syed
-
కారులో బయలుదేరిన కొన్ని నిమిషాలకే.. విషాదం!
సాక్షి, సంగారెడ్డి/పటాన్చెరు: ఓఆర్ఆర్పై జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు దుర్మరణం చెందగా, ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. బీడీఎస్ సీఐ రవీందర్ రెడ్డి తెలిపిన వివరాలిలా ఉన్నాయి. హైదరాబాద్ గోల్కొండకు చెందిన మహమ్మద్ సయిద్(20), నుమాన్ అలీ(19), హసీం, మజిద్, ఫైజల్ ఆహారం తీసుకునేందుకు కారులో శనివారం రాత్రి సంగారెడ్డి వైపు బయలుదేరారు. పటాన్చెరు మండలం కర్ధనూర్ ఓఆర్ఆర్ సమీపంలోకి రాగానే ముందు వెళ్తున్న వాహనాన్ని ఢీకొట్టారు. ఈ ఘటనలో సయిద్, అలీ అక్కడికక్కడే మృతిచెందారు. మిగతా ముగ్గురికి తీవ్రగాయాలు కాగా చికిత్స కోసం హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. వారిలో మజీద్ పరిస్థితి విషమంగా ఉందని కుటుంబసభ్యులు తెలిపారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఇద్దరి మృతదేహాలను పటాన్చెరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. బాధిత కుటుంబసభ్యులు ఆదివారం ఫిర్యాదు చేయగా కేసును పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇవి కూడా చదవండి: 'కుమురంభీం వర్ధంతి' వేడుకలో.. ఒక్కసారిగా విషాదం! -
‘ఇంటర్’లో ఈసారి తప్పులు దొర్లనివ్వం
సాక్షి, హైదరాబాద్ : రాష్ట్రంలో ఇంటర్మీడియట్ ప్రవేశాలు, పరీక్షల నిర్వహణ, మూల్యాంకనానికి సంబంధించిన సాంకేతిక (ఆన్లైన్) పనుల్లో ఎలాంటి పొరపాట్లు దొర్లకకుండా పకడ్బందీ చర్య లు చేపడుతున్నట్లు ఇంటర్ బోర్డు కార్యదర్శి సయ్యద్ ఉమర్ జలీల్ వెల్లడించారు. ఇటీవల బోర్డు కార్యదర్శిగా బాధ్యతలు స్వీకరించిన ఆయన బుధవారం బోర్డు కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. గతంలో పొరపాట్లు ఎక్కడ దొర్లాయో పరిశీలిస్తున్నామని, త్రీమెన్ కమిటీ నివేదికను అధ్యయనం చేస్తున్నామన్నారు. వాట న్నింటిని పరిగణనలోకి తీసుకొని అలాంటి పొరపాట్లు పునరావృతం కాకుండా చర్యలు చేపడతామని స్పష్టం చేశారు. విద్యార్థులకు ఎలాంటి నష్టం వాటిల్లకుండా చర్యలు తీసుకుంటామన్నారు. ఇందులో భాగంగానే సాంకేతిక సమస్యల పరిష్కారం కోసం బోర్డులోని ఐటీ నిఫుణులతో పాటు ప్రభుత్వ ఐటీ విభాగానికి చెందిన ఐటీ నిఫుణులతో కమిటీని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. డిసెంబర్ వరకే ఫీజుల చెల్లింపు.. ఫిబ్రవరి వరకు పరీక్ష ఫీజులు చెల్లించే విధానం వల్ల కూడా కొన్ని పొరపాట్లు దొర్లుతున్నట్లు తమ దృష్టికి వచ్చిందని, ఈసారి డిసెంబర్ వరకే పరీక్ష ఫీజుల చెల్లింపు విధానాన్ని అమలు చేస్తామని ఇంటర్ బోర్డు కార్యదర్శి సయ్యద్ ఉమర్ జలీల్ తెలిపారు. బోర్డుకు సంబంధించిన అంశాలు, క్షేత్రస్థాయిలో తలెత్తే సమస్యలపై సమీక్షించేందుకు, తగిన కార్యాచరణను రూపొందించి అమలు చేసేందుకు ఈనెల 27న జిల్లా ఇంటర్ విద్యాధికారులతో (డీఐఈవో) సమావేశం నిర్వహించనున్న ట్లు తెలిపారు. జిల్లాల వారీగా గుర్తింపు పొందిన కాలేజీల జాబితాలను జిల్లాల్లోని డీఐఈవో కార్యాలయంలో ప్రదర్శిస్తామన్నారు. కమిటీ సిఫారసులు అమలు.. గత వార్షిక పరీక్షల్లో పరీక్షల మూల్యాంకనం, ఆ తర్వాత కంప్యూటరీకరణ, ఆన్లైన్ ప్రాసెస్ వంటి వాటిపై త్రీమెన్ కమిటీ ఇచ్చిన సిఫారసులను అమలు చేస్తామని ఇంటర్ బోర్డు కార్యదర్శి తెలిపారు. అందుకు అనుగుణంగా చర్యలు చేపడతామన్నారు. సెలవుల్లో క్లాసులు నిర్వహిస్తే చర్యలు ఇక జూనియర్ కాలేజీలకు ఈనెల 28 నుంచి వచ్చే నెల 9 వరకు దసరా సెలవులుగా ప్రకటిస్తున్నట్లు ఇంటర్ బోర్డు కార్యదర్శి సయ్యద్ ఉమర్ జలీల్ చెప్పారు. కాలేజీలు తిరిగి వచ్చే నెల 10న ప్రారం భం అవుతాయని స్పష్టం చేశారు. సెలవుల్లో తరగతులు నిర్వహిస్తే సంబంధిత కాలేజీలు, ప్రిన్సిపాళ్లపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. -
ఈవీఎం ట్యాంపరింగ్: సయ్యద్ షుజాపై పోలీసులకి ఈసీ ఫిర్యాదు
-
అందరూ ఉన్నా అనాథలయ్యారు
మైలార్‌దేవ్‌పల్లి: కుటుంబ సభ్యులు కాదు పొమ్మన్నారు.. తలదాచుకోవడానికి కాసింత స్థలం ఇమ్మంటే బయటకు గెంటేశారు.. వారసత్వంగా వచ్చే ఇల్లు లేదన్నారు. దీంతో అందరూ ఉన్నా ఆ కుటుంబం అనాథగా మిగిలింది. చేసేది లేక చలికి వణుకుతూ రోడ్డుపైనే జీవనం సాగిస్తోంది. వివరాల్లోకి వెళితే.. రాజేంద్రనగర్ సర్కిల్ అంబేడ్కర్‌నగర్‌కు చెందిన ఉస్మాన్ అలీ, ఖరీమ్బీ దంపతులకు ఏడుగురు సంతానం. వీరి కుమారుడిలో ఒకరైన సయ్యద్ ఇక్బాల్ అలీ(52) కుక్‌గా పని చేస్తూ ఆర్డర్లు వచ్చిన చోటుకు వెళ్తూ భార్య పిల్లలతో జీవనం సాగిస్తున్నాడు. ఇక్బాల్ అలీకి పదేళ్ల కుమారుడు ఉన్నాడు. కాగా తండ్రి ఉస్మాన్ అలీకి అంబేడ్కర్‌నగర్‌లో 180 గజాల స్థలంలో ఇల్లు ఉంది. గత కొన్నేళ్లుగా ఇంటికి దూరంగా ఉన్న ఇక్బాల్ అలీ గత సంవత్సరం తన సోదరుడి వివాహానికి హాజరయ్యేందుకు రాజేంద్రనగర్ అంబేడ్కర్ నగర్‌కు వచ్చి పక్కనే ఉన్న ఇంట్లో అద్దెకు దిగాడు. ఇక్బాల్ అద్దెకుంటున్న ఇంటి యజమానులు ఆ ఇంటిని కూల్చి నూతన ఇల్లు నిర్మించేందుకు పనులు ప్రారంభించారు. దీంతో ఇక్బాల్ అలీ తండ్రి సంపాదించిన ఇంట్లోకి వెళ్లేందుకు ప్రయత్నించాడు. ఇంట్లో నీకు ప్రవేశం లేదంటూ కుటుంబ సభ్యులు గొడవకు దిగడంతో ఇంటి ఎదుట ఉన్న స్థలంలో భార్యాపిల్లలతో నివసిస్తున్నాడు. స్థానికులు కుటుంబ సభ్యులకు నచ్చజెప్పినప్పటికీ అతడికి ఇంట్లోకి ప్రవేశం లేదంటూ గొడవపడుతున్నారు. తన తండ్రి వారసత్వంగా వచ్చిన స్థలంలో 45 గజాలు తనకు వస్తుందని సంబంధిత అధికారులు తన విషయంలో జోక్యం కలిగించుకొని ఇంట్లోకి ప్రవేశం కల్పించాలని ఇక్బాల్ అలీ గోడును వెల్లబోసుకున్నాడు. సొంత ఇల్లు ఉన్నా తనకు ప్రవేశం లేదని, రోడ్డు పక్కన కుటుంబంతో జీవనం సాగిస్తున్నానని, జీహెచ్ఎంసీ వారు అందించే దుప్పట్లతో రాత్రి వేళలో నిద్రిస్తున్నానని ఇక్బాల్ కుటుంబం కన్నీరు పెట్టుకుంది. తనకు న్యాయం చేయాలని బాధిత కుటుంబం కోరుతోంది. -
పూలకుండీల్లో గంజాయి సాగు..
-
పూలకుండీల్లో గంజాయి సాగు..
హైదరాబాద్: గంజాయిని పొలాల్లో సాగు చేస్తే అధికారులు పసిగడతారని ఓ వ్యక్తి కొత్త ఉపాయం కనిపెట్టాడు. తన ఇంట్లోని పూలకుండీల్లోనే సాగు చేసి దొంగచాటుగా విక్రయిస్తున్నాడు. దీనిపై సమాచారం అందుకున్న సౌత్‌జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు గుట్టురట్టు చేశారు. గోల్కొండలోని వైకే రెసిడెన్సీలో ఉండే సయ్యద్ అనే వ్యక్తి తన నివాసంలోనే పెద్దపూలకుండీలను ఏర్పాటు చేసుకుని గంజాయిని సాగు చేస్తున్నాడు. ఆపై దొంగచాటుగా విద్యార్థులకు, ఉద్యోగులకు విక్రయిస్తున్నాడు. గత కొంతకాలంగా ఈ తంతు కొనసాగుతోంది. దీనిపై విశ్వసనీయ సమాచారం మేరకు పోలీసులు సోమవారం దాడులు చేసి, సయ్యద్‌ను అదుపులోకి తీసుకున్నారు. గంజాయి మొక్కలు సహా కుండీలను స్టేషన్‌కు తరలించారు. -
జీవితమే సపొలం
చుట్టూ భవనాలు.. వీటి మధ్యకు కాడెడ్లు ఎక్కడి నుంచి వచ్చాయనుకుంటున్నారా..! ఈ వ్యవసాయ క్షేత్రం హైటెక్‌సిటీకి కూతవేటు దూరంలో ఉంది. ఓ పదేళ్లు ఫ్లాష్‌బ్యాక్‌లోకి వెళ్తే ఇక్కడన్నీ వ్యవసాయ భూములే. అభివృద్ధి పథంలో ముందుగా ఇక్కడికి హైటెక్ సిటీ వచ్చింది.. దాని వెంట దేశవిదేశాలకు చెందిన ఎన్నో ఐటీ కంపెనీలు బారులు తీరాయి.. అంతే.. అక్కడి భూముల ధరలు ఆకాశాన్నంటాయి. రియల్ బూమ్ రెక్కలు తొడిగి.. ఖాళీ స్థలం కనిపిస్తే చాలు.. వాలిపోయింది. కాసుల గలగల ముందు ధాన్యరాసుల కళ చిన్నబోయింది. వందలాది ఎకరాల వ్యవసాయ భూమి రియల్ సెక్టర్‌గా మారిపోయింది. ఇదే జోరులో ఎందరో కట్టల గుట్టలు ఆఫర్ చేసినా.. ఓ పెద్దాయన మాత్రం తన భూమిని అమ్మేదిలేదని భీష్మించుకున్నాడు. చుట్టూ ఐటీ ప్రపంచం సోకులు పోతున్నా.. నేటికీ పల్లెటూరి మోతుబరిలా దర్జాగా వ్యవసాయం చేసుకుంటున్నాడు. ఓ వైపు తళతళ మెరిసే రోడ్లు.. మరోవైపు ఆకాశాన్నంటే ఐటీ భవనాలు.. వీటి మధ్యే ఉంది సయ్యద్ జాఫర్ ఐదెకరాల వ్యవసాయ భూమి. ఆయన పొలానికి అటుఇటుగా ఉన్న వ్యవసాయ క్షేత్రాలన్నీ కోట్లకు అమ్ముడుపోయాయి. అయినా జాఫర్ బాయ్.. ‘భూమిని నమ్ముకుంటాను కానీ అమ్ముకోనని’ డిసైడ్ అయ్యాడు. ఆయన మనసెరిగిన కొడుకు సయ్యద్ గౌస్ కూడా తండ్రి బాటలోనే సాగుతున్నాడు. తృణప్రాయంగా.. నాలుగు తరాలుగా వ్యవసాయంపై ఆధారపడి జీవనం సాగిస్తోంది ఈ కుటుంబం. తాతలనాడు అరక పట్టి.. మెరక దున్నారంటే ఓకే..! తమ పొలానికి ఎన్ని ఆఫర్లు వచ్చినా తోసిపుచ్చి.. నేటికీ సయ్యద్ కుటుంబం పొలం పనులతోనే జీవనం సాగిస్తోంది. ఇప్పటికీ కాడెడ్లతోనే పొలాన్ని దున్నుతున్నారు. సేంద్రియ ఎరువులతోనే సాగు చేస్తున్నారు. తిండిగింజలు కరువైన నాడు ఎన్ని డబ్బులు ఉన్నా ఏం లాభం అంటాడు జాఫర్ ఉరఫ్ ఫకీర్‌సాబ్. రైతులు ఉన్నప్పుడే.. జనజీవనం సాగుతుందని చెబుతాడు. ఈ పొలంలో వరితోపాటు టమాటాలు, వంకాయలు, సొరకాయలు వంటి కూరగాయలతో పాటు, ఆకుకూరలూ పండిస్తున్నారు. ‘ఎనిమిదేళ్ల నుంచి ఈ పొలంలో పనిచేస్తున్నా. మాదాపూర్‌లో పొలం పనులకు వెళ్తున్నా అంటే హైటెక్‌సిటీలో పొలమేందని మా వాళ్లు ఆశ్చర్యపోతుంటరు’ అని చెబుతుంది రైతు కూలి శాంతమ్మ. మా ఇంటి పంటే తింటాం.. ‘నాకిప్పుడు 80 ఏళ్లు. నా కొడుకులు, మనవళ్లతో సమానంగా నడుస్తా. మా పొలంలో పండిన కూరగాయలే తింటం. మా ఇంటి నుంచి పొలానికి కిలోమీటర్ ఉంటది. రోజూ రెండు మూడు సార్లు పొలానికి నడుచుకుంటనే పోయొస్తుంట. ఈ తరం వారికి వ్యవసాయం భారంగా తోస్తోంది. గిట్టుబాటుకాకా.. పల్లెల్లో కూడా చాలామంది రైతులు వ్యవసాయానికి దూరమైతున్నరు’ అని అంటారు సయ్యద్ జాఫర్. నాన్న కోరిక.. నా ఇష్టం.. ‘చిన్నప్పటి నుంచే మా నాన్న వ్యవసాయంపై నాకు ఆసక్తి కలిగించారు. మా నాన్న కోరిక మేరకు వ్యవసాయం చేస్తున్నా. మా తమ్ముడు హోటల్ నడిపిస్తున్నాడు. బాగానే లాభాలు వస్తున్నాయి. అయినా పొలంబాట వీడేది లేదు. మా పిల్లలు ‘వ్యవసాయం ఎందుకు నాన్నా’ అని అంటుంటారు. ఈ దారిలో వెళ్తూ చాలామంది మా పొలం దగ్గర ఆగి చూస్తుంటారు. ‘ఇక్కడ వ్యవసాయమా.. మంచి పని చేస్తున్నావ్..!’ అని మెచ్చుకుంటారు కూడా’ అంటూ సంతోషంగా చెబుతారు సయ్యద్ గౌస్ . .:: తన్నీరు సింహాద్రి, మాదాపూర్ -
భార్యను చంపి.. ఆత్మహత్య చేసుకున్న తాగుబోతు
యాకుత్‌పురా: కుటుంబ కలహాలు దంపతులను బలిగొన్నాయి. భార్యను హత్య చేసి.. ఆపై తాను ఆత్మహత్య చేసుకున్నాడో తాగుబోతు. రెయిన్‌బజార్ పోలీస్‌స్టేషన్‌లో పరిధిలో గురువారం అర్ధరాత్రి ఈ దారుణం జరిగింది. ఇన్స్పెక్టర్ రమే ష్ కథనం ప్రకారం... భవానీనగర్ ఠాణా పరిధిలోని జహంగీర్‌నగర్‌కు చెందిన సయ్యద్‌జాఫర్ (35), నజియా బేగం (32) భార్యాభర్తలు. 16 ఏళ్ల క్రితం వీరికి పెళ్లైంది. ఇద్దరు కుమారులు, ఇద్దరు కుమార్తెలు సంతానం. నెలన్నరగా సయ్యద్ కుటుంబం రెయిన్‌బజార్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని హఫీజ్‌నగర్‌లో నివాసముంటోంది. పత్తర్‌గట్టీ పటేల్‌మార్కెట్‌లోని వస్త్రాల దుకాణంలో జాఫర్ పని చేస్తున్నాడు. నిత్యం మద్యం తాగి వచ్చి భార్యతో గొడవపడేవాడు. ఇంటి ఖర్చులకు భర్త డబ్బులు ఇవ్వకపోవడంతో నజియా కొన్ని రోజులుగా మ్యారేజ్ బ్యూరో నిర్వహిస్తూ కుటుం బాన్ని పోషిస్తోంది. కుటుంబకలహాల నేపథ్యంలో జాఫర్ గతేడాది సెప్టెంబర్ 24న నజియా గొంతు కోసి హత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఆమె ఫిర్యాదు మేరకు భవానీనగర్ పోలీసులు ఐపీసీ 306,307 సెక్షన్ల కింద కేసు నమోదు చేసి జైలుకు పంపారు. ఆ తర్వాత భార్య కేసును ఉపసంహరించుకోవడంతో జైలు నుంచి బయటికి వచ్చాడు. కొన్ని రోజులు బాగానే ఉన్న జాఫర్ రెండు వారాలుగా తప్పతాగి వచ్చి భార్యతో ఘర్షణ పడుతున్నాడు. ఇదే క్రమంలో గురువారం రాత్రి తాగివచ్చి గొడవపడ్డాడు. అర్ధరాత్రి గాఢనిద్రలో ఉన్న నజియా తలపై రోకలిబండతో మోది చంపేశాడు. ఆ తర్వాత తాను కూడా ఇంట్లోని పైకప్పు రాడ్‌కు చున్నీతో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఉదయం పిల్లలు లేచి చూసేసరికి తల్లిదండ్రులు మృతి చెంది ఉన్నారు. సమాచారం అందుకున్న రెయిన్‌బజార్ పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించి, మృతదేహాలను పోస్టుమార్టం కోసం తరలించారు. మృతురాలి సోదరుడుమహ్మద్ హఖిల్ ఫిర్యాదు మేరకుకేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.