శిల్పి రాజ్‌కుమార్‌కు ‘స్వర్ణభారతి’ పురస్కారం
కొత్తపేట :
కొత్తపేటకు చెందిన ప్రముఖ శిల్పి, ఏపీ ప్రభుత్వ ఆస్థాన శిల్పి డి.రాజ్‌కుమార్ వుడయార్ స్వర్ణభారతి కళా పురస్కారం అందుకున్నారు. కృష్ణా జిల్లా గన్నవరం సమీపంలోని ఆతుకూరు కళాభారతి సేవా సంస్థ ప్రథమ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని ఆదివారం శిల్ప కళలో అంతర్జాతీయ ఖ్యాతిని గడించిన రాజ్‌కుమార్‌కు కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు, సుప్రీం కోర్టు జస్టిస్ జాస్తి చలమేశ్వర్‌ల చేతుల మీదుగా పురస్కారం ప్రదానం చేసి ఘనంగా సత్కరించారు. ఈ సందర్బంగా వుడయార్‌ను స్థానిక కళాసాహితి అధ్యక్షుడు పెన్మెత్స హరిహరదేవళరాజు, ప్రధాన కార్యదర్శి జి.సుబ్బారావు, సభ్యులు ఏబీసీ దేవ్, షేక్ గౌస్, రోటరీ క్లబ్ మాజీ అధ్యక్షుడు తోట వెంకటేశ్వరరావు తదితరులు అభినందించారు.