SV Sugar Factory
-
ఎస్వీ షుగర్ ఫ్యాక్టరీ కార్మికులకు బకాయిలు చెల్లింపు
రేణిగుంట(తిరుపతి జిల్లా): తిరుపతి జిల్లా గాజులమండ్యం ఎస్వీ సహకార చక్కెర కర్మాగారం కార్మికులకు రాష్ట్ర ప్రభుత్వం వేతన బకాయిలను చెల్లించింది. 368 మంది కార్మికులకు 9 ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న రూ.21.36 కోట్లను ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఇటీవల విడుదల చేశారు. బుధవారం ఫ్యాక్టరీ ప్రాంగణంలో జరిగిన కార్యక్రమంలో శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్‌రెడ్డి, ఎమ్మెల్సీ డాక్టర్ సిపాయి సుబ్రమణ్యంతో కలిసి మంత్రి రోజా.. కార్మికులకు చెక్కులు పంపిణీ చేశారు. రేణిగుంట మండలం గాజులమండ్యంలోని శ్రీ వెంకటేశ్వర సహకార చక్కెర కర్మాగారాన్ని చంద్రబాబు అధికారంలోకి రాగానే 2014లో మూసివేశారు. కానీ కార్మికులకు వేతన బకాయిలు చెల్లించలేదు. దీంతో కార్మికులు పని కోల్పోయి.. వేతనాలు అందక తీవ్ర ఇబ్బందులు పడ్డారు. వారి సమస్య తెలుసుకున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్ 368 మంది కార్మికులకు అందాల్సిన బకాయిలు మొత్తం రూ.21.36 కోట్లను విడుదల చేశారు. వాటిని బుధవారం మంత్రి రోజా అందజేయగా.. కార్మికులు సంతోషం వ్యక్తం చేశారు. తమ సమస్య తెలియగానే నిధులు విడుదల చేసిన సీఎం జగన్‌కు కృతజ్ఞతలు తెలిపారు. తమ జీవితాల్లో సీఎం జగన్ వెలుగులు నింపారని ఆనందం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో ఫ్యాక్టరీ ఎండీ రవిబాబు తదితరులు పాల్గొన్నారు. -
సొంత జిల్లాలో ఫ్యాక్టరీలను మూయించిన చరిత్ర బాబుది: మంత్రి రోజా
సాక్షి, తిరుపతి జిల్లా: చంద్రబాబు నాయుడు చిత్తూరు జిల్లా ద్రోహి అని పర్యాటకశాఖ మంత్రి ఆర్కే రోజా విమర్శించారు. చిత్తూరు జిల్లాలో పుట్టి ఈ జిల్లాలో ఉన్న ఎస్వీ షుగర్ ఫ్యాక్టరీని 2003లో మూయించిన చరిత్ర బాబుదని మండిపడ్డారు. దివంగత వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ఘుగర్ ఫ్యాక్టరీని తెరిపించారని పేర్కొన్నారు. ఎస్వీ షుగర్ ఫ్యాక్టరీని ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్‌గా అభివృద్ధి చేస్తామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి హామీ ఇచ్చారని గుర్తు చేశారు. నేడు రూ. 21.36 కోట్లు షుగర్ ఫ్యాక్టరీ బకాయిలను సీఎం చెల్లించారని తెలిపారు. ఈ మేరకు షుగర్ ఫ్యాక్టరీ ఉద్యోగులకు మంత్రి రోజా, ఎమ్మెల్యే బియ్యపు మధు సుధన్ రెడ్డి చెక్కులు పంపిణీ చేశారు. శ్రీకాళహస్తి నియోజకవర్గం పరిధిలో 165 మంది ఉద్యోగులకు రూ. 9.58 కోట్లు, నగరి నియోజవర్గంలో 147 మంది ఉద్యోగులకు రూ. 8.50 కోట్లు, తిరుపతి నియోజకవర్గంలో 40 మంది ఉద్యోగులకు 2.60 కోట్లు, ఇతర ప్రాంతాలకుచ ఎందిన ఉద్యోగులకు రూ. 58 లక్షల చెక్కులను అందించారు. కన్సాలిడేెడ్ ఉద్యోగుల సమస్యలలను సీఎం దృష్టికి తీసుకు వెళ్తానని తెలిపారు. చదవండి: పచ్చ మీడియాకు ఆ దమ్ముందా?: మంత్రి కాకాణి చిత్తూరు విజయాడెయిరీని మూయించిన చంద్రబాబు.. చిత్తూరు జిల్లాకు, రాష్ట్రానికి చేసింది శూన్యమని మంత్రి రోజా అన్నారు. పుంగనూరు తరహా ఘటనను భీమవరంలో రిపీట్ చేశారని ఫైర్ అయ్యారు. అమరావతిని అవినీతి రాజధానిగా చేశారని దుయ్యబట్టారు. ఫ్రాడ్ బిల్లులతో దోచుకుని అడ్డంగా దొరికి పోయారని అన్నారు. సీఆర్డీఏ అంటే చంద్రబాబు రియల్ దోపిడీ అథారిటీ అని ఎద్దేవా చేశారు. ప్రశ్నిస్తా అంటూ చెప్పే పవన్ కల్యాణ్ ఎక్కడ దాక్కున్నాడని ప్రశ్నించారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధరేశ్వరి ఎందుకు నోరు మెదపడం లేదని నిలదీశారు. బీజేపీ అంటే ఏపీలో బాబు జనతా పార్టీగా మారిందని.. పురంధశ్వరి ఎందుకు మరిది గురించి మాట్లాడటం లేదని ప్రశ్నించారు. సింగపూర్‌లో దోచుకున్న మంత్రి ఈశ్వరన్ అరెస్ట్ అయ్యి జైలుకు వెళ్లారన్న రోజా.. త్వరలో అమరావతి అవినీతి కేసులో చంద్రబాబు, లోకేష్ జైలుకు వెళ్తారని పేర్కొన్నారు. ఇండియాను భారత్ అనే పేరుగా మార్చడం ద్వారా ఎలాంటి ఇబ్బంది లేదని మంత్రి రోజా స్పష్టం చేశారు. బుధవారం ఉదయం తిరుమలలో స్వామి వారి నైవేద్య విరామ సమయంలో శ్రీవారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు..దర్శనంతరం ఆలయ రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వాదం అందించగా, ఆలయ అధికారులు పట్టు వస్త్రంతో సత్కరించి స్వామి వారి తీర్ధ ప్రసాదాలు అందజేశారు. అనంతరం ఆలయ వెలుపల మీడియాతో మాట్లాడుతూ.. ఏపి ప్రజలందరికి శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు తెలిపారు. ఇండియాని భారత్ అనే పదం మార్చడం ద్వారా ఎలాంటి ఇబ్బంది లేదని, మాతృ భాషలో పిలవడం మంచిదేనని అన్నారు.భారత్ పేరుకు తన వ్యక్తిగతంగా మద్దతు తెలుపుతున్నట్లు పేర్కొన్నారు. -
ఎస్వీ షుగర్స్‌ను అమ్మేయడానికి..
తిరుపతి: నష్టాలను సృష్టించి వాటిని సాకుగా చూపి గాజులమండ్యం ఎస్వీ షుగర్ ఫ్యాక్టరీని తనకు కావాల్సిన వారికి కట్టబెట్టేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు కుట్ర పన్నారని వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలు ధ్వజమెత్తారు. చెరకు రైతులు, ఫ్యాక్టరీ ఉద్యోగ కార్మికుల సమస్యలపై సోమవారం ఫ్యాక్టరీ ఎదుట వైఎస్ఆర్సీపీ జిల్లా రైతు విభాగం ఆధ్వర్యంలో చేపట్టిన మహా ధర్నా విజయవంతమైంది. వందలాది మంది చెరకు రైతులు పాల్గొన్న ఈ ధర్నాలో వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యేలు ఆర్కే.రోజా, డాక్టర్ చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, కే.నారాయణ స్వామి పాల్గొన్నారు. ధర్నాను ఉద్దేశించి నగరి ఎమ్మెల్యే ఆర్కే.రోజా ప్రసంగిస్తున్న తరుణంలో ఫ్యాక్టరీ ఎండీ.వెంకటేశ్వరరావు అక్కడికి చేరుకున్నారు. వైఎస్ఆర్ సీపీ డిమాండ్లపై ఆయన స్పందిస్తుండగా రైతులు ఆయనతో వాగ్వాదానికి దిగారు. ఈ సందర్భంగా కొంత గందరగోళం నెలకొంది. ఎమ్మెల్యేలు రోజా, నారాయణస్వామి రైతులకు నచ్చజెప్పి పరిస్థితిని చక్కదిద్దారు. డిమాం డ్లను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి 15 రోజుల్లోగా బకారుులు చెల్లిస్తామని ఎండీ హామీ ఇవ్వడంతో రైతులు ధర్నా విరమించారు. ధర్నాలో రైతు నాయకులు ఆదికేశవులురెడ్డి, పి.చెంగారెడ్డి, ఆర్.చక్రపాణిరెడ్డి, చిం దేపల్లి మధుసూదన్‌రెడ్డి, అత్తూరు రమణారెడ్డి, రఘునాథరెడ్డి, మాజీ ఎంపీపీ సుదర్శన్ రెడ్డి, సుబ్రమణ్యం, బుల్లిరెడ్డి, బీసీ నాయకుడు మిద్దెలహరి తదితరులు ప్రభుత్వ రైతు వ్యతి రేక విధానాలను ఎండగడుతూ ప్రసంగాలు చేశారు. బకారుులు చెల్లించి ఈ క్రషింగ్ సీజన్ నుంచి టన్నుకు 3 వేల రూపాయల వంతున ధర చెల్లించాలని డిమాం డ్ చేశారు. జిల్లాలోని వివిధ మండలాల నుంచి చెరకు రైతులు, ైమహిళా రైతులు,వైఎస్ఆర్సీపీ అనుబంధ సంఘాల నాయకులు పాల్గొన్నారు. కారు చౌకగా అమ్మేయడానికే అధ్యయన కమిటీ : ఆర్కే.రోజా లాభసాటిగా నడుస్తున్న సహకార చక్కెర ఫ్యాక్టరీలను కారుచౌకగా అమ్మేయడానికి చంద్రబాబు అధ్యయన కమిటీ వేశారు. రైతులు, ఫ్యాక్టరీ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించి మరింతగా లాభాల బాటలో ఫ్యాక్టరీని నడిపించడానికి అధ్యయన కమిటీ వేస్తే మాకు అభ్యంతరం లేదు. చంద్రబాబు రైతులకు గత రెండు క్రషింగ్ సీజన ్లకు చెల్లించాల్సిన 9 కోట్ల 40 లక్షల బకారుులు చెల్లించకుండా, రైతులు ఫ్యాక్టరీకి చెరకు సరఫరా చేయకుండా చేసి నష్టాలను సృష్టించి ఆ సాకుతో ఫ్యాక్టరీని అమ్మేయాలనుకుంటే ఒప్పుకునేది లేదు. రైతుల పక్షాన వైఎస్ఆర్సీపీ నిలబడి రాజీలేని పోరాటాలు సాగిస్తుంది. సింగపూర్, జపాన్ వెళ్లి రాయితీలు, స్పెషల్ ప్యాకేజీలు అంటూ పెట్టుబడిదారులకు రెడ్ కార్పెట్ పరచి ఆహ్వానిస్తున్న చంద్రబాబు రాష్ట్ర రైతాంగం సమస్యలను ఏ మాత్రం పట్టించుకోవడం లేదు. చెరకు రైతులకు కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన కనీస మద్దతు ధర కూడా చెల్లించడం లేదు. ఎస్వీ షుగర్స్ పరిధిలోని చెరకు రైతుల సమస్యలు పరిష్కరించకుంటే జాతీయ రహదారిని దిగ్బంధిస్తాం. రైతుల కోసం పోరాటాలకు సిద ్ధం: చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ‘వైఎస్ఆర్ సీపీ రైతుల పార్టీ, రైతు ల కోసం ఎలాంటి పోరాటాలకైనా సిద్ధంగా ఉన్నాం. కమిటీలు, నివేది కలు అంతా బూ టకం. తన మనసులోని మాటను కమిటీ ద్వారా చెప్పిం చి ఎస్వీ షుగర్స్‌ను ప్రైవేట్‌పరం చేయడమే చంద్రబాబు లక్ష్యం. ప్రజా వ్యతిరే క విధానాలు అవలంబిస్తున్న టీడీపీని ప్రజలు ఛీకొట్టే రోజులు దగ్గర్లోనే ఉన్నా యి. మరో రెండేళ్లు కలసికట్టుగా పోరాడి ఫ్యాక్టరీని సహకార రంగంలో కొనసాగే లా కాపాడుకోగలిగితే అనుకూల ప్రభుత్వం రాగానే సమస్యలన్నీ పరిష్కారమవుతాయి. గతంలో 9 ఏళ్లు చంద్రబాబు పాలన అనుభవాలు తెలిసి కూడా రుణమాఫీపై ఆశతో మొన్నటి ఎన్నికల్లో టీడీపీకి ఓట్లువేసి మోసపోయామని రైతులు పశ్చాత్తాపపడుతున్నారు. రుణమాఫీ జ రగలేదు. పంటల బీమా లేదు. బ్యాంకు లు కొత్త రుణాలు ఇవ్వవు. అతివృష్టి, అనావృష్టితో పంటలు పాడై పోతున్నా యి. రైతు కుటుంబాల కంట కన్నీరు తెప్పించే ప్రభుత్వాలు మనుగడ సాగిం చలేవు. వారి ఉసురు ఊరికే పోదు.