సీతారామాలయ స్వర్ణోత్సవాలు
కనుల పండువగా జల కలశాల ఊరేగింపు
విజయపురిసౌత్: సీతారామాలయంలో ఆరు రోజులుగా జరుగుతున్న స్వర్ణోత్సవాలు గురువారం ముగిశాయి. చివరిరోజు ఉదయం 7గంటలకు 108 మంది భక్తులు మేళతాళాల నడుమ కృష్ణవేణి ఘాట్ నుంచి సాగర జలకలశములతో ఊరేగింపు జరిపారు. అనంతరం మహా కుంభాభిషేకం, అవబృధోత్సవం, మహాపూర్ణాహుతి జరిపారు. 11గంటలకు ఆలయంలో సీతారామ కల్యాణం నిర్వహించారు. అనంతరం 3వేల మంది భక్తులకు అన్నదాన ం నిర్వహించారు. రాత్రి 7గంటలకు పుష్పయాగం, సహస్ర దీపాలంకరణ సేవ, మహదాశీర్వచనము, ఆచార్య సన్మానము, యజ్ఞశాలలో శ్రీరామ నామ తారక మహామంత్రజప, తర్పణ యజ్ఞములు జరిపారు. తరువాత నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు విశేషంగా ఆకట్టుకున్నాయి. కార్యక్రమంలో ఆలయ కమిటీ అధ్యక్షుడు సిహెచ్.చంద్రశేఖరరెడ్డి, కార్యదర్శి కె.వసంతకుమార్‌రెడ్డి, మాజీ అధ్యక్షుడు సిహెచ్.నాగిరెడ్డి, కోశాధికారి కె.సత్యనారాయణ, రిటైర్డ్ సీఈ పరంధామరెడ్డి, కమిటీ సభ్యులు అల్లు వెంకటరెడ్డి, జీవీజీ కృష్ణమూర్తి, జి.అమర్‌కుమార్, ఎం.రామాంజనేయులు , ఎ.నాగరాజు, ఏడీ నాగరాజు తదితరులు పాల్గొన్నారు.