ఎస్వీ షుగర్స్‌ను అమ్మేయడానికి..
తిరుపతి: నష్టాలను సృష్టించి వాటిని సాకుగా చూపి గాజులమండ్యం ఎస్వీ షుగర్ ఫ్యాక్టరీని తనకు కావాల్సిన వారికి కట్టబెట్టేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు కుట్ర పన్నారని వైఎస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్యేలు ధ్వజమెత్తారు. చెరకు రైతులు, ఫ్యాక్టరీ ఉద్యోగ కార్మికుల సమస్యలపై సోమవారం ఫ్యాక్టరీ ఎదుట వైఎస్‌ఆర్‌సీపీ జిల్లా రైతు విభాగం ఆధ్వర్యంలో చేపట్టిన మహా ధర్నా విజయవంతమైంది. వందలాది మంది చెరకు రైతులు పాల్గొన్న ఈ ధర్నాలో వైఎస్‌ఆర్ సీపీ ఎమ్మెల్యేలు ఆర్‌కే.రోజా, డాక్టర్ చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, కే.నారాయణ స్వామి పాల్గొన్నారు.
ధర్నాను ఉద్దేశించి నగరి ఎమ్మెల్యే ఆర్‌కే.రోజా ప్రసంగిస్తున్న తరుణంలో ఫ్యాక్టరీ ఎండీ.వెంకటేశ్వరరావు అక్కడికి చేరుకున్నారు. వైఎస్‌ఆర్ సీపీ డిమాండ్లపై ఆయన స్పందిస్తుండగా రైతులు ఆయనతో వాగ్వాదానికి దిగారు. ఈ సందర్భంగా కొంత గందరగోళం నెలకొంది. ఎమ్మెల్యేలు రోజా, నారాయణస్వామి రైతులకు నచ్చజెప్పి పరిస్థితిని చక్కదిద్దారు. డిమాం డ్లను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి 15 రోజుల్లోగా బకారుులు చెల్లిస్తామని ఎండీ హామీ ఇవ్వడంతో రైతులు ధర్నా విరమించారు.
ధర్నాలో రైతు నాయకులు ఆదికేశవులురెడ్డి, పి.చెంగారెడ్డి, ఆర్.చక్రపాణిరెడ్డి, చిం దేపల్లి మధుసూదన్‌రెడ్డి, అత్తూరు రమణారెడ్డి, రఘునాథరెడ్డి, మాజీ ఎంపీపీ సుదర్శన్ రెడ్డి, సుబ్రమణ్యం, బుల్లిరెడ్డి, బీసీ నాయకుడు మిద్దెలహరి తదితరులు ప్రభుత్వ రైతు వ్యతి రేక విధానాలను ఎండగడుతూ ప్రసంగాలు చేశారు. బకారుులు చెల్లించి ఈ క్రషింగ్ సీజన్ నుంచి టన్నుకు 3 వేల రూపాయల వంతున ధర చెల్లించాలని డిమాం డ్ చేశారు. జిల్లాలోని వివిధ మండలాల నుంచి చెరకు రైతులు, ైమహిళా రైతులు,వైఎస్‌ఆర్‌సీపీ అనుబంధ సంఘాల నాయకులు పాల్గొన్నారు.
కారు చౌకగా అమ్మేయడానికే అధ్యయన కమిటీ : ఆర్‌కే.రోజా
లాభసాటిగా నడుస్తున్న సహకార చక్కెర ఫ్యాక్టరీలను కారుచౌకగా అమ్మేయడానికి చంద్రబాబు అధ్యయన కమిటీ వేశారు. రైతులు, ఫ్యాక్టరీ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించి మరింతగా లాభాల బాటలో ఫ్యాక్టరీని నడిపించడానికి అధ్యయన కమిటీ వేస్తే మాకు అభ్యంతరం లేదు. చంద్రబాబు రైతులకు గత రెండు క్రషింగ్ సీజన ్లకు చెల్లించాల్సిన 9 కోట్ల 40 లక్షల బకారుులు చెల్లించకుండా, రైతులు ఫ్యాక్టరీకి చెరకు సరఫరా చేయకుండా చేసి నష్టాలను సృష్టించి ఆ సాకుతో ఫ్యాక్టరీని అమ్మేయాలనుకుంటే ఒప్పుకునేది లేదు. రైతుల పక్షాన వైఎస్‌ఆర్‌సీపీ నిలబడి రాజీలేని పోరాటాలు సాగిస్తుంది.
సింగపూర్, జపాన్ వెళ్లి రాయితీలు, స్పెషల్ ప్యాకేజీలు అంటూ పెట్టుబడిదారులకు రెడ్ కార్పెట్ పరచి ఆహ్వానిస్తున్న చంద్రబాబు రాష్ట్ర రైతాంగం సమస్యలను ఏ మాత్రం పట్టించుకోవడం లేదు. చెరకు రైతులకు కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన కనీస మద్దతు ధర కూడా చెల్లించడం లేదు. ఎస్‌వీ షుగర్స్ పరిధిలోని చెరకు రైతుల సమస్యలు పరిష్కరించకుంటే జాతీయ రహదారిని దిగ్బంధిస్తాం.
రైతుల కోసం పోరాటాలకు సిద ్ధం: చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి
‘వైఎస్‌ఆర్ సీపీ రైతుల పార్టీ, రైతు ల కోసం ఎలాంటి పోరాటాలకైనా సిద్ధంగా ఉన్నాం. కమిటీలు, నివేది కలు అంతా బూ టకం. తన మనసులోని మాటను కమిటీ ద్వారా చెప్పిం చి ఎస్వీ షుగర్స్‌ను ప్రైవేట్‌పరం చేయడమే చంద్రబాబు లక్ష్యం. ప్రజా వ్యతిరే క విధానాలు అవలంబిస్తున్న టీడీపీని ప్రజలు ఛీకొట్టే రోజులు దగ్గర్లోనే ఉన్నా యి. మరో రెండేళ్లు కలసికట్టుగా పోరాడి ఫ్యాక్టరీని సహకార రంగంలో కొనసాగే లా కాపాడుకోగలిగితే అనుకూల ప్రభుత్వం రాగానే సమస్యలన్నీ పరిష్కారమవుతాయి.
గతంలో 9 ఏళ్లు చంద్రబాబు పాలన అనుభవాలు తెలిసి కూడా రుణమాఫీపై ఆశతో మొన్నటి ఎన్నికల్లో టీడీపీకి ఓట్లువేసి మోసపోయామని రైతులు పశ్చాత్తాపపడుతున్నారు. రుణమాఫీ జ రగలేదు. పంటల బీమా లేదు. బ్యాంకు లు కొత్త రుణాలు ఇవ్వవు. అతివృష్టి, అనావృష్టితో పంటలు పాడై పోతున్నా యి. రైతు కుటుంబాల కంట కన్నీరు తెప్పించే ప్రభుత్వాలు మనుగడ సాగిం చలేవు. వారి ఉసురు ఊరికే పోదు.