swarnala cheruvu
-
రొట్టెల పండుగ : భక్తజనంతో పరవళ్లు తొక్కిన స్వర్ణాల తీరం (ఫొటోలు)
-
ఆకాంక్షలే ఆలంబనగా రొట్టెల పండగ
అక్కడకు తరలి వచ్చేవారివి చిన్న చిన్న కోరికలే. చదువు రావాలి, ఉద్యోగం రావాలి, వివాహం జరగాలి, సంతానం కలగాలి అనే... జీవితంలో ఆకాంక్షలు ఉండాలి. ఆ ఆకాంక్షలు నెరవేరతాయనే ఆశ ఉండాలి. అలాంటి వారికి అభయమిచ్చే ఆధ్యాత్మిక వేడుకలు ఎన్నో. అలాంటి వాటిలో ఒకటి ‘రొట్టెల పండగ’ నెల్లూరులో జరిగే ఈ పండగలో స్త్రీలు విశేషంగా ΄ాల్గొంటారు. ప్రతి సంవత్సరం మొహరం పండగ వేళలో నెల్లూరు వీధులు ΄ోటెత్తుతాయి. దేశ విదేశాల నుంచి జనం నెల్లూరులోని బారా షహీద్ దర్గా దగ్గరకు చేరుకుంటారు. కులం, మతం, భాష, ్ర΄ాంతం... తేడా లేకుండా అక్కడి స్వర్ణాల చెరువులో మొక్కు మొక్కుకుంటారు. లేదా తీర్చుకుంటారు. మొక్కు తీరిన వారు రొట్టె పంచుతారు. మొక్కుకునే వారు ఆ రొట్టెను స్వీకరిస్తారు. తరాలుగా వస్తున్న ఈ సంప్రదాయం చెక్కు చెదరడం లేదు. ప్రతి సంవత్సరం ఐదు రోజుల ΄ాటు జరిగే ఈ వేడుక నిన్నటి నుంచి çఘనంగా జరుగుతోంది. ఇది ప్రధానంగా స్త్రీల పండగ.ఎవరు ఈ బారా షహీద్?మహమ్మద్ ప్రవక్త సందేశాన్ని ప్రపంచ వ్యాప్తం చేయడంలో భాగంగా టర్కీ నుంచి సుమారు 300 ఏళ్ల క్రితం 12 మంది మతబోధకులు భారతదేశానికి వచ్చారు. ఆ సమయంలో కొడవలూరు మండలంలోని గండవరంలో తమిళనాడు వాల్జారాజులకు, బీజాపూర్ సుల్తాన్లకు మధ్య యుద్ధం జరిగింది. ఆ యుద్ధంలో ఈ 12 మంది వీరమరణం ΄÷ందారు. వీరి తలలు గండవరంలో తెగిపడగా మొండాలను గుర్రాలు నెల్లూరులోని స్వర్ణాల చెరువు వద్దకు తీసుకు వచ్చాయి. ఈ 12 మంది నెల్లూరు ఖ్వాజీకి కలలో కనపడి తమను అక్కడే సమాధి చేయాలని కోరడంతో అక్కడే సమాధులు నిర్మించారు. 12ను ఉర్దూలో బారా, వీర మరణం ΄÷ందిన అమరులను షహీద్‌లుగా పిలుస్తారు. అందుకే ఈ దర్గాకు బారా షహీద్ అనే పేరొచ్చింది. రొట్టెల ఆనవాయితీతమిళనాడు నుంచి నెల్లూరు వరకు ఆర్కాట్ నవాబుల ఏలుబడిలో ఉన్నప్పుడు నవాబు భార్య జబ్బు పడితే ఆమెకు నయం అయ్యే మార్గం కోసం నవాబు ఎదురు చూస్తున్నాడు. అదే సమయంలో బారా షహీద్ దర్గా దగ్గర బట్టలు ఉతుకుతున్న రజకునికి ఆ రాత్రి బారా షహీద్‌లు కనబడి మా సమాధుల దగ్గరి మట్టి తీసుకుని నవాబు భార్య నుదుటికి రాస్తే నయం అవుతుందని చె΄్పారు. ఆ సంగతి రజకుడు ఊరి వారికి తెలుపగా వారు నవాబుకు తెలియచేశారు. మట్టి తెప్పించిన నవాబు దానిని తన భార్య నుదుటికి రాయగా 24 గంటల్లో ఆమెకు నయం అయ్యింది. దాంతో అతడు అంత దూరం నుంచి బారా షహీద్ దర్గాను చూడటానికి వచ్చాడు. దర్శనం అయ్యాక అక్కడ ఉన్న పేదలకు రొట్టెలు పంచాడు. మొక్కు తీరాక ఇలా రొట్టెలు పంచడం ఆనవాయితీ అయ్యింది. ఈ నెల 21 వరకు రొట్టెల పండగ జరుగుతుంది.వివాహం రొట్టె.. సంతాన రొట్టెనెల్లూరు బారా షహీద్ దర్గాలో మొక్కు రొట్టెతో ముడిపడి ఉంటుంది. ఇక్కడకు వచ్చే భక్తులు ఉద్యోగం, ప్రమోషన్, సౌభాగ్యం, సంతానం, విద్య, స్వగృహం, వ్యా΄ారం... ఈ కోరికలు నెరవేరాలని మొక్కుకునేందుకు వస్తారు. గతంలో మొక్కిన మొక్కులు తీరిన వారు రొట్టెలతో వస్తారు. వారి నుంచి రొట్టె తీసుకోవాలి. అంటే గతంలో వివాహ మొక్కు మొక్కుకుని వివాహం జరిగిన వారు రొట్టెలతో వస్తారు. వివాహం కావలసిన వారు వారి దగ్గర నుంచి రొట్టె స్వీకరించి తినాలి. మొక్కు తీరాక వాళ్లు ఇలాగే రొట్టెను తెచ్చి ఇవ్వాలి. బారా షహీద్ దర్గా పక్కనే ఉన్న స్వర్ణాల చెరువులో మోకాళ్ల లోతుకు దిగి స్త్రీలు ఈ రొట్టెల బదలాయింపు చేసుకుంటారు. బాకీ తీరాలనే రొట్టె, స్థలం కొనాలనే రొట్టె, ర్యాంకుల రొట్టె... ఇవన్నీ అదృష్టాన్ని బట్టి దొరుకుతాయి. అన్నింటి కంటే ఎక్కువగా ఆరోగ్య రొట్టె కోసం వస్తారు. – కొండా సుబ్రహ్మణ్యం, సాక్షి, నెల్లూరు -
రూ.20 కోట్లతో స్వర్ణాల చెరువు అభివృద్ధి
నెల్లూరును మెగా సిటీగా చేస్తా నెల్లూరీయులు భవిష్యత్తులో ఉద్యోగాల కోసం ఎక్కడికీ వెళ్లాల్సిన పనిలేదు బారాషహీద్ దర్గా అభివృద్ధికి హుండీలో కానుకలు వేయండి సీఎం చంద్రబాబు నాయుడు సాక్షి ప్రతినిధి – నెల్లూరు / పొగతోట/ నెల్లూరు అర్బన్ : నెల్లూరు స్వర్ణాల చెరువు అభివృద్ధికి రూ.8 కోట్లు ఖర్చు చేశామని, రాబోయే రోజుల్లో రూ.20 కోట్లు ఖర్చు చేసి పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేస్తామని సీఎం చంద్రబాబు నాయుడు చెప్పారు. గురువారం సాయంత్రం బారా షహీద్ దర్గాను దర్శించుకున్న సీఎం చెరువులో రొట్టెలు పట్టారు. ఈ సందర్భంగా జరిగిన సభలో ఆయన మాట్లాడుతూ స్వర్ణాల చెరువును కేవలం రొట్టెల పండుగ సమయంలోనే కాకుండా ప్రతి రోజు యాత్రికులు వచ్చేలా అభివృద్ధి చేస్తామన్నారు. నెల్లూరు నగరాన్ని మెగా సిటీగా అభివృద్ధి చేయడానికి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని చెప్పారు. జిల్లా పరిశ్రమలకు అనుకూలంగా ఉందని, విశాఖ– చెన్నయ్, చెన్నయ్– బెంగుళూరు కారిడార్లు జిల్లా మీదుగా వెళ్లడం ఇక్కడి ప్రజల అదృష్టమన్నారు. దీనివల్ల భవిష్యత్తులో జిల్లా ఎంతో అభివృద్ధి చెందుతుందని, ఉద్యోగాల కోసం ఇక్కడి వారు ఎక్కడికీ వెళ్లాల్సిన పని ఉండదన్నారు. కృష్ణపట్నం పోర్టు వల్ల రాబోయే రోజుల్లో ఉపాధి, పారిశ్రామిక రంగాలు ఎంతో అభివృద్ధి చెందుతాయన్నారు. జిల్లాలో ఇప్పటికే 14 కొత్త పరిశ్రమలు వచ్చాయని, భవిష్యత్తులో మరిన్ని పరిశ్రమలు రావడానికి జిల్లా అనుకూలమైన ప్రాంతమన్నారు. సముద్ర తీరం ఆసరాగా చేసుకుని జిల్లాను పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేయడానికి ఏర్పాట్లు చేస్తున్నామని చంద్రబాబు చెప్పారు. రూ.350 కోట్లతో పనులు జరుగుతున్న పెన్నా– సంగం బ్యారేజీ నిర్మాణం మార్చిలోగా పూర్తి చేస్తామన్నారు. రొట్టెల పండుగను రాష్ట్ర పండుగగా ప్రకటించామని, భవిష్యత్తులో మరింత ఘనంగా ఈ పండుగ నిర్వహిస్తామని చంద్రబాబు చెప్పారు. బారా షహీద్ దర్గా ఎంతో శక్తిమంతమైనదన్నారు. దర్గా అభివృద్ధికి హుండిలో తాను కానుకలు వేశానని, మీరు కూడా వేయండని ప్రజలకు పిలుపునిచ్చారు. దర్గా అభివృద్ధి కోసం మేయర్ అజీజ్ తన ట్రస్టు ద్వారా రూ.20 లక్షలు ఇస్తున్నట్లు సీఎం ప్రకటించారు. నెల్లూరీయులు ప్రపంచ వ్యాప్తంగా హోటళ్లు నడుపుతున్నారని, రాబోయే రోజుల్లో వీరి ఆధ్వర్యంలో హోటళ్ల రంగం మరింత అభివృద్ధి సాధిస్తుందన్నారు. మాజీ మంత్రి ఆదాల ప్రభాకర్‌రెడ్డి చేతుల మీదుగా సీఎం రాష్ట్ర అభివృద్ధి, అమరావతి నిర్మాణం రొట్టెను అందుకున్నారు. జిల్లా ఇన్చార్జ్ మంత్రి శిద్ధా రాఘవరావు, మంత్రి నారాయణ, మేయర్ అజీజ్, టీడీపీ జిల్లా అధ్యక్షుడు బీద రవిచంద్ర, ఎమ్మెల్యే పాశం సునీల్ కుమార్, ఎమ్మెల్సీ వాకాటి నారాయణరెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ అధ్యక్షుడు కిలారి వెంకటస్వామి నాయుడు, పార్టీ నగర అధ్యక్షుడు కోటంరెడ్డి శ్రీనివాసులురెడ్డి, పార్టీ నాయకులు ఆనం రామనారాయణరెడ్డి, ముంగమూరు శ్రీధర కృష్ణారెడ్డి, బీద మస్తాన్‌రావు, తాళ్లపాక రమేష్‌రెడ్డి, తాళ్లపాక అనురాధ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. -
ప్రారంభమైన పండగ
తరలివస్తున్న భక్తులు గంధమహోత్సవం నేడు బాంబు పేలుడు నేపథ్యంలో అడుగడుగునా పోలీసు భద్రత నేడు సీఎం, రేపు జగన్ రాక సాక్షి ప్రతిని«ధి–నెల్లూరు : బారాషహీద్ దర్గా ఆవరణలో బుధవారం రొట్టెల పండగ ప్రారంభమైంది. దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి భక్తులు పెద్ద ఎత్తున తరలివస్తున్నారు. బుధవారం నుంచి 16వ తేదీ వరకు జరిగే ఈ వేడుకకు 15 లక్షల మంది హాజరవుతారని అంచనా వేసిన మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు పారిశుధ్యం విషయంలో తొలిరోజే ఘోరంగా విఫలమయ్యారు. నెల్లూరు జిల్లా కోర్టు ఆవరణలో బాంబు పేలుడు నేపథ్యంలో వీఐపీలకు సైతం తనిఖీలు తప్పడం లేదు. వాహనాల పాసుల జారీ విషయంలో పోలీసులు, కార్పొరేషన్ అధికారుల మధ్య వివాదం రేగింది. రొట్టెల పండగలో పాల్గొనడానికి గురువారం సీఎం చంద్రబాబు నాయుడు, శుక్రవారం ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి నెల్లూరుకు వస్తున్నారు. రొట్టెల పండుగను ప్రభుత్వం రాష్ట్ర పండ గగా ప్రకటించిన నేపథ్యంలో ఈ సారి భారీ ఎత్తున ఏర్పాట్లు చేయడానికి కార్పొరేషన్ రంగంలోకి దిగింది. రూ.కోటికి పైగా ఖర్చు పెట్టి భక్తుల కోసం మరుగుదొడ్లు, సేద తీరే భవనాలు, రొట్టెలు మార్చుకోవడానికి ఇబ్బంది లేకుండా అనేక ఏర్పాట్లు చేస్తామని ప్రకటించారు. నెల రోజుల ముందు నుంచి మంత్రి నారాయణ, మేయర్ అజీజ్ రొట్టెల పండుగ ఏర్పాట్లపై సమీక్షలు జరిపారు. ఐదు రోజుల్లో 15 లక్షల మంది వస్తారనే అంచనాతో పారిశుధ్యంపై ఎక్కువ దృష్టి పెట్టారు. ఇందుకోసం ఏడు జోన్లు ఏర్పాటు చేసి జోన్ ఇన్‌చార్జ్‌లతో పాటు ఇద్దరు పర్యవేక్షణాధికారులు, 14 మంది మేస్త్రీలను నియమించారు. ఎక్కడా చెత్త కనిపించకుండా చేయాలనే ఉద్దేశంతో 1000 మంది తాత్కాలిక పారిశుధ్య కార్మికులను రంగంలోకి దించారు. అయితే తొలిరోజు ఊహించినంత మంది జనం రాక పోయినా పారిశుద్ధ్యం విషయంలో మాత్రం కార్పొరేషన్ అధికారులు విఫలమయ్యారు. మరుగుదొడ్లు, ఇతర ఏర్పాట్లు బాగానే ఉన్నాయని అనిపించాయి. కృష్ణపట్నం పోర్టు, సీవీ ఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో భక్తులకు మజ్జిగ ప్యాకెట్లు సరఫరా చేశారు. ఐదు రోజుల్లో లక్ష మందికి మజ్జిగ పంపిణీ చేస్తున్నట్లు పోర్టు వర్గాలు చెప్పాయి. కార్పొరేషన్ అధికారులు తాగునీరు, వైద్య సహాయ శిబిరాలు ఏర్పాటు చేశారు. మిగిలిపోయిన పనులు శుక్రవారం ఉదయానికి పూర్తి చేయడం కోసం పనులు జరిపిస్తూనే ఉన్నారు. మంత్రి నారాయణ, మేయర్ అజీజ్, కలెక్టర్ ముత్యాల రాజు ఏర్పాట్లను పర్యవేక్షించారు. భక్తులకు ఆహ్లాదం కలిగించడం కోసం పర్యాటక శాఖ బోటు షికారు ఏర్పాటు చేశారు. 1800 మందితో భద్రత జిల్లా కోర్టు ఆవరణలో ఇటీవల బాంబు పేలుడు సంభవించిన నేపథ్యంలో ఎస్పీ విశాల్ గున్ని నేతృత్వంలో పోలీసు శాఖ భారీ భద్రత ఏర్పాటు చేసింది. నగరంలోని ఆర్టీసీ బస్టాండ్, రైల్వే స్టేషన్‌తో పాటు లాడ్జిల మీద నిఘా ఉంచారు. డ్రోన్, సీసీ కెమెరాలతో నిఘా పర్యవేక్షిస్తున్నారు. వీఐపీల వాహనాలను సైతం తనిఖీ చేశాకే దర్గా ప్రాంతంలోకి అనుమతించాలని పోలీసు అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. నేడు సీఎం రాక సీఎం చంద్రబాబు నాయుడు బుధవారం మధ్యాహ్నం 3–20 గంటలకు హెలికాప్టర్లో నెల్లూరు పోలీసు పరేడ్ గ్రౌండ్స్‌కు చేరుకుని అక్కడి నుంచి దర్గాకు వెళతారు. సాయంత్రం 4–15 గంటల వరకు రొట్టెల పండగలో పాల్గొని, 4.20 నుంచి 5 గంటల వరకు ఉమేష్ చంద్ర సమావేశ మందిరంలో ప్రజాప్రతినిధులు, అధికారులతో సమావేశం నిర్వహిస్తారు. అనంతరం తిరుపతికి వెళతారు. రేపు జగన్ రాక శాసనసభలో ప్రతిపక్ష నాయకుడు, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి శుక్రవారం రొట్టెల పండగలో పాల్గొంటారని రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి తెలిపారు. మధ్యాహ్నం 12 గంటలకు దర్గాకు చేరుకుని దర్శనం చేసుకున్నాక రొట్టెల పండుగలో పాల్గొని తిరుపతికి తిరుగు ప్రయాణం అవుతారని ఆయన చెప్పారు.