Syringe
-
ఒకే సిరంజీ.. హెచ్ఐవీ సోకడంతో బయటకు నెట్టేశారు
లక్నో: ఉత్తర ప్రదేశ్‌లో దారుణం చోటు చేసుకుంది. ప్రభుత్వాసుపత్రిలో ఓ డాక్టర్ పేషెంట్లందరికీ ఒకే సిరంజీతో సూది మందులు ఇవ్వగా.. ఓ బాలికకు హెచ్ఐవీ సోకింది. అయితే బాలికకు హెచ్ఐవీ నిర్ధారణ అయ్యాక సిబ్బంది ఆమెను బలవంతంగా ఆస్పత్రి నుంచి బయటకు పంపేయడంతో ఈ వ్యవహారం మరింత ముదిరింది. బాధిత తల్లిదండ్రుల కథనం ప్రకారం.. యూపీ ఎటాహ్ జిల్లా రాణి అవంతి బాయి లోధా గవర్నమెంట్ మెడికల్ కాలేజీ ఆస్పత్రిలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఫిబ్రవరి 20వ తేదీన బాలికను తల్లిదండ్రులు ఆస్పత్రిలో చేర్పించారు. ఆమెను పరీక్షించిన డాక్టర్ అప్పటికే కొందరు షేషంట్లకు వాడిన సిరంజీతో ఇంజెక్షన్ చేశాడు. ఆ సమయంలో పేరెంట్స్ అభ్యంతరం వ్యక్తం చేసినా.. సిబ్బంది పట్టించుకోకుండా ఇంజెక్షన్ వేశాడు. ఆ తర్వాత అదే సిరంజీని మరికొందరికి వాడాడు కూడా. ఆపై కొన్నిరోజులకు చిన్నారికి రక్త పరీక్షల్లో హెచ్‌ఐవీగా తేలింది. దీంతో రాత్రికి రాత్రే ఆస్పత్రి సిబ్బంది ఆ బాలికను బయటకు బలవంతంగా పంపించేశారు. ఈ ఘటనపై శనివారం ఆమె తల్లిదండ్రులు జిల్లా న్యాయాధికారి(కలెక్టర్) అంకిత్ కుమార్ అగర్వాల్‌ను కలిసి ఫిర్యాదు చేశారు. మరోవైపు విషయం వార్తల్లోకి ఎక్కడంతో ప్రభుత్వం స్పందించింది. డిప్యూటీ సీఎం బ్రజేష్ పాథక్ స్పందిస్తూ.. ఘటనపై సమగ్ర వివరణ కోరామని, డాక్టర్‌ది తప్పు ఉందని తేలితే కఠిన చర్యలు తప్పవని స్పష్టం చేశారు. మరోవైపు ప్రతిపక్షాల బాధిత కుటుంబానికి పరిహారం చెల్లించాలని డిమాండ్ చేస్తున్నాయి. मेडिकल कॉलेज,एटा में चिकित्सक द्वारा एक ही सिरिंज से कई मरीजों को इंजेक्शन लगाए जाने एवं एक बच्चे की जाँच रिपोर्ट एचआईवी पॉजिटिव मिलने संबंधी प्रकरण का तत्काल संज्ञान लेते हुए मेरे द्वारा प्रधानाचार्य,स्वशासी राजकीय मेडिकल कॉलेज एटा से उक्त संबंध में स्पष्टीकरण मांगा गया है (1/2) — Brajesh Pathak (@brajeshpathakup) March 4, 2023 -
హైదరాబాద్‌ను ఆగం చేస్తున్న బయో వ్యర్థాలు.. రోగాల కుంపటిగా..!
సూదిమందు.. వాడిపడేసిన కాటన్.. టానిక్ సీసా.. ఇతరత్రా ఆస్పత్రి వ్యర్థాలు మహానగరాన్ని ముంచెత్తుతున్నాయి. వాటిలోని బ్యాక్టీరియా, వైరస్లు వాతావరణంలో కలిసి నగరాన్ని రోగాల కుంపటిగా మారుస్తున్నాయి. ఇప్పటికీ అనేక ఆస్పత్రులు తమ వ్యర్థాలను ఆరు బయట తగులబెడుతుండడంతో అనేక మంది అంటురోగాల బారిన పడుతున్నారు. అత్యాధునిక వైద్యానికి, అనేక అరుదైన చికిత్సలతో మెడికల్ హబ్‌గా గుర్తింపు పొందిన గ్రేటర్‌ను ప్రస్తుతం ఆస్పత్రి వ్యర్థాలు దడ పుట్టిస్తుండటంపై సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది. తాజాగా గ్రేటర్ జిల్లాల పరిధిలోని ప్రైవేటు ఆస్పత్రుల్లో వైద్యారోగ్య శాఖ అధికారులు నిర్వహించిన తనిఖీల్లో విస్తుపోయే అంశాలు వెలుగుచూశాయి. మెజారిటీ క్లినిక్‌లు, నర్సింగ్ హోమ్‌లకు పీసీబీ అనుమతులు, జీవ వ్యర్థాల నిర్వహణ సర్టిఫికెట్లు లేకపోవడం గమనార్హం. సాక్షి, హైదరాబాద్: గ్రేటర్ పరిధిలోని మూడు జిల్లాల్లో ఉన్న 3,919 ఆస్పత్రుల్లో 60 వేలకుపైగా పడకలు ఉన్నట్లు అంచనా. ఒక్కో పడక నుంచి సగటున రోజుకు 300 నుంచి 400 గ్రాముల వరకు జీవవ్యర్థాలు వెలువడుతున్నట్లు పీసీబీ లెక్కవేసింది. గ్రేటర్ నుంచి నిత్యం 35 టన్నులు, శివారు పురపాలికల నుంచి మరో 15 టన్నుల వరకు ఆస్పత్రి వ్యర్థాలు వెలువడుతున్నట్లు అంచనా వేసింది. ఈ వ్యర్థాలను కార్పొరేట్ ఆస్పత్రులు మినహా ఇతర ఆస్పత్రులు శాస్త్రీయ పద్ధతిలో కాకుండా సాధారణ చెత్తతో పాటే పడవేస్తుండడంతో బ్యాక్టీరియా, వైరస్లు గాలిలో కలిసి వివిధ రకాల వ్యాధులకు కారణమవుతున్నట్లు వైద్య నిపుణులు అభిప్రాయపడుతున్నారు. సాధారణ చెత్తతోనే వ్యర్థాలు ఆస్పత్రి వ్యర్థాల నిర్వహణ చట్టం– 1998 ప్రకారం ఆస్పత్రుల్లో రోజువారీ ఉత్పత్తయ్యే చెత్తను వేర్వేరు రంగుల డబ్బాల్లో నింపాలి. 48 గంటలకు మించి ఆస్పత్రుల్లో నిల్వ ఉంచరాదు. వీటిని శాస్త్రీయ పద్ధతిలో రీసైక్లింగ్ చేసేందుకు ప్రత్యేకంగా నెలకొల్పిన కేంద్రాలకు తరలించాలి. రవాణాలోనూ జాగ్రత్తలు తీసుకోవాలి. ఆచరణలో ఈ నిబంధనలు అమలు కావడంలేదు. గాందీ, ఉస్మానియా, కోఠి ప్రసూతి ఆస్పత్రి, నిమ్స్ సహా పలు ఆస్పత్రుల యాజమాన్యాలు సాధారణ చెత్తతో పాటే ఆస్పత్రి వ్యర్థాలను గుట్టలుగా పోగుచేసి తగులబెడుతుండడంతో వాతావరణం కలుషితమవుతోంది. ఈ పొగ పీల్చుకున్న వారిలో 20 శాతం మంది అస్వస్థతకు గురవుతున్నారు. విదేశాల్లో ఇలా.. అమెరికా, ఆ్రస్టేలియా, ఇంగ్లాడ్ తదితర విదేశాల్లో ఆస్పత్రి వ్యర్థాలను పర్యావరణానికి హాని కలగకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. జీవ వ్యర్థాల వల్ల ఉత్పన్నమయ్యే ప్రమాదకర రసాయనాలు, ఇతర ఉద్గారాలు గాలిలో కలువకుండా ఎప్పటికప్పుడు దహనం చేస్తున్నారు. వ్యర్థాలను వేర్వేరు డబ్బాల్లో నింపి వాటిని నిర్వహణ కేంద్రాలకు జాగ్రత్తగా తరలిస్తున్నారు. అక్కడ ఆటో క్లీనింగ్, మైక్రోవేవింగ్, కెమికల్ ట్రీట్ మెంట్ నిర్వహించి వ్యర్థాల్లో బ్యాక్టీరియా, వైరస్ వంటి సూక్ష్మజీవులు లేకుండా చేస్తున్నారు. ఆ తర్వాత భూమిపై పెద్ద గుంత తీసి వాటిలో పూడుస్తున్నారు. ప్రస్తుతం మన కార్పొరేట్ ఆస్పత్రులు ఈ విధానాన్ని సొంతంగా అమలు చేస్తుండగా..మిగతావారు ఈ అంశాన్ని పట్టించుకోకపోవడంతోనే అనర్థాలు తలెత్తుతున్నట్లు పర్యావరణ నిపుణులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. వ్యర్థాలతో అనర్థాలివే: హెచ్ఐవీ రోగులు వాడిపడేసిన సూదులు, బ్లేడులు ఆరుబయట పడేయడంతో ఇవి ఇతరులకు గుచ్చుకున్నప్పుడు వారికి ఆయా రోగాలు సోకే ప్రమాదం ఉంది. హెపటైటిస్ బి వంటి రోగాలు ప్రబలుతాయి. చీము తుడిచిన కాటన్‌ను వథాగా పడవేస్తుండడంతో అందులోని ఫంగస్ ఇతరులకు వ్యాపిస్తుంది. ఆస్పత్రి వ్యర్థాల్లోని బ్యాక్టీరియా, వైరస్ ఇతరులకు త్వరగా వ్యాపించి జీర్ణకోశ, శ్వాసకోశ, చర్మ వ్యాధులు ప్రబలుతాయి. ప్రజారోగ్యానికి పెద్ద ముప్పు రోగుల రక్తంతో తడిసిన దుప్పట్లు, సర్జికల్ డ్రెస్సులు నగరంలోని శివారు చెరువుల్లో శుభ్రం చేస్తుండటంతో చెరువుల్లోని నీరు కలుషితమవుతోంది. వాతావరణ కాలుష్యానికి కారణమవుతూ ప్రజారోగ్యాన్ని దెబ్బతీస్తున్న ఆస్పత్రులను గుర్తించి, చర్యలు తీసుకున్న దాఖలాలు కూడా లేకపోవడంతో పలు ప్రైవేటు ఆస్పత్రులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నాయి. గతంలో ఇదే అంశంపై ప్రభుత్వానికి, గవర్నర్‌కు ఫిర్యాదు చేశాం. అయినా జీవ వ్యర్థాల నిర్వహణ విషయంలో మార్పు కనిపించడం లేదు. – ఎం.పద్మనాభరెడ్డి, కార్యదర్శి, ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ (చదవండి: మద్యం ‘మత్తు’లో ఎవరెవరు?) -
టీకా కలకలం: ఒకే సిరంజీతో 30 మందికి వ్యాక్సినేషన్.. ఆ తర్వాత..
Vaccinated 30 Students With One Syringe.. కరోనా కట్టడిలో భాగంగా దేశంలో వ్యాక్సినేషన్ ప్రక్రియ ముమ్మరంగా సాగుతున్న విషయం తెలిసిందే. ప్రపంచవ్యాప్తంగా వ్యాక్సినేషన్లో భారత్ రికార్డు స్థాయిలో 200కోట్ల డోసులకుపైగా టీకాలను అందించింది. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ సైతం భారతీయులపై ప్రశంసలు కురిపించారు. ఇదిలా ఉండగా.. మధ్యప్రదేశ్‌లో ఓ దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. వ్యాక్సినేషన్ కేంద్రంలో జితేంద్ర అనే వ్యాక్సినేటర్ ఒకే సిరంజీతో 30 మంది విద్యార్థులకు టీకా ఇవ్వడం కలకలం సృష్టించింది. అయితే, దీనికి ఆయన చెప్పిన సమాధానం విన్న స్థానికులు అవాక్కయ్యారు. తన పై అధికారులు ఆదేశాల మేరకే తాను ఇలా చేసినట్టు స్పష్టం చేశారు. వివరాల ప్రకారం..సాగర్ జిల్లాలోని జైన్ పబ్లిక్ హయ్యర్ సెకండరీ స్కూల్లో విద్యార్థులకు జితేంద్ర అనే వ్యాక్సినేటర్ ఒకే సిరంజీతో 30 మందికి టీకా వేశాడు. అది గమనించిన విద్యార్థులు పేరెంట్స్ ఇదేంటని ప్రశ్నిస్తే.. తమ పై అధికారులు ఒకే సిరంజీ పంపించారని, ఆ ఒక్క సిరంజీతోనే విద్యార్థులందరికీ టీకా వేయాలని ఆదేశించారని వెల్లడించారు. ఈ క్రమంలో ఇలా టీకా వేయడంలో తప్పు ఏముంది అంటూ వ్యాఖ్యలు చేయడం అక్కడున్న వారిని ఆగ్రహానికి గురి చేసింది. దీంతో, పిల్లల పేరెంట్స్ అతడిపై దాడి చేసినంత పనిచేశారు. Shocking violation of “One needle, one syringe, only one time” protocol in #COVID19 #vaccination, in Sagar a vaccinator vaccinated 30 school children with a single syringe at Jain Public Higher Secondary School @ndtv @ndtvindia pic.twitter.com/d6xekYQSfX — Anurag Dwary (@Anurag_Dwary) July 27, 2022 ఈ విషయం.. జిల్లా ఇమ్యునైజేషన్ అధికారి డాక్టర్ రాకేశ్ రోషన్ దృష్టికి చేరడంతో ఆయన చర్యలు తీసుకునేందుకు సిద్ధమయ్యారు. జితేంద్ర.. వన్ నీడిల్, వన్ సిరంజీ, వన్ టైమ్ అనే కేంద్ర ప్రభుత్వ విధానాన్ని ఉల్లఘించారని తెలిపారు. అందుకే జితేంద్రపై ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్టు వెల్లడించారు. కాగా, జిల్లా కలెక్టర్ క్షితిజ్ సింఘాల్ స్పందిస్తూ.. జితేంద్రను వెంటనే అరెస్ట్ చేయాలని పోలీసులకు సూచించారు. ఇది కూడా చదవండి: ‘నేను ఏం చేస్తానో తెలుసా?’ ఎంపీ కూతురి సమాధానంతో.. -
న్యాయవాది వింత ప్రవర్తన..రక్తాన్ని ఇంజెక్ట్ చేసి, సిరంజీలతో దాడి చేసి..చివరికి
Lawyer Accused of Injecting Blood Into Food: కొంతమంది పైశాచికంగా ఎదుటవాళ్ల మీద కోపంతోనూ లేదా ద్వేషంతోనూ వికృతమైన పనులకు ఒడిగడుతుంటారు. అలాంటి పలు ఘటనలు గురించి విన్నాం కూడా. అచ్చం అలానే ఇక్కడొక వ్యక్తి దారుణమైన దుశ్చర్యకు ఒడిగట్టాడు. అది కూడా ఎలా చేస్తున్నాడో వింటే కచ్చితంగా షాక్ అవుతారు. అసలు విషయంలోకెళ్తే...లండన్‌లోని వ్యక్తి సూపర్ మార్కెట్లోని ఆహార పదార్థాల్లోకి తన రక్తాన్ని ఇంజెక్ట్ చేశాడు. అలా ఒకటి రెండు కాదు ఏకంగా మూడు సూపర్ మార్కెట్లలోని ఆహార పదార్థాల్లోకి రక్తాన్ని ఇంజెక్ట్ చేశాడు. ఈ మేరకు అతను చేస్తున్న పని సీసీటీవీలో రికార్డు అయ్యింది. దీంతో సదరు షాపు వాళ్లు కస్టమర్లను పంపించేసి ఆహార పదార్థాలన్నింటిని పడేశారు. అంతేకాదు అతన్ని పట్టుకోవడానికి ప్రయత్నించిన సెక్యూరిటీ గార్డుని నెట్టడం సిరంజీలు విసరడం వంటివి చేశాడు. పోలీసులు ఈ ఘటనల్లో సుమారు 21 సిరంజీలను స్వాధీనం చేసుకున్నారు. అయితే నిందుతుడు లియోయాయ్ ఎల్‌గరీబ్‌గా గుర్తించారు. అతను స్వంతంగా లీగల్ కన్సల్టెన్సీని కూడా ఉంది. అయితే సూపర్ మార్కెట్లన్నీ సుమారు రూ.5 కోట్ల నష్టాన్ని చవిచూశాయి. ఈ మేరకు పోలీసులో ప్రతి సీసీ ఫుటేజ్‌ని పరీక్షించి చూడాగా ..ఆపిల్లు, చికెన్ టిక్కా ఫిల్లెట్‌ల ప్యాకెట్లకు అతను రక్తాన్ని ఇంజెక్ట్ చేసినట్లు తెలిసింది. అంతేకాదు విచారణలో అవన్నీ 37 ఏళ్ల క్రితం నాటి ఆహారంగా చూపించడంతో పోలీసులు ఆశ్చర్యపోయారు. పైగా ఆ సీసీ ఫుటేజ్‌లో అతను ఒక బకెట్లో హైపోడెర్మిక్ సూదులను మోస్తున్నట్లు కూడా కనిపించిందన్నారు. కానీ నిందుతుడు లియోయాయ్ ఎల్‌గరీబ్ మాత్రం వింతగా ప్రవర్తిస్తున్నాడు. ఈ క్రమంలో ఈ రోజు లండన్‌లోని ఐల్వర్త్ క్రౌన్ కోర్టు ఆ వింత కేసును విచారించింది. అయితే నిందుతుడి తరుఫు న్యాయవాదులు మాత్రం అతని పిచ్చివాడని, మానసిక పరిస్థితి బాగోలేదని చెబుతున్నారు. మరోవైపు సైక్రియార్టిస్ట్ డాక్టర్లు కూడా అతని మానసిక పరిస్థితి గందరగోళంగా ఉందని కాబట్టి అతను ఉద్దేశపూర్వకంగా చేసిన నేరంగా భావించలేకపోతున్నాం అని చెప్పారు. దీంతో లండన్ కోర్టు అతను ఈ నేరం చేసినప్పుడూ అతని మానసిక పరిస్థితి ఎలా ఉందో విచారించమని ఆదేశించడం గమనార్హం. (చదవండి: మంచు పర్వత అధిరోహణ.. దూసుకొచ్చిన హిమపాతం!) -
Omicron Variant: సిరంజీలకు కొరత..!
కరోనా రెండోవేవ్‌లో వ్యాక్సిన్ల కొరతతో రాష్ట్రాలు హాహాకారాలు చేశాయి. టీకాలు పంపండి మహాప్రభో అంటూ కేంద్రానికి మొరపెట్టుకున్నాయి. ఉత్పత్తి పెరిగి ఇప్పుడు సమృద్ధిగా టీకా డోసులు అందుబాటులోకి వచ్చేశాయని స్థిమిత పడుతుంటే మరో సమస్య వచ్చిపడింది. ఒమిక్రాన్ వేరియెంట్, జనవరి– ఫిబ్రవరి నెలల్లో థర్డ్‌వేవ్ పీక్స్‌కు చేరొచ్చనే వార్తలనేపథ్యంలో సిరంజీలకు తీవ్ర కొరత రానుంది. కోవిడ్ వ్యాక్సినేషన్‌పై ప్రతికూల ప్రభావం పడే అవకాశముంది. ఏం జరిగింది? మూలిగే నక్కపై తాటిపండు ప్రపంచంలోనే అతిపెద్ద సిరంజీ ఉత్పత్తి సంస్థ హిందుస్థాన్ సిరంజీస్ అండ్ మెడికల్ డివైసెస్ (హెచ్ఎండీ) సంస్థకు హరియాణాలోని ఫరీదాబాద్ (నేషనల్ క్యాపిటల్ రీజియన్–ఎస్సీఆర్ పరిధిలోకి వస్తుంది) శివార్లలో ఎనిమిది ఆటోమేటెడ్ ప్లాంట్లు ఉన్నాయి. కాలుష్య నియంత్రణ ప్రమాణాలు పాటించట్లేదు కాబట్టి ఇందులో ప్రధాన ప్లాంట్‌తో సహా మూడింటిని మూసివేయాల్సిందిగా హరియాణా పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఆదేశించింది. లేదంటే చట్టపరమైన చర్యలు చేపడతామని, ప్లాంట్లను సీల్ చేస్తామని హెచ్చరించింది. డీజిల్ జనరేటర్లతో ప్లాంట్లను నడుపుతున్నారని, ఇది కాలుష్యానికి కారణమవుతోందనేది పీసీబీ ఆక్షేపణ. విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిగినపుడే తప్పితే తాము పెద్దగా డీజిల్ జనరేటర్లు ఉపయోగించట్లేదని పీసీబీకి వివరించినా... వారిని ఒప్పించలేకపోయామని హెచ్ఎండీ పేర్కొంది. దాంతో వీటిని హెచ్ఎండీ మూసివేసింది. ♦భారత్ అవసరాల్లో మూడింట రెండొంతులు హెచ్ఎండీయే తీరుస్తోంది. ♦ఏడాదికి హెచ్ఎండీ ఉత్పత్తి సామర్థ్యం. భారత్‌లో 20 పైచిలుకు సిరంజీ ఉత్పత్తి సంస్థలు ఉండగా... వీటి ఉమ్మడి ఉత్పత్తి సామర్థ్యం నెలకు 50 కోట్లు. అంటే ఏడాదికి 600 కోట్లు. ఇందులో హెచ్ఎండీ ఒక్కటే 450 కోట్లు ఉత్పత్తి చేస్తోందంటే... దాంట్లో ఉత్పత్తి నిలిచిపోతే ఎదురయ్యే కొరతను అంచనా వేయవచ్చు. ♦ ప్రతిరోజూ ఈ సంస్థ ఉత్పత్తి చేసే సిరంజీల సంఖ్య 1.2 కోట్ల పైచిలుకే ♦మూడు ప్లాంట్ల మూసివేత కారణంగా రోజులు 80 లక్షల సిరంజీలు, 1.5 కోట్ల నీడిల్స్ ఉత్పత్తి నిలిచిపోతుందని హెచ్ఎండీ మేనేజింగ్ డైరెక్టర్ రాజీవ్‌నాథ్ తెలిపారు. ఈ లెక్కన కంపెనీ ఉత్పత్తిలో నెలకు 24 కోట్లు, ఏడాది 288 కోట్లు కోత పడుతుంది. దీంతో భారత్‌లో సిరంజీలకు తీవ్ర కొరత ఏర్పడే ప్రమాదముంది. ఫలితంగా కోవిడ్ వ్యాకినేషన్ కార్యక్రమానికి తీవ్ర విఘాతం కలిగే ఆస్కారం ఉంది. ♦ భారత్‌లో ప్రతి వ్యక్తికి సగటున ఏడాదికి 2.9 సిరంజీల వాడకం జరుగుతున్నట్లు 2018 లెక్కలు చెబుతున్నాయి. దీని ప్రకారం 350–400 కోట్ల సిరంజీలు ఏడాదికి మన వినియోగానికి కావాలి. ♦తమ గోదాముల్లో రెండురోజులకు సరిపడా నిల్వలు మాత్రమే ఉన్నాయని, సోమవారం నుంచి దేశీయ అవసరాలకు సరఫరా చేసే స్టాక్‌లో భారీగా కోత పడుతుందని హెచ్ఎండీ తెలిపింది. ఎగుమతులపై నిషేధం పరిస్థితి తీవ్రతను గ్రహించిన కేంద్ర ప్రభుత్వం ఈ ఏడాది అక్టోబరు 9న సిరంజీల ఎగుమతులపై 3 నెలల నిషేధం విధించింది. 0.5 మిల్లీలీటర్లు, 1, 2, 3 ఎంఎల్ సిరంజీల ఎగుమతిని నిషేధించింది. కోవిడ్ వ్యాక్సిన్ డోసు 0.5 ఎంఎల్ మాత్రమే. వృ«థాను అరికట్టాలంటే 0.5–1 ఎంఎల్ సిరంజీల వాడకం ఉత్తమం. 143 కోట్లు: 2020–21 ఆర్థిక సంవత్సరంలో భారత కంపెనీలు విదేశాలకు ఎగుమతి చేసిన సిరంజీల సంఖ్య. అమెరికా, చైనాలే ప్రపంచంలో రెండు అతిపెద్ద ఎగుమతుదారుల. ప్రపంచ సిరంజీల విపణిలో మన వాటా స్వల్పమే. తేడా ఏంటి? ఆటో డిజేబుల్ సిరంజీలను ఒకసారి ఉపయోగిస్తే... ఇందులోని సేఫ్టీ లాక్ బ్రేక్ అవుతుంది. సిరంజీలో వ్యాక్సిన్‌ను నింపాక సూది ఇవ్వడానికి పైనుంచి బొటనవేలితో నొక్కుతాం. రెండోసారి నొక్కేందుకు వీలులేని సిరంజీలు ఆటో డిసేబుల్‌లో మరోరకం. పునర్వినియోగానికి పనికిరావు. సంప్రదాయ డిస్పోజబుల్ సిరంజీలు అయితే... వాడిన వెంటనే నీడిల్ (సూది)ని కట్ చేసేసి నిర్దేశించిన చెత్తబుట్టలో పారవేయాలి. అలాకాకుండా మళ్లీ వినియోగిస్తే ఇన్ఫెక్షన్లు ఒకరినుంచి మరొకరికి సంక్రమించే ప్రమాదం ఉంటుంది. జాతీయ విపత్తు నిర్వహణ చట్టం (ఎన్డీఎంఏ) కింద సిరంజీలను అత్యావశ్యక వైద్య పరికరాలుగా ప్రకటించాలని (కోవిడ్–19 వ్యాక్సినేషన్ దృష్ట్యా) కోరుతూ హెచ్ఎండీ ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ ద్వారా విజ్ఞప్తి చేసింది. తమ ప్లాంట్లలో ఎలాంటి అంతరాయాలు లేకుండా ఉత్పత్తి జరిగేలా చూడాలని కోరింది. -
బీరు బాటిల్లో సిరంజి
సాక్షి, కుషాయిగూడ(హైదరాబాద్): కాప్రాలోని ఓ బార్ కు వెళ్లి ఓ వ్యక్తి బీరు ఆర్డర్ చేశాడు. బేరర్ బీరు తీసుకొచ్చి ఓపెన్ చేసి ఆ వ్యక్తి ముందు పెట్టారు. బీరు తాగుతున్న వ్యక్తికి నోటిలో ఏదో తగిలినట్లు అనిపించింది. వెంటనే తేరుకొని చూడగా బీరు బాటిల్లో సిరంజిని చూసి కంగు తిన్నా డు. ఇదేమిటని బార్ నిర్వాహకులను నిలదీసి కుషాయిగూడ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. సోమవారం రాత్రి మహాంకాళి బార్లో చోటు చేసుకున్న ఈ సంఘటన మంగళవారం వెలుగులోకి వచ్చింది. -
ఐదో తరగతి పాసైన ఎమ్మెల్యే కరోనా రోగులకు వైద్యం
అహ్మదాబాద్: మహమ్మారి కరోనా వైరస్ బారినపడిన వారికి వైద్య సేవలు అంతంత మాత్రాన అందుతున్నాయి. వారి సేవలకు అడ్డంకిగా ప్రజాప్రతినిధులు మారారు. తరచూ పర్యటనలు చేస్తుండడంతో కొంత వైరస్ బాధితులకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. తాజాగా ఓ ఎమ్మెల్యే చేసిన పని తీవ్ర విమర్శలకు దారి తీస్తోంది. ఆ విమర్శలను ఆ ఎమ్మెల్యే సమర్ధించుకుని వివరణ ఇచ్చుకున్నారు. ఆయన చదివింది ఐదో తరగతి కావడం గమనార్హం. వివరాలు ఇలా ఉన్నాయి. గుజరాత్‌లోని కమ్రేజ్ నియోజకవర్గ బీజేపీ ఎమ్మెల్యే వీడీ జలవడియా. ఆయన చదివింది ఐదో తరగతి వరకే. అయితే ఆదివారం సర్తన ప్రాంతంలోని కరోనా కేంద్రాన్ని ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా బాధితులతో మాట్లాడారు. అక్కడ ఆయన వైద్యుడి రూపమెత్తారు. ఈ క్రమంలో రెమిడిసివర్ వ్యాక్సిన్ తీసుకుని సిరంజీలో ఎక్కించేందుకు కష్టపడ్డాడు. అనంతరం ఆ సిరంజీని చికిత్స పొందుతున్న కరోనా బాధితుడి గ్లూకోజ్ బాటిల్లో గుచ్చారు. ఇది చేసేందుకు కొంత ఇబ్బందులు పడ్డారు. ఈ విధంగా ఆయన కరోనా బాధితుల సహాయార్థం కష్టపడుతున్నారని ఆయన అనుచరులు, బీజేపీ నాయకులు ఆ వీడియోను సోషల్ మీడియాలో పంచుకున్నారు. ఈ వీడియో వైరల్‌గా మారింది. ఐదో తరగతి చదివిన ఎమ్మెల్యే వైద్యుడి అవతారమెత్తారంటారంటూ కామెంట్లు వస్తున్నాయి. దీనిపై కాంగ్రెస్ పార్టీ మండిపడింది. ‘వైద్య శాఖ మంత్రి ఆ ఎమ్మెల్యేను ఆదర్శంగా తీసుకోవాలి. బీజేపీ కార్యకర్తలకు అందరికీ కరోనా వైద్యం నేర్పించండి. జలవడియా ఆధ్వర్యంలో ఆ ఆ చికిత్స విధానంపై శిక్షణ ఇవ్వండి’ అని కాంగ్రెస్ అధికార ప్రతినిధి జైరాజ్‌సిన్హ్ పర్మర్ తెలిపారు. మంచి పనులను కూడా విమర్శించడం కాంగ్రెస్‌కు అలవాటు అని ఆ ఎమ్మెల్యే కొట్టిపారేశారు. ‘40 రోజులుగా 10-15 వైద్యులతో ఉంటున్నా. 200 మంది కరోనా బాధితులను రక్షించా. కరోనా బాధితులకు బీజేపీ నాయకులు కూడా సహాయం చేస్తున్నారు’ అని ఎమ్మెల్యే జలవడియా వివరణ ఇచ్చారు. -
వైద్యుడి నిర్లక్ష్యం.. 400 మందికి హెచ్ఐవీ
ఇస్లామాబాద్ : ఆస్పత్రి ప్రాంగంణంలో ఉన్న ఆ తల్లిదండ్రుల మొహాల్లో ఆందోళన కొట్టొచ్చినట్లు కనిపిస్తుంది. తమ చిన్నారుల గురించి ఎలాంటి చెడు వార్త వినాల్సి వస్తుందో తెలీక వారంతా ప్రాణాలు అర చేతిలో పెట్టుకుని కూర్చున్నారు. రిపోర్ట్స్ నెగిటీవ్ అని వస్తే బాగుండు అని దేవుడిని వేడుకుంటున్నారు. కానీ వారు కోరుకున్నట్లు జరగడం లేదు. పరీక్షలు చేసిన ప్రతి ఒక్కరిలో మహామ్మరి లక్షణాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే దాదాపు 400 మందిలో హెచ్ఐవీ వైరస్ లక్షణాలు కనిపించగా.. వారిలో ఎక్కువ మంది చిన్నారులే కావడం ప్రతి ఒక్కరిని కలచి వేస్తుంది. కలుషిత సిరంజి వాడి.. వందలాది మంది చిన్నారులను ప్రాణాంతక హెచ్ఐవీ వ్యాధి బారిన పడేలా చేసిన ఈ సంఘటన పాకిస్తాన్లో తీవ్ర కలకలం రేపిన సంగతి తెలిసిందే. లర్కానా జిల్లాలోని రటోడెరో ప్రభుత్వ ఆస్పత్రిలో విధులు నిర్వహిస్తున్న డాక్టర్ ముజఫర్ గంగర్ ఈ దారుణానికి ఒడిగట్టాడు. స్వయంగా అతను కూడా హెచ్ఐవీ బాధితుడు కావడం గమనార్హం. ఈ వైద్యుడి వద్ద వద్ద చికిత్స తీసుకున్న వారంతా ఈ వైరస్ బారిన పడ్డట్లు అధికారులు గుర్తించారు. ఇప్పటికే దాదాపు 400 మందిలో ఈ వైరస్ లక్షణాలు బయటపడ్డాయని.. వారిలో అధికులు చిన్న పిల్లలే అని అధికారులు తెలిపారు. మరి కొంత మందికి ప్రస్తుతం వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నామని.. బాధితుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందన్నారు. అభం శుభం తెలియని తమ చిన్నారులకు ఈ ప్రాణాంతక వ్యాధి సోకడంతో వారి తల్లిదండ్రుల ఆందోళనలు మిన్నంటుతున్నాయి. ఇక తమ పిల్లలు సాధరణ జీవితాన్ని ఎలా గడుపుతారు.. సమాజం వారిని ఎలా చూస్తుంది అని వాపోతున్నారు. తమ పిల్లలను ఆదుకోవాలని.. వారికి మెరుగైన వైద్యం అందించేందుకు దాతలు ముందుకు రావాలని కోరుతున్నారు. తమ ప్లిలలకు ఈ పరిస్థితి కల్పించిన డాక్టర్‌కు మరణ శిక్ష విధించాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ విషయం గురించి అధికారులు మాట్లాడుతూ.. హైచ్ఐవీ కేసుల్లో పాకిస్తాన్ ఆసియాలోనే రెండో స్థానంలో ఉంది. 2017 ఒక్క సంవత్సరంలోనే దేశ వ్యాప్తంగా దాదాపు 20 వేల కొత్త కేసులు నమోదయ్యాయి. నకిలీ వైద్యులు, పేదరికం వంటివి కూడా ఈ వైరస్ వ్యాప్తికి ప్రధాన కారణాలు అవుతున్నాయి. డబ్బు మిగులుతుందనే ఉద్దేశంతో.. వైద్యులు ఒకే సిరంజిని అనేక మందికి వినియోగిస్తున్నారు. ఇక ఇంతటి దారుణానికి కారణమైన వైద్యుడు ప్రస్తుతం రటోడెరోకు సమీపంలోని ఓ జైలులో ఉన్నాడు. ఈ విషయం గురించి అతను ‘నాకు హెచ్ఐవీ ఉన్న సంగతి తెలియదు. కావాలనే కలుషిత సిరంజి వాడానని చేస్తోన్న ఆరోపణలు కూడా అవాస్తవం’ అని కొట్టి పారేస్తున్నాడు. ఈ దారుణంపై విచారణ చేస్తున్నట్లు సింధ్ ఎయిడ్స్ కంట్రోల్ ప్రొగ్రామ్ ఇంచార్జ్ డా. సికందర్ మెమన్ తెలిపారు. -
పెరిగిన హెచ్ఐవీ పేషెంట్లు.. డాక్టర్ అరెస్ట్
కరాచీ : పాకిస్తాన్‌లోని సింధ్ ప్రావిన్స్‌లో హెచ్ఐవీ వ్యాధిని వ్యాప్తి చేస్తున్న డా. ముజఫర్ గంగర్ను పోలీసులు అరెస్ట్ చేశారు. లర్కానా జిల్లాలోని రటోడెరోలో ప్రభుత్వ ఆసుపత్రిలో ముజఫర్ గంగర్ విధులు నిర్వహిస్తున్నారు. అతడికి కూడా హెచ్ఐవీ ఉన్నట్టు గుర్తించారు. లర్కానా నగర సమీప ప్రాంతాల్లో హెచ్ఐవీ బాధితుల సంఖ్య ఒక్కసారిగా పెరగడంతో వైద్యఅధికారులు అలర్ట్‌ను ప్రకటించారు. వైద్య పరీక్షలకు ఆదేశించగా చిన్నపిల్లలు కూడా ఎక్కువగా హెచ్ఐవీ భారిన పడ్డట్లుగా గుర్తించారు. విచారణ సందర్భంగా ఓ వైద్యుడి వద్ద చికిత్స తీసుకున్న వారంతా ఈ వైరస్ బారిన పడ్డట్లు అధికారులు గుర్తించారు. సదరు వైద్యుడు కలుషిత సిరంజీలు వాడటం వల్లే వ్యాధి వ్యాప్తికి కారకుడయ్యాడని పేర్కొన్నారు. కలుషిత సిరంజి వాడటం వల్ల 90 మంది వ్యక్తులు హెచ్ఐవీ బారిన పడినట్టు తెలుస్తోంది. వీరిలో 65 మంది పిల్లలు ఉన్నారు. అయితే ఈ ఘటనకకు తనకు ఎలాంటి సంబంధం లేదని డా. ముజఫర్ గంగర్ తెలిపారు. తనకు హెచ్ఐవీ సోకిన విషయం కూడా తెలియదని చెప్పారు. దీనిపై పూర్తి స్థాయిలో విచారణ చేయనున్నట్టు సింధ్‌లో ఎయిడ్స్ కంట్రోల్ ప్రోగ్రామ్ ఇంచార్జ్ డా. సికందర్ మెమన్ తెలిపారు. -
క్రీడా గ్రామంలో సిరంజీల కలకలం
గోల్డ్‌కోస్ట్: కామన్వెల్త్ గేమ్స్ క్రీడా గ్రామంలో సిరంజీలు బయటపడటం కలకలం రేపింది. భారత ఆటగాళ్లు బస చేసిన భవనం సమీపాన ఈ సంఘటన జరిగింది. వెంటనే ఈ విషయాన్ని సిబ్బంది తనకు తెలిపారని కామన్వెల్త్ క్రీడల సమాఖ్య (సీజీఎఫ్) చీఫ్ ఎగ్జిక్యూటివ్ డేవిడ్ గ్రివెమ్‌బర్గ్ వెల్లడించారు. అయితే... దీనిని భారత బృందంతో ఉన్న అధికారి తీవ్రంగా పరిగణించి, ఖండించారు. ‘సిరంజీలు మా ఆటగాళ్ల గదుల్లో దొరకలేదు. వివిధ దేశాల క్రీడాకారులంతా ఉన్న భవనం వద్ద లభించాయి. మేమే వాటిని సీజీఎఫ్ వైద్యాధికారులకు అప్పగించాం. తర్వాత వారి నుంచి ఎటువంటి సమాచారం లేదు’ అని ఆయన స్పష్టం చేశారు. ఈ విషయంలో తమను ప్రశ్నించేందుకు, అనుమానించేందుకు అవకాశం లేదని చెప్పారు. కొందరు భారత ఆటగాళ్లకు డోప్ పరీక్షలు చేయనున్నారన్న వార్తలు రాగా... అది క్రీడలకు ముందు సహజంగా జరిగేదేనని, సిరంజీల ఉదంతంతో సంబంధం లేదని పేర్కొన్నారు. మరోవైపు ఈ సంఘటనపై విచారణ జరుగుతోందని గ్రివెమ్‌బర్గ్ తెలిపారు. -
సిరంజీపై 1000% లాభం
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా సిరంజీలు, సూదులు వంటి వైద్య పరికరాలను వేయి శాతానికి పైగా లాభంతో విక్రయిస్తున్నారు. పంపిణీదారుడి మార్జిన్లు మినహాయిస్తే అంతిమంగా భారం మోస్తున్నది వినియోగదారుడే. తయారీదారులు, ఎగుమతిదారుల నుంచి సేకరించిన సమాచారాన్ని విశ్లేషించి, సిరంజీలు, సూదుల లాభాల మార్జిన్లపై జాతీయ ఔషధ ధరల నిర్ధారణ సంస్థ(ఎన్పీపీఏ) ఈ విషయాలను వెలుగులోకి తెచ్చింది. సూదితో కూడిన 5 ఎంఎల్ హైపోడెర్మిక్ డిస్పోజబుల్ సిరంజీ తయారీ ధర రూ. 2.31. కానీ పంపిణీదారుడికి చేరే సరికి దాని ధర రూ. 13.08 (1251శాతం అధికం) అవుతోంది. సూదిలేని 50 ఎంఎల్ హైపోడెర్మిక్ డిస్పోజిబుల్ సిరంజీ ధర పంపిణీదారుడి వద్దకు వచ్చే సరికి రూ.16.96 కాగా, వినియోగదారుడికి అమ్మే గరిష్ట చిల్లర ధర రూ.97గా(సుమారు 1249 శాతం లాభం) ఉంటోంది. సూదితో కలపి 1 ఎంఎల్ ఇన్సులిన్ సిరంజీని తయారీ ధరకంటే 400 శాతం అధిక ధరకు అమ్ముతున్నారు. అలాగే సూది లేని 1 ఎంఎల్ ఇన్సులిన్ సిరంజీని తయారీ ధర కన్నా 287 శాతం అధిక ధరకు విక్రయిస్తున్నారు. డిస్పోజబుల్ సూదిపై గరిష్ట మార్జిన్ 789 శాతంగా ఉంది. సూదుల ఉత్పత్తిదారుల సంఘం అధ్యక్షుడు రాజీవ్‌నాథ్ స్పందిస్తూ.. ‘అధిక మార్జిన్లు నిజమే. ఆయా కంపెనీల మధ్య అనారోగ్య పోటీయే దీనికి కారణం’ అని అన్నారు. -
సిరంజీతో కళ్లలో యాసిడ్ కొట్టి...
పట్నా : యజమాని భార్యతో వివాహేతర సంబంధం నడిపిన ఓ వ్యక్తికి స్థానిక ప్రజలు దారుణమైన శిక్షను విధించారు. వివాహితతో పారిపోయిన ఆ వ్యక్తిని పట్టుకుని కళ్లలో యాసిడ్ పోశారు. దీంతో అతను కంటి చూపును కోల్పోయాడు. బిహార్ పిప్రా చౌక్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్లితే... సమస్తిపూర్ జిల్లా బరౌనీ గ్రామానికి చెందిన వ్యక్తి(30) ఓ రైతు దగ్గర ట్రాక్టర్ డ్రైవర్‌గా విధులు నిర్వహిస్తున్నాడు. ఈ క్రమంలో అతను యజమాని భార్యతోనే వివాహేతర సంబంధం నడిపాడు. ఫిబ్రవరి 6న ఆమెతోపాటు కొంత డబ్బుతో ఉడాయించాడు. దీనిపై ఆ యాజమాని తెగ్రా పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా.. కిడ్నాప్, దొంగతనం కేసులు నమోదు అయ్యాయి. అయితే ఏం జరిగిందో తెలీదుగానీ ఫిబ్రవరి 16న ఆమె స్వచ్ఛందంగా పోలీస్ స్టేషన్‌కు వచ్చి భర్త దగ్గరకు వెళ్తానని చెప్పింది. దీంతో పోలీసులు అనుమానంతో అసలు విషయం ఆరా తీశారు. అదే రోజు ఉదయం పిప్రా చౌక్ వద్ద ఓ హోటల్ వీరిని పట్టుకున్న గ్రామస్థులు దాడికి తెగబడ్డారు. ఆపై సిరంజీతో ఆ యువకుడి కళ్లలో యాసిడ్ కొట్టారు. దాడి అనంతరం హనుమాన్ చౌక్‌లో అతన్ని పడేసి వెళ్లిపోగా.. మహిళను బెదిరించటంతో ఆమె స్టేషన్‌కు వచ్చి భర్త దగ్గరికి వెళ్తానంటూ చెప్పింది. ఇక బాధితుణ్ణి అటుగా వెళ్తున్న ఓ వ్యక్తి గమనించి ఆస్పత్రిలో చేర్పించాడు. బాధితుడి స్టేట్మెంట్ ప్రకారం కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఈ కేసులో ఇప్పటికే ఇద్దరినీ అదుపులోకి తీసుకున్నట్లు తెగ్రా పోలీసులు వెల్లడించారు. -
విశాఖలో సైకో సూదిగాడు
-
బంజారాహిల్స్‌లో సూదిగాడి కలకలం
సిరంజితో చిన్నారిపై దాడి చేసిన సైకో సురేశ్ హైదరాబాద్: బంజారాహిల్స్‌లో సూదిగాడు కలక లం రేపాడు. ఆదివారం ఉదయం ఇంటి ముందు ఆడుకుంటున్న మూడేళ్ల చిన్నారికి సిరంజి గుచ్చి పరారవుతుండగా స్థానికులు అప్రమత్తమై సూదిగాడిని రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకొని పోలీసులకు అప్పగించా రు. బంజారాహిల్స్ రోడ్ నెం. 2లోని ఇందిరానగర్ లో నివసించే పాండురంగారావు, శ్రావణి దంపతుల చిన్నారి గ్రేష్మ కావ్యశ్రీ ఇంటి ముందు ఆడుకుంటోంది. అదే సమయంలో ఓ యువకుడు చేతిలో సూది పట్టుకొని ఆడుకుంటున్న చిన్నారి తొడకు పొడిచి పారిపోయాడు. దీంతో కావ్య కిందపడిపోయింది. పాప ఏడుపు విని లోపలి నుంచి తల్లి శ్రావ ణి, పాండురంగారావు బయటకు రాగా విషయం చెప్పింది. వెంటనే పారిపోతున్న యువకుడిని స్థాని కుల సహకారంతో పట్టుకొని పోలీసులకు అప్పగించారు. పోలీసులు విచారించగా నిందితుడి పేరు జి. సురేశ్‌గా తేలింది. స్థానికంగా నలుగురు స్నేహితులతో కలసి అద్దెగదిలో నివసిస్తూ హిమాయత్‌నగర్‌లోని అవిదా మీడియా సొల్యూషన్స్‌లో ప్రోగ్రాం డెవలపర్‌గా పని చేస్తున్నట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది. పోలీసులు సురేశ్ గదిలో తనిఖీలు చేయగా... ల్యాప్‌టాప్‌తోపాటు కొన్ని మందులు, సిరంజిలు లభించాయి. ఈ ఘటన స్థానికులను దిగ్భ్రాంతికి గురి చేసింది. ఘటనాస్థలానికి బస్తీ యావత్తు తరలి వచ్చి ఆందోళన నిర్వహించింది. పట్టపగలే సూదిగాడు చిన్నారిని సిరంజితో పొడిచి పరారు కావడం స్థానికంగా చర్చనీయాంశమైంది. నిందితుడిని విచారిస్తే మరిన్ని వాస్తవాలు వెలుగు చూసే అవకాశం ఉందని పోలీసులు పేర్కొంటున్నారు. కాగా కావ్యకు నిలోఫర్ ఆస్పత్రిలో వైద్యపరీక్షలు నిర్వహిస్తున్నారు. పాప ఆరోగ్యం నిలకడగా ఉందని కుటుంబసభ్యులు తెలిపారు. -
సూదిగాడి కేసు ముమ్మర దర్యాప్తు
సీసీ కెమెరాల ఫుటేజీలను పరిశీలిస్తున్న పోలీసులు మల్కాజిగిరి: చిన్నారిపై సిరంజితో సైకో దాడి ఘటనపై పోలీసులు ముమ్ముర దర్యాప్తు చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో జరుగుతున్న సిరంజి దాడి ఘటన తెలంగాణలో మొట్టమొదటిసారి మల్కాజిగిరిలో జరిగింది. ఇందిరానెహ్రూనగర్‌కు చెందిన యాదగిరి, లావణ్యల కుమార్తె రమ్య స్థానికంగా ఉన్న పాఠశాలలో 4వ తరగతి చదువుతోంది. శనివారం పాఠశాలకు వెళ్లిన రమ్య టీచర్స్‌డే సందర్భంగా తన టీచర్‌కు బహుమతి కొనడానికి బయటకు వచ్చి తిరిగి పాఠశాలకు వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. స్థానిక ఆస్పత్రిలో రమ్యకు చికిత్స చేయించినఅనంతరం చిన్నారి తల్లి లావణ్య పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కాగా, రమ్యకు గాంధీ ఆస్పత్రిలో రక్త పరీక్షలు చేశారని, వారం రోజుల తర్వాత మళ్లీ రమ్మని వైద్యులు చెప్పారని చిన్నారి తండ్రి యాదగిరి తెలిపాడు. తన కూతురిపై సిరంజితో దాడి చేశారని నమ్ముతున్నామని, పోలీసులు తగిన దర్యాప్తు చేయాలని కోరారు. కాగా, కేసు దర్యాప్తు చేపట్టిన పోలీసులు ఘటనా స్థలానికి కొద్ది దూరంలో ఉన్న బ్యాంక్‌లు, దుకాణాల వద్ద ఉన్న సీసీ కెమెరాల ఫుటేజీలను పరిశీలిస్తున్నారు. చిన్నారి రమ్య ఆరోగ్యంగానే ఉందని, దర్యాప్తు కొనసాగుతోందని ఎస్ఐ మోహన్ తెలిపారు. -
హైదరాబాద్‌లో సైకో సూదిగాడు కలకలం