
'రాష్ట్రంలో అతిపెద్ద కుంభకోణం జరుగుతోంది'
హైదరాబాద్ : మిషన్ కాకతీయ ద్వారా రాష్ట్రంలో అతిపెద్ద కుంభకోణం జరుగుతోందని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్యే భట్టి విక్రమార్క ఆరోపించారు. శనివారం తెలంగాణ అసెంబ్లీలో రాష్ట్ర బడ్జెట్పై చర్చ జరిగింది. ఈ సందర్భంగా భట్టి విక్రమార్క మాట్లాడుతూ... మిషన్ కాకతీయలో భాగంగా ఉపయోగించే ప్రతిపైప్నకు ఎంత ఖర్చు అవుతుందో తెలపాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
తమ సలహాలు, సూచనలను ప్రభుత్వం ప్రజాస్వామ్య స్ఫూర్తితో స్వీకరించాలని టీఆర్ఎస్ ప్రభుత్వానికి సూచించారు. అయితే తమ సూచనలు, సలహాలను ఈ ప్రభుత్వం అవహేళన చేస్తే... అది రాజ్యాంగానికే విరుద్ధమని భట్టి పేర్కొన్నారు. ప్రణాళిక వ్యయం, ప్రణాళికేతర వ్యయం విన్నాం కానీ... బడ్జెట్యేతర వ్యయం మాట మాత్రం ఇప్పుడే వింటున్నామని భట్టి వ్యాఖ్యానించారు.