Swords
-
కర్మన్‌ఘాట్‌లో ఉద్రిక్తత
చంపాపేట: గోవులను కబేళాకు తరలిస్తున్న వాహనాన్ని అడ్డుకోవడంతో ఓ వర్గానికి చెందిన యువకులు మరో వర్గం వారిపై తల్వార్లతో దాడికి యత్నించిన సంఘటన మంగళవారం అర్దరాత్రి చంపాపేట డివిజన్ కర్మన్‌ఘాట్‌లో చోటు చేసుకుంది. బీఎన్‌రెడ్డి చౌరస్తా నుంచి మీర్‌పేట నందిహిల్స్ మీదుగా ఓ వాహనంలో గోవులను చంద్రాయణగుట్టకు తరలిస్తున్నట్లు సమాచారం అందడంతో గోరక్షక్ సభ్యులు కర్మన్‌ఘాట్ శ్రీ ధ్యానాంజనేయ స్వామి ఆలయం సమీపంలో వాహనాన్ని అడ్డుకుని గోవులను కిందకు దించేందుకు ప్రయత్నించారు. ఈ విషయం తెలియడంతో మరో వర్గానికి చెందిన యువకులు ఓ వాహనంలో వేగంగా వచ్చి గోరక్ష సభ్యుల ఇన్నోవాను బలంగా ఢీకొట్టి ధ్వంసం చేశారు. అనంతరం సమితి సభ్యులపై తల్వార్లతో దాడికి యత్నించారు. దీంతో వారు కర్మన్‌ఘాట్ శ్రీ ధ్యానాంజనేయ స్వామివారి ఆలయంలోకి వెళ్లి తలదాచుకున్నారు. వారిని వెంబడించిన దుండగులు ఆలయంలోకి జొరబడి తల్వార్లతో వీరంగం సృష్టించారు. విషయం తెలుసుకున్న ఎల్బీనగర్ బీజేపీ నాయకులు, గోరక్షక్ సభ్యులు పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకోవడంతో దుండగులు పరారయ్యారు. అనంతరం బీజేపీ, భజరంగదళ్, గోరక్షా సభ్యులు ఆలయం ఎదుట బైటాయించి దుండగులను అరెస్ట్ చేసి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ ఆందోళన చేపట్టారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు వారిని సముదాయించే ప్రయత్నం చేశారు. దీంతో ఆ ప్రాంతంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. -
కత్తులు పట్టుకొని బాలీవుడ్ డైలాగులు.. వాట్సాప్ స్టేటస్లు
సాక్షి, హైదరాబాద్: ‘బాప్ బాప్ హీ హోతా బేటా.. నామ్‌తో సునాహీ హోగా న.. సోనూ మోడల్ బోల్తే’ అంటూ బాలీవుడ్ డైలాగ్‌ను కత్తులు పట్టుకున్న ఫొటోపై రాసిన సయ్యద్ ఖలీల్ అనే యువకుడు తన వాట్సాప్‌కు స్టేటస్‌గా పెట్టాడు. ఇలాంటి వాటిని చూపించి స్థానికంగా బెదిరింపుల దందాకు దిగాడు. దీనిపై సమాచారం అందుకున్న మధ్య మండల టా'స్క్‌ఫోర్స్ పోలీసులు అతడిని పట్టుకోగా.. భారీ కత్తుల గోదాం వ్యవహారం బయటపడింది. ఈ విషయాన్ని ఆదివారం ఓఎస్డీ పి.రాధాకిషన్‌రావు వెల్లడించారు. బషీర్‌బాగ్‌లోని బ్యాంక్ కాలనీకి చెందిన సయ్యద్ ఖలీల్ ప్లంబర్. ఇతను కొన్నాళ్లుగా వివిధ రకాల కత్తులతో దిగిన ఫొటోలను తన వాట్సాప్ స్టేటస్‌గా పెట్టేవాడు. వీటిని చూపించి స్థానికంగా బెదిరింపులకు పాల్పడేవాడు. దీనిపై మధ్య మండల టాస్క్‌ఫోర్స్ ఇన్స్పెక్టర్ మహ్మద్ అబ్దుల్ జావేద్‌కు సమాచారం అందింది. అతడి కదలికలపై నిఘా ఉంచిన నేపథ్యంలో శనివారం రాత్రి కత్తులతో ద్విచక్ర వాహనంపై వెళ్తున్నాడని గుర్తించారు. జియాగూడకు చెందిన లాండ్రీ వర్కర్ అంకిత్ లాల్‌తో కలిసి ఉండగా పట్టుకున్నారు. చదవండి: తెలంగాణలోని జిల్లాలకు రెడ్ అలర్ట్ తనిఖీలు చేయగా.. వీరి వద్ద భారీ కత్తులు బయటపడ్డాయి. దీంతో ఇరువురినీ తమ కార్యాలయానికి తరలించిన టాస్క్‌ఫోర్స్ పోలీసులు లోతుగా విచారణ చేశారు. వీటిని అంకిత్‌కు సిద్ది అంబర్‌బజార్‌కు చెందిన రతన్ రాజ్ కుమార్ రూ.1400కు విక్రయించినట్లు వెలుగులోకి వచ్చింది. వాటి ఫొటోలను తమ స్టేటస్‌లుగా పెడుతున్న ఖలీల్, అంకిత్‌లు రూ.2500 నుంచి రూ.3500కు విక్రయిస్తున్నారు. ప్రధానంగా పెళ్లి బారాత్‌లు, ఉత్సవాల సమయంలో విన్యాసాలు చేయడానికి యువత వీటిని ఖరీదు చేస్తున్నారు. ఆయుధ చట్టం ప్రకారం ఇలాంటి వాటిని అనుమతి లేకుండా కలిగి ఉండటం, విక్రయించడం నేరం. రతన్ రాజ్ సిద్ధి అంబర్‌బజార్‌లో మహావీర్ గిఫ్ట్ అండ్ నావెల్టీస్ సంస్థ నిర్వహిస్తున్నాడంటూ ఈ ద్వయం బయటపెట్టింది. దీంతో టాస్‌్కఫోర్స్ పోలీసులు ఆ సంస్థపై దాడి చేసి రతన్‌ను అదుపులోకి తీసుకుని ప్రశ్నించారు. తన వ్యాపారంలో నష్టాలు రావడంతో ప్రత్యామ్నాయ మార్గాలు అన్వేషించానని అతడు చెప్పాడు. పెళ్లిళ్లు, పండగల సీజన్ కావడంతో భారీ కత్తులకు డిమాండ్ ఉందనే ఉద్దేశంతో ఢిల్లీలో కొనుగోలు చేసి ట్రాన్స్‌పోర్ట్‌లో రప్పించానని బయటపెట్టాడు. తన గోదాములో దాచి విక్రయాలు చేస్తున్నానన్నాడు. చదవండి: బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం! దీంతో గోదాంపై దాడి చేసిన పోలీసులు భారీ స్థాయిలో పెద్ద, చిన్న కత్తులను స్వాదీనం చేసుకున్నారు. ముగ్గురు నిందితుల నుంచి మొత్తం 87 పెద్ద కత్తులు, ఎనిమిది చిన్న కత్తులు సీజ్ చేశారు. తదుపరి చర్యల నిమిత్తం ముగ్గురు నిందితులను కత్తులతో సహా సైఫాబాద్ పోలీసులకు అప్పగించారు. ఇలాంటి వ్యవహారాలు ఉపేక్షించబోమని, చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరిస్తున్నారు. -
వైరల్: నలుగురు టూరిస్టులు కత్తులతో హల్చల్
మనాలి: నలుగురు టూరిస్టులు నడిరోడ్డుపై కత్తులతో హల్చల్ చేశారు. రోడ్డు మీద ఉన్న వాళ్లపై దాడి చేయడానికి యత్నించారు. ఈ ఘటన కులు జిల్లాలోని మనాలిలో చోటు చేసుకుంది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఓ నెటిజన్ ట్విటర్లో పోస్ట్ చేయగా.. సోషల్ మీడియాలో ప్రస్తుతం వైరల్‌గా మారింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నిందితులు ఓ కారులో మనాలి బస్‌స్టాండ్ నుంచి రంగ్రీ ప్రాంతంలో ప్రయాణిస్తూ.. మరో వాహనాన్ని ఓవర్టేక్ చేశారు. అంతటితో ఆగకుండా తమ కారును నడిరోడ్డు మీద నిలిపి ట్రాఫిక్ జామ్‌కు పాల్పడ్డారు. ఇతర వాహనాలకు చెందినవారు కారును రోడ్డు మీద నుంచి వెంటనే తొలగించమనడంతో తమ వద్ద ఉన్న కత్తులతో వారిని బెదిరిస్తూ దాడికి యత్నించినట్లు పోలీసులు తెలిపారు. వారి దాడిలో ఒకరికి గాయాలు అయ్యాయని పేర్కొన్నారు. ఈ ఘటనపై స్పందించిన కులు జిల్లా ఎస్పీ గురుదేవ్ చంద్‌శర్మా మాట్లాడుతూ.. పంజాబ్‌లోని సంగ్రూర్ స్థానికులైన రవీందర్, దల్బీర్ సింగ్, అమన్‌దీప్ సింగ్, జస్రాజ్ను అదులోకి తీసుకొని పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు తెలిపారు. ఈ ఘటనపై దర్యాప్తు జరుగుతోందని ఆయన వెల్లడించారు. Manali Viral Video: One More Video Surfaces, See how a man carrying sword running around the People.#HimachalPradesh pic.twitter.com/kz5cYYRXvv — Ajay Banyal (@iAjay_Banyal) July 15, 2021 -
కత్తులతో కాలనీని వణికించారు
హైదరాబాద్: తల్వార్లతో విన్యాసాలు కలకలం రేపాయి. ఈ ఘటన ఉప్పల్ లక్ష్మారెడ్డి కాలనీలో చోటుచేసుకుంది. పుట్టినరోజు సందర్బంగా గణేష్ మండపం వద్ద కొందరు వ్యక్తులు కత్తులతో విన్యాసాలు చేశారు. కత్తి విన్యాసాలకు భయపడిన ఉప్పల్ లక్మరెడ్డి కాలనీ వాసులు రాచకొండ సీపీకి ఫోటోలు పంపారు. దీంతో సీపీ ఆదేశాల మేరకు పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని ముగ్గురిని అరెస్ట్ చేశారు. మారణాయుధాలు ఎక్కడ నుండి తీసుకొచ్చారు? ఎవరు తీసుకొచ్చారు? ఎవరు వాటితో ట్రైనింగ్ ఇస్తున్నారు? అనే కోణంలో ఎస్ఓటీ పోలీసుల ఆరా తీస్తున్నారు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.