Swedish research group
-
కరోనాకు కొత్త మందు!
సాక్షి. హైదరాబాద్: స్వీడన్ కంపెనీ ఎంజమైటికా తయారు చేసిన కోల్డ్‌జైమ్ మందు కరో నా వైరస్‌ను మెరుగ్గా నియంత్రిస్తున్నట్లు ప్రాథమిక పరిశోధనల ద్వారా స్పష్టమైంది. వైర స్ సోకిన తరువాత కొంతకాలం నోరు, గొంతులోనే ఉండే వైరస్‌ను కోల్డ్‌జైమ్ 98.3 శా తం వరకు నిర్వీర్యం చేస్తున్నట్లు కంపెనీ గు ర్తించింది. పరిశోధనశాలలో వైరస్‌తో కూడిన కణాలపై జరిపిన పరిశోధనల ద్వారా ఇది తె లిసిందని కంపెనీ సోమవారం ప్రకటించింది. కోల్డ్‌జైమ్‌ను ఒక యంత్రం సాయంతో నోట్లో కి పిచికారి చేసుకోవాల్సి ఉంటుందని, తాము జరిపిన పరిశోధనల్లో కోల్డ్‌జైమ్ 20 నిమిషా ల్లోనే వైరస్‌ను 98.3% వరకు నిర్వీర్యం చేసిం దని, దుష్ప్రభావాలేవీ కనిపించలేదని కంపె నీ తెలిపింది. అమెరికన్ కంపెనీ మైక్రోబాక్ లేబొరేటరీస్‌లో తాము పరిశోధనలు నిర్వహించామని ఎంజమైటికా తెలిపింది. ఈ పరి శోధనల ఫలితాల సాయంతో నేరుగా మందు ను మానవులపై ప్రయోగించే వీలు లేనప్పటి కీ మరిన్ని పరిశోధనలు చేసేందుకు మార్గం సుగమమవుతుందని కంపెనీ తెలిపింది. కోల్డ్‌జైమ్ ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా కారక వైరస్‌తోపాటు సాధారణ జలుబుకు కారణమైన ‘హెచ్కోవడ్–229ఈ’ వైరస్‌పై కూడా ఇదే రకమైన ప్రభావం చూపుతున్నట్లు గతం లో జరిగిన పరిశోధనలు చెబుతున్నాయి. ఈ రెండు పరిశోధనల ద్వారా కోల్డ్‌జైమ్ అనేది కరోనా వైరస్ కుటుంబంలోని పలు వైరస్ల ను నిరోధించడంలో ఉపయోగపడుతుందని తెలుస్తోందని కంపెనీ తెలిపింది. కరోనా కా రక వైరస్ ఊపిరితిత్తుల్లోకి ప్రవేశించే ముందు నోరు, గొంతులోనే కొంతకాలం వృద్ధి చెందుతుంటుంది. ఆ సమయంలోనే కోల్డ్‌జైమ్ వం టి మందులను వాడటం ద్వారా వైరస్‌ను నిరోధించవచ్చని కంపెనీ తెలిపింది. -
మగాళ్లపైనే కేసులు ఎక్కువ!
లండన్: హింసాత్మక ధోరణుల విషయంలో పురుషులకు, మహిళలకు ఎంతో వ్యత్యాసం ఉంటుందని ఒక కొత్త అధ్యయనంలో తేలింది. బాధితుల ఎంపికలో గానీ, హత్య చేసే ప్రాంతం విషయంలోగానీ, హత్య జరిగే విధానంలో గానీ మహిళలు.. పురుషులతో పోలిస్తే వైవిధ్యంగా ఆలోచిస్తారని వెల్లడైంది. ప్రపంచంలో జరిగే ప్రతి 10 హింసాత్మక కేసుల్లో 9 కేసులు మగవారిపైనే నమోదవుతున్నాయి. 1990-2010 మధ్య పురుషులు, మహిళల మధ్య హింసాత్మక ధోరణుల్లో ఉన్న తేడాలను స్వీడిష్ పరిశోధక గ్రూపు పరీక్షించింది. నేర ప్రవృత్తిలో ఇరువురి మధ్య ఉన్న పోలికలు ఏమిటనే విషయాలపై కూడా పరిశోధనలు జరిపింది. కానీ పరిశోధనలో తేలిందేమిదంటే ఇరువురిలోనూ రానురాను హింసాత్మక ధోరణులు తగ్గుముఖం పడుతూ వస్తున్నట్లు కనుగొన్నారు. మొత్తం 1,570 కేసులను పరిశీలించగా వాటిలో 1,420 కేసులు పురుషులకు సంబంధించినవి కాగా, కేవలం 150 మాత్రమే మహిళలకు సంబంధించినవి. హత్యలు దాదాపుగా ఇళ్లలోనే జరుగుతున్నట్లు వారు కనుగొన్నారు. మహిళలు ఎక్కువగా బుద్ధిపూర్వక హత్యలు, శిశు హత్యలకు పాల్పడగా.. పురుషులు ఆవేశంలో ఎక్కువగా హత్యలు చేస్తున్నట్లు తెలిసింది.