బీరుట్: ఉత్తర సిరియాలో శుక్రవారం జరిగిన వైమానిక దాడుల్లో దాదాపు 46 మంది మృతి చెందగా, వంద మందికి పైగా క్షతగాత్రులయ్యారు. అలెప్పోకు 30 కిలోమీటర్ల దూరంలో ఉన్న అల్ జినే గ్రామంలోని ఓ మసీదులో సాయంత్రం ప్రార్థనలు జరుగుతుండగా ఈ దాడులు జరిగినట్లు సిరియా మానవ హక్కుల సంస్థ పేర్కొంది.
కాగా, అల్‌ఖైదా ఉగ్రవాదులను లక్ష్యంగా చేసుకుని తమ బలగాలే ఈ దాడులు జరిపినట్లు అమెరికా ప్రకటించింది. మసీదుకు పక్కనే 50 అడుగుల దూరంలో ఉన్న మరో భవనంలో అల్‌ఖైదా ఉగ్రవాదులు సమావేశం నిర్వహించారని, వారిని లక్ష్యంగా చేసుకుని ఈ దాడులు జరిపినట్లు అమెరికా తెలిపింది. కాగా, సోమాలియా శరణార్థులను మోసుకెళ్తున్న ఓ పడవపై శుక్రవారం యెమెన్‌లో జరిగిన కాల్పుల్లో 40 మంది చనిపోయారు.
సిరియాలో దాడుల్లో 46 మంది మృతి
Published Sat, Mar 18 2017 4:59 AM | Last Updated on Tue, Sep 5 2017 6:21 AM
Advertisement
Advertisement