Tac
-
ఫిబ్రవరి 11న సీతారామ ప్రాజెక్టుపై టీఏసీ సమావేశం
సాక్షి, హైదరాబాద్: తెలంగాణకు కేంద్ర జలసంఘం (సీడబ్ల్యూసీ) శుభవార్త చెప్పింది. సీతారామ ఎత్తిపోతల పథకం/సీతమ్మసాగర్ బహుళార్థ సాధక ప్రాజెక్టుకు అనుమతి ఇవ్వరా దన్న ఆంధ్రప్రదేశ్ అభ్యంతరాలను తోసిపుచ్చింది. ప్రాజెక్టుకు సాంకేతిక అనుమతి ఇచ్చే అంశంపై చర్చించడానికి ఫిబ్రవరి 11న సీడబ్ల్యూసీకి చెందిన టెక్నికల్ అడ్వయిజరీ కమిటీ(టీఏసీ) సమావేశం కానుంది. తెలుగు రాష్ట్రాల మధ్య గోదావరి జలాల వినియోగంపై ఒప్పందం కుదిరేదాకా లేదా ట్రిబ్యునల్ నీటి పంపకాలు తేల్చేదాకా ఈ ప్రాజెక్టు డీపీఆర్‌ను తదుపరి క్లియరెన్స్ కోసం కేంద్ర జల సంఘానికి పంపించరాదని గోదావరి బోర్డును కోరుతూ ఏపీ లేఖ రాసింది. ఇవేమీ పరిగణనలోకి తీసుకోకుండా సీతారామకు సాంకేతిక అనుమతులు ఇచ్చే అంశంపై చర్చించడానికి సీడబ్ల్యూసీ ముందుకెళ్లనుంది.ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని సీతారామ ఎత్తిపో తల పథకాన్ని 2026 మార్చి నాటికి పూర్తి చేసి, 3,28,853 ఎకరాల కొత్త ఆయకట్టుతోపాటు, 3,45,534 ఎకరాల స్థిరీకరించిన ఆయ కట్టును కలుపుకొని 6.74 లక్షల ఎకరాలకు ఈ ప్రాజెక్టు ద్వారా నీళ్లివ్వాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. సీతారామ ఎత్తిపో తల పథకాన్ని 2016 ఫిబ్రవరి 18వ తేదీన రూ.7,926.14 కోట్ల అంచనాలతో ప్రభుత్వం పరిపాలన అనుమతులు ఇవ్వగా, ఆ తర్వాత 2018 ఆగస్టులో రూ.13,057 కోట్లకు అంచనాలను సవ రించారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డాక ఈ ప్రాజెక్టు డీపీఆర్‌కు సీడబ్ల్యూసీలోని డైరెక్టరేట్లన్నీ క్లియరెన్స్ ఇచ్చాయి.ఆ తర్వాత డీపీఆర్‌ల పరిశీలన కోసం కేంద్ర జలశక్తి శాఖ గతంలో జారీ చేసిన ’ఫ్లో చార్జ్’ప్రకారం గోదావరి బోర్డుకు పంపించారు. ఆ డీపీఆర్‌ను బోర్డు పరిశీలించి, ఏపీ అభ్యంతరాలు/అభిప్రా యాలు జతచేసి, టీఏసీ క్లియరెన్స్ కోసం సీడబ్ల్యూసీకి పంపించింది. ఇటీవల సీడబ్ల్యూసీ కొత్త చైర్మన్ ముకేష్‌కుమార్ సిన్హా రావడంతో టీఏసీ సమావేశానికి రూట్ క్లియర్ అయ్యింది. దీంతో ఫిబ్రవరి 11న సీతారామతోపాటు ఇతర రాష్ట్రాలకు చెందిన మరో రెండు ప్రాజెక్టులకు సాంకేతిక అనుమతిపై చర్చించడానికి టీఏసీ నిర్వహించనున్నట్టు గురువారం రాత్రి కేంద్ర జలవనరుల సంఘం సమాచారం ఇచ్చింది. టీఏసీ క్లియరెన్స్ వచ్చాక, ఇక అపెక్స్ కౌన్సిల్ అనుమతి రావాల్సి ఉంటుంది. అది లభిస్తే... ప్రాజెక్టుకు అన్ని రకాల అనుమతులు లభించనట్టే అవుతుంది. -
3 ప్రాజెక్టులకు టీఏసీ లైన్‌క్లియర్
సాక్షి, న్యూఢిల్లీ: గోదావరి నదీ జలాలను వినియోగిస్తూ చేపట్టిన తెలంగాణలోని మూడు సాగునీటి ప్రాజెక్టులకు సాంకేతిక సలహా కమిటీ (టీఏఏసీ) ఆమోదం లభించింది. భూపాలపల్లి జిల్లాలోని ముక్తేశ్వర(చిన్న కాళేశ్వరం) ఎత్తిపోతల పథకం, ఆదిలాబాద్ జిల్లాలోని ఛనాక–కొరట బ్యారేజీ, నిజామాబాద్ జిల్లాలోని చౌటుపల్లి హన్మంత్‌రెడ్డి ఎత్తిపోతల పథకాలకు టీఏసీ ఆమోదం ఇస్తున్నట్లు కేంద్ర జల శక్తి మంత్రిత్వ శాఖ సెక్రెటరీ పంకజ్ కుమార్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో ప్రకటించారు. ఈ ప్రాజెక్టుల ఆమోదానికి సంబంధించి అడ్వైజరీ కమిటీ మినిట్స్ త్వరలోనే జారీ చేయనున్నారు. జూలై 2021లో కేంద్ర ప్రభుత్వం జారీ చేసి న గెజిట్ నోటిఫికేషన్లో ఈ మూడింటినీ ఆమోదం లేని ప్రాజెక్టులుగా పేర్కొన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం ఈ ప్రాజెక్టుల డీపీఆర్‌లను గతేడాది సెప్టెంబర్‌లో కేంద్ర జల సంఘానికి, గోదావరి బోర్డుకు సమర్పించింది. కేంద్ర జల సంఘం పరిధిలోని వివిధ డైరెక్ట రేట్లు ఈ డీపీఆర్‌లను కూలంకషంగా పరిశీలించి ఆమోదించాయి. అనంతరం డీపీఆర్‌ల పరిశీలనకు సంబంధించి కేంద్ర జల శక్తి మంత్రిత్వ శాఖ ఆమోదించిన ఫ్లో చార్ట్ ప్రకారం వీటిని గోదావరి బోర్డు పరిశీలన కోసం పంపారు. ఈ ఏడాది ఏప్రిల్‌లో జరిగిన బోర్డు భేటీలో వీటి అనుమతులను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వ్యతిరేకించినా, బోర్డు తన రిమార్కులతో మళ్ళీ కేంద్ర జల సంఘానికి పంపింది. కేంద్ర జల సంఘం ఏపీ లేవనెత్తిన అన్ని అభ్యంతరాలను పున: సమీక్షించి వాటిని పూర్వ పక్షం చేస్తూ ఈ మూడు ప్రాజెక్టులను టీఏసీ సిఫారసు చేస్తూ అడ్వైజరీ కమిటీకి పంపింది. ఈ నేపథ్యంలో మంగళవారం ఢిల్లీలోని శ్రమశక్తి భవన్‌లోని జల శక్తి శాఖ కార్యదర్శి పంకజ్‌కుమార్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఈ 3 ప్రాజెక్టులపై చర్చించారు. సభ్యులు అడిగిన అన్ని ప్రశ్నలకు తెలంగాణా ప్రభుత్వం తరుఫున హాజరైన స్పెషల్ చీఫ్ సెక్రటరీ రజత్‌కుమార్, ఈఎన్సీలు మురళీధర్, నల్లా వెంకటేశ్వర్లు, సీఈలు శ్రీనివాస్, మధుసూధన్‌రావు, సీఎం ఓఎస్డీ శ్రీధర్‌రావు దేశ్‌పాండే, ఎస్ఈ శ్రీనివాస్‌రెడ్డి సమాధానాలు ఇచ్చారు. ఈ సమాధానాలకు సంతృప్తి చెంది ఈ మూడు ప్రాజెక్టులకూ ఆమోదం తెలుపనున్నట్టు పంకజ్ ప్రకటించారు. -
రాజ్యాంగ రక్షణ ఛత్రం ఛిద్రం
టీఏసీని ఏర్పాటు చేయని ప్రభుత్వం బాక్సైట్ గనుల తవ్వకాలకు ప్రభుత్వ కుట్ర వైస్సార్ కాంగ్రెస్‌కు భయపడే అడ్డగోలు నిర్ణయం మండిపడుతున్న గిరిజన ప్రజాప్రతినిధులు రాజ్యాంగ హక్కుల కోసం ఉద్యమానికి సన్నద్ధం బాక్సైట్ గనులను తమ అస్మదీయ విదేశీ సంస్థలకు కట్టబెట్టడానికి రాష్ట్ర ప్రభుత్వం రాజ్యాంగ నిబంధనలు అన్నింటినీ తుంగలో తొక్కేసింది. గిరిజన ప్రాంతల రక్షణ, గిరిజనుల హక్కుల పరిరక్షణ కోసం రాజ్యాంగంలో నిర్దేశించిన ‘గిరిజన సలహా మండలి(టీఏసీ)తో నిమిత్తం లేకుండా బాక్సైట్ గనుల తవ్వకాలకు జీవో జారీ చేసేసింది. బాక్సైట్ తవ్వకాలను వ్యతిరేకిస్తున్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధులే సభ్యులుగా ఉండనుండటంతో ఏకంగా టీఏసీనే ఏర్పాటు చేయకుండా పనికానిచ్చేసింది. రాజ్యాంగ రక్షణ ఛత్రాన్ని ఛిద్రం చేస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై మండిపడుతున్న గిరిజన ప్రజాప్రతినిధులు ఉద్యమానికి ఉద్యుక్తమవుతున్నారు. - సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం రాజ్యాంగంలోని ఐదో షెడ్యూల్లో టీఏసీ గురించి స్పష్టంగా నిర్దేశించింది. గిరిజన ప్రాంతాల నుంచి ఎన్నికైన ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఇతర ప్రజాప్రతినిధులు టీఏసీని రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేయాలి. టీఏసీ ఆమోదంతోనే గిరిజన ప్రాంతాలకు సంబంధించి ఎలాంటి నిర్ణయమైనా తీసుకోవాలిన స్పష్టం చేసింది. ఏజెన్సీలో బాక్సైట్ గనులను 1960లోనే గుర్తించారు. కాగా 1986లో నాటి టీడీపీ ప్రభుత్వం అధికారంలో ఉండగా బాక్సైట్ గనుల తవ్వకాల ప్రతిపాదన తొలిసారి తెరపైకి వచ్చింది. నాటి నుంచి కూడా టీఏసీ సభ్యులు బాక్సైట్ తవ్వకాల ప్రతిపాదనను వ్యతిరేకిస్తునే ఉన్నారు. 2000-2002లో చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు బాక్సైట్ తవ్వకాల కోసం దుబాయికి చెందిన కంపెనీతో ఒప్పందం కుదుర్చుకున్నారు. కానీ టీఏసీ ఆమోదం సాధించడం సులువు కాదని గ్రహించి 2004 ఎన్నికల తరువాత చూద్దామని వాయిదా వేశారు. కానీ ఆ ఎన్నికల్లో టీడీపీ ఓడిపోయింది. 2014లో అధికారంలోకి వచ్చిన టీడీపీ ఈసారి ఏకంగా టీఏసీని నీరుగార్చేస్తూ అడ్డగోలుగా బాక్సైట్ తవ్వకాలకు అనుమతి ఇచ్చేసింది. వైఎస్సార్ కాంగ్రెస్‌కు భయపడే... రాజ్యాంగం ప్రకారం గిరిజన ప్రాంతాల నుంచి గెలిచిన ప్రజాప్రతినిధులు టీఏసీలో సభ్యులుగా ఉండాలి. 2014 ఎన్నికల్లో రాష్ట్రం లో 8 ఎస్టీ నియోజకవర్గాల్లో ఏకంగా 7 ని యోజకవర్గాల్లో వైఎస్సార్ కాంగ్రెస్ అభ్యర్థులు విజయం సాధించారు. గిరిజన ప్రాం తాల్లో స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ వైఎస్సా ర్ కాంగ్రెస్ అభ్యర్థులు అత్యధికంగా గెలిచా రు. ఈ నేపథ్యంలో టీఏసీని నియమిస్తే అందులో 90శాతంమంది సభ్యులు వైఎస్సా ర్ కాంగ్రెస్‌కు చెందిన ప్రజాప్రతినిధులే ఉంటారు. వైఎస్సార్‌కాంగ్రెస్ బాక్సైట్ తవ్వకాలను వ్యతిరేకిస్తుండటంతో టీఏసీ ఆమోదం పొందడం దుర్లభమని చంద్రబాబు ప్రభుత్వ గుర్తించింది. ఒకానొక దశలో తమ పార్టీ గిరిజన నేతలకు నామినేటెడ్ పదవులు ఇచ్చి టీఏసీలో సభ్యులుగా చేర్చాలని వ్యూహం పన్నింది. అది అంతగా ఆచరణ సాధ్యంకాదని గ్రహించి ఏకంగా టీఏసీని నియమించకూడదని నిర్ణయించుకుంది. టీఏసీ ఏర్పాటు చేయకుండానే బాక్సైట్ తవ్వకాలకు అనుమతిస్తూ జీవో జారీ చేసేసింది. అంటే గిరిజనులకు రాజ్యాంగం కల్పించిన రక్షణ వ్యవస్థ టీఏసీని నిర్వీర్యం చేస్తూ అడ్డగోలుగా నిర్ణయం తీసుకుంది. ఉద్యమానికి గిరిజన ప్రజాప్రతినిధుల ఉద్యుక్తం ప్రభుత్వం అడ్డగోలు వ్యవహారంపై గిరిజన ప్రజాప్రతినిధులు మండిపడుతున్నారు. గిరిజన ప్రాంతాలకు రాజ్యాంగం కల్పించిన రక్షణ వ్యవస్థ టీఏసీని నియమించాలని డిమాండ్ చేస్తూ ప్రభుత్వంపై ప్రత్యక్ష ఆందోళనకు ఉద్యుక్తమవుతున్నారు. అందుకోసం గిరిజన ప్రజాప్రతినిధులు విశాఖపట్నంలో ఆదివారం సమావేశం కావాలని నిర్ణయించారు. తామే అనధికారికంగా టీఏసీగా ఏర్పడి బాక్సైట్ తవ్వకాలకు వ్యతిరేకంగా ఏకగ్రీవంగా తీర్మానించి గవర్నర్, రాష్ట్రపతులకు నివేదించాలని నిర్ణయించారు. ప్రభుత్వం అధికారికంగ టీఏసీని నియమించనందున తమ ప్రాంత హక్కుల కోసం తామే టీఏసీగా ఏర్పడినట్లు ఆ నివేదికలో పొందుపరుస్తామని ఆ ప్రజాప్రతినిధులు చెబుతున్నారు. బాక్సైట్ తవ్వకాలకు వ్యతిఏకంగా గిరిజనులను చైతన్యపరచడంతోపాటు ప్రభుత్వంపై న్యాయపోరాటానికి కూడా ఉద్యుక్తమవుతున్నారు.