సీసీ కెమెరాల ఫుటేజీలను పరిశీలిస్తున్న పోలీసులు
మల్కాజిగిరి: చిన్నారిపై సిరంజితో సైకో దాడి ఘటనపై పోలీసులు ముమ్ముర దర్యాప్తు చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో జరుగుతున్న సిరంజి దాడి ఘటన తెలంగాణలో మొట్టమొదటిసారి మల్కాజిగిరిలో జరిగింది. ఇందిరానెహ్రూనగర్‌కు చెందిన యాదగిరి, లావణ్యల కుమార్తె రమ్య స్థానికంగా ఉన్న పాఠశాలలో 4వ తరగతి చదువుతోంది. శనివారం పాఠశాలకు వెళ్లిన రమ్య టీచర్స్‌డే సందర్భంగా తన టీచర్‌కు బహుమతి కొనడానికి బయటకు వచ్చి తిరిగి పాఠశాలకు వెళ్తుండగా ఈ ఘటన జరిగింది.
స్థానిక ఆస్పత్రిలో రమ్యకు చికిత్స చేయించినఅనంతరం చిన్నారి తల్లి లావణ్య పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కాగా, రమ్యకు గాంధీ ఆస్పత్రిలో రక్త పరీక్షలు చేశారని, వారం రోజుల తర్వాత మళ్లీ రమ్మని వైద్యులు చెప్పారని చిన్నారి తండ్రి యాదగిరి తెలిపాడు. తన కూతురిపై సిరంజితో దాడి చేశారని నమ్ముతున్నామని, పోలీసులు తగిన దర్యాప్తు చేయాలని కోరారు. కాగా, కేసు దర్యాప్తు చేపట్టిన పోలీసులు ఘటనా స్థలానికి కొద్ది దూరంలో ఉన్న బ్యాంక్‌లు, దుకాణాల వద్ద ఉన్న సీసీ కెమెరాల ఫుటేజీలను పరిశీలిస్తున్నారు. చిన్నారి రమ్య ఆరోగ్యంగానే ఉందని, దర్యాప్తు కొనసాగుతోందని ఎస్‌ఐ మోహన్ తెలిపారు.
సూదిగాడి కేసు ముమ్మర దర్యాప్తు
Published Mon, Sep 7 2015 12:17 AM | Last Updated on Sun, Sep 3 2017 8:52 AM
Advertisement
Advertisement