Swine flu disease
-
స్వైన్‌ఫ్లూ కలకలం
నిజామాబాద్‌అర్బన్: స్వైన్‌ప్లూ కలకలం రేపుతోంది. జిల్లా కేంద్రంలో జనవరిలో మూడు కేసులు నమోదు కావడం వైద్య ఆరోగ్యశాఖను ఆందోళనకు గురిచేసింది. ప్రస్తుతం వీరిలో ఇద్దరు కొలుకోగా ఒకరు ఐసీయూలో చికిత్స పొందుతున్నారు. వాతావరణంలో మార్పులను బట్టి ఈ వ్యాధి ప్రతాపం చూపుతుంది. హైదరాబాద్‌లో అత్యధిక కేసులు నమోదు అవుతుండగా, జిల్లాలో కేసులు వెలుగులోకి వస్తున్నాయి. నెలలో ఒకరిద్దరు లక్షణాలతో వెలుగులోకి వస్తున్నారు. జిల్లా కేంద్రంలోనే ఎక్కువ సంఖ్యలో వ్యాధిగ్రస్తులు ఉంటున్నారు. పది రోజుల క్రితం జిల్లా కేంద్రంలోని నాందేవ్‌వాడకు చెందిన 46 సంవత్సరాల వ్యక్తికి స్వైన్‌ప్లూ సోకింది. ప్రస్తుతం ఇతను ఐసీయూలో చికిత్స పొందుతున్నారు. మాలపల్లికి చెందిన 30 సంవత్సరాల మహిళ , గౌతంనగర్‌కు చెందిన ఐదేళ్ల చిన్నారికి స్వైన్‌ప్లూ సోకింది. వైద్యులను సంప్రదించగా లక్షణాలు వెలుగులోకి రావడంతో జిల్లా వైద్యశాఖకు సమాచారం అందించారు. అప్రమత్తమైన వైద్యాధికారులు ఆయా ప్రాంతాల్లో నివారణ చర్యలు చేపడుతున్నారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచడం, ఇంటింటికి వ్యాధిపై అవగాహన కల్పిస్తున్నారు. డిసెంబర్లో సుభాష్‌నగర్‌కు చెందిన ఒకరికి స్వైన్‌ప్లూ సోకకగా హైదరాబాద్‌లో చికిత్స పొందారు. జిల్లా వ్యాప్తంగా ఇప్పటి వరకు 15 కేసులు నమోదు అయ్యాయి. గత ఏడాది 11 కేసులు నమోదు కాగా ఈ ఏడాదిలో మూడు కేసులు ఎక్కువగా నమోదు అయ్యాయి. స్వైన్‌ప్లూకు సంబంధించి అధికారులు మందులను అందుబాటులో ఉంచారు. కరపత్రాలను పంపిణీ చేస్తున్నారు. అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి, ప్రైవేట్ ఆసుపత్రులకు ఆదేశాలు జారీ చేశారు. స్వైన్‌ప్లూ లక్షణాలు కలిగి ఉన్న రోగులు ఎవరైనా వస్తే తక్షణమే సమాచారం అందించాలని ఆదేశించారు. నిజామాబాద్‌అర్బన్: స్వైన్‌ప్లూ కలకలం రేపుతోంది. జిల్లా కేంద్రంలో జనవరిలో మూడు కేసులు నమోదు కావడం వైద్య ఆరోగ్యశాఖను ఆందోళనకు గురిచేసింది. ప్రస్తుతం వీరిలో ఇద్దరు కొలుకోగా ఒకరు ఐసీయూలో చికిత్స పొందుతున్నారు. వాతావరణంలో మార్పులను బట్టి ఈ వ్యాధి ప్రతాపం చూపుతుంది. హైదరాబాద్‌లో అత్యధిక కేసులు నమోదు అవుతుండగా, జిల్లాలో కేసులు వెలుగులోకి వస్తున్నాయి. నెలలో ఒకరిద్దరు లక్షణాలతో వెలుగులోకి వస్తున్నారు. జిల్లా కేంద్రంలోనే ఎక్కువ సంఖ్యలో వ్యాధిగ్రస్తులు ఉంటున్నారు. పది రోజుల క్రితం జిల్లా కేంద్రంలోని నాందేవ్‌వాడకు చెందిన 46 సంవత్సరాల వ్యక్తికి స్వైన్‌ప్లూ సోకింది. ప్రస్తుతం ఇతను ఐసీయూలో చికిత్స పొందుతున్నారు. మాలపల్లికి చెందిన 30 సంవత్సరాల మహిళ , గౌతంనగర్‌కు చెందిన ఐదేళ్ల చిన్నారికి స్వైన్‌ప్లూ సోకింది. వైద్యులను సంప్రదించగా లక్షణాలు వెలుగులోకి రావడంతో జిల్లా వైద్యశాఖకు సమాచారం అందించారు. అప్రమత్తమైన ౖÐð వైద్యాధికారులు ఆయా ప్రాంతాల్లో నివారణ చర్యలు చేపడుతున్నారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచడం, ఇంటింటికి వ్యాధిపై అవగాహన కల్పిస్తున్నారు. డిసెంబర్లో సుభాష్‌నగర్‌కు చెందిన ఒకరికి స్వైన్‌ప్లూ సోకకగా హైదరాబాద్‌లో చికిత్స పొందారు. జిల్లా వ్యాప్తంగా ఇప్పటి వరకు 15 కేసులు నమోదు అయ్యాయి. గత ఏడాది 11 కేసులు నమోదు కాగా ఈ ఏడాదిలో మూడు కేసులు ఎక్కువగా నమోదు అయ్యాయి. స్వైన్‌ప్లూకు సంబంధించి అధికారులు మందులను అందుబాటులో ఉంచారు. కరపత్రాలను పంపిణీ చేస్తున్నారు. అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి, ప్రైవేట్ ఆసుపత్రులకు ఆదేశాలు జారీ చేశారు. స్వైన్‌ప్లూ లక్షణాలు కలిగి ఉన్న రోగులు ఎవరైనా వస్తే తక్షణమే సమాచారం అందించాలని ఆదేశించారు. స్వైన్‌ప్లూ వీరికి ప్రమాదకరం.. గర్భిణులు, ఐదేళ్ల లోపు పిల్లలు, 65 ఏళ్లపైబడిన వృద్ధులు, దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులు ఈ లక్షణాలు ఉంటే వైద్యుడిని సంప్రదించాలి చికిత్సకు తగ్గని అధిక జ్వరం ఊపిరిపీల్చడానికి ఇబ్బందికరంగా ఉంటుంది. ఛాతి,కడుపులో నొప్పి, వరుసగా వాంతులు హఠాత్తుగా ఆయోమయస్థితి చిన్నపిల్లల్లో దద్లుర్లతో కూడిన జ్వరం శరీరం నీలిరంగుగా మారడం జాగ్రత్తలు స్వైన్‌ప్లూ లక్షణాలు ఉన్న రోగులు జనసామూహంలోకి వెళ్లకూడదు. తగ్గినప్పుడు, తూమ్మినప్పుడు ముఖానికి చేతిరుమాలు పెట్టుకోవాలి తగ్గినప్పుడు, తుమ్మినప్పుడు చేతులను శుభ్రంగా కడుకోవాలి. స్వైన్‌ప్లూ సోకిన వ్యక్తి వాడిన వస్తువులు, దుస్తులు ఇతరులు వాడకూడదు. స్వైన్‌ప్లూ సోకిన వారికి కరచానలం చేయకుండా దూరంగా ఉండాలి. జలుబు, దగ్గు, జ్వరం వంటి లక్షణాలు ఉంటే వైద్యున్ని సంప్రదించాలి. లక్షణాలు కనబడితే వెంటనే వైద్యులను సంప్రదించాలి. అప్రమత్తంగా ఉండాలి స్వైన్‌ప్లూపై ముందస్తు జాగ్రత్తలే మేలు. వ్యాధి లక్షణాలు ఉంటే వైద్యున్ని సంప్రదించాలి. సరైన చికిత్స ద్వారా వ్యాధి నయమవుతుంది. కాని వ్యాధి పట్ల జాగ్రత్తగా ఉండి తగిన జాగ్రత్తలు తీసుకుంటే ఎంతో మేలు. ప్రస్తుత వాతావరణ పరిస్థితులు ఈ వ్యాధికి అనుకూలంగా కాబట్టి తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. డాక్టర్ జలగం తిరుపతిరావు, జనరల్ ఫిజీషియన్, అసిస్టెంట్ ప్రొఫెసర్, ప్రభుత్వ మెడికల్ కళాశాల -
స్వైన్‌ఫ్లూ కలకలం
నల్లగొండ టౌన్ : జిల్లాలో మళ్లీ స్వైన్‌ఫ్లూ కలకలం మొదలైంది. తాజాగా జిల్లా కేంద్రంలో రెండు పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. నెల రోజులుగా రాత్రి ఉష్ణోగ్రతలు పడిపోయి చలితీవ్రత పెరిగిపోవడంతో వ్యాధి చాపకిందనీరులా వ్యాపిస్తోంది. చలికాలంలో స్వైన్‌ఫ్లూ(హెచ్1ఎన్1) వ్యాధి ఇన్ఫ్లూయంజా ఎ వైరస్ వల్ల గాలి ద్వారా ఒకరి నుంచి మరొకరికి వ్యాప్తి చెందుతుంది. నెల రోజులుగా హైదరాబాద్‌లో స్వైఫ్లూతో ఉస్మానియా, గాంధీ ఆస్పత్రుల్లో అనేకమంది చేరిన విషయం విదితమే. పదుల సంఖ్యలో మరణాలు కూడా సంభవించాయి. భాగ్యనగరానికి సమీపంలో జిల్లా ఉండడంతోపాటు ఇక్కడినుంచి రోజూ వందలాది మంది అక్కడికి వెళ్లి వస్తుంటారు. దీంతో స్వైన్‌ఫ్లూ బాధితుల సంఖ్య పెరిగిపోతున్నట్లు వైద్య ఆరోగ్యశాఖ అధికారులు భావిస్తున్నారు. జిల్లాలో గత ఏడాది నవంబర్, డిసెంబర్ మాసాల్లో పద్నాలుగు స్వైన్‌ఫ్లూ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. రెండు నెలల వ్యవధిలోనే ఇన్ని కేసులు నమోదు కావడం జిల్లా ప్రజలను ఆందోళనకు గురిచేసింది. ఈ కేసులన్నీ పెద్దవూర, మిర్యాలగూడ, హాలియా, మర్రిగూడ, నల్లగొండ, కట్టంగూరు, త్రిపురారం మండలాల పరిధిలో నమోదైనట్లు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారుల లెక్కలు చెబుతున్నాయి. వారందరూ గాంధీ ఆస్పత్రితోపాటు పలు ప్రైవేట్ ఆస్పత్రుల్లో చికిత్స పొంది వ్యాధినుంచి విముక్తులయ్యారు. అంతవరకు బాగానే ఉన్నప్పటికీ తాజాగా ఈ ఏడాది జనవరి నెలలో జిల్లా కేంద్రంలోనే రెండు పాజిటివ్ కేసులు నమోదు కావడం జిల్లా వైద్య ఆరోగ్యశాఖ వర్గాల్లో కలకలం రేపుతోంది. చలి కొంత తగ్గి వ్యాధి వ్యాప్తి లేదనుకుంటున్న తరుణంలో పాజిటివ్ కేసులు నమోదు కావడంతో ప్రజలు కూడా ఆందోళనకు గురవుతున్నారు. వారిలో ఒకతను పాతబస్తీకి చెందినవ్యక్తికాగా, మరొకరు బీట్‌మార్కెట్ ప్రాంతానికి చెందిన వ్యక్తిగా అధికారులు పేర్కొంటున్నారు. అందులో పాతబస్తీకి చెందిన వ్యక్తి గాంధీలో చికిత్స పొంది వ్యాధినుంచి విముక్తుడై వచ్చినప్పటికీ మరో వ్యక్తి మాత్రం ఆస్పత్రిలోనే చికిత్స పొందుతున్నాడు. జిల్లాలో ఇప్పటివరకు ఒక్క స్వైన్‌ఫ్లూ మరణాలు లేవు. కానీ వ్యాధి బారిన పడుతుండడం కొంత ఆందోళన కలిగిస్తోంది. స్వైన్‌ఫ్లూ లక్షణాలతో ఎవరైనా కనిపిస్తే వెంటనే వారి రక్తనమూనాలను సేకరించి హైదరాబాద్‌లోని ఐపీఎం(ఇనిస్టిట్యూట్ ఆఫ్ ప్రీవెంటీవ్ మెడిసిన్) ల్యాబ్‌కు పరీక్షల నిమిత్తం పంపించేందుకు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అన్ని ఏర్పాట్లు చేసుకుంది. ఇప్పటికే జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆస్పత్రిలో పది పడకలతో ప్రత్యేక స్వైన్‌ఫ్లూ వార్డును ఏర్పాటు చేశారు. పాజిటివ్ అని ఐపీఎం నివేదికలో తేలితే వెంటనే వారికి ప్రత్యేక వార్డులో చికిత్స అందించడానికి అవసరమైన మందులను కూడా అందుబాటులో ఉంచినట్లు జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారులు చెబుతున్నారు. స్లైన్‌ఫ్లూ లక్షణాలు దగ్గు, ముక్కుకారడం, ఆయాసం, దమ్ము రావడం, ఊపిరి పీల్చేందుకు సైతం కష్టపడడం, పిల్లి కూతలు రావడం, శరీర ఉష్ణోగ్రత పెరగడం, గొంతులో గరగర, జ్వరం రావడం, ఒళ్లు నొప్పులు, కళ్లనుంచి నీరు కారడం, చెవినొప్పి, చెవినుంచి చీము కారడం, చిన్న పిల్లలకు నిమ్ముచేయడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. స్వైన్‌ఫ్లూ నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు బహిరంగ ప్రదేశాల్లో ఏటీఎంలు, తలుపుల గొళ్లాలు, మొదలైన వాటిని వాడిన తరువాత, ప్రయాణాలను చేసిన తరువాత చేతులను శుభ్రంగా కడుక్కునే వరకు ముక్కు, కళ్లు, నోటిని ముట్టుకోవద్దు. చేతులను తరచూ సబ్సుతో శుభ్రంగా కడుక్కోవాలి. తుమ్మినప్పుడు, దగ్గినప్పుడు నోటికి, ముక్కుకు అడ్డంగా చేతి రుమాలు పెట్టుకోవాలి. ఎక్కువగా నీళ్లు తాగడంతోపాటు పౌష్టికాహారాన్ని తీసుకోవాలి. చలికాలంలో మంచుపడుతున్న సమయంలో బయటకు వెళ్లొద్దు. ఉన్నిదుస్తులను ధరించాలి. వేడివేడి ఆహారం తీసుకోవాలి. గోరువెచ్చని నీటిని తాగడం మంచిది. చిన్న పిల్లల శరీర ఉష్ణోగ్రతలు తగ్గకుండా ఉన్ని దుస్తులను వేయాలి. వ్యాధి లక్షణాలు కనిపించిన వెంటనే దగ్గరలోని ప్రాథమిక ఆరోగ్య కేం«ద్రం డాక్టర్‌ను సంప్రదించాలి. మందులు అందుబాటులో ఉంచాం స్వైన్‌ఫ్లూ చికిత్స కోసం ప్రభుత్వ ఆస్పత్రుల్లో అవసరమైన అన్ని ఏర్పాట్లు చేశాం. జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆస్పత్రితోపాటు దేవరకొండ, మిర్యాలగూడ, నాగార్జునసాగర్ ఏరియా ఆస్పత్రుల్లో మాత్రలు, టానిక్లను సిద్ధంగా ఉంచాం. మా సిబ్బంది, వైద్యులను అప్రమత్తం చేశాం. గ్రామస్థాయిలో స్వైన్‌ఫ్లూపై తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పిస్తున్నాం. చలికాలంలో వ్యాధి వ్యాప్తి చెందే అవకాశం ఉంటుంది. జిల్లానుంచి నిత్యం హైదరాబాద్‌కు జిల్లానుంచి అనేకమంది రాకపోకలు సాగిస్తుంటారు. కాబట్టి వ్యాధి వ్యాప్తి చెందే అవకాశం ఉన్నందున అన్ని ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నాం. అనుమానిత కేసులు నమోదైతే వెంటనే మా ప్రత్యేక వైద్యబృందం వెళ్లి వారిని పరీక్షించడంతోపాటు చుట్లూ ఉన్న 50 ఇళ్లలోని వారికి కూడా పరీక్షలను చేయడానికి ఏర్పాట్లు చేశాం. – డాక్టర్ వై.గంగవరప్రసాద్, డీఎంహెచ్ఓ -
వణికిస్తున్న స్వైన్‌ఫ్లూ
సాక్షి, అమరావతి/ కర్నూలు(హాస్పిటల్)/ ఉలవపాడు/ గుంటూరు మెడికల్: స్వైన్‌ఫ్లూ వైరస్ రాష్ట్రంలో చాపకింద నీరులా విస్తరిస్తోంది. కొన్ని జిల్లాలకే పరిమితమై ఉన్న ఈ వైరస్ ఇప్పుడు మరికొన్ని జిల్లాలకు విస్తరించింది. స్వైన్‌ఫ్లూ తీవ్రతతో రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లో ప్రమాద ఘంటికలు మోగుతున్నాయి. 2018 అక్టోబర్ 24 నాటికి అధికారిక లెక్కల ప్రకారం 93 స్వైన్‌ఫ్లూ కేసులు నమోదుకాగా, అనధికారికంగా ఇంతకంటే ఇంకా ఎక్కువ కేసులు నమోదై ఉంటాయని భావిస్తున్నారు. కొన్ని ప్రైవేటు ఆస్పత్రుల్లో నమోదైన కేసులు అధికారిక లెక్కల్లోకి తీసుకోవట్లేదని తెలుస్తోంది. స్వైన్‌ఫ్లూ వల్ల ఇప్పటివరకూ 7 మంది మాత్రమే మృతి చెందారని రాష్ట్ర ప్రభుత్వం చెబుతూండగా, 13 మందికి పైనే మృతి చెందినట్లు నిర్ధారణ అయింది. స్వైన్‌ఫ్లూ తీవ్రత ప్రస్తుతం చిత్తూరు, విశాఖ, ప్రకాశం, కర్నూలు, గుంటూరు, కృష్ణా జిల్లాల్లో ఎక్కువగా ఉన్నట్లు అధికారులు గుర్తించారు. వేధిస్తున్న వసతుల కొరత రాష్ట్రంలో బోధనాసుపత్రుల్లో మాత్రమే స్వైన్‌ఫ్లూ బాధితులకు ప్రత్యేక వైద్యం ఉంది. కానీ అక్కడ ఇన్‌పేషెంట్ల రద్దీ పెరగడంతో ప్రత్యేక పడకలు ఏర్పాటు చేయడంలో వైఫల్యం కనిపిస్తోంది. అలాగే జ్వర లక్షణాలున్న బాధితులకు సరైన వైద్యం అందించడంలో వసతుల కొరత వేధిస్తోంది. ఈ నేపథ్యంలో మృతుల సంఖ్య పెరుగుతుండటంతో బాధితులు, ప్రజల్లో ఆందోళన మరింత ఎక్కువవుతోంది. బస్టాండ్లు, ఎయిర్‌పోర్ట్‌లు తదితర జనసమర్థ ప్రాంతాల్లో ముందస్తు చర్యలు తీసుకున్నామని ప్రజారోగ్య శాఖ అధికారులు చెబుతున్నా స్వైన్‌ఫ్లూ విస్తరణను నియంత్రించలేకపోతున్నారు. రాష్ట్రాన్ని ఇప్పటికే మలేరియా, డెంగీ, విషజ్వరాలు వణికిస్తుండగా ఇప్పుడు స్వైన్‌ఫ్లూ మరింత ఆందోళన కలిగిస్తోంది. రానున్న సీజన్ స్వైన్‌ఫ్లూ విస్తరణకు మరింత అవకాశం కల్పిస్తుందని, నియంత్రణా చర్యలు తీసుకోలేక పోతే మరింత ప్రమాదం జరిగే అవకాశముందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. కర్నూలు జిల్లాలో మరో ముగ్గురు మృతి కర్నూలు జిల్లాలో స్వైన్‌ఫ్లూ విజృంభిస్తోంది. మృతుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతుండడంతో ప్రజల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. స్వైన్‌ఫ్లూ వల్ల బుధవారం మరో ముగ్గురు మృత్యువాతపడ్డారు. దీంతో నెల రోజుల వ్యవధిలోనే మృతుల సంఖ్య పదికి చేరింది. అలాగే నెల వ్యవధిలో కర్నూలు సర్వజన ఆస్పత్రిలో 25 స్వైన్‌ఫ్లూ కేసులు నమోదయ్యాయి. వీరిలో ఇంతకుముందు ఏడుగురు మృతిచెందగా బుధవారం కర్నూలు మండలం వెంగన్నబావి ప్రాంతానికి చెందిన 27 ఏళ్ల యువకుడు, ప్యాపిలికి చెందిన 38 ఏళ్ల వ్యక్తి, ఆదోనికి చెందిన 54 ఏళ్ల వ్యక్తి మృత్యువాతపడ్డారు. ఏడుగురు కోలుకుని ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ కాగా, ఇంకా 8 మంది చికిత్స పొందుతున్నారు. గుంటూరులో స్వైన్ ఫ్లూ కేసు నమోదు గుంటూరు జిల్లా రాజుపాలెం మండలం కొండమోడుకు చెందిన టి.రాజశేఖరరెడ్డికి స్వైన్ ఫ్లూ సోకినట్లు బుధవారం గుంటూరు జీజీహెచ్ వైద్యులు నిర్ధారణ చేశారు. ఈ నెల 21న జ్వరం, దగ్గుతో బాధపడుతున్న రాజశేఖరరెడ్డిని కుటుంబ సభ్యులు జీజీహెచ్‌లో చేర్పించారు. జీజీహెచ్‌లో స్వైన్‌ఫ్లూ ఉందన్న అనుమానంతో పరీక్ష చేయగా బుధవారం నిర్ధారణ జరిగింది. దీంతో బాధితుడిని గోరంట్ల ప్రభుత్వ జ్వరాల ఆసుపత్రికి తరలించారు. గుంటూరు జిల్లాలో ఈనెలలో స్వైన్ ఫ్లూ కేసు నమోదవడం ఇది మూడోది. ప్రకాశంలో యువకుడి మృతి స్వైన్‌ఫ్లూ వ్యాధితో ప్రకాశం జిల్లా ఉలవపాడు మండలం రామాయపట్నానికి చెందిన ఓ యువకుడు బుధవారం మృతి చెందాడు. రామాయపట్నంకు చెందిన పంతంగి చంద్రశేఖర్ (33) మూడేళ్లుగా ఉద్యోగ రీత్యా బెంగళూరులో నివాసం ఉంటున్నాడు. ఈ నెల 18న నెల్లూరు జిల్లా కావలి మండలం గుమ్మడిబండల గ్రామంలో బంధువుల ఇంట వివాహ కార్యక్రమానికి హాజరయ్యేందుకు వచ్చిన చంద్రశేఖర్ అనారోగ్యానికి గురి కావడంతో కావలిలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేర్చించారు. మర్నాడు ఒంగోలుకు తరలించగా పరిస్థితి విషమించడంతో ఈ నెల 20న విజయవాడలోని ఆయుష్ ఆస్పత్రిలో చేర్పించారు. ఈ నెల 23న బాధితుడికి స్వైన్‌ఫ్లూ సోకినట్టు వైద్యులు నిర్ధారించారు. అక్కడ చికిత్స పొందుతున్న చంద్రశేఖర్ బుధవారం ఉదయం మృతి చెందాడు. -
స్వైన్‌ఫ్లూతో మరో ఇద్దరు మృతి
సాక్షి, హైదరాబాద్: స్వైన్‌ఫ్లూ మళ్లీ మృత్యుఘంటికలు మోగిస్తోంది. ఇప్ప టికే 34 మందిని కబళించిన స్వైన్‌ఫ్లూ తాజాగా మరో ఇద్దరిని బలి తీసు కుంది. 4 రోజుల నుంచి గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న మెదక్ జిల్లాకు చెందిన కమలమ్మ(55)తో సహా సోమాజిగూడలోని యశోద ఆస్ప త్రిలో చికిత్స పొందుతున్న మరో వ్యక్తి(45) గురువారం మృతి చెందారు. ప్రస్తుతం గాంధీలో ఆరుగురు, కార్పొరేట్ ఆస్పత్రుల్లో నలుగురు స్వైన్‌ఫ్లూ బాధితులు చికిత్స పొందుతున్నారు. వీరిలో నలుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలిసింది. ఈ ఏడాది ఇప్పటివరకు 1,330 స్వైన్‌ఫ్లూ కేసులు నమో దు కాగా వీటిలో అత్యధికంగా జీహెచ్ఎంసీ పరిధిలోనివే. స్వైన్‌ఫ్లూ బాధి తులకు ఉస్మానియా, గాంధీ, నిమ్స్, ఫీవర్, నిలోఫర్ ఆస్పత్రుల్లో ప్రభు త్వం ప్రత్యేక వార్డులను ఏర్పాటు చేసింది. కానీ గాంధీ, ఫీవర్ ఆస్పత్రుల్లో తప్ప ఇతర ఆస్పత్రుల్లో చికిత్సలందడం లేదని రోగులు ఆరోపిస్తున్నారు. -
వామ్మో... స్వైన్‌ఫ్లూ
నెల్లూరు(అర్బన్) : జిల్లాలో స్వైన్ ఫ్లూ కేసులు మళ్లీ విజృంభిస్తున్నాయి. నెల రోజుల క్రితమే జిల్లాలో తొలిసారిగా ఆరు స్వైన్‌ఫ్లూ కేసులు నమోదయ్యాయి. కావలి పట్టణానికి చెందిన మున్సిపల్ శాఖలో పనిచేసే ఒక వ్యక్తి మరణించాడు. వైద్య శాఖాధికారులు సరిగా స్పందించకపోవడంతో చాపకింద నీరులా జిల్లా అంతటా మళ్లీ స్వైన్‌ఫ్లూ కేసులు విస్తరిస్తున్నాయి. శుక్రవారం మనుబోలు మండలంలో ఒక మహిళ స్వైన్‌ఫ్లూతో మరణించడంతో కలకలం రేగుతోంది. ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు. జిల్లాలో స్వైన్ ఫ్లూ కేసులు విస్తరిస్తున్నప్పటికీ వాటి నియంత్రణకు అధికారులు ఎలాంటి చర్యలు చేపట్టలేదు. స్వైన్ ఫ్లూ కేసు సోకినట్టు తెలిస్తే అప్పటికప్పుడు అక్కడ హడావుడి చేయడం, తరువాత మిన్నకుండిపోవడంతో రోగులు పెరుగుతున్నారు. ప్రాణాపాయ స్థితిలోకి పోతున్నారు. స్వైన్‌ఫ్లూ బూచి చూపి వైద్యం పేరిట ప్రైవేటు ఆస్పత్రులు లక్షలకులక్షలు దోచుకుంటున్నాయి. రోగి బతికినా అప్పులపాలవుతున్నాడు. గుర్తించింది నాలుగు కేసులేనట! స్వైన్‌ఫ్లూ జిల్లాలో నలుగురికి మాత్రమే వచ్చినట్టు వైద్యశాఖ లెక్కలు చెబుతున్నాయి. అధికారిక లెక్కల ప్రకారం..పదహారు మందిని లక్షణాలు బట్టి గుర్తించినప్పటికీ వారిలో నలుగురికే పరీక్షలో పాజిటివ్ వచ్చిందని జిల్లావైద్యశాఖాధికారులు పేర్కొంటున్నారు. ప్రైవేటు ఆస్పత్రుల ద్వారా పాజిటివ్ వచ్చిన ఆరు మందిని తాము గుర్తించడం లేదన్నారు. కాగా, తిరుపతిలో ఉండే ప్రభుత్వ లాబోరేటరీలో మాత్రమే పరీక్ష చేయించి పాజిటివ్ వస్తేనే గుర్తిస్తామనడం అన్యాయమని పలువురు పేర్కొంటున్నారు. కాగా, ఇటీవల తరచూ ఏదో ఒక ప్రాంతంలో స్వైన్‌ఫ్లూ కేసులు సోకుతున్నట్టు వార్తలు వస్తూనే ఉన్నాయి. పెద్దాస్పత్రిలో మాత్రం స్వైన్‌ఫ్లూకి 8 బెడ్లతో ఒక వార్డును ఏర్పాటు చేశారు. అయితే అందులో ఒక్క కేసు కూడా చేరలేదు. కొన్ని ఉదాహరణలు పరిశీలిస్తే... ► తడ మండలం పూడిì గ్రామంలో ఇద్దరు చిన్నారులకు స్వైన్ ఫ్లూ సోకగా చెన్నైలోని విజయా హాస్పిటల్ నందు చికిత్స తీసుకున్నారు. ► పెళ్లకూరు మండలానికి చెందిన ఒక డాక్టర్‌కి స్వైన్‌ఫ్లూ సోకగా రాయవేలూరు సిఎంసీలో చికిత్స పొందారు. ► వెంకటాచలం మండలానికి చెందిన మహిళకు స్వైన్‌ఫ్లూ సోకగా నెల్లూరులో చికిత్సపొందారు. ► 10 రోజుల క్రితం సైదాపురం మండలానికి చెందిన బాలుడికి స్వైన్ ఫ్లూ సోకగా నెల్లూరు నగరంలోని సిద్ధార్థ ఆస్పత్రిలో చికిత్స పొంది డిశ్చార్జి అయ్యారు. ► పడుగుపాడుకి చెందిన ఓ వ్యక్తి స్వైన్ ఫ్లూ లక్షణాలతో నెల్లూరులోని ఓ కార్పొరేట్ ఆస్పత్రిలో చికిత్స పొంది మరణించాడని తెలుస్తోంది. ► కృష్ణపట్నం పోర్టులో అసిస్టెంట్ కుక్‌గా పనిచేస్తున్న ఒక వ్యక్తి స్వైన్‌ఫ్లూ లక్షణాలతో నగరంలోని ఒక కార్పొరేట్ ఆస్పత్రిలో చికిత్స పొంది నాలుగు రోజుల క్రితమే డిశ్చార్జి అయ్యారు. ► కావలి పట్టణానికి చెందిన ఒక మహిళ గుంటూరులో చికిత్స పొందుతోంది. తేడా వస్తే మరణమే.. స్వైన్‌ఫ్లూపై ఏమాత్రం నిర్లక్ష్యం వహించినా మరణం సంభవిస్తుంది. విపరీతమైన జలుబు, జ్వరం, తలనొప్పి ప్రధాన లక్షణాలుగా ఉంటాయి. పందుల నుంచి నేరుగా మనుషులకు, స్వైన్‌ఫ్లూ సోకినవారి నుంచి ఇతరులకు ఈ వ్యాధి సులభంగా వ్యాపిస్తోంది. గాలి ప్రధాన వాహకం. అందువల్ల ప్రజలు మాస్క్ ధరించాలి. తుమ్మేటప్పుడు పక్కకు తిరిగి కర్చీఫ్ అడ్డుపెట్టుకుని తుమ్మాలి. నలుగురు కలిసే చోట ఉండకూడదు. శుద్ధమైన నీరు, శుభ్రమైన పరిసరాలతో వ్యాధిని అదుపులో ఉంచుకోవచ్చు. అప్రమత్తంగా ఉన్నాం స్వైన్‌ఫ్లూ వ్యాధి ప్రబలకుండా తగిన ఏర్పాట్లు చేశాం. మా టీంను అప్రమత్తం చేశాం. జిల్లా మొత్తం సర్వేచేయించాం. తిరుపతిలో పాజిటివ్ వస్తేనే స్వైన్‌ఫ్లూగా గుర్తిస్తాం. అలా నాలుగు కేసులు మాత్రమే నమోదయ్యాయి. మనుబోలుకు వెళ్లి వచ్చాను. అక్కడ స్వైన్‌ఫ్లూ కేసు నమోదైనట్టు మా దృష్టికి రాలేదు. అయినా విచారణ జరిపిస్తాం. – డా.వరసుందరం, జిల్లా వైద్య,ఆరోగ్యశాఖాధికారి -
స్వైన్‌ఫ్లూతో సీనియర్ పాత్రికేయుడి మృతి
సాక్షి, ముంబై: స్వైన్‌ఫ్లూ వ్యాధితో సీనియర్ పాత్రికేయుడు రమేశ్ రావుత్(52) శుక్రవారం మరణించారు. గత వారం రోజులుగా రావుత్ జ్వరంతో బాధపడుతుండటంతో డాక్టర్ హెడ్గేవార్ ఆస్పత్రిలో చేర్పించారు. కొన్ని పరీక్షలు నిర్వహించగా ఆయనకు స్వైన్‌ఫ్లూ సోకినట్టు గురువారం నిర్ధారణ అయింది. దీంతో ఆయనను ఔరంగబాద్‌లోని ఘాటి ఆస్పత్రిలో చేర్పించారు. చికిత్స పొందుతూ శుక్రవారం తెల్లవారుజామున మృతిచెందారు. ఆయన భార్య మాధురి కూడా జ్వరంతో బాధపడుతుండటంతో ఆమెను కూడా అదే ఆస్పత్రిలో చేర్పించి చికిత్స అందిస్తున్నారు. 20 ఏళ్లకుపైగా పాత్రికేయ వృత్తిలో.. రమేష్ రావుత్ గత 20 ఏళ్లకుపైగా పాత్రికేయ వృత్తిలో కొనసాగుతున్నారు. ఔరంగాబాద్‌లోని అనేక దినపత్రికలలో ఆయన విధులు నిర్వహించారు. పాత్రికేయుడి నుంచి సంపాదకుడి వరకు అన్ని బాధ్యతలు చేపట్టారు. ముఖ్యంగా ‘చిత్రలేఖ’ అనే వారపత్రికకు అనే క ఏళ్లు మరాఠ్వాడా ప్రతినిధిగా విధులు నిర్వహించారు. ఆ సమయంలో ఆయన రాసిన పలు ఆర్టికల్స్ చర్చల్లోకెక్కాయి. ముంబైలోని సామ్నా దినపత్రికలో కూడా విధులు నిర్వహించడంతో శివసేన, ఎమ్మెన్నెస్ అధ్యక్షులైన ఉద్దవ్ ఠాక్రే, రాజ్ ఠాక్రే కుటుంబీకులతోనూ ఆయనకు సన్నిహిత సంబంధాలున్నాయి. ఔరంగాబాద్‌తోపాటు మరాఠ్వాడాలో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్నారు. ఆయన హఠాన్మరణంపై పాత్రికేయ మిత్రులు దిగ్భాంతి వ్యక్తం చేశారు. -
స్వైన్‌ఫ్లూ బాధితుడికి వైద్యాధికారుల పరామర్శ
మొయినాబాద్: స్వైన్‌ఫ్లూ వ్యాధితో బాధపడుతూ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న రైతును గురువారం వైద్యాధికారులు పరామర్శించారు. అనంతరం బాధితుడి ఇంటికి వెళ్లి ఇంటి పరిసరాలను పరిశీలించారు. మొయినాబాద్‌కు చెందిన రైతు మహ్మద్ ఆసీఫ్(29) స్వైన్‌ఫ్లూ వ్యాధితో బాధపడుతూ నగరంలోని ప్రిమియర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న విషయం తెలిసిందే. గురువారం పత్రికల ద్వారా విషయాన్ని తెలుసుకున్న చేవెళ్ల క్లస్టర్ ఎస్పీహెచ్ఓ చెంచయ్య తమ సిబ్బందితో కలిసి గురువారం ఆస్పత్రిలో ఆసీఫ్‌ను పరామర్శించారు. వ్యాధి నిర్ధారణకు సంబంధించిన రిపోర్టులను పరిశీలించారు. అక్కడి వైద్యులతో మాట్లాడి ఆసీఫ్ ఆరోగ్య పరిస్థితి గురించి వాకబు చేశారు. ప్రస్తుతం వెంటిలేషన్‌పై చికిత్స అందిస్తున్నారని, అతని ఆరోగ్య పరిస్థితి కొంత మెరుగుపడుతున్నట్లు వైద్యులు చెప్పారని చెంచయ్య చెప్పారు. ఆసీఫ్ ఇంటి పరిసరాలు పరిశీలన మొయినాబాద్ పీహెచ్సీ సిబ్బందితో ఎస్పీహెచ్ఓ చెంచయ్య బాధితుడు ఆసీఫ్ ఇంటికి వెళ్లి కుటుంబీకులతో మాట్లాడి పరిసరాలను పరిశీలించారు. పరిసరాలు అపరిశుభ్రంగా ఉండటం, వాతావరణంలో వచ్చే మార్పుల కారణంగా వ్యాధి సోకే అవకాశం ఉందన్నారు. ఎక్కువ ప్రయాణం చేసే సందర్భాల్లో కూడా స్వైన్‌ఫ్లూ ఒకరి నుంచి మరొకరికి సోకే అవకాశం ఉంటుందని చెప్పారు. అయితే ప్రస్తుతం ఆసీఫ్ కుటుంబీకులంతా ఆరోగ్యంగానే ఉన్నారని, వారికి ముందు జాగ్రత్తగా వ్యాధి నివారణ మాత్రలు అందజేస్తామని ఎస్పీహెచ్ఓ చెంచయ్య చెప్పారు. అధిక జ్వరం, దగ్గు, నీరసంగా ఉన్నట్లైతే పరీక్షలు చేయించుకోవాలని ఆయన సూచించారు. ఎస్పీహెచ్ఓ చెంచయ్యతో పాటు సీహెచ్ఓ డోరకమ్మ, హెల్త్ సూపర్వైజర్ నీరజ, ఏఎన్ఎం శోభ ఉన్నారు. గ్రామస్తుల ఆందోళన... మొయినాబాద్‌కు చెందిన రైతు ఆసీఫ్‌కు స్వైన్‌ఫ్లూ సోకిందన్న విషయం తెలియడంతో గ్రామస్తులు ఆందోళన చెందుతున్నారు. గ్రామంలో పరిసరాలన్నీ అపరిశుభ్రంగా ఉండడం.. వాతవరణంలో మార్పులు రావడంతో వ్యాధి వ్యాపిస్తుందేమోనని భయపడుతున్నారు.