సాక్షి, హైదరాబాద్: స్వైన్‌ఫ్లూ మళ్లీ మృత్యుఘంటికలు మోగిస్తోంది. ఇప్ప టికే 34 మందిని కబళించిన స్వైన్‌ఫ్లూ తాజాగా మరో ఇద్దరిని బలి తీసు కుంది. 4 రోజుల నుంచి గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న మెదక్ జిల్లాకు చెందిన కమలమ్మ(55)తో సహా సోమాజిగూడలోని యశోద ఆస్ప త్రిలో చికిత్స పొందుతున్న మరో వ్యక్తి(45) గురువారం మృతి చెందారు. ప్రస్తుతం గాంధీలో ఆరుగురు, కార్పొరేట్ ఆస్పత్రుల్లో నలుగురు స్వైన్‌ఫ్లూ బాధితులు చికిత్స పొందుతున్నారు. వీరిలో నలుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలిసింది. ఈ ఏడాది ఇప్పటివరకు 1,330 స్వైన్‌ఫ్లూ కేసులు నమో దు కాగా వీటిలో అత్యధికంగా జీహెచ్‌ఎంసీ పరిధిలోనివే. స్వైన్‌ఫ్లూ బాధి తులకు ఉస్మానియా, గాంధీ, నిమ్స్, ఫీవర్, నిలోఫర్ ఆస్పత్రుల్లో ప్రభు త్వం ప్రత్యేక వార్డులను ఏర్పాటు చేసింది. కానీ గాంధీ, ఫీవర్ ఆస్పత్రుల్లో తప్ప ఇతర ఆస్పత్రుల్లో చికిత్సలందడం లేదని రోగులు ఆరోపిస్తున్నారు.