SWEROS
-
అన్ని రంగాల్లో ముందుండాలన్నదే స్వేరోయిజం
పాత గుంటూరు: రాజకీయాలతో పాటు అన్ని రంగాల్లోనూ మనమే ముందుండాలన్నదే స్వేరోయిజమని ఐపీఎస్(వీఆర్ఎస్) అధికారి ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ చెప్పారు. గుంటూరు వెంకటేశ్వర విజ్ఞాన మందిరంలో ఆదివారం అక్షరం, ఆరోగ్యం, ఆర్థికం.. మార్పు కోసం స్వేరోయిజం అంశాలతో స్వేరోస్ రాష్ట్ర స్థాయి సమావేశం నిర్వహించారు. కార్యక్రమంలో ప్రవీణ్‌కుమార్, ఏపీ సీఐడీ చీఫ్ పీవీ సునీల్‌కుమార్, ఐఆర్టీఎస్ విశ్రాంత అధికారి డాక్టర్ భరత్‌భూషణ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రవీణ్‌కుమార్ మాట్లాడుతూ దేశ వ్యాప్తంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు ఎన్నో సవాళ్లున్నాయని, వాటిని ఎదుర్కోవాలంటే రాజకీయంగానే సాధ్యమవుతుందన్నారు. రానున్న కాలంలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు దళితుల చుట్టే తిరుగుతాయన్నారు. ప్రజా సేవే లక్ష్యంగా మాయావతి ఆశీస్సులతో బీఎస్పీలో చేరానని, రానున్న ఎన్నికల్లో పార్టీని గెలిపించుకోవాలని పిలుపునిచ్చారు. ఏపీలో స్వేరో నెట్వర్క్ కార్యాలయాన్ని ప్రారంభించాల్సిన అవసరముందన్నారు. సునీల్‌కుమార్ మాట్లాడుతూ భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ ఆశయాలకు అనుగుణంగా ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా కాన్షీరాం ప్రసంగాలపై రచించిన పుస్తకాన్ని ఆవిష్కరించారు. -
బీఎస్పీలోకి ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్!?
సాక్షి, హైదరాబాద్: ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ బహుజన సమాజ్‌పార్టీ (బీఎస్పీ)లో చేరతారన్న చర్చ ఊపందుకుంటోంది. స్థానిక మీడియాతోపాటు జాతీయ చానళ్లలోనూ ఈ వార్త ప్రముఖంగా వినిపిస్తోంది. బీఎస్పీ జాతీయస్థాయి నేతలతో ఆయన సంప్రదింపులు జరిపారని, అందులో చేరికకు రంగం సిద్ధం చేసుకుంటున్నారని ప్రచారం జరుగుతోంది. ఈ మేరకు మంగళవారం పలువురు స్వేరో ప్రతినిధుల పేరిట సోషల్‌మీడియాలో సందేశాలు వైరల్‌గా మారాయి. ఆగస్టు 8న నల్లగొండ జిల్లాలోని ఎన్జీ కాలేజ్ మైదానంలో ఐదు లక్షలమందితో భారీ బహిరంగసభ ఏర్పాటుచేసి, ప్రవీణ్ బీఎస్పీలో చేరతారన్నది వీటి సారాంశం. మరోవైపు తెలంగాణలోని ఉమ్మడి జిల్లాల వారీగా ప్రవీణ్‌కుమార్ వరుస సమావేశాలు నిర్వహిస్తున్నారు. బీఎస్పీలో చేరాలా? లేదా స్వతంత్ర వేదిక ఏర్పాటు చేయాలా? అనే దానిపై సమాలోచనలు సాగిస్తున్నారు. ప్రవీణ్‌కుమార్ ఏ నిర్ణయం తీసుకున్నా వెంట నిలుస్తామని స్వేరో, పలు ప్రభుత్వ ఉద్యోగ సంఘాలు అంటున్నాయి. పీడిత వర్గాలకు ఏకవచన సంబోధనా: ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ అగ్రవర్ణాల నాయకులను గారు అని సంబోధించి, పీడితవర్గాల నాయకులను ఏకవచనంతో సంబోధించారంటూ ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇటీవల ప్రగతిభవన్‌లో జరిగిన దళిత సాధికారికత సమావేశంలో వేదికపైకి హుజూరాబాద్ నాయకులకు స్వాగతం పలుకుతూ కౌశిక్‌రెడ్డి వ్యవహరించిన తీరుపై ఆయన అసంతృప్తి వ్యక్తం చేస్తూ మంగళవారం ట్వీట్‌చేశారు. ఇలాంటి దురహంకార భావజాలం వల్లనే జనాలు బహుజన రాజ్యం రావాలంటున్నారని పేర్కొన్నారు. దీనిపై కౌశిక్‌రెడ్డి కూడా ట్వీట్చేస్తూ.. ఎడిట్ చేసిన వీడియోను చూసి విమర్శలు చేయడం మీ స్థాయికి తగదని బదులిచ్చారు. త్వరలోనే రాజకీయ కార్యాచరణ భానుపురి(సూర్యాపేట): ఉమ్మడి నల్లగొండ జిల్లాలో త్వరలో బహిరంగసభ నిర్వహించి భవిష్యత్ రాజకీయ కార్యాచరణ ప్రకటిస్తానని గురుకుల పాఠశాలల మాజీ కార్యదర్శి, రిటైర్డ్ ఐపీఎస్ అధికారి ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ వెల్లడించారు. మంగళవారం సూర్యాపేటలో నిర్వహించిన బహుజన ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాల ఆత్మీయ సమావేశానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. తన వద్ద డబ్బుల్లేవని, తన రాజకీయ కార్యాచరణకు ప్రతి ఒక్కరూ చందాలు వేసుకుని ముందుకు రావాలన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ అంబేద్కర్ చిత్రపటానికి నివాళులర్పించి గౌరవిస్తున్నారని, కానీ, ఎస్సీ ఉద్యోగుల ప్రమోషన్లు ఆపి అగౌరవ పర్చుతున్నారన్నారు. -
4న స్వేరోయిజం సమావేశం
గద్వాల న్యూటౌన్ : షాద్‌నగర్‌లో ఈ నెల 4న జరిగే స్వేరోయిజం సమావేశానికి తరలిరావాలని స్వేరోస్ కమిటీ డివిజన్ అధ్యక్షుడు శ్రావణ్‌కుమార్ అన్నారు. గురువారం పట్టణంలోని రామిరెడ్డి స్మారక గ్రంథాలయంలో స్వేరోస్ కమిటీ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సమావేశానికి విశిష్ట అతిథిగా తెలంగాణ గురుకులాల కార్యదర్శి ప్రవీణ్‌కుమార్, ముఖ్య అతిథులుగా జాయింట్ కలెక్టర్ రాంకిషన్, జెడ్పీ సీఈఓ లక్షీ్మనారాయణ, షాద్‌నగర్ ఏఎస్పీ కల్మేశ్వర్ సింగెనవార్తోపాటు వక్తలుగా ప్రొఫెసర్లు హాజరవుతారన్నారు. సమావేశంలో కమిటీ సభ్యు లు దిలీప్‌కుమార్, రాజు, రాబర్ట్, సురేష్, శ్రావన్, నాగన్న, విజయ్ పాల్గొన్నారు.