పూడ్చిన నెల తర్వాత పోస్ట్‌మార్టం
-సాధరణ మరణమని గత నెల 29న అంత్యక్రియలు...
-అనుమానం ఉందని ఫిర్యాదు...కేసు నమోదు...పోస్ట్‌మార్టం
చిన్నశంకరంపేట(మెదక్ జిల్లా)
సాధారణ మరణంగా భావించి అంత్యక్రియలు నిర్వహించారు. తర్వాత తమకు అనుమానాలున్నాయని కుటుంబ సభ్యులు పోలీస్‌లకు పిర్యాదు చేశారు. దీంతో నెల రోజుల క్రితం అంత్యక్రియలు నిర్వహించి పూడ్చిన శవాన్ని బయటకు తీసి పోస్ట్‌మార్టం నిర్వహించిన సంఘటన చిన్నశంకరంపేట మండలం శాలిపేట గ్రామంలో బుధవారం చోటు చేసుకుంది.
వివరాల్లోకి వెళితే.. శాలిపేట గ్రామానికి చెందిన ఐతరబోయిన బుచ్చయ్య(45) డిసెంబర్ 29న వెల్దూర్తి మండలం రామాంతాపూర్‌లో రోడ్డు పనుల నిర్వహణకు వెల్లి మతి చెందాడు. అప్పట్లో సాధారణ మరణంగా భావించిన కుటుంబ సభ్యులు అంత్యక్రియలు నిర్వహించారు. తీరా ట్రాక్టర్‌ను తీసుకువచ్చి చూడగా ముందు బాగం దెబ్బతినడంతో అనుమానం వచ్చిన కుటుంభ సభ్యులు ఆరాతీయగా, ట్రాక్టర్ ప్రమాదానికి గురైందని, గాయాలైన బుచ్చయ్య మృతి చెందగా స్వగ్రామానికి తరలించి అంత్యక్రియలు నిర్వహించినట్లు తెలుసుకున్నారు.
దీంతో బార్య శ్యామవ్వ ఈ నెల 18న చేగుంట పోలీస్ స్టేషన్లో పిర్యాదు చేయడంతో ఎస్ఐ శ్రీనివాస్‌రెడ్డి కేసునమోదు చేసి దర్యాప్తు చేపాట్టారు.ఈ మేరకు బుధవారం మండలంలోని శాలిపేటలో బుచ్చయ్య శవాన్ని వెలికితీసి తహశిల్దార్ విజయలక్ష్మి సమాక్షంలో పంచనామ నిర్వహించారు. గాంధీ అస్పత్రి ప్రొపెసర్ డాక్టర్ మోహన్‌సింగ్ పోస్ట్‌మార్టం చేశారు.
ఈ సందర్బంగా ఎస్ఐ శ్రీనివాస్‌రెడ్డి మాట్లాడుతు మృతుడు బుచ్చయ్య ట్రాక్టర్ ప్రమాదంలో మతి చెందినట్లు తమకు అనుమానాలున్నాయని అతని బార్య శ్యామవ్వ ఫిర్యాదు చేసిందని.. దీంతో అనుమానస్పద మృతిగా కేసునమోదు చేసుకుని దర్యాప్తు చేపాట్టిన ట్లు తెలిపారు.పోస్ట్‌మార్టం నివేదిక తరువాత విషయాలు వెల్లడించనున్నట్లు తెలిపారు.