మాట్లాడుతున్న సీఐ అప్పలనాయుడు, ఎస్‌ఐ ఫకృద్దీన్‌లు
సాక్షి, సాలూరు: సాలూరు పట్టణంలో ఈ నెల 21న జరిగిన వివాహిత అనుమానాస్పద మృతి కేసును పోలీసులు ఛేదించారు. అనుమానంతో భర్తే హత్య చేసినట్టు నిర్ధారించారు. నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. పట్టణ పోలీస్ స్టేషన్‌లో శనివారం ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో హత్య వివరాలను సీఐ అప్పలనాయుడు, ఎస్‌ఐ ఫకృద్దీన్‌లు వెల్లడించారు. పట్టణంలోని చినహరిజనపేటకు చెందిన వివాహిత సారిక సంధ్య విజయనగరంలోని కన్నవారింటికి వెళ్లిన ప్రతిసారి పది, పదిహేనురోజుల పాటు ఉండిపోయేది. దీనిపై భర్త గణేష్ అనుమానం పెంచుకున్నాడు. ఈ విషయంలో తరచూ భార్యాభర్తల మధ్య గొడవలు జరిగేవి. రాఖీ పూర్ణిమ రోజున సోదరునికి రాఖీ కట్టడానికి విజయనగరం వెళ్లేందుకు సంధ్య సిద్ధమౌతోంది.
అప్పటికే భార్యపై అనుమానంతో ఉన్న గణేష్ తువ్వాలిలో జీఏ వైరు పెట్టి సంధ్య మెడకు బిగించి హతమార్చాడు. తనకేమీ తెలియనట్టు సంధ్య మృతిచెందిందంటూ ఆమె కుటుంబ సభ్యులకు సమా చారం ఇచ్చాడు. మృతికి గంట ముందు రాఖీ కట్టేందుకు వస్తున్నానంటూ సోదరుడికి సంధ్య సమాచారం ఇవ్వడం, ఇంతలోనే చనిపో యిందని గణేష్ తెలియజేయడంతో అనుమానం వచ్చింది. పోలీసులకు ఫిర్యాదు చేశారు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసిన పోలీసులు తమదైన శైలిలో విచారణ కొనసాగించారు. నిందితుడు హత్య చేసినట్టు అంగీకరించాడని, కోర్టులో హజరుపర్చుతామని సీఐ తెలిపారు.
చదవండి: కొరమీను, నాటు కోడి, రొయ్య, మటన్ ఖీమా.. ఈ పచ్చళ్లు టేస్ట్ చేశారా
నేడు విశాఖకు సింధు.. స్టీల్‌ప్లాంట్ ఉన్నతాధికారులతో సమావేశం
Comments
Please login to add a commentAdd a comment