30న ఢిల్లీలో సీఐటీయూ అఖిలభారత సదస్సు: దేవరాయ్
ఈ నెల 30న ఢిల్లీలో అఖిలభారత స్థాయి సీఐటీయూ వర్కర్స్ యూనియన్ సదస్సు నిర్వహించనున్నట్టు సీఐటీయూ సెక్రటరీ స్వదేశీ దేవరాయ్ తెలిపారు. ఆదివారం విశాఖలోని సీఐటీయూ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలపైనే సదస్సులో ప్రధానంగా చర్చ జరగనుందని చెప్పారు. సెప్టెంబర్ 2 నుంచి 20కోట్ల మంది కార్మికులతో సమ్మె నిర్వహించనున్నామని తెలిపారు.