సృష్టిలో వివాహ వ్యవస్థ గొప్పది
స్త్రీ అమ్మవారి ప్రతిరూపం
స్త్రీలు కోపానికి దూరంగా ఉండాలి
భగవాన్ రాÐ]lుదూతస్వామి
ఖమ్మం: సృష్టిలోని అన్ని వ్యవస్థల కంటే వివాహ వ్యవస్థ గొప్పదని,దీనికి విశిష్ట స్థానముందని భగవాన్ శ్రీశ్రీశ్రీ రామదూత స్వామి అన్నారు. గురువారం ఆయన ఖమ్మం నగరంలోని బుర్హాన్పురంలో ప్రముఖ గ్రానైట్ వ్యాపారి వద్దిరాజు రవిచంద్ర (గాయత్రి) నివాసంలో సువర్ణలక్ష్మి దాంపత్య వ్రతం నిర్వహించారు. అనంతరం స్వామి మాట్లాడుతూ వివాహ వ్యవస ్థద్వారా ఆర్థిక వ్యవస్థ సక్రమంగా ఉండటంతోపాటు ఆనందాన్ని,వంశ వృద్ధిని కలిగించడమే కాకుండా మోక్షం కూడా లభిస్తుందన్నారు. స్త్రీ సహనమూర్తి అని ఆమె అమ్మవారి ప్రతిరూపమన్నారు. స్త్రీకి కోసం వస్తే శనీశ్వరుడు ఇంట ప్రవేశిస్తాడని,దీనివల్ల ఇంట్లో దారిద్ర్యం తాండవిస్తుందన్నారు. దీన్ని దృష్టిలో ఉంచుకుని స్త్రీమూర్తులు కోపానికి దూరంగా ఉండాలని సూచించారు. మనం చేసే ప్రతి పనికి దైవ కృప ఉంటే ఆ పని విఫలం కాదన్నారు. ప్రతి ఒక్కరూ మంచి జరిగేందుకు సువర్ణలక్ష్మి దాంపత్య వ్రతం చేయించుకోవాలన్నారు.ప్రముఖ గ్రానైట్ వ్యాపారి వద్దిరాజు రవిచంద్ర మాట్లాడుతూ భగవాన్ రామదూత స్వామి తమ నివాసానికి వచ్చినందుకు కృతజ్ఞతలు తెలిపారు. కృష్ణాష్టమి సందర్భంగా స్వామి దర్శనం ఆనందంగా ఉందన్నారు. స్వామీజీని వద్దిరాజు రవిచంద్ర సోదరులు,ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ, స్థానిక కార్పొరేటర్ శీలంశెట్టి రమ, వీరభద్రం, ఆర్జేసీ కృష్ణ, శెట్టి రంగారావు కలిసి ఆశీర్వాదాలు తీసుకున్నారు.