చేపల వేటకు వెళ్లి..
చేపలు పట్టడానికి వెళ్లిన వ్యక్తి ప్రమాదవశాత్తు చెరువులోపడి మృతిచెందాడు. ఈ సంఘటన రంగారెడ్డి జిల్లా కీసర మండలం రాంపల్లి గ్రామంలో శుక్రవారం చోటుచేసుకుంది. నేతాజినగర్కు చెందిన సయ్యద్ ఖాదర్(31) రాంపల్లిలోని పెద్ద చెరువులో చేపలు పట్టడానికి వెళ్లి ప్రమాదవశాత్తు అందులో పడి మృతిచెందాడు. విషయం తెలుసుకున్న గ్రామస్థులు మృతదేహాన్ని బయటకు తీసి పోలీసులకు సమాచారం అందించారు.