swis bank
-
స్విస్ బ్యాంకులో తగ్గిన భారతీయుల డిపాజిట్లు
-
ఇక నల్లకుబేరుల పని అయిపోయినట్లే!
ఆటోమేటిక్ సమాచార మార్పిడి ఒప్పందం కింద స్విట్జర్లాండ్ ప్రభుత్వం ఆ దేశంలోని స్విస్ బ్యాంకులో గల భారతీయుల ఖాతా వివరాలను మూడోసారి కేంద్రానికి అందజేసింది. గోప్యతకు మారుపేరైన స్విస్ బ్యాంకుల్లో దాచిపెట్టిన నల్లధనం వివరాలను భారత్ నిరంతరం పొందడానికి ఈ ఆటోమేటిక్ ఎక్స్ఛేంజ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఒప్పందం దోహదపడుతుంది. ఖాతా సంఖ్య, ఖాతాదారుడి పేరు, చిరునామా, పుట్టిన తేదీ, పన్ను గుర్తింపు సంఖ్య, వడ్డీ, డివిడెండ్, బీమా పాలసీల నుంచి చెల్లింపులు, క్రెడిట్ బ్యాలెన్స్, ఆస్తుల విక్రయం నుంచి లభించిన ఆదాయం తదితర అన్ని విషయాలను పరస్పరం మార్చుకోవచ్చు. ఈ యూరోపియన్ దేశం 96 దేశాలతో దాదాపు 33 లక్షల ఖాతాదారుల వివరాలను పంచుకున్నట్లు పేర్కొంది. ఫెడరల్ ట్యాక్స్ అడ్మినిస్ట్రేషన్(ఎఫ్‌టిఎ) ఒక ప్రకటనలో ఈ ఏడాది సమాచార మార్పిడిలో మరో 10 దేశాలు పాల్గొన్నాయని తెలిపింది. ఆ దేశాలు ఆంటిగ్వా, బార్బుడా, అజర్ బైజాన్, డొమినికా, ఘనా, లెబనాన్, మకావ్, పాకిస్తాన్, ఖతార్, సమోవా, వౌటు. ఎఫ్‌టిఎ మొత్తం96 దేశాల పేర్లు, తదుపరి వివరాలను వెల్లడించనప్పటికీ, వరుసగా మూడవ సంవత్సరం సమాచారాన్ని అందుకున్న వారిలో భారతదేశం ఉన్నట్లు తెలిపింది. స్విస్ ఆర్థిక సంస్థలలో ఖాతాలు ఉన్న పెద్ద సంఖ్యలో వ్యక్తులు, కంపెనీలకు సంబంధించిన వివరాలు భారత అధికారులతో పంచుకున్నట్లు అధికారులు తెలిపారు. ఈ మార్పిడి గత నెలలో జరిగింది. తదుపరి సమాచార మార్పిడి స్విట్జర్లాండ్ సెప్టెంబర్ 2022లో పంచుకోనుంది. సెప్టెంబర్ 2019లో ఏఇఓఐ(ఆటోమేటిక్ ఎక్స్ఛేంజ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్) కింద స్విట్జర్లాండ్ నుంచి భారతదేశం మొదటి సెట్ వివరాలను అందుకుంది. ఆ సంవత్సరం అటువంటి సమాచారాన్ని పొందిన 75 దేశాలలో మన దేశం ఒకటి. రెండు దేశాల మధ్య ఇలాంటి ఒప్పందం కుదిరిన నాటి నుంచి అనేక మంది భారతీయులు స్విస్ బ్యాంకుల్లోని తమ అక్రమ డిపాజిట్లను ఇతర సురక్షిత ప్రాంతాలకు తరలించినట్టు సమాచారం.(చదవండి: ఈ సారి జీమెయిల్, అవుట్ లుక్ యూజర్లను టార్గెట్ చేసిన హ్యాకర్లు) -
స్విస్ బ్యాంక్‌లో రూ.7 కోట్ల డిపాజిట్లు..!
సాధారణంగా అక్రమ సంపాదనపరులు తమ నల్లడబ్బును స్విస్ బ్యాంకుల్లో దాచుకుంటారని అంటుంటారు. అక్కడి బ్యాంకుల్లో సొమ్మున్నట్టు బహిరంగంగా ఎవరూ చెప్పుకోరు. అయితే, పంజాబ్‌లోని గురుదాస్‌పూర్ నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న సునీల్ కుమార్ జాఖఢ్ మాత్రం తన భార్యకు స్విస్ బ్యాంకులో ఏడు కోట్ల రూపాయల విలువైన డిపాజిట్లు ఉన్నాయని ఎన్నికల అఫిడవిట్లో స్పష్టం చేశారు. తన భార్య సిల్వియా జాఖఢ్ పేరుమీద జ్యూరిక్ లోని జ్యూర్చర్ కాంటోనల్ బ్యాంకులో 7.37 కోట్ల రూపాయల డిపాజిట్లు ఉన్నాయని ఎన్నికల సంఘానికి సమర్పించిన అస్తిపాస్తుల వివరాల్లో వెల్లడించారు. మధ్య ప్రదేశ్ మాజీ గవర్నర్ బలరాం జాఖడ్ కుమారుడైన సునీల్ ఈ నియోజకవర్గం సిట్టింగ్ ఎంపీ. ఇక్కడ ఆయన ప్రముఖ బాలీవుడ్ హీరో సన్నీదేవల్తో తలపడుతున్నారు. స్విస్ బ్యాంకు సొమ్ము కాకుండా దేశంలోని వేర్వేరు బ్యాంకుల్లో 1.23 కోట్ల విలువైన డిపాజిట్లు ఉన్నాయని సునీల్ తెలిపారు. తన భార్యకు 12.06 కోట్ల విలువైన ఆస్తులున్నాయని పేర్కొన్నారు. ఇక సన్నీడియోల్ విషయానికి వస్తే ఆయనకు 60.46 కోట్ల విలువైన చరాస్తులు,21 కోట్ల విలువైన స్థిరాస్తులు ఉన్నాయి. ఆయన భార్య లిండా దేవల్‌కు 5.72 కోట్లు ఉన్నాయి. సన్నీదేవల్కు మొత్తం 49.3 కోట్ల అప్పులు ఉన్నాయి. ఆయన భార్య పేరు మీద 1.66 కోట్ల అప్పులున్నాయని అఫిడవిట్లో పేర్కొన్నారు. సన్నీ దేవల్ జీఎస్టీ కింద కోటి 7 లక్షల రూపాయలు ప్రభుత్వానికి చెల్లించాల్సి ఉందట. -
నల్లధనంపై 121 కేసులు నమోదు
న్యూఢిల్లీ: పన్నులు ఎగవేసి స్విస్ బ్యాంకులో అక్రమంగా నల్లధనాన్ని దాచిన వ్యక్తులు, సంస్థలపై ఆదాయపు పన్నుశాఖ(ఐటీ) కేసులు నమోదు చేసింది. హెచ్ఎస్బీసీ జెనీవా బ్యాంకు జాబితా ఆధారంగా ఐటీశాఖ ఇలా మొత్తం 121 కేసులను నమోదు చేసినట్టు అధికారవర్గాలు తెలిపాయి. పన్ను ఎగవేసి సుమారు రూ.4,800 కోట్లమేర డబ్బును అక్రమంగా ఈ బ్యాంకులో దాచారని ఐటీశాఖ గుర్తించింది. ఢిల్లీ, ముంబై, బెంగళూరు, అహ్మదాబాద్, గోవాల్లోని కోర్టులో ఐటీశాఖ 2014-15 ఆర్థిక సంవత్సరం ముగింపురోజైన మార్చి 31న ఈ కేసులను దాఖలు చేసింది. నల్లధనంపై సుప్రీంకోర్టు ఆదేశాలమేరకు దర్యాప్తు చేస్తున్న ప్రత్యేక దర్యాప్తు బృందానికి కూడా ఈ వివరాలను పంపినట్టు అధికారవర్గాలు వెల్లడించాయి.