Syam prasad
-
సీఎం జగన్‌ను కలిసిన జస్టిస్ శ్యామ్‌ప్రసాద్
సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిని విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ గుడిసేవ శ్యామ్‌ప్రసాద్ శుక్రవారం తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఏపీ మెడికల్ ఎడ్యుకేషన్ హైపవర్ కమిటీ చైర్మన్‌గా ఇటీవల నియమితులై, బాధ్యతలు స్వీకరించిన జస్టిస్ శ్యామ్‌ప్రసాద్ సీఎంకు పుష్పగుచ్ఛం ఇచ్చి కృతజ్ఞతలు తెలిపారు. -
మందిరం దళితులది కాదా?
సందర్భం కాలగమనంలో మన ధర్మంలో ఏర్పడిన అనేక దురాచారాలను నేడు ఆచరించడం మానేశాం కానీ దళితులకు ఆలయ ప్రవేశం విషయంలో నేటికీ వ్యతిరేకత ఉండటం విచారకరం. కాశీలో, శ్రీశైలంలో ఏ కులస్తుడైనా స్వయంగా శివలింగానికి అభి షేకం చేయవచ్చును. తిరుపతిలో, అన్నవరంలో, సింహాచలంలో... ఇలా అన్ని ప్రముఖ దేవాలయాలలో అన్ని కులాల వారికి, షెడ్యూలు కులాల వారికి దేవాలయ ప్రవేశం ఉంది. అయినప్పటికీ దేశంలోని కొన్ని గ్రామాల్లో నేటికీ దేవాలయంలోకి అందరికీ ప్రవేశం లేదు. ఇది హిందూ ధర్మం కాదు. ఇది దురాచారం. గతంలో చేసిన పొరపా టును అర్థం చేసుకుని అన్నికులాల వారికి సమాన గౌరవాన్ని కల్పిస్తూ దేవాలయ ప్రవేశం కల్పిద్దాం అనే సంకల్పంతో సామాజిక సమరసతా వేదిక తలపెట్టిన కార్యం దిగ్విజయంగా పూర్తయింది. విజయనగరం జిల్లా, మెంటాడ మండలంలోని జక్కువ గ్రామంలో 2014 మే 3న పునర్నిర్మితమైన శ్రీరామ మందిరంలోకి దళితులను రానివ్వలేదు. దీనిపై సామాజిక సమర సతా వేదిక నిజ నిర్ధారణ కమిటీ 29 మే 2014న గ్రామాన్ని దర్శించి నివేదికను ప్రభుత్వ అధికారులకు అందజేసింది. దళితులకు మద్దతుగా జిల్లా కలెక్టరు కార్యాలయం ముందు 23 జూన్ 2014న ధర్నాను నిర్వహించింది. ఈ రెండేళ్లలో ప్రభుత్వం నుంచి అందవలసిన సహా యక చర్యల విషయంలో కృషి చేసి బాధితులకు అండగా నిలిచింది. ఈ స్ఫూర్తితోటే సమరసతా వేదిక బీజేపీ, వైఎస్సార్సీపీ, తెలుగుదేశం పార్టీ లకు చెందిన ప్రజా ప్రతినిధులను ఆహ్వా నిస్తూ గ్రామస్తులందరి సహకారంతో గ్రామ దళితుల దేవాలయ ప్రవేశాన్ని దిగ్వి జయంగా పూర్తి చేసింది. ఉత్తరాంధ్ర జిల్లాల సమరసతా సమ్మేళనాన్ని 2016 ఆగస్టు 20న ఘనంగా నిర్వహించింది. ప్రముఖ పండితుడు, సామాజిక సమానతకై ఉద్యమించిన కావ్య కంఠ వాశిష్ట గణపతిముని సందేశ స్ఫూర్తితో ఈ కార్యక్రమాన్ని సామాజిక సమరసతా వేదిక విజయనగరం జిల్లా శాఖ నిర్వహించింది. శ్రీనివాసానంద స్వామీజీ (అధ్యక్షులు, ఉత్తరాంధ్ర సాధు పరిషత్, ఆనందా శ్రమము, శ్రీకాకుళం జిల్లా) వారి నేతృత్వంలో జక్కువ గ్రామంలోని దళితులు, సభకు ఇతర గ్రామాల నుంచి వచ్చినవారు ఆగస్టు 20న శ్రీరామ మందిరంలో ప్రవేశించి ఎంతో ఆనం దంగా ‘జైశ్రీరాం’ నినాదాలతో శ్రీరాముణ్ణి దర్శించుకున్నారు. సామాజిక సమానతకై కృషి చేసిన గౌతమ బుద్ధుడు, స్వామి వివేకానందులు, మహాత్మా జ్యోతిబా పూలే, డాక్టర్ అంబేడ్కర్ల విగ్రహాలను కె. శ్యామ్ ప్రసాద్ (సమరసతా వేదిక, క్షేత్ర కన్వీనర్), శ్రీనివాసానంద స్వామి, దూసి రామకృష్ణ (ఆర్.ఎస్.ఎస్. క్షేత్ర కార్య దర్శి), సోము వీర్రాజు (ఎమ్మెల్సీ) ఆవిష్కరించారు. విగ్రహాల నిర్మాణానికి ఆర్థికంగా సహకరించిన సుబ్బా రావు, జగన్మోహనరెడ్డి, విగ్రహాల నిర్మాత హరేంద్రనాథ్ ఉడయార్లను వేదిక సన్మానించింది. చుట్టు ప్రక్కల ఎనిమిది గ్రామాలకు చెందిన 75 మంది వివిధ కులాలకు చెందినవారు సభకు తరలివచ్చారు. సభానంతరం స్వామీజీతో సహా, ఇతర నాయకులు ఎస్సీ కాలనీలోని కుటుం బాలతో కలసి భోజనం చేశారు. మన ధర్మంలో వర్ణాలలో కాని, కులాలలోకాని హెచ్చు తగ్గులు లేవు. అస్పృశ్యత లేదు. మధ్యకాలంలో కొద్దిమంది స్వార్థ శక్తుల ప్రయత్నాలవల్ల కులాల పేరుతో అసమానతలు, అంటరానితనం ఏర్పడ్డాయి. ఇవి దురాచారాలు. వీటిని తొల గించుకుని బంధు భావంతో ఐకమత్యంగా ఉండాలని సమావేశంలో వక్తలు ప్రసంగించారు. నాసిక్ కాలారామ్ దేవాలయంలో దళితుల ప్రవేశం కోసం 1927లో డాక్టర్ అంబేడ్కర్ నాయకత్వంలో సత్యాగ్రహం జరిగింది. నాటి దేవాలయ పూజారి దళితుల ప్రవేశాన్ని అంగీ కరించలేదు. ఆ పూజారి మనుమడు సుధీర్ మహారాజ్ నాశిక్ కాలారామ్ 1992లో అదే దేవా లయంలో జరిగిన సభలో పాల్గొంటూ, ‘ఆనాడు మా తాత గారు దేవాలయంలోకి ప్రవేశాన్ని వ్యతిరేకిస్తూ వ్యవహరించారు. వారు చేసిన పొరపాటుకు నేను సభాముఖంగా క్షమాపణలు కోరుకుంటున్నాను’ అని అన్నారు. ఈ లక్ష్యంతోటే సమరసతా వేదిక రాజకీయాలకు అతీ తంగా దేశవ్యాప్తంగా పనిచేస్తోంది. వివిధ గ్రామాలలో సామాజిక సమానతను నిర్మించటమే ఈ సభా, విగ్రహాల ఆవిష్కరణ ముఖ్య లక్ష్యం, మన జీవితాలకు పరమార్థం. కె. శ్యామ్‌ప్రసాద్ వ్యాసకర్త కన్వీనర్, సామాజిక సమరసతా వేదిక కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ -
లైంగిక దాడులపై విస్తృత చర్చలు చేపట్టాలి: జి. రోహిణి
చిత్తూరు, న్యూస్‌లైన్: పిల్లలపై జ రుగుతున్న లైంగిక దాడుల నివారణకు విస్తృతంగా చర్చలు జరగాలని హైకోర్టు సీనియర్ న్యాయమూ ర్తి, న్యాయ సేవాధికార సంస్థ రాష్ట్ర కార్యనిర్వాహక చైర్పర్సన్ జస్టిస్ రోహిణి అన్నారు. చిత్తూరులోని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో ‘పిల్లలపై లైంగిక దాడుల నివారణ చట్టం’పై అవగాహన కార్యక్రమాన్ని గురువారం నిర్వహించారు. జస్టిస్ రోహిణి మాట్లాడుతూ.. ఇటీవల కాలంలో పిల్లలపై లైంగిక దాడులు, హింసాత్మక ఘట నలు పెరిగిపోతున్నాయని ఆవేదన వ్యక్తంచేశారు. రెండేళ్ల క్రితం రూపొందించిన పిల్లలపై లైంగిక దాడుల నివారణ చట్టాన్ని అమలుచేయడంలో పోలీసులదే బాధ్యతని పేర్కొన్నారు. బాధిత పిల్లల్ని పదేపదే న్యాయస్థానాలకు పిలిపించకుండా ఘటన జరిగిన ఏడాదిలోపు కేసును పరిష్కరించి నిందితుల్ని శిక్షించడానికి న్యాయాధికారులు, పోలీసులు సహకరించాలని కోరారు. రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ సభ్య కార్యదర్శి శ్యామ్‌ప్రసాద్ మాట్లాడుతూ దేశంలోని పిల్లల్ని రక్షించుకోవడానికి నూతన చట్టాలు ఎంతగానో ఉపయోగపడతాయన్నారు. -
రూ.6.5 కోట్లతో ‘బనవాసి’ అభివృద్ధి
మంత్రాలయం, న్యూస్‌లైన్: ఎమ్మిగనూరు మండలంలోని బనవాసి ఫారం అభివృద్ధికి ప్రభుత్వం రూ.6.50 కోట్లు మంజూరు చేసినట్లు పశుగణాభివృద్ధి శాఖ రాష్ట్ర ముఖ్య కార్యనిర్వాహణాధికారి డాక్టర్ పీడీ కొండారావు పేర్కొన్నారు. రాఘవేంద్రుల దర్శనార్థం బుధవార ం ఆయన మంత్రాలయం వచ్చారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. బనవాసిలో ఫారం అభివృద్ధి, కొత్త ఆబోతుల కొనుగోలు, ఘనీకృత వీర్యం నిల్వ పరికరాల కోసం ఈ నిధులు ఖర్చు చేస్తున్నామన్నారు. కరీం నగర్, బనవాసి క్షేత్రాల్లో 66 నుంచి 120 జెర్సీ ఆబోతులు పెంచుతామని వివరించారు. లైవ్ స్టాకు కోసం రూ.9 కోట్లు, ఘనీకృత వీర్య కేంద్రాల అభివృద్ధికి జాతీయ డెయిరీ ప్రణాళిక నుంచి రూ.20 కోట్లు మంజూరైనట్లు తెలిపారు. రాష్ట్రంలో గతేడాది 108 లక్షల పశువులు ఉండగా ఈ ఏడాది 93 లక్షలకు పడిపోయాన్నారు. కృత్రిమ గర్భదారణ ద్వారా 25 శాతం పశువులు వృద్ధి చెందుతున్నట్లు చెప్పారు. సెమెన్ ధన రూ.30 నుంచి 40కి పెరిగిందన్నారు. ఆయనతోపాటు పశుగణాభివృద్ధి శాఖ జిల్లా సీఈవో హమీద్‌బాషా, డాక్టర్ శ్యాంప్రసాద్, వరప్రసాద్, ఆచారి పాల్గొన్నారు. -
వివాహితపై సామూహిక అత్యాచారం
సాక్షి, విజయవాడ : విజయవాడ రైల్వే అప్‌యార్డులో మంగళవారం ఓ ప్రయాణికురాలిపై సామూహిక అత్యాచారం జరిగింది. రైల్వే ఎస్పీ డాక్టర్ సీహెచ్ శ్యామ్‌ప్రసాద్ కథనం మేరకు.. తూర్పుగోదావరి జిల్లా మండపేట మండలం ఈడిగ గ్రామానికి చెందిన వివాహిత (27) హైదరాబాద్ నుంచి భువనేశ్వర్ వెళ్లే విశాఖ ఎక్స్‌ప్రెస్‌లో రాజమండ్రి వెళ్లడానికి సోమవారం రాత్రి పిడుగురాళ్లలో రెలైక్కింది. రైలు విజయవాడకు చేరుకున్న తర్వాత రాజమండ్రికి ప్యాసింజర్ రైలులో వెళ్లే ఉద్దేశంతో డీజిల్ మల్టీ యూనిట్ (డీఎంఈ) ఎక్కి కూర్చుంది. ఈలోగా రైలును శుభ్రపరిచే నిమిత్తం అప్ యార్డుకు తరలించారు. రైలు వెళ్తున్న సమయంలో ఆర్పీఎఫ్ కానిస్టేబుల్‌గా పరిచయం చేసుకున్న వ్యక్తి అత్యాచారానికి యత్నించాడు. బాధితురాలు రైలు డ్రైవర్‌కు మొరపెట్టుకోగా ఇటువంటి సంఘటనలు సహజమని అతనికి సహకరించాలంటూ ఉచిత సలహా ఇచ్చాడు. రైలులోనే పడిఉండగా క్లీనింగ్ సిబ్బంది తనను పొదల్లోకి తీసుకువెళ్లి వారు కూడా అత్యాచారం చేసినట్లు వాపోయింది. ఆమె ఫిర్యాదు మేరకు నిర్భయ చట్టం కింద కేసు నమోదు చేసినట్లు ఎస్పీ తెలిపారు. చిన్నారిపై బాలుడి అఘాయిత్యం ఖమ్మం: అయిదేళ్ల చిన్నారిపై ఓ బాలుడు(13) లైంగిక దాడి చేశాడు. ఖమ్మం రూరల్ మండలం ఏదులాపురం గ్రామంలోని చిన్నారి మంగళవారం పక్కింటికి వెళ్లింది. ఆ ఇంటిలోని బాలుడు చాక్లెట్ ఇస్తానంటూ చిన్నారిని లోపలికి తీసుకెళ్లి అత్యాచారం చేశాడు. కొద్దిసేపటి తరువాత చిన్నారి ఇంటికి వెళ్లగా తల్లిదండ్రులు తీవ్రంగా రక్తస్రావమవడాన్ని గమనించి ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేశామని, బాలుడు పరారీలో ఉన్నాడని ఎస్సై తెలిపారు. కీచక ఉపాధ్యాయుడి సస్పెన్షన్ చిలుకూరు: పదో తరగతి విద్యార్థినిని గర్భవతిని చేసిన ఉపాధ్యాయుడిపై నల్లగొండ జిల్లా విద్యాశాఖ చర్యలకు ఉపక్రమించింది. ప్రాథమిక విచారణ జరిపించిన అనంతరం పీఈటీ విజయ్‌కుమార్‌ను సస్పెండ్ చేస్తూ డీఈవో జగదీష్ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. నిందితుడిపై నిర్భయ చట్టంకింద కేసు నమోదు చేశారు.