందని, రీచార్జి చేయించాలని చెప్పారు. నేను వెంటనే రీచార్జీ చేయించాను. మరుసటిరోజు ఫోన్ చేస్తే స్విఛాఫ్ వచ్చింది. నాలుగైదు రోజులు ఫోన్ కలవకపోవడంతో మా సార్ స్నేహితులు, బంధువుల షాప్‌కు వస్తున్నాడా అని నన్ను అడిగారు. ఇన్నిరోజులుగా మా సార్ వస్తారని ఎదురుచూస్తూ ఉన్నాను.– నర్సింగ్, సత్యనారాయణరెడ్డి షాపులో పనిచేసే వ్యక్తి అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నాం పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్‌రెడ్డి బావ నరెడ్డి సత్యనారాయణరెడ్డి కారు కాలువలో పడి, ఆయనతోపాటు భార్య రాధ, కుమార్తె వినయశ్రీ మృతిచెందిన ఘటనపై దర్యాప్తు చేస్తున్నాం. ఈ ఘటనపై గతంలో మాకు ఎలాంటి ఫిర్యాదు అందలేదు. ఏ పోలీస్ స్టేషన్లోనూ మిస్సింగ్ కేసు కూడా నమోదు కాలేదు. ప్రమాదం ఎలా జరిగిందనేదానిపై విచారణ జరుపుతాం. ఎమ్మెల్యే మనోహర్‌రెడ్డి ఎలాంటి అనుమానాలు లేవని నిర్ధారించినందున ప్రమాదవశాత్తూ కారు కాలువలో పడి ఉంటుందని భావిస్తున్నాం. విచారణ అనంతరం పూర్తి వివరాలు వెల్లడిస్తాం. – కమలాసన్‌రెడ్డి, కరీంనగర్ సీపీ ప్రమాదమేనని తేలింది సత్యనారాయణరెడ్డి కుటుంబం చనిపోయిన ఘటన ప్రాథమిక విచారణలో ప్రమాదమే అని తేలింది. వీలైనంత తొందరగా విచారణ పూర్తిచేస్తాం. ప్రమాదం ఎప్పుడు, ఎక్కడ, ఎలా జరిగిందనే విషయాలు దర్యాప్తులో బయటపడతాయి. – నితికాపంత్, ట్రైనీ ఐపీఎస్ -
రాధ కుటుంబం మృతిపై పలు అనుమానాలు..!
-
కారులో మూడు మృతదేహాలు..
సాక్షి, కరీంనగర్: అలగునూర్ సమీపంలో కాకతీయ కెనాల్లోకి కారు దూసుకుపోయి ముగ్గురు మృతి చెందిన సంఘటనపై పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ప్రమాదవశాత్తూ కారు కెనాల్లోకి దూసుకువెళ్లిందా? లేక వారు ఆత్మహత్యకు పాల్పడ్డారా అనే అనుమానాలు కలుగుతున్నాయి. కాగా పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి సోదరి రాధ, ఆమె భర్త సత్యనారాయణ రెడ్డి, కుమార్తె వినయశ్రీ అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. వీరు ప్రయాణిస్తున్న కారు కాకతీయ కెనాల్లో బయటపడింది. ఆదివారం రోజున మానేరు కాలువలో ప్రమాదవ శాత్తు పడిన ఒక మోటార్ బైక్ ను వెలికితీయడానికి కాలువలో నీటిని నిలిపివేశారు. నీరు ఖాళీ కావడంతో అందులో కారు బయటపడింది. దాన్ని పోలీసులు తరిచి చూస్తే అందులో కుళ్లిన శవాలు బయటపడ్డాయి. లభించిన ఆధారాల మేరకు పెద్దపల్లి ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి సోదరి కుటుంబం అని తేలింది. (చదవండి : పెద్దపల్లి ఎమ్మెల్యే సోదరి అనుమానాస్పద మృతి!) గత నెల 27న సాయంత్రం మూడు గంటల నుంచి సత్యనారాయణ రెడ్డి ఫోన్ స్విచ్చాఫ్‌లో ఉంది. ఆ సమయంలోనే కారు కెనాల్లో పడితే రాజీవ్ రహదారిపై వెళ్లేవారు చూసేందుకు అవకాశం ఉండేది. అయితే ఈ ప్రమాదం సాయంత్రం వరకూ జరిగి ఉండకపోవచ్చని పోలీసులు భావిస్తున్నారు. కాగా సత్యానారాయణ రెడ్డి ...భార్య, కుమార్తెకు తెలియకుండా ముందుగా పథకం ప్రకారమే రాత్రి సమయంలో వేగంగా కారును కెనాల్లోకి దూసుకువెళ్లేలా చేశారా అనే కోణంలోనూ పోలీసులు విచారణ జరుపుతున్నారు. ఈ సంఘటనపై ట్రైనీ ఐపీఎస్ నితిక పంత్ విచారణ చేపట్టారు. సంఘటనా స్థలంలోనే మూడు మృతదేహాలకు పోస్ట్‌మార్టం నిర్వహించారు. సత్యనారాయణరెడ్డి జనవరి 27న భార్య, కుమార్తెతో కలిసి ఇంటి నుంచి కారులో బయల్దేరారు. వీరంతా పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డికి దగ్గర బంధువులు. మృతురాలు రాధ ఎమ్మెల్యేకు సోదరి అవుతుంది. సత్యనారాయణ రెడ్డికి కరీంనగర్లో ఫర్టిలైజర్ షాపు ఉండగా, రాధిక స్కూల్ టీచర్. మూడేళ్ల క్రితం వీరి కుమారుడు రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. కొడుకును కోల్పోయినప్పటి నుంచి దంపతులు మానసికంగా కృంగిపోయారు. వైద్యం కోసం తరచూ హైదరాబాద్‌కి వెళ్లేవారని బంధువులు తెలిపారు. ఇంటి నుంచి వెళ్లిన వీరి ఆచూకీ తెలియకపోవడంతో బంధువులు వారి ఆచూకీ కోసం ప్రయత్నించారు. చివరకు బ్యాంక్ కాలనీలోని వారి ఇంటి తాళాలు పగులగొట్టి చూసినా ఎలాంటి ఆధారాలు లభించలేదు. ఒకవేళ విదేశాలకు వెళ్లి ఉంటారని భావించి విమానాశ్రయంలో ఆరా తీసినా ఫలితం లేకపోయింది. అయితే పోలీసులకు రాతపూర్వకంగా ఫిర్యాదు చేయకపోవడంతో మిస్సింగ్ కేసు నమోదు కాలేదు. -
పెద్దపల్లి ఎమ్మెల్యే సోదరి అనుమానాస్పద మృతి
-
భర్త, కుమార్తెతో సహా ఎమ్మెల్యే సోదరి మృతి
సాక్షి, కరీంనగర్ : పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి ఇంట్లో విషాదం చోటుచేసుకుంది. మనోహర్ రెడ్డి సోదరి రాధ కుటుంబ సభ్యులు అలగనూరు వద్ద మానేరు కాలువలో శవాలుగా తేలారు. భర్త సత్యనారాయణ రెడ్డి, కుమార్తె సహస్రతో సహా ఎమ్మెల్యే సోదరి రాధ మృతి చెందారు. దాదాపు 20 రోజుల నుంచి ఆ కుటుంబం గురించి ఎలాంటి సమాచారం లేదు. ఆదివారం రోజున మానేరు కాలువలో ప్రమాదవ శాత్తు పడిన ఒక మోటార్ బైక్ ను వెలికితీయడానికి కాలువలో నీటిని నిలిపివేశారు. నీరు ఖాళీ కావడంతో అందులో కారు బయటపడింది. దాన్ని పోలీసులు తరిచి చూస్తే అందులో కుళ్లిన శవాలు బయటపడ్డాయి. లభించిన ఆధారాల మేరకు పెద్దపల్లి ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి సోదరి కుటుంబం అని తేలింది. దాదాపు 20 రోజులుగా ఆ కుటుంబానికి సంబంధించిన సమాచారం లేదు. (దూసుకొచ్చిన మృత్యువు) బైకు కోసం నీటిని ఖాళీ చేయగా అందులో ప్రమాదానికి గురైన కారు కనిపించడంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కారు నుంచి మూడు శవాలను బయటకు తీశారు. అవి పూర్తిగా కుళ్లిపోయిన దశలో ఉన్నాయి. కారు నంబర్ ఆధారంగా పెద్దపల్లికి చెందిన రాధగా గుర్తించారు. ఆమె స్థానిక ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి సోదరి. జనవరి 27 నుంచి ఆమెకు సంబంధించిన ఎలాంటి సమాచారం లేదని ఎమ్మెల్యే చెబుతున్నారు. ఇన్ని రోజులు గడుస్తున్నా ఆ కుటుంబానికి సంబంధించిన ఎలాంటి ఫిర్యాదు నమోదు కాకపోవడం అనుమానాలకు తావిస్తోంది. ప్రస్తుతం ఘటనా స్థలానికి ఎమ్మెల్యే మనోహార్ రెడ్డి, కలెక్టర్ శశాంక్, సీపీ కమల్‌హాసన్‌రెడ్డి చేరుకున్నారు, ఈ సందర్భంగా ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడారు.. తమ కుటుంబానికి సోదరి మరణం తీరని లోటు అని ఎమ్మెల్యే వ్యాఖ్యానించారు. తమ కుటుంబంలో ఎలాంటి గొడవలు లేవని, సోదరి కుటుంబం తరచుగా విహార యాత్రలకు వెళ్తూ ఉంటారని, తాజాగా కూడా అలాగే భావించామని పేర్కొన్నారు. గత 20 రోజులుగా వారితో సంబంధాలు లేవని అందుకే తమకెలాంటి అనుమానం రాలేదని తెలిపారు. సీపీ కమలాహాసన్ రెడ్డి మాట్లాడుతూ, ఈ ఘటనపై ఎలాంటి వివరాలు అందలేదని,పూర్తి వివరాలు తెలియాల్సి ఉందని తెలిపారు. మిస్సింగ్ కేసు నమోదైందో తెలియాల్సి ఉందన్నారు. పూర్తి విచారణ తరువాత వివరాలు వెల్లడిస్తామన్నారు. -
అంత్యక్రియల అనంతరం నిలదీస్తే.. ఒప్పుకొన్న భర్త
సాక్షి, యద్దనపూడి: అనారోగ్యంతో చనిపోయిందని భావించిన వివాహత మృతి వ్యవహారం ఆ తర్వాత హత్యగా వెలుగులోకి వచ్చింది. ఈ సంఘటన మండల కేంద్రం యద్దనపూడిలో జరిగింది. స్థానికులు, సీఐ రాంబాబు కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన నూతలపాటి లక్ష్మీరాజ్యం (50) అనారోగ్యంతో ఈ నెల 11వ తేదీ గురువారం వేకువ జామున మృతి చెందినట్లు భావించి కుటుంబ సభ్యులు శుక్రవారం అంత్యక్రియలు చేశారు. మృతురాలి కుమార్తె లావణ్య తన తల్లి మరణం సహజంగా జరిగింది కాదని అనుమానం వ్యక్తం చేసిన నేపథ్యంలో బంధువులు, గ్రామ పెద్దలు మృతురాలి భర్త నూతలపాటి వేణుగోపాలరావును నిలదీశారు. తన భార్యను తానే హత్య చేసినట్లు అతడు నేరం అంగీకరించాడు. మృతురాలి కుమార్తె లావణ్య స్థానిక పోలీసుస్టేషన్లో ఫిర్యాదు చేయడంతో ఇంకొల్లు సీఐ రాంబాబు నిందితుడిని అదుపులోకి తీసుకొని కేసు దర్యాప్తు చేపట్టారు. వికలాంగుడైన వేణుగోపాలరావు ఒక్కడే హత్యకు పాల్పపడి ఉండడని, ఇంకా ఎవరైనా సహకరించి ఉంటారనే కోణంలో పోలీసుల దర్యాప్తు సాగుతోంది. -
కాంగ్రెస్ నాయకురాలి అనుమానాస్పద మృతి..!
బెంగుళూరు : కాంగ్రెస్ పార్టీ నాయకురాలు రేష్మా పడెకనూర్ మృతి చెందారు. గురువారం రాత్రి అదృశ్యమైన ఆమె శుక్రవారం శవమై కనిపించారు. బసవనబాగేవాడి తాలుకాలో కృష్ణానదిపై నిర్మించిన కొల్హార్ బ్రిడ్జి సమీపంలో ఆమె మృతదేహాన్ని స్థానికులు గుర్తించారు. సమాచారం అందుకున్నపోలీసులు అక్కడకు చేరుకుని అనుమానాస్పదమృతిగా కేసు నమోదు చేశారు. మృతదేహంపై గాయాలున్నాయని.. ఇది హత్యా, ఆత్మహత్యా తెలియాల్సి ఉందని ఏసీపీ బీఎస్ నేమెగౌడ్ చెప్పారు. దర్యాప్తు మొదలు పెట్టామని వెల్లడించారు. గురువారం రాత్రి నుంచి కనిపించకుండా పోయిన రేష్మా రాత్రయినా ఇంటికి రాకపోవడం, సెల్‌ఫోన్ స్విఛాఫ్ చేసి ఉండడంతో కుంటుంబ సభ్యులు కొల్హార్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. పోలీసులు, ఆమె కుటుంబ సభ్యులు రాత్రంతా వెతికినా ఫలితం లేకపోయింది. రేష్మా మృతదేహం, పక్కన ఆమె ఫైల్ ఫోటో మహారాష్ట్రకు చెందిన మజ్లిస్ పార్టీ నాయకుడి కారులో ఆమె వెళ్లినట్టు పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. జేడీఎస్ విజయపుర జిల్లా అధ్యక్షురాలిగా పనిచేసిన రేష్మా 2013 అసెంబ్లీ ఎన్నికల్లో దేవరహిప్ప నియోజకవర్గం పోటీచేసి ఓడిపోయారు. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో జేడీఎస్ మరోమారు టికెట్ కేటాయించకపోవడంతో.. ఆమె కాంగ్రెస్‌లో చేరారు. కాంగ్రెస్ పార్టీలో క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నారు. లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో చురుగ్గా పాల్గొన్న రేష్మా ఫలితాలు దగ్గర పడుతున్న సమయంలో ప్రాణాలు కొల్పోవడం పలు అనుమానాలకు తావిస్తోంది. ఆమె మరణంపట్ల కాంగ్రెస్ పార్టీ నాయకులు దిగ్భాంతి వ్యక్తం చేశారు. -
అనుమానాస్పద స్థితిలో బాలిక మృతి
చింతకాని ఖమ్మం : మండలంలోని గాంధీనగర్‌కాలనీలో అనుమానాస్పద స్థితిలో మహ్మద్ సోఫియా(13) బాలిక సోమవారం రాత్రి మృతి చెందింది. స్థానికులు తెలిపిన వివరాలు... కాలనీకి చెందిన హస్నుజమా, నస్రీన్ దంపతుల చిన్న కుమార్తె సోఫియా, ఖమ్మం నగరంలోని పాఠశాలలో 4వ తరగతి చదువుతోంది. ప్రతి రోజు ఇంటి నుంచి పాఠశాలకు బస్సులో ఖమ్మం వెళ్లి వస్తోంది. అనారోగ్యం కారణంగా సోమవారం పాఠశాలకు వెళ్లలేదు. తమ ఇంట్లోని బాత్రూంలో రేకుల కోసం ఏర్పాటు చేసిన ఇనుప రాడ్‌కు చున్నీతో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. బయటకు వెళ్లిన తల్లి ఇంటికి వచ్చేసరికి కుమార్తె కన్పించకపోవటంతో బాత్రూం వద్దకు వెళ్లి చూసింది. వెంటనే చుట్టుపక్కల వారి సహాయంతో కిందకు దించి, స్థానిక ఆర్ఎంపీ వద్దకు తీసుకెళ్లింది. అప్పటికే మృతిచెందినట్టుగా ఆ ఆర్ఎంపీ తెలిపారు. బాత్రూంలో రేకుల కోసం అమర్చిన ఇనుప రాడ్ ఎత్తు ఆరు అడుగులు ఉంది. రాడ్‌కు కట్టిన చున్నీ నాలుగున్నర అడుగుల కిందకు వేలాడి ఉంది. దీంతో, బాలిక మృతిపై (ఆత్మహత్యపై) స్థానికులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. భర్తకు దూరంగా నస్రీన్ ఉంటోంది. ఆ దంపతులకు ఐదుగురు పిల్లలు. ఇద్దరు కుమారులు, ముగ్గురు కుమార్తెలు. గతంలో రెండవ కుమారుడు ఆత్మహత్య చేసుకున్నాడు. నస్రీన్ ఫిర్యా దుతో ఎస్సై మొగిలి కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
అనుమానాస్పదంగా కార్మికుడి మృతి
బరంపురం: నగరంలోని సితలాపల్లి గ్రామ శివారులో అదే గ్రామానికి చెందిన ఎంకా రెడ్డి మృతదేహం ఉండడాన్ని గ్రామస్తులు ఆదివారం గుర్తించారు. ఇదే విషయంపై గ్రామస్తులు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో విషయం తెలుసుకున్న గోపాల్పూర్, చమ్మఖండి పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తమై బరంపురం ఎంకేసీజీ మెడికల్‌కు తరలించారు. అనంతరం కేసును నమోదు చేసి దర్యాప్తు చేపడుతున్నారు. దీనిపై గోపాల్పూర్ పోలీస్‌స్టేషన్ ఐఐసీ అధికారి అందించిన సమచారం ప్రకారం.. సితలాపల్లిలో నివాసముంటున్న ఎంకా రెడ్డి తన భార్యతో కలిసి పని కోసం శనివారం గోపాల్పూర్ వెళ్లాడు. అదే రోజు సాయంత్రం పని ముగించుకుని వ్యాన్‌లో ఇంటికి పయనమయ్యాడు. మార్గం మధ్యలో ఓ బైకుపై వచ్చిన యువకుడితో ఎంకారెడ్డి కలిసి వెళ్ళాడు. రాత్రి అయినా ఎంకా రెడ్డి ఇంటికి రాకపోవడంతో కుటుంబ సభ్యులు ఎంకారెడ్డికి మొబైల్‌కు ఫోన్ చేశారు. ఎంతసేపు ఫోన్ చేసినా స్విచ్ ఆఫ్ రావడంతో కుటుంబ సభ్యులు ఆందోళనకు గురయ్యారు. ఆదివారం ఉదయం సితలాపల్లి గ్రామ పొలాల్లో విగతజీవుడై ఉన్న ఎంకా రెడ్డిని గ్రామస్తులు గుర్తించి పోలీసులకు సమాచారమిచ్చారు. పాతకక్షలే కారణం 2014లో జరిగిన జి.గణరెడ్డి హత్య కేసులో ప్రధాన నిందితుడిగా ఎంకా రెడ్డి ఆరోపణలు ఎదుర్కొని, ఇటీవల నిర్దోషిగా విడుదలయ్యాడు. ఈ నేపథ్యంలో ఈ హత్య జరగడం పలు అనుమానాలకు తావునిస్తోంది. బండరాయిని తలపై మోది హత్య చేసి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. పూర్తి సమాచారం ప్రాథమిక నివేదిక వచ్చాక చెబుతామని పోలీసులు తెలిపారు -
అనుమానాస్పదంగా యువకుడి మృతి
విశాఖపట్నం, పెందుర్తి: పెందుర్తి సమీపంలోని చినముషిడివాడ సిద్దార్థనగర్ కాలనీలో ఓ యువకుడు అనుమానాస్పదంగా మృతి చెందాడు. ఓ వివాహితతో యువకుడు అక్రమ సంబందం కలిగి ఉన్న ఇంట్లోనే ఘటన చోటుచేసుకుంది. సదరు వివాహిత, మరో యువకుడు కలిసి ఈ ఘాతుకానికి పాల్పడినట్లు మృతుని బంధువులు ఆరోపిస్తున్నారు. గురువారం ఉదయం స్థానికంగా కలకలం రేపిన ఈ ఘటన వివరాలు ఇలా ఉన్నాయి. సింహాచలం సమీపంలోని గోశాల ప్రాంతానికి చెందిన బలిరెడ్డి తరుణ్‌కుమార్(25) తల్లితో కలిసి నివాసం ఉంటున్నాడు. తరుణ్‌కి చినముషిడివాడకు చెందిన వివాహిత దొడ్డి కుమారి(భర్తతో కలిసి ఉండడం లేదు)తో వివాహేతర సంబంధం ఏర్పడింది. కాగా ఉపాధి నిమిత్తం కొన్నాళ్ల క్రితం దుబాయ్ వెళ్లిన తరుణ్ కొద్దిరోజుల క్రితమే ఇంటికి వచ్చాడు. ఈ క్రమంలో సిద్దార్థనగర్‌లో ఉంటున్న కుమారి వద్దకు రాత్రి సమయంలో వచ్చేవాడు. బుధవారం రాత్రి కూడా వచ్చిన తరుణ్ గురువారం తెల్లవారుజామున కిటికీకి చీరతో ఉరి వేసుకుని కనిపించాడు. ఈ నేపథ్యంలో కుమారి చుట్టుపక్కల వారిని పిలవగా వారు తరుణ్ కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. ఘటానాస్థలికి చేరుకున్న మృతుని బంధువులు కుమారి, ఆమెతో చనువుగా ఉండే షణ్ముఖ అనే యువకుడిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. అంతా అనుమానమే ఘటనాస్థలంలో మృతుడు తరుణ్ ఉరి వేసుకున్న విదానమే అనుమానాస్పదంగా ఉంది. కాళ్లు కిందకు తగిలేలా ఉండే కిటికీకి ఉరి ఎలా వేసుకుంటాడని మృతుని బంధువులు ప్రశ్నిస్తున్నారు. అంతేకాకుండా ఉరి వేసుకుంటే సాధారణంగా నాలుక బయటకు వస్తుంది. కానీ తరుణ్ మృతదేహం అలా లేదు. మరోవైపు తరుణ్ సంబంధం కొనసాగిస్తున్న కుమారిపై గతంలో వ్యభిచారం ఆరోపణలు ఉన్నట్లు పోలీసుల దృష్టికి వచ్చింది. ఈ క్రమంలో ఆమె మరో యువకుడితో చనువుగా ఉన్నట్లు తరుణ్ గమనించినట్లు తెలుస్తుంది. కాగా మృతుని బంధువులు కూడా కుమారి సహా షణ్ముఖ అనే యువకుడే తరుణ్‌ని హతమార్చి ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నారని ఫిర్యాదులో ఆరోపిస్తున్నారు. పోలీసులు కుమారి, షణ్ముఖలను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. తరుణ్ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కేజీహెచ్‌కు తరలించారు. పోస్టుమార్టం నివేదిక వచ్చిన తర్వాత కేసు ఓ కొలిక్కి వస్తుందని పెందుర్తి సీఐ పి.సూర్యనారాయణ చెప్పారు. సీఐ ఆధ్వర్యంలో ఎస్ఐ అప్పలరాజు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
కాటేసే ‘కాస్మొటిక్’!
సాక్షి, హైదరాబాద్: అతిలోక సుందరి దివికేగింది.. మరణానికి కారణం గుండెపోటని వార్తలొచ్చినా సమయం గడుస్తున్న కొద్దీ అనేక అనుమానాలు ముసురుకుంటున్నాయి.. కాస్మొటిక్ సర్జరీలు కారణమని కొందరు.. బరువు తగ్గేందుకు వాడిన మందులని ఇంకొందరు అనుమానిస్తున్నారు.. ఆరోపిస్తున్నారు కూడా.. వాస్తవం రహస్యంగానే ఉండిపోవచ్చుగానీ సౌందర్య శస్త్ర చికిత్సలు, బరువు తగ్గించే మాత్రలు ప్రాణాలు తీసేంత హానికరమైనవే! గ్లామర్ ప్రపంచంలో అందంగా కనిపించడం అనివార్యం. కడుపు కట్టుకోవడం, ద్రవ ఆహారమే తీసుకోవడం, గంటల తరబడి వ్యాయామం చేస్తూ అందాన్ని కాపాడుకోవడం ఓ రకమైతే.. పెరుగుతున్న వయసు, ఒళ్లు దాచుకోడానికి శస్త్ర చికిత్సలు, మందులు మింగి ఆకలిని అణచుకొని నాజూకుగా కనిపించే ప్రయత్నం చేయడం ఇంకో రకం. శ్రీదేవి రెండో రకం వ్యక్తి అని కొన్ని వార్తలు చెబుతున్నాయి. చిన్న వయసులోనే ముక్కు ఆకారం సరిచేసుకోడానికి రైనోప్లాస్టీ చేయించుకున్న శ్రీదేవి.. తరువాత అమెరికా కాలిఫోర్నియాలోని ఓ ఆస్పత్రిలో చిన్నాచితకా కలిపి మొత్తం దాదాపు 29 ఆపరేషన్లు చేయించుకున్నారని వార్తలొస్తున్నాయి. శ్రీదేవికి దగ్గరి స్నేహితురాలు ఒకరు ఈ విషయమై ఫేస్బుక్లో ఓ పోస్ట్ కూడా పెట్టారు. అన్ని సర్జరీలూ ప్రమాదకరమే.. కాస్మొటిక్ సర్జరీలతో అందం మాటేమోగానీ.. ఆరోగ్యం నాశనమవడం ఖాయమన్నది నిపుణుల మాట. రైనోప్లాస్టీ మొదలుకొని.. వక్ష సౌందర్యాన్ని పెంచుకోడానికి చేసుకునే శస్త్ర చికిత్స.. శరీరంలోని కొన్ని భాగాల నుంచి కొవ్వులు తొలగించేందుకు చేసే లైపోసక్షన్, తినే ఆహారం మోతాదును కృత్రిమంగా తగ్గించేందుకు బేరియాట్రిక్ సర్జరీ.. ఇలా అన్ని రకాల సర్జరీలతోనూ దుష్ప్రభావాలు బోలెడు. శస్త్ర చికిత్స జరిగిన ప్రాంతాల్లో రక్తం గడ్డకట్టడం మొదలుకుని.. రెండో గుండెగా చెప్పుకునే పిక్కల్లోని నరాల్లో రక్తప్రసరణ ఆగిపోయేంతగా అడ్డంకులు ఏర్పడటం వీటిల్లో కొన్ని మాత్రమే. కొన్నిసార్లు పిక్కల్లో ఏర్పడిన రక్తపు గడ్డలు పైకి ప్రవహించి ఊపిరితిత్తుల్లోకి చేరి ప్రాణాలూ తీయొచ్చు. వక్ష సంపదను పెంచేందుకు సర్జరీ చేయించుకున్న వారిలో కనీసం 15 శాతం మంది నాడులు దెబ్బతిని కొన్ని స్పందనలు కోల్పోతారని గణాంకాలు చెబుతున్నాయి. శస్త్ర చికిత్సల కోసం తరచూ మత్తుమందులు తీసుకోవాల్సి రావడమూ ఆరోగ్యాన్ని పాడు చేస్తుంది. కొవ్వులు తొలగించేందుకు వాడే లైపోసక్షన్‌తో శరీరం లోపల ఉండే అవయవాలు దెబ్బతినేందుకు అవకాశాలెక్కువ. కొవ్వు తొలగించేందుకు ఉపయోగించే పరికరాలు అవయవాలను తాకడం వల్ల ఇలా జరుగుతుంటుంది. మాత్రలతోనూ చిక్కులెక్కువే.. బరువు తగ్గేందుకు హైడ్రాక్సిల్ ఆధారిత మందులు శ్రీదేవి వాడారని వార్తలొచ్చాయి. బరువు తగ్గేందుకు లేదా ఆకలి మందగించేలా చేసేందుకు ఈ రకం మందులు వాడుతుంటారు. అనెరొక్సోరెంట్స్ రకం మందులు తీసుకుంటే కడుపు నిండుగా ఉందన్న భావన కలిగించేలా ఇవి మెదడులో కొన్ని మార్పులు చేస్తాయి. ఇలాంటి మందులతో రక్తపోటు, గుండె కొట్టుకునే వేగం పెరగడం. వాంతులు, అతిసారం, నిద్రలేమి, మలబద్దకం, ఛాతి నొప్పి, చూపు మసకబారడం వంటి దుష్ప్రభావాలు ఉంటాయి. సర్జరీలు చేయించుకోలేదన్న శ్రీదేవి పదిహేనేళ్ల విరామం తరువాత ‘ఇంగ్లిష్ వింగ్లిష్’ సినిమాతో శ్రీదేవి మళ్లీ తెరంగేట్రం చేసిన విషయం తెలిసిందే. చిత్రం విడుదల సమయంలో తన పెదవుల ఆకారాన్ని మార్చుకోడానికి శ్రీదేవి ప్లాస్టిక్ సర్జరీ చేయించుకున్నారని వార్తలు గుప్పుమన్నాయి. ఈ విషయమై అనేక సందర్భాల్లో విలేకరులు శ్రీదేవిని ప్రశ్నించారు కూడా. అయితే ప్లాస్టిక్ సర్జరీల విషయాన్ని శ్రీదేవి పూర్తిగా ఖండించారు. తనకు ఆ అవసరం లేదని.. మంచి ఆహారం, వ్యాయామాలతోనే ముఖం కళకళలాడుతోందిగానీ.. కృత్రిమ సర్జరీలతో కాదని అప్పట్లో ఆమె వ్యాఖ్యానించారు. ఆమె మరణం తరువాత కూడా.. శస్త్ర చికిత్సలు మాత్రమే మరణానికి కారణం కాకపోవచ్చునని ఓ కాస్మొటిక్ సర్జరీ నిపుణుడు అనడం గమనార్హం. రజనీ కోసం శ్రీదేవి వ్రతం తమిళ సినిమా: సినిమా వాళ్లు ఏం చేసినా స్వార్థంతోనే అనే అపవాదు ఉంది. కానీ ఈ పరిశ్రమలోనూ మానవత్వం ఉన్న వాళ్లు, స్నేహానికి గౌరవం ఇచ్చేవారూ ఉన్నారు. అందుకు నిదర్శనం శ్రీదేవియే. 2011లో రజనీకాంత్ అనారోగ్యానికి గురై చికిత్స నిమిత్తం సింగపూర్‌కు వెళ్లారు. రజనీ త్వరగా కోలుకోవాలని అప్పట్లో శ్రీదేవి వారం రోజులు వ్రతం ఆచరించి పూజలు చేశారట. రజనీ కోలుకున్న తరువాత షిర్డీ సాయిబాబా ఆలయానికి వెళ్లి వ్రతాన్ని పూర్తి చేసుకున్నారు. ఈ విషయాన్ని స్వయంగా ఆమెనే ఇటీవల ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. ‘కమల్, రజనీ ఇద్దరు నాకు మంచి మిత్రులు. రజనీకి మా అమ్మంటే చెప్పలేనంత అభిమానం. రజనీ అంటే మా అమ్మకూ అంతే. కమల్లాగే తానూ పెద్ద స్టార్ కావాలని, అందుకు ఏం చేయాలని రజనీ మా అమ్మను అడిగేవారు. నువ్వు కచ్చితంగా పెద్ద స్టార్‌వి అవుతావని ఆమె చెప్పేది’ అని ఇంటర్వ్యూలో శ్రీదేవి చెప్పారు. రూ.30వేలు పారితోషికం తీసుకోవాలనేది తన ఆశ అని అప్పట్లో రజనీ అంటుండేవారనీ, అది తలచుకుంటే ఇప్పుడూ నవ్వొస్తుందన్నారు. శ్రీదేవి స్వగ్రామంలో విషాద ఛాయలు సాక్షి, చెన్నై: శ్రీదేవి మరణ వార్తతో ఆమె స్వగ్రామమైన తమిళనాడులోని విరుదునగర్ జిల్లా శివకాశి సమీపంలోని మీనంపట్టిలో విషాద ఛాయలు అలుముకున్నాయి. బాల్యంలోనే శ్రీదేవి మీనంపట్టి నుంచి చెన్నైకి వెళ్లినప్పటి ఫొటోను, ఆమె తల్లిదండ్రుల చిత్రపటాలను వీధుల్లో ఉంచి కొవ్వొత్తులు వెలిగించి అక్కడి ప్రజలు నివాళులర్పించారు. శ్రీదేవి గొప్ప నటిగా చెన్నైలో స్థిరపడిన తర్వాత కూడా మీనంపట్టి నుంచి తనను చూడడానికి ఎవరైనా వస్తే మంచి మర్యాదలతో స్వాగతం పలికి ఇంట్లో ఏ లోటూ రాకుండా చూసుకునేవారని గ్రామస్తులు గుర్తు చేసుకుంటూ విలపిస్తున్నారు. శ్రీదేవి జీవిత ఇతివృత్తంతో డాక్యుమెంటరీ తీయడానికి ఆమె అభిమాన సంఘాలు ఇటీవలే అనుమతి తీసుకుని ఆ పనులను వేగవంతం చేశాయి. ఇంతలోనే ఆమె కన్నుమూశారు. చెన్నై ఆళ్వార్‌పేట సీఐటీ కాలనీలోని శ్రీదేవి స్వగృహం ఒకప్పుడు అభిమానుల తాకిడితో నిత్యం కళకళలాడేది. ముంబైకి మకాం మార్చాక కూడా ఆమె ఎప్పుడు చెన్నైకి వచ్చినా ఈ ఇంట్లోనే ఉండేవారు. మాజీ సీఎం జయలలిత మరణం తర్వాత గత ఏడాది జనవరిలో ఆమె చివరిసారిగా చెన్నైకి వచ్చి శశికళను పరామర్శించి వెళ్లారు. ఆ ఇంటి ముందు అభిమానులు శ్రీదేవి చిత్రపటాన్ని ఉంచి నివాళులర్పించారు. రంగీలా.. బాజీగర్! బాలీవుడ్లో బ్లాక్బస్టర్లుగా నిలిచిన రంగీలా, బాజీగర్, మొహబ్బతే, బాఘ్బాన్ చిత్రాల్లోని ప్రధాన పాత్ర కోసం శ్రీదేవినే ఆయా చిత్ర నిర్మాతలు సంప్రదించారు. అయితే ఆమె వాటిని తిరస్కరిం చడంతో ఆ పాత్రలు కాజోల్, ఉర్మిలా మతోండ్కర్, ఐశ్వర్యారాయ్ తదితరుల్ని వరించాయి. గతంలో స్టార్‌డస్ట్ మ్యాగజీన్‌కు శ్రీదేవి ఇచ్చిన ఓ ర్యాపిడ్‌ఫైర్ ఇంటర్వ్యూలోని ముఖ్యాంశాలు: ► నేను ప్రేమించేది– పచ్చగా ఉన్న ఈ సుందరమైన ప్రపంచాన్ని ► మర్చిపోవాలనుకునే విషయం– ఈ ప్రపం చాన్ని మనం ఎలా నాశనం చేసుకుంటున్నామో అన్న విషయాన్ని ► నేను సినిమాల్లో కోరుకునేది– మంచి స్క్రీన్‌ప్లే ► నాకు ఆసక్తి కలిగించే అంశం– మంచి స్క్రీన్‌ప్లే ► నాకున్న అతిపెద్ద ఆస్తి– నా కుటుంబం ► నా సెక్స్ అప్పీల్‌కు గల కారణం– జన్యువులే ► నాకు ఇష్టమైనవి– పాంపియన్ కుక్కపిల్లలు, పైనాపిల్ ఐస్‌క్రీం, సినిమా ప్యాకప్ సమయం ► తెలుసుకోవాలనుకునేది– చనిపోయిన తర్వాత అక్కడా మేకప్ రూమ్స్ ఉంటాయా అని. ► నా భయం, బాధ – చనిపోయాక మరో జీవితం అంటూ ఉండదేమోనని ► నా అధీనంలో ఉన్నవాటిలో ఇష్టమైనవి– నా భావోద్వేగాలు ► నా జీవితంలో మర్చిపోలేని అనుభవం– ఛాల్‌బాజ్ సినిమాకు ఫిలింఫేర్ అవార్డు అందుకోవడం ► నా బలం– జీవితంలో జరగబోయేవాటిని ముందుగానే పసిగట్టగలగడం ► నేను అలసిపోయేలా చేసేవి– రీటేక్‌లు, రీమేక్‌లు ► ఎక్కువగా ఆనందపడేది– నా రీమేక్ సినిమా సూపర్‌హిట్ అయినప్పుడు ► నా పుట్టినరోజు– మృత్యువుకు మరో రోజు దగ్గరవ్వడం. గురుగ్రామ్‌లో శ్రీదేవికి నివాళులర్పిస్తున్న నాటకరంగ కళాకారులు -
ఇంటి నుంచి వెళ్లి శవమయ్యాడు!
రైలు పట్టాలపై యువకుడి మృతదేహం మృతిపై కుటుంబ సభ్యుల అనుమానాలు అక్కిరెడ్డిపాలెం (గాజువాక) : రాత్రి ఇంటి నుంచి స్నేహితుడితో బయటకు వెళ్లిన ఇంజినీరింగ్ విద్యార్థి మరుసటి రోజు తెల్లారేసరికి రైలు పట్టాలపై శవమై కనిపించాడు. తల్లిదండ్రు లకు తీరని శోకాన్ని మిగిల్చాడు. మృతుని బంధువులు తెలిపిన వివరాల ప్రకారం... 59వ వార్డు నాతయ్యపాలెంలో నివాసముంటున్న అమరాపు ఆనందరావు చిల్లర వ్యాపారం నిర్వహిస్తున్నాడు. భార్య ప్రమీల, టీచర్ ట్రైనింగ్ పూర్తి చేసిన కుమార్తె రమ్య, కుమారుడు నరేంద్రతో నివాసం ఉంటున్నాడు. నరేంద్ర నరవ ప్రాంతంలోని ఇంజినీరింగ్ కళాశాలలో చివరి సంవత్సరం చదువుతున్నాడు. శుక్రవారం రాత్రి నరేంద్రకు స్నేహితుడి నుంచి ఫోన్ రావడంతో బయటకు వెళ్లాడు. తల్లిదండ్రులు వారించినా ఇప్పుడే వస్తానని చెప్పి వెళ్లాడు. బయటకు వెళ్లిన కుమారుడు ఎంతకీ రాకపోవడంతో రాత్రంతా ఆందోళనలో కుటుంబ సభ్యులు గడిపారు. తెలిసిన వారందరినీ విచారించినా ఫలితం లేకపోయింది. శనివారం దువ్వాడ రైల్వే పోలీసుల నుంచి నరేంద్ర ఫోన్ నుంచి తల్లిదండ్రులకు కాల్ వచ్చింది. షీలానగర్ నుంచి నరవకు వెళ్లే రైల్వే బ్రిడ్జిపై ఒక యువకుడు మృతి చెంది ఉన్నట్లు తెలపారు. హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకుని పట్టాలపై ఉన్న నరేంద్ర మృతదేహాన్ని చూసి కన్నీరుమున్నీరయ్యారు. ఒక చేతి మణికట్టు, కాలి పాదం వరకు తొలగిన ఆనవాళ్లుతో పాటు ముఖం ఒకవైపు చెక్కుకుపోయిన గుర్తులు ఉన్నాయని బంధువులు తెలిపారు. రైల్వే పోలీసులు ఆత్మహత్య కేసుగా నమోదు చేశారు. కేజీహెచ్‌లో పోస్టుమార్టం అనంతరం నాతయ్యపాలెం శ్మశానవాటికలో అంత్యక్రియలు నిర్వహించారు. మృతిపై అనుమానాలు! నాతయ్యపాలెం బంగారుమాంబ ఆలయం వద్ద నివాసం ఉంటున్న నరేంద్ర అంత దూరంలో ఉన్న రైల్వే ట్రాక్‌పై చనిపోవడంపై కుటుంబ సభ్యులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. రాత్రి 11 గంటల సమయంలో నరేంద్రకు ఫోన్ చేసింది ఎవరనేది తెలియదని తల్లిదండ్రులు అంటున్నారు. మృతిపై అనుమానాలు ఉన్నాయని, పూర్తి వివరాలు తెలియాల్సి ఉందని బంధువులు అంటున్నారు. సెల్ కాల్ డేటా ద్వారా అసలు విషయాలు వెలుగులోకి వస్తాయని, ఆ కోణంలో విచారణ చేపట్టాల్సిందిగా గాజువాక పోలీసులకు ఫిర్యాదు చేస్తున్నట్లు బంధువులు తెలిపారు