Sweet memory
-
నోరూరించే చాక్లెట్ల చరిత్ర తెలుసా? ఇంట్రస్టింగ్ ఫ్యాక్ట్స్
క్యాడ్బరీ డైరీమిల్క్, ఫైవ్‌స్టార్, కిట్‌కాట్, జెమ్స్... చెబుతుంటేనే నోరూరి΄ోతోంది కదా. అమ్మానాన్నలు ఏదైనా పని చె΄్పాలంటే ‘చేశావంటే చాక్లెట్ ఇస్తా’ అంటుంటారు. నోట్లో వేసుకోగానే కరిగి΄ోయే చాక్లెట్లంటే చిన్నపిల్లలకే కాదు, పెద్దలకూ ఇష్టమే. ఈ చాక్లెట్లకు దాదాపు 5 వేల ఏళ్ల చరిత్ర ఉంది. అప్పట్లో అమెరికాలో చాకో చెట్లను తొలిసారి గుర్తించారు. ఆ చెట్టు పళ్లలోని గింజల నుంచి రసం తీసి తాగడం అలవాటు చేసుకున్నారు. రుచికరమైన ఆ రసం అందరికీ తెగ నచ్చింది. దీంతో కోకో చెట్టును దైవప్రసాదంగా భావించేవారు. ప్రధాన వేడుకల్లో ఈ చెట్లను కానుకలుగా ఇచ్చేవారు. డబ్బు చలామణీ లేని ఆ కాలంలో ఈ చెట్టునే విలువైన వస్తువుగా భావించేవారు. ఆ తర్వాత 1519లో స్పెయిన్ దేశస్థులు ఆ చాకో చెట్టు రసాన్ని తమ దేశానికి తెచ్చారు. అక్కడే మొదటిసారి ఆ రసానికి ‘చాకొలేట్’ అనే పేరు పెట్టారు. అక్కడి నుంచి అది యూరప్ ప్రాంతానికి పరిచయమై ప్రాధాన్యాన్ని పొందింది. వందల ఏళ్లపాటు రసంగానే ఉన్న ఆ ద్రవం 19వ శతాబ్దంలో పారిశ్రామికీకరణ అనంతరం బిళ్లల రూపంోకి మారింది. ఆ రసంలో మరిన్ని కొత్త దినుసులు కలిపి కొత్త తరహా రుచుల్ని తీసుకొచ్చారు. 1819లో స్విట్జర్ల్యాండ్ దేశంలో ‘ఫ్రాంకోయిస్ లూయిస్ కైల్లర్’ తొలిసారి చాక్లెట్ తయారీ ఫ్యాక్టరీ మొదలు పెట్టారు. ‘స్విస్ చాక్లెట్’ సృష్టికర్త ఆయనే. ఇప్పటికీ కైల్లర్ బ్రాండ్ చాక్లెట్ ప్రపంచంలోనే శ్రేష్ఠమైన చాక్లెట్.మొదట్లో ఒకే రంగులో ఉండే చాక్లెట్లు ఆ తర్వాత కొత్త కొత్త రంగులతో మార్కెట్లోకి వచ్చాయి. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా చాక్లెట్ల వ్యాపారం లక్షల కోట్ల ఆదాయంతో నడుస్తోంది. పుట్టినరోజులు, పెళ్లిరోజులు, చిన్నారులకు వేడుకలు... ఇలా ఏ శుభకార్యం జరిగినా చాక్లెట్లు ఉండాల్సిందే అనేంతగా పేరు పొందాయి. అయితే మీకు చాక్లెట్లంటే ఎంత ఇష్టమున్నా వాటిని ఎక్కువగా తింటే అనేక సమస్యలు వస్తాయి. తరచూ చాక్లెట్లు తింటే పళ్లు పాడవుతాయి. కాబట్టి ఎప్పుడో ఒకసారి మాత్రమే చాక్లెట్లు తినండి. ఇది కూడా చదవండి: ఉసిరితో వనభోజనం : ఇన్స్టంట్ పచ్చడి ఒక్కసారి తిన్నారంటే! -
Monsoon Rains: వాన జ్ఞాపకం.. తడిసిన బడిగంట
ఎండాకాలం సెలవులు ఫిక్స్డ్. వానాకాలం సెలవులు అలా కాదు. వానదేవుడి మూడ్‌ని బట్టి ఉంటాయి. రెండు రోజులు దంచి కొడితే మూడోరోజు సెలవు. తెల్లారి కుమ్మరిస్తే మధ్యాహ్నం సెలవు. రాత్రంతా ఉరుములు మెరుపులు ఉంటే ఉదయానికి సెలవు. వానదేవుడు నిజంగా పిల్లల ఫ్రెండు. ‘రేయ్... ఎంజాయ్ చేయండ్రా’ అని అప్పుడప్పుడు స్కూల్‌కు మబ్బులతో తాళాలు వేస్తాడు. ఎవరూ అడుగు పెట్టకుండా వాన ధారలను కాపలా పెడతాడు. ముసురులో స్కూల్... బలే జ్ఞాపకం. చాలా మంది పిల్లల దగ్గర గొడుగులు ఉండవు. కొంచెం చినుకులు పడుతూ ఉంటే గొడుగు ఉన్న ఫ్రెండ్ పక్కన చేరడం, కింద ఉన్న నీళ్ల గుంతలను ఫుట్‌బాల్‌గా తన్నడం, స్లిప్పర్లు బురద ఎగరేస్తూ ఉంటే వెనుక షర్ట్ మీద, చెడ్డీ మీద డిజైన్లు వేసుకోవడం బాగుంటుంది. గొడుగు ఉన్నా పక్కకు జరిగి తల తడుపుకుంటారు కొందరు. తడిసి లేతగా ఒణకడం, పళ్లు కటకటలాడించడం, చేతులు రెండూ కలిపి పిడికిలి బిగించి గుండెల దగ్గర పెట్టుకోవడం బాగుంటుంది. మనం తడవొచ్చుగాని పుస్తకాలు... సవాలే లేదు. షర్ట్ కిందకు తీసుకోవాల్సిందే. మంచి ప్లాస్టిక్ కవర్లో చుట్టి నెత్తి మీద పెట్టుకుంటే అదే గొడుగు. కొన్ని క్లాస్‌రూమ్‌లు స్ట్రిక్ట్‌గా ఉంటాయి. ఎంత పెద్ద వాన కురిసినా ఉరవవు. కొన్ని పోనీలే పాపం అనుకుంటాయి. కాస్త జల్లుకే చుక్కలు కార్చి బల్లలన్నీ తడిపేస్తాయి. అప్పుడు ఉరవని క్లాస్‌రూమ్‌లోకి ఉరిసే క్లాస్‌లోని పిల్లలను తోలుతారు. ఈ టీచర్ ఆ టీచర్ కబుర్లలో పడతారు. ఈ పిల్లలకు ఆ పిల్లలకూ పండగే. ఒక్కో బెంచీలో ఇరుక్కుని కూచుని ఊరికూరికే నవ్వుకుంటూ నెట్టుకుంటూ కిటికీలో నుంచి వానను చూస్తూ లాంగ్ బెల్లు కోసం ఎదురు చూస్తూ ఉండటం బాగుంటుంది. ప్లే గ్రౌండ్లో నీళ్లు చేరుతాయి. ఓల్డ్ స్టూడెంట్స్ నాటిన గుల్మొహర్ చెట్లు పూర్తిగా తడిసిపోతాయి. ఎప్పుడూ చక్కగా నడుచుకునే సార్లు మోకాళ్లు దాకా ప్యాంట్లు మడుచుకుని గమ్మత్తుగా కనిపిస్తారు. టీచర్లు తలల మీద పవిటను పరుచుకుంటారు. స్కూల్ అటెండర్ ఫ్లాస్క్ పట్టుకుని హెడ్మాస్టర్ కోసం టీ తేవడానికి పరిగెడుతూ ఉంటాడు. వాన ఆగుతుందా... ఆగదా... సెలవు ఇవ్వడమా వద్దా... అని హెడ్మాస్టర్ రూమ్‌లో ఆయనకు ఇష్టమైన సీనియర్ టీచర్లతో చర్చ ఉంటుంది. మధ్యాహ్నం స్కూల్ లేదంటే మేట్నీకి వెళ్లడం గురించి ఆలోచనలు వస్తాయి. ఏ ఫ్రెండ్ ఇంట్లో నలుగురూ కూడి ఏ ఆట ఆడవచ్చో ప్లానింగు ఉంటుంది. ఉప్పు సెనగలు, బటానీలకు పెద్దలు వద్దన్నా డబ్బు ఇస్తారు. కలిగిన కుటుంబాలలో ఆ సాయంత్రం వేసే ఉల్లిబజ్జీలు గుర్తుకు వస్తాయి. లేనివారికి బడి బయటి పిడితకింద పప్పే గతి. ఉండి ఉండి వాన పెరుగుతుంది. క్లాస్రూమ్లోఎక్కువ గోలో బయట వానది ఎక్కువ గోలో అర్థం కాకుండా ఉంటుంది. హెడ్మాస్టర్ గది బయట వేళ్లాడుతున్న గంట తడిసి తడిసి ‘ఇక చాల్లే లాంగ్ బెల్ కొట్టండి’ అంటుంది. టంగ్... టంగ్.. టంగ్... అని లాంగ్‌బెల్ వినపడగానే పిల్లలు బిలబిలమని క్లాస్రూమ్ బయటకు వస్తారు. గొడుగులు ఉన్నవాళ్లు తెరుస్తారు. కచ్చబోతోళ్లు ఎవరినీ పిలవకనే ఒక్కరే గొడుగులో వెళ్లిపోతారు. సైకిల్ మీద వెళ్లాల్సిన వాడు స్పీడ్‌గా తొక్కితే తక్కువ తడుస్తానని భ్రమపడతాడు. ప్లాస్టిక్ కవర్ని గాంధీ టోపీలా తగిలిస్తాడొకడు. పరీక్షల అట్ట ఒక గట్టి అడ్డం వానకు. తాటాకు పట్టుకుని పింఛం చేసుకుంటాడొకడు. ఆడపిల్లల ముఖాన పౌడరే మిగలదు. వానకు ఆగే ఉద్దేశం ఉండదు. ఇల్లు చేరేసరికి అంతా చిత్తడి చిత్తడిగా ఉంటుంది. అమ్మ కరెంటు పోతే ఇబ్బంది అని రాత్రి వంట తొందరగా ముగిద్దామని చూస్తుంది. నాన్న తొందరగా వస్తే బాగుండు అనిపిస్తుంది. గాలి ఈలలు భయంగా, ఇష్టంగా అనిపిస్తాయి. ముంగిట్లో ఉన్న మల్లెతీగ అంత ఊగగలదని అస్సలు తెలియదు. పెరట్లో జామ పిందెలన్నీ తడిసి మెరుస్తుంటాయి. పాలు తాగెళ్లే దొంగపిల్లి ఈసారికి ఊరుకోండి అని వరండాలో ఒక మూల చేరుతుంది. వీధి కుక్క సొంతంత్రంగా గేటు తోసుకుని తడిలేని మట్టిలో వెచ్చగా పడుకుంటుంది. ఆ రాత్రి రొట్టెలు, పప్పూ రుచిగా ఉంటాయి. కిరోసిన్ దీపం రెడీ అవుతుంది. కరెంటు పోయినా వాన పోనంటూ కురుస్తూనే ఉంటుంది. తలుపులేసుకొని వెచ్చగా పడుకుంటే బోలెడు కబుర్లు నడుస్తాయి. మరుసటి ఉదయం బాగా నానిన వాల్‌పోస్టర్ ఊడబెరికి అట్టలు వేసుకోవచ్చన్న ఊహ ఉత్సాహాన్ని ఇస్తుంది. దూరంగా ధడేలున ఎక్కడో పిడుగుపడుతుంది. రేపు స్కూలు ఏ విధంగానూ ఉండదన్న సంతోషంతో నిద్ర భలేగా పడుతుంది. వానకు జేజే. వానకు ఆగే ఉద్దేశం ఉండదు. ఇల్లు చేరేసరికి అంతా చిత్తడి చిత్తడిగా ఉంటుంది. అమ్మ కరెంటు పోతే ఇబ్బంది అని రాత్రి వంట తొందరగా ముగిద్దామని చూస్తుంది. నాన్న తొందరగా వస్తే బాగుండు అనిపిస్తుంది. గాలి ఈలలు భయంగా, ఇష్టంగా అనిపిస్తాయి. ముంగిట్లో ఉన్న మల్లెతీగ అంత ఊగగలదని అస్సలు తెలియదు. పెరట్లో జామ పిందెలన్నీ తడిసి మెరుస్తుంటాయి. -
మతం పేరు దుర్వినియోగాన్ని అరికట్టాలి..
మస్కట్: ఉగ్రవాదానికి సహకరిస్తున్న, ప్రోత్సహిస్తున్న వారిని ఏకాకిని చేయటంలో పరస్పర సహకారంతో ముందుకెళ్లాలని భారత్, ఒమన్ దేశాలు నిర్ణయించాయి. మతం పేరును దుర్వినియోగం చేస్తున్న వారి ప్రయత్నాలకు అడ్డుకట్ట వేయాలని ఇరుదేశాధినేతలు నరేంద్ర మోదీ, ఒమన్ సుల్తాన్ ఖబూస్ నిర్ణయించారు. ఒమన్ పర్యటనలో భాగంగా సుల్తాన్ ఖబూస్‌తో మోదీ సమావేశమయ్యారు. ద్వైపాక్షిక అంశాలపై విస్తృతంగా చర్చించారు. భారత్–ఒమన్ ద్వైపాక్షిక సంబంధాల్లో బలమైన పురోగతికి ఈ పర్యటన తోడ్పడిందని మోదీ పేర్కొన్నారు. అనంతరం మోదీ గల్ఫ్, పశ్చిమాసియాలోని ప్రముఖ వ్యాపారవేత్తలతో సమావేశమయ్యారు. భారత్‌లో పెట్టుబడులు పెట్టాలని వారిని ఆహ్వానించారు. అనంతరం మస్కట్‌లోని పురాతన శివాలయాన్ని మోదీ సందర్శించారు. ఉగ్రవాదంపై ప్రత్యేకంగా.. ‘ఇరుదేశాలు ఉగ్రవాదం కారణంగా ఇబ్బందులు పడుతున్నాయి. అందుకే ఈ ప్రాంతంలో, అంతర్జాతీయంగా శాంతినెలకొల్పే ప్రయత్నాల్లో కలసి ముందుకెళ్లాలని నిర్ణయించాం. ఉగ్రవాదానికి సహకరిస్తున్న వారిని ఏకాకి చేయాల్సిన అవసరం ఉంది. ఈ దిశగా పరస్పర సహకారానికి అంగీకరించాం’ అని ఇరుదేశాధినేతల సంయుక్త ప్రకటన పేర్కొంది. ఒమన్ అభివృద్ధిలో భారతీయుల పాత్రను సుల్తాన్ ఖబూస్ ప్రశంసించారు. వారి కష్టపడి పనిచేసేతత్వం, నిజాయితీని మరిచిపోలేమన్నారు. 8 ఒప్పందాలు: మోదీ, ఖబూస్ సమక్షంలో ఇరుదేశాల ప్రతినిధులు 8 ఒప్పందాలపై సంతకాలు చేశారు. పౌర, వాణిజ్యపరమైన అంశాల్లో న్యాయ సహకారంపైనా ఒప్పందాలు జరిగాయి. దౌత్య, ప్రత్యేక, సేవా, అధికారిక వీసాలు ఉన్నవారికి సంయుక్త వీసా రద్దుకు సంబంధించిన ఒప్పందం కూడా ఈ జాబితాలో ఉంది. వైద్యం, పర్యాటకం, శాంతియుత ప్రయోజనాల కోసం అంతరిక్ష వినియోగం తదితర అంశాలపై ఒప్పందాలు జరిగాయి. డుక్మా ప్రత్యేక ఆర్థిక మండలిలో రెండు ప్రాజెక్టులకు సంబంధించి భారత సంస్థలు 1.8 బిలియన్ డాలర్ల పెట్టుబడులు పెట్టనున్నాయి. మధుర స్మృతి ‘భారత్–ఒమన్ దేశాల ప్రజల మధ్యనున్న శతాబ్దాల పురాతనమైన బంధాన్ని మరింత బలోపేతం చేసుకునేందుకు ఈ పర్యటన దోహదపడింది. వాణిజ్యం, పెట్టుబడుల బంధాలు సహా అన్నిరంగాల్లోనూ సహకారం మరింత వేగవంతమవనుంది. గౌరవనీయులైన సుల్తాన్ ఖబూస్ మీకు ప్రత్యేక ధన్యవాదాలు. మీ ఆతిథ్యం, స్నేహం.. నా ఒమన్ పర్యటనను మధురస్మృతిగా మార్చేశాయి’ అని పర్యటన ముగింపు సందర్భంగా మోదీ పేర్కొన్నారు. అనంతరం మస్కట్‌లోని 125 ఏళ్ల పురాతన శివాలయాన్ని మోదీ సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రతిష్టాత్మక సుల్తాన్ ఖబూస్ మసీదునూ ప్రధాని సందర్శించారు. -
ప్రజలకు అన్నీ చేదు జ్ఞాపకాలే!
సాక్షి, హైదరాబాద్: ముఖ్యమంత్రి చంద్రబాబు 2015 సంవత్సరం మొత్తం ప్రజలకు చేదు జ్ఞాపకాలే మిగిల్చారని, చెప్పుకోవడానికి ఒక్క తీపి జ్ఞాపకం కూడా లేదని వైఎస్సార్సీపీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు విమర్శించారు. ఈ ఏడాదిలో ముఖ్యమంత్రి అనేక తప్పిదాలు చేశారని, కొత్త ఏడాదిలోనైనా మంచి పాలన అందించాలని హితవు పలికారు. ఆయన గురువారం వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ... ఈ ఏడాది కాల్‌మనీ, సెక్స్ రాకెట్, కల్తీ మద్యం, కల్తీ నెయ్యి, ఇసుక మాఫియా, భూ మాఫియా ఇలా విజయవాడను వంద మాఫియాల కేంద్రంగా మార్చేశారని ధ్వజమెత్తారు. చంద్రబాబు పాలన మహిళలు, పేదలకు వ్యతిరేకంగా కొనసాగుతోందని మండిపడ్డారు. మున్ముందు పరిస్థితి ఇలాగే కొనసాగితే ఆయనకు ప్రజల నుంచి తిరుగుబాటు తప్పదని హెచ్చరించారు. ఓటుకు నోటు కేసులో ఒకరికొకరు విమర్శలు చేసుకున్న ఏపీ, తెలంగాణ ముఖ్యమంత్రులు చంద్రబాబు,కె.చంద్రశేఖర్‌రావులు ఇప్పుడు చెట్టాపట్టాలు వేసుకొని తిరగడంలో మతలబేమిటో ప్రజలకు చెప్పాలని డిమాండ్ చేశారు. శాసనసభ నుంచి మహిళా ఎమ్మెల్యే రోజాను ఏడాదిపాటు బహిష్కరించిన దుర్మార్గపు సంవత్సరంగా నిలిచిపోయిందన్నారు. పెంచిన జీతాలు ఇవ్వాలని అడిగిన అంగన్వాడీ టీచర్లను హింసించడంతోపాటు ఉద్యోగాలను ఊడగొట్టే ప్రయత్నాలు చేస్తుండటం సిగ్గుచేటని దుయ్యబట్టారు. -
క్రికెట్ గెలిచింది!
=హెలెన్‌పై విశాఖ భారీ విక్టరీ = చివరి క్షణం వరకు మ్యాచ్ జరగడమే మిస్టరీ =అడ్డంకి లేని వన్డే.. అదో స్వీట్ మెమొరీ విశాఖపట్నం, న్యూస్‌లైన్ : కమ్ముకున్న కారు మబ్బులు.. ఎడతెరిపి లేకుండా కురిసే వర్షాలు.. ఉధృతంగా వీచే ఈదురుగాలులు.. హెలెన్ తుఫాన్ భీకర స్వరూపమిది.. కోస్తాంధ్ర అంతటినీ చిగురుటాకులా వణికించిన పెనుతుఫాన్ తాకిడితో విశాఖ హడలెత్తిపోయింది. నిమిషం విరామం కూడా లేకుండా మూడు రోజులుగా కురిసిన వర్షాలతో నగరం నిలువెల్లా తడిసి ముద్దయింది. దాంతో.. విశాఖ క్రీడాభిమానుల గుండెల్లో భయం ఇంతింతై మొదలై, పెను వాయు‘గండం’లా రూపాంతరం చెందింది. రెండేళ్ల తర్వాత మళ్లీ జరగబోతున్న అంతర్జాతీయ మ్యాచ్ సాఫీగా సాగుతుందా? వర్షం కనికరిస్తుందా? మ్యాచ్ జరిగే రోజైనా వాన తెరిపిస్తుందా?.. శనివారం ఉదయం వరకు ఈ సవాలక్ష సందేహాలతో క్రికెట్ వీరాభిమానుల గుండె పీచుపీచుమంది.. ఓవంక సమైక్యాంధ్ర ఉద్యమకారుల హుంకారాలతో మొదటికే మోసమొస్తుందనుకుంటే.. ఆ అడ్డంకి దాటి మ్యాచ్ నిర్వహణకు అంతా అనుకూలిస్తే... వరుణుడు సైంధవుడిలా అడ్డు పడుతున్నాడన్న ఆందోళన అందరినీ బెంబేలెత్తించింది. పూర్తిగా టార్పాలిన్లతో కప్పేసిన అవుట్‌ఫీల్డ్ ఫొటోలు చూసిన క్రికెట్ అభిమానుల మనసు ఉసూరంది.. కానీ... అందరి ప్రార్థన ఫలించింది! వైఎస్సార్ స్టేడియం సిబ్బంది, మ్యాచ్ నిర్వాహకుల నిర్విరామ కృషి సఫలమైంది! వానదేవుడి అనుగ్రహం కలిసొచ్చింది! విశాఖలో భారత, వెస్టిండీస్ జట్ల మధ్య ఆదివారం వన్డే మ్యాచ్ నిర్విఘ్నంగా, నిరాఘాటంగా జరిగింది! గెలిచింది వెస్టిండీస్ అయినా, అసలు విజయం క్రికెట్‌దే అయింది! లక్షలాది మంది క్రీడాభిమానుల ఆకాంక్షతో తుఫాన్ అవాంతరం దూదిపింజెల్లా చెల్లాచెదురైపోయింది! భయం భయం నవంబర్ అంటేనే తుఫాన్ల మాసం.. పైగా గత ఏడాది ఇదే సమయంలో జరగాల్సిన టీ20 మ్యాచ్ వర్షం వల్లే రద్దయిన చేదు అనుభవం.. ఈనెల 20 నాటికి వర్ష బీభత్సం చూసిన క్రీడాభిమానుల గుండెల్లో ఈ భయం లీలామాత్రంగా కదిలింది. దాన్ని బలపరిచే విధంగా, 21 నాడు.. 22 నాడు నిర్విరామంగా వాన కురిసింది. దాంతో 24 నాటి మ్యాచ్ జరగడం కష్టమేనన్న అభిప్రాయం వినవచ్చింది. అయితే 22 సాయంత్రం హెలెన్ తీరం దాటడమే కాకుండా, తర్వాత వరుణుడు కరుణించడంతో ఆశ చిగురించింది. శనివారమంతా ఎంత కాయడంతో ఇక మ్యాచ్ ఖాయమని నిశ్చయమైపోయింది. దాంతో విశాఖ క్రికెట్ అభిమాని ఆనందానికి అవధేలేకుండా పోయింది. అందుకు తగ్గట్టే, మ్యాచ్ వీసమెత్తు సమస్య లేకుండా అమోఘంగా సాగింది. గ్రౌండ్ సిబ్బంది సామర్ధ్యమిది.. రెండు రోజులకు పైగా భారీ వర్షాలు వెంటాడిన పరిస్థితుల్లో అంతర్జాతీయ మ్యాచ్ నిర్వహణ అంటే దాదాపు అసాధ్యమే. అది అసాధారణ కృత్యమే. కానీ వైఎస్సార్ స్టేడియంలోని అద్వితీయ డ్రైనేజ్ వ్యవస్థ చుక్క నీటి జాడ కూడా లేకుండా చేసింది. అంతకు మించి గ్రౌండ్ సిబ్బంది నిర్విరామ కృషి కారణంగా అసలు వర్షం కురిసిందా? అన్న తీరులో మైదానం తయారైంది. నిర్వాహకుల దీక్షతో మ్యాచ్ క్షణం జాప్యమైనా, అవాంతరమైనా లేకుండా సాగింది. స్టేడియం తీరు, సిబ్బంది తపన అంతర్జాతీయ వ్యాఖ్యాతల ప్రత్యేక ప్రశంసలకు పాత్రమైంది.