తల్లిని చంపిన ఐసిస్ ఉగ్రవాది | Isis is a terrorist kill the mother | Sakshi
Sakshi News home page

తల్లిని చంపిన ఐసిస్ ఉగ్రవాది

Published Sat, Jan 9 2016 1:46 AM | Last Updated on Sun, Sep 3 2017 3:19 PM

తల్లిని చంపిన ఐసిస్ ఉగ్రవాది

తల్లిని చంపిన ఐసిస్ ఉగ్రవాది

లండన్: ఐసిస్ నుంచి బయటికి రమ్మని చెప్పినందుకు ఆ సంస్థ ఉగ్రవాది ఒకడు తన తల్లిని బహిరంగంగా కాల్చి చంపాడు. ఈ దారుణం సిరియాలోని ఐసిస్ అడ్డా రక్కాలో బుధవారం జరిగిందని సిరియా మానవ హక్కుల సంస్థ తెలిపింది. అలీ సకర్ అల్ కాసిమ్(20) వందలాదిమంది సమక్షంలో తన తల్లి లెనా(45)ను తలపై రైఫిల్‌తో కాల్చిచంపాడని పేర్కొంది. ‘ఐసిస్ నుంచి బయటికొచ్చి, రక్కాను వదలివెళ్లిపోదామని లెనా.. సకర్‌కు నచ్చజెప్పేందుకు ప్రయత్నించింది. అతను ఈ విషయాన్ని తన నాయకులకు చెప్పాడు.

వారు లెనాను అరెస్ట్ చేసి, మతాన్ని త్యజించిందని అభియోగాలు మోపారు. ఆమెను చంపేయాలని సకర్‌ను ఆదేశించారు’ అని సిరియన్ అబ్జర్వేటరీ ఫర్ హ్యూమన్ రైట్స్ తెలిపింది. ఈ దారుణంపై సోషల్ మీడియాలో తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement