Syrian Human Rights Organization
-
సిరియాలో దాడుల్లో 46 మంది మృతి
బీరుట్: ఉత్తర సిరియాలో శుక్రవారం జరిగిన వైమానిక దాడుల్లో దాదాపు 46 మంది మృతి చెందగా, వంద మందికి పైగా క్షతగాత్రులయ్యారు. అలెప్పోకు 30 కిలోమీటర్ల దూరంలో ఉన్న అల్ జినే గ్రామంలోని ఓ మసీదులో సాయంత్రం ప్రార్థనలు జరుగుతుండగా ఈ దాడులు జరిగినట్లు సిరియా మానవ హక్కుల సంస్థ పేర్కొంది. కాగా, అల్‌ఖైదా ఉగ్రవాదులను లక్ష్యంగా చేసుకుని తమ బలగాలే ఈ దాడులు జరిపినట్లు అమెరికా ప్రకటించింది. మసీదుకు పక్కనే 50 అడుగుల దూరంలో ఉన్న మరో భవనంలో అల్‌ఖైదా ఉగ్రవాదులు సమావేశం నిర్వహించారని, వారిని లక్ష్యంగా చేసుకుని ఈ దాడులు జరిపినట్లు అమెరికా తెలిపింది. కాగా, సోమాలియా శరణార్థులను మోసుకెళ్తున్న ఓ పడవపై శుక్రవారం యెమెన్‌లో జరిగిన కాల్పుల్లో 40 మంది చనిపోయారు. -
తల్లిని చంపిన ఐసిస్ ఉగ్రవాది
-
తల్లిని చంపిన ఐసిస్ ఉగ్రవాది
లండన్: ఐసిస్ నుంచి బయటికి రమ్మని చెప్పినందుకు ఆ సంస్థ ఉగ్రవాది ఒకడు తన తల్లిని బహిరంగంగా కాల్చి చంపాడు. ఈ దారుణం సిరియాలోని ఐసిస్ అడ్డా రక్కాలో బుధవారం జరిగిందని సిరియా మానవ హక్కుల సంస్థ తెలిపింది. అలీ సకర్ అల్ కాసిమ్(20) వందలాదిమంది సమక్షంలో తన తల్లి లెనా(45)ను తలపై రైఫిల్‌తో కాల్చిచంపాడని పేర్కొంది. ‘ఐసిస్ నుంచి బయటికొచ్చి, రక్కాను వదలివెళ్లిపోదామని లెనా.. సకర్‌కు నచ్చజెప్పేందుకు ప్రయత్నించింది. అతను ఈ విషయాన్ని తన నాయకులకు చెప్పాడు. వారు లెనాను అరెస్ట్ చేసి, మతాన్ని త్యజించిందని అభియోగాలు మోపారు. ఆమెను చంపేయాలని సకర్‌ను ఆదేశించారు’ అని సిరియన్ అబ్జర్వేటరీ ఫర్ హ్యూమన్ రైట్స్ తెలిపింది. ఈ దారుణంపై సోషల్ మీడియాలో తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి.