టీ న్యూస్‌కు నోటీసులు ఉపసంహరించుకోండి
హైదరాబాద్ : టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడుతో తెలంగాణ టీడీపీ నేతల భేటీ ముగిసింది. టీ న్యూస్ ఛానల్‌కు ఇచ్చిన నోటీసులు ఉపసంహరించుకోవాలని టీడీపీ నేతలు ఈ సందర్భంగా చంద్రబాబును కోరారు. నోటీసులు ఉపసంహరించుకోకపోతే జర్నలిస్టులతో తమకు ఇబ్బందులు ఎదురు అవుతాయని వారు చంద్రబాబుకు తెలిపారు.
చంద్రబాబుతో ఈరోజు ఉదయం గరికపాటి రామ్మోహన్రావు, వేం నరేందర్ రెడ్డి, ఎర్రబెల్లి దయాకరరావు తదితరులు భేటీ అయిన విషయం తెలిసిందే. కాగా నిన్న అర్థరాత్రి టీ న్యూస్ ఛానల్‌కు విశాఖ పోలీసులు నోటీసులు ఇచ్చిన విషయం తెలిసిందే. దాంతో తెలంగాణ వ్యాప్తంగా జర్నలిస్టులు ఆందోళనకు దిగారు.