ఇంగ్లండ్‌ను చిత్తు చేసిన పాకిస్తాన్.. వరుసగా నాలుగో విజయం
వరల్డ్ ఛాంపియన్షిప్ ఆఫ్ లెజెండ్స్ 2024 టోర్నీలో పాకిస్తాన్ ఛాంపియన్స్ జైత్ర యాత్ర కొనసాగుతోంది. ఈ మెగా టోర్నీలో భాగంగా ఆదివారం ఎడ్జ్‌బాస్టన్ వేదికగా ఇంగ్లండ్ ఛాంపియన్స్‌తో మ్యాచ్‌లో 79 పరుగుల తేడాతో పాకిస్తాన్ ఘన విజయం సాధించింది. కాగా ఇది పాక్‌కు వరుసగా నాలుగో విజయం కావడం విశేషం. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన పాకిస్తాన్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 196 పరుగులు చేసింది. పాక్ బ్యాటర్లలో షోయబ్ మక్సూద్(64) పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలవగా.. షోయబ్ మాలిక్(21) హాఫ్ సెంచరీతో మెరిశాడు. ఇంగ్లండ్ బౌలర్లలో మీకర్ రెండు వికెట్లు పడగొట్టగా.. మాడీ, స్కోఫీల్డ్ తలా వికెట్ సాధించారు.తిప్పేసిన ఆజ్మల్..197 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లండ్ 117 పరుగులకే కుప్పకూలింంది. పాక్ బౌలర్లలో స్పిన్నర్ ఆజ్మల్ 4 వికెట్లతో ఇంగ్లండ్ పతనాన్ని శాసించగా.. రజాక్ రెండు, సోహైల్ ఖాన్, మాలిక్ తలా వికెట్ సాధించారు. ఇంగ్లండ్ బ్యాటర్లలో వికెట్ కీపర్ బ్యాటర్ ఫిల్ మాస్టర్డ్(30) పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు.చదవండి: IND vs SL: భారత్‌తో టీ20 సిరీస్.. శ్రీలంక హెడ్ కోచ్‌గా సనత్ జయసూర్య