T assembly
-
మున్సిపల్ చట్టం ఆమోదానికి గవర్నర్ బ్రేక్
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణ ప్రభుత్వ నూతన మున్సిపల్ చట్టం ఆమోదానికి రాష్ట్ర గవర్నర్ నరసింహన్ బ్రేక్ వేశారు. చట్ట సవరణ బిల్లుకు సంబంధించి కొన్ని అంశాలపై గవర్నర్ అభ్యంతరాలు వ్యక్తం చేశారు. కాగా మున్సిపల్ చట్టానికి తెలంగాణ శాసనసభ ఆమోదం తెలిపిన విషయం తెలిసిందే. అయితే ఈ బిల్లులో కలెక్టర్లకు ప్రజా ప్రతినిధులను తొలగించే అధికారంపై గవర్నర్ అభ్యంతరం తెలిపారు. అంతేకాకుండా మున్సిపల్ ఎన్నికలు తేదీలను కూడా ప్రభుత్వమే నిర్ణయించడంపై అభ్యంతరం చెబుతూ బిల్లును వెనక్కి పంపారు. గవర్నర్ చేసిన సూచనలపై రాష్ట్ర ప్రభుత్వం తాజాగా మళ్లీ ఆర్డినెన్స్ జారీ చేసింది. కాగా కొత్త మున్సిపల్ చట్టాన్ని తెలంగాణ ప్రభుత్వం పకడ్బందీగా తెరపైకి తెచ్చిన విషయం తెలిసిందే. పారదర్శకత, జవాబుదారీతనంతో పాటు అధికారులు, ప్రజాప్రతినిధుల ఉమ్మడి భాగస్వామ్యంతో మున్సిపల్‌పాలనను పరుగులు పెట్టించేలా ఈ చట్టాన్ని రూపొందించింది. ఓవైపు బాధ్యతలను గుర్తు చేస్తూనే మరో వైపు సంస్కరణలను ప్రవేశపెడుతూ రూపొందించిన ఈ చట్టంలో జిల్లా కలెక్టర్లను సూపర్‌బాస్‌లను చేసింది. మున్సిపల్‌పగ్గాలన్నీ వారికే అప్పగించి ప్రజాప్రతినిధుల పనితీరుపై ఓ కన్నేసి ఉంచేలా నిబంధనలను తీసుకొచ్చింది. చదవండి: జవాబుదారిలో భారీ మార్పులు తేడా వస్తే చైర్‌పర్సన్‌తోపాటు సభ్యులను సస్పెండ్ చేసే అధికారాలను కట్టబెట్టింది. హరిత మున్సిపాలిటీల కోసం బడ్జెట్లో 10% నిధులను ప్రత్యేకంగా కేటాయించడంతో పాటు.. నాటిన వాటిలో 85% మొక్కలు బతక్కపోతే సంబంధిత వార్డు మెంబర్, అధికారిపై కొరడా ఝళిపించనుంది. పాలకవర్గాలకు ఎన్నికలు, వాటి పనితీరు సమీక్ష, పాలన పర్యవేక్షణ, పట్టణ ప్రణాళిక నియమ నిబంధనలు, ఉద్యోగులకు ఏకీకృత సర్వీస్ రూల్స్, నైపుణ్య పెంపుదల కోసం స్వయం ప్రతిపత్తితో కూడిన సంస్థ ఏర్పాటు, పారిశుద్ధ్య నిర్వహణ బోర్డుల ఏర్పాటు వంటి అంశాలతో శాసనసభ, మండలి ఆమోద ముద్ర వేసిన విషయం విదితమే. మరోవైపు నూతన పురపాలక చట్టంపై విపక్షాలు కూడా అభ్యంతరాలు వ్యక్తం చేశాయి. -
‘కేసీఆర్‌కు భవిష్యత్‌లో జైలు తప్పదు’
సాక్షి, హైదరాబాద్ : కేసీఆర్ పాలనలో అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న తీరు దారుణంగా ఉందని మాజీ ఎమ్మెల్యే సంపత్‌కుమార్ ఆవేదన వ్యక్తం చేశారు. సార్థకతలేని అసెంబ్లీ సమావేశాలు ఒక్క తెలంగాణలోనే జరుగుతున్నాయని విమర్శించారు. కేసీఆర్.. అసెంబ్లీని తన రాజరికపు, కుటుంబ వ్యవహారంగా నడుపుతున్నారని ఆరోపించారు. అసెంబ్లీలో బిల్లులపై పూర్తి స్థాయిలో స్వేచ్ఛగా చర్చ జరిపే పరిస్థితులు లేవన్నారు. ప్రశ్నించే వారిని కేసీఆర్ అణిచివేస్తున్నారని ధ్వజమెత్తారు. కేసీఆర్ తన ఇంట్లో తీసుకునే నిర్ణయాలను అసెంబ్లీలో ఆమోదింపజేసుకుంటూ.. శాసనసభకు కళంకం తెచ్చేలా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. కేసీఆర్ తీసుకురాబోయే మున్సిపల్ చట్టంలో ఏముందో ఆయన కుటుంబానికి తప్ప మిగతావారెవ్వరికి తెలియదన్నారు. మంత్రులు సైతం కేబినెట్ భేటీలో వరుసగా నిలబడి సంతకాలు పెట్టడం తప్ప.. ఏంటని ప్రశ్నించే పరిస్థితులు లేవన్నారు. రాష్ట్రంలో వ్యవసాయం పూర్తిగా కుంటుపడిందని చెప్పారు. రైతుబంధు డబ్బులు సమయానికి అందక రైతులు ఇబ్బందులు పడుతున్న పట్టించుకోవడంలేదని ఆరోపించారు. ప్రజల సొమ్మును తన రాజకీయ అవసరాలకు వాడుకుంటున్న కేసీఆర్‌కు భవిష్యత్‌లో జెలు తప్పదని హెచ్చరించారు. థాయిలాండ్ ప్రధానికి పట్టిన గతే కేసీఆర్‌కు పడుతుందన్నారు. ఎన్నికలు, రాజకీయాలు తప్ప వేరే అంశాలను పట్టించుకోని కేసీఆర్‌కు భవిష్యత్‌లో ప్రజలు తగిన గుణపాఠం చెబుతారని సంపత్‌కుమార్ అన్నారు. -
'రాష్ట్రంలో అతిపెద్ద కుంభకోణం జరుగుతోంది'
హైదరాబాద్ : మిషన్ కాకతీయ ద్వారా రాష్ట్రంలో అతిపెద్ద కుంభకోణం జరుగుతోందని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్యే భట్టి విక్రమార్క ఆరోపించారు. శనివారం తెలంగాణ అసెంబ్లీలో రాష్ట్ర బడ్జెట్‌పై చర్చ జరిగింది. ఈ సందర్భంగా భట్టి విక్రమార్క మాట్లాడుతూ... మిషన్ కాకతీయలో భాగంగా ఉపయోగించే ప్రతిపైప్నకు ఎంత ఖర్చు అవుతుందో తెలపాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. తమ సలహాలు, సూచనలను ప్రభుత్వం ప్రజాస్వామ్య స్ఫూర్తితో స్వీకరించాలని టీఆర్ఎస్ ప్రభుత్వానికి సూచించారు. అయితే తమ సూచనలు, సలహాలను ఈ ప్రభుత్వం అవహేళన చేస్తే... అది రాజ్యాంగానికే విరుద్ధమని భట్టి పేర్కొన్నారు. ప్రణాళిక వ్యయం, ప్రణాళికేతర వ్యయం విన్నాం కానీ... బడ్జెట్‌యేతర వ్యయం మాట మాత్రం ఇప్పుడే వింటున్నామని భట్టి వ్యాఖ్యానించారు. -
రైతు సమస్యల పై సమగ్ర చర్చ జరిగింది
-
రైతుల ఆత్మహత్యలపై అసెంబ్లీలో పట్టుపడతాం
నల్గొండ : రాష్ట్రంలో రైతుల ఆత్మహత్యలపై అసెంబ్లీలో పట్టుపడతామని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు జి.కిషన్‌రెడ్డి స్పష్టం చేశారు. బుధవారం నల్గొండలో విలేకర్లతో కిషన్‌రెడ్డి మాట్లాడుతూ... అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు ఐదు రోజులు కాకుండా 20 రోజుల పాటు జరిగేలా చూడాలని తెలంగాణ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. రైతుల ఆత్మహత్యలపై అన్ని పార్టీలతో కలసి కమిటీ వేయాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అంతకుముందు రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన సైదులు కుటుంబాన్ని నల్లగొండలో కిషన్‌రెడ్డి పరామర్శించారు. -
సభను ఇలా అడ్డుకోవడం సరికాదు!
-
కల్తీ పాలను అరికట్టాలి:రాజేందర్ రెడ్డి
-
నిరుద్యోగులను అదుకోవాలి:జీవన్ రెడ్డి