సాక్షి. హైదరాబాద్: స్వీడన్ కంపెనీ ఎంజమైటికా తయారు చేసిన కోల్డ్‌జైమ్ మందు కరో నా వైరస్‌ను మెరుగ్గా నియంత్రిస్తున్నట్లు ప్రాథమిక పరిశోధనల ద్వారా స్పష్టమైంది. వైర స్ సోకిన తరువాత కొంతకాలం నోరు, గొంతులోనే ఉండే వైరస్‌ను కోల్డ్‌జైమ్ 98.3 శా తం వరకు నిర్వీర్యం చేస్తున్నట్లు కంపెనీ గు ర్తించింది. పరిశోధనశాలలో వైరస్‌తో కూడిన కణాలపై జరిపిన పరిశోధనల ద్వారా ఇది తె లిసిందని కంపెనీ సోమవారం ప్రకటించింది. కోల్డ్‌జైమ్‌ను ఒక యంత్రం సాయంతో నోట్లో కి పిచికారి చేసుకోవాల్సి ఉంటుందని, తాము జరిపిన పరిశోధనల్లో కోల్డ్‌జైమ్ 20 నిమిషా ల్లోనే వైరస్‌ను 98.3% వరకు నిర్వీర్యం చేసిం దని, దుష్ప్రభావాలేవీ కనిపించలేదని కంపె నీ తెలిపింది. అమెరికన్ కంపెనీ మైక్రోబాక్ లేబొరేటరీస్‌లో తాము పరిశోధనలు నిర్వహించామని ఎంజమైటికా తెలిపింది.
ఈ పరి శోధనల ఫలితాల సాయంతో నేరుగా మందు ను మానవులపై ప్రయోగించే వీలు లేనప్పటి కీ మరిన్ని పరిశోధనలు చేసేందుకు మార్గం సుగమమవుతుందని కంపెనీ తెలిపింది. కోల్డ్‌జైమ్ ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా కారక వైరస్‌తోపాటు సాధారణ జలుబుకు కారణమైన ‘హెచ్‌కోవడ్–229ఈ’ వైరస్‌పై కూడా ఇదే రకమైన ప్రభావం చూపుతున్నట్లు గతం లో జరిగిన పరిశోధనలు చెబుతున్నాయి. ఈ రెండు పరిశోధనల ద్వారా కోల్డ్‌జైమ్ అనేది కరోనా వైరస్ కుటుంబంలోని పలు వైరస్‌ల ను నిరోధించడంలో ఉపయోగపడుతుందని తెలుస్తోందని కంపెనీ తెలిపింది. కరోనా కా రక వైరస్ ఊపిరితిత్తుల్లోకి ప్రవేశించే ముందు నోరు, గొంతులోనే కొంతకాలం వృద్ధి చెందుతుంటుంది. ఆ సమయంలోనే కోల్డ్‌జైమ్ వం టి మందులను వాడటం ద్వారా వైరస్‌ను నిరోధించవచ్చని కంపెనీ తెలిపింది.
Comments
Please login to add a commentAdd a comment