సాక్షి, హైదరాబాద్: రెండో డోసు టీకా తీసుకున్న 14 రోజులకు చిలుకలగూడ రైల్వే డిస్పెన్సరీ వైద్యుడికి కరోనా పాజిటివ్‌గా తేలడం కలకలం సృష్టిస్తోంది. బాధితుడి నుంచి నమూనాలు సేకరించి సీసీఎంబీ శాస్త్రవేత్తలు పరీక్షిస్తున్నారు. బాధితుడిలో ఉన్నది యాక్టివ్ వైరసా..? లేక డెడ్లీ వైరసా..? అనే కోణంలో విశ్లేషిస్తున్నారు. ఇటు వైరస్ నిర్ధారౖణెన వైద్యుడితో సన్నిహితంగా ఉన్న కుటుంబీకులు, సహోద్యోగులకు పరీక్షలు నిర్వహించగా.. అందరికీ నెగెటివ్ రావడం విశేషం. కాగా సదరు వైద్యుడు జనవరి మూడో వారంలో తొలి విడత.. తొలి డోసులో ‘కోవిషీల్డ్’వ్యాక్సిన్ తీసుకున్నాడు. ఆ తర్వాత 28 రోజులకు అదే కంపెనీ వ్యాక్సిన్‌ను రెండో డోసు తీసుకున్నాడు.
ఈ క్రమంలోనే విధి నిర్వహణలో భాగంగా ఇతర ప్రాంతాలకు వెళ్లి వచ్చాడు. అయితే జలుబు, జ్వరంతో బాధ పడుతుండటంతో ఇటీవల పరీక్షలు నిర్వహించగా ఆయనకు కరోనా ఉన్నట్లు తేలింది. నిజానికి రెండు డోసులు తీసుకున్న రెండు వారాల తర్వాత పూర్తి స్థాయిలో యాంటీబాడీలు వృద్ధి కావాల్సి ఉంది. కానీ ఆ వైద్యుడికి ఆ నిర్దేశిత గడువు ముగిసినప్పటికీ కోవిడ్‌గా తేలింది. దీంతో వ్యాక్సిన్ పనితీరుపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. టీకా తీసుకున్న వారిలోనూ మళ్లీ వైరస్ నిర్ధారణ అవుతుండటం ఒకింత ఆందోళనకు గురిచేస్తోంది.
ప్రభావ శీలత 80 శాతమే..!
టీకా తీసుకున్న వారందరికీ యాంటీబాడీస్ వృద్ధి చెందుతాయా? అంటే తయారీ కంపెనీలు కూడా స్పష్టత ఇవ్వడం లేదు. అయితే టీకా ప్రభావ శీలత 80% మాత్రమే ఉంటుందని వెల్లడిస్తున్నాయి. క్లినికల్ ట్రయల్స్‌లోనూ ఇది స్పష్టమైంది. నిజానికి టీకా తీసుకున్న 90 రోజుల వరకు రిస్క్ ఉంటుందని, అప్పటివరకు స్వీయ జాగ్రత్తలు పాటించాల్సిందేనని, తయారీ కంపెనీలతో పాటు వైద్య, ఆరోగ్యశాఖ పదే పదే స్పష్టం చేస్తూనే ఉంది. కానీ చాలా మంది ఈ విషయాన్ని పట్టించుకోవడం లేదు.
‘ఇప్పటికే తమకు వైరస్ వచి్చపోవడానికి తోడు.. వ్యాక్సిన్ కూడా వేయించుకోవడం వల్ల వైరస్‌ను ఎదుర్కొనేందుకు అవసరమైన యాంటీబాడీస్ పుష్కలంగా ఉత్పత్తయినట్లు చాలామంది భావిస్తున్నారు. దీంతో మాస్‌్కలు లేకుండా, భౌతిక దూరం పాటించకుండా, శానిటైజర్లు వాడకుండా ప్రయాణాలు చేస్తున్నారు. ఫంక్షన్లు, దైవదర్శనాల పేరుతో యథేచ్ఛగా గుంపులలో తిరుగుతూ మళ్లీ వైరస్ బారిన పడుతున్నారు..’అని నిలోఫర్ ఆస్పత్రి వైద్యుడు నరహరి ‘సాక్షి’తో చెప్పారు
చదవండి : రేవంత్‌రెడ్డికి కరోనా పాజిటివ్
సినిమా థియేటర్ల బంద్‌పై మంత్రి తలసాని స్పష్టత
Comments
Please login to add a commentAdd a comment