Tadiparti
-
తాడిపత్రిలో టెన్షన్.. వైఎస్సార్సీపీ కార్యకర్తలపై దాడి
సాక్షి, అనంతపురం: తాడిపత్రి నియోజకవర్గంలో టీడీపీ నేతలు రెచ్చిపోయారు. తాజాగా వైఎస్సార్సీపీ కార్యకర్తపై దాడికి పాల్పడ్డారు. ఈ క్రమంలో ఇద్దరు కార్యకర్తలకు తీవ్ర గాయాలు కావడంతో వారిని వెంటనే ఆసుపత్రికి తరలించారు. కాగా, జేసీ ప్రభాకర్ రెడ్డి వర్గీయులే దాడి చేసినట్టు బాధితులు చెబుతున్నారు.వివరాల ప్రకారం.. అనంతపురంలోని పెద్దవడగూరు మండలం అప్పేచర్లలో టీడీపీ నేతలు రెచ్చిపోయారు. టీడీపీ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి వర్గీయులు అరాచకం సృష్టించారు. గురువారం ఉదయం వైఎస్సార్సీపీ కార్యకర్తలపై దాడి చేశారు. ఈ క్రమంలో ఇద్దరు కార్యకర్తల తలకు బలమైన గాయం కావడంతో వెంటనే వారిని ఆసుపత్రికి తరలించారు. టీడీపీ నేతల దాడి విషయాన్ని వైఎస్సార్సీపీ కార్యకర్త భాస్కర రెడ్డి సెల్ఫీ వీడియోలో వివరించారు.ఇదిలా ఉండగా.. తాడిపత్రి టీడీపీ మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డిపై దళిత సంఘం నేత రాంపుల్లయ్య పోలీసులకు ఫిర్యాదు చేశారు. జేసీ ప్రభాకర్ రెడ్డి తనను ఫోన్లో దూషించారని ఫిర్యాదులో పేర్కొన్నారు. తనను బెదిరించిన జేసీపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని విజ్ఞప్తి చేశారు. ఇదే సమయంలో జేసీ ప్రభాకర్ రెడ్డిపై ఇప్పటిదాకా ఎన్ని కేసులు నమోదు అయ్యాయి. వాటి వివరాలు చెప్పాలని సమాచార చట్టం కింద దరఖాస్తు పెట్టుకున్నారు. ఈ నేపథ్యంలో డీజీపీకి రిజిస్టర్ పోస్టు ద్వారా వివరాలను పంపించారు. -
స్పాంజ్ అండ్ పవర్ పరిశ్రమలో ప్రమాదం
తాడిపత్రి రూరల్: అనంతపురం జిల్లా తాడిపత్రి మండలం భోగసముద్రం వద్ద ఉన్న సుగ్న స్పాంజ్ అండ్ పవర్ పరిశ్రమలో బుధవారం తెల్లవారుజామున పెద్ద శబ్దంతో ఎయిర్ బాయిలర్ పేలిపోయింది. ఇద్దరు కార్మికులకు గాయాలయినట్లు అధికారులు తెలిపారు. వివరాల్లోకి వెళితే.. ముడి ఐరన్ తయారీలో భాగంగా పలు రకాల ముడి ఖనిజాలను ఎయిర్ బాయిలర్లో వేసి, కొన్ని రసాయనాలను కలుపుతారు. ఐరన్ ముద్దలు తయారై బయటకు వస్తాయి. ఈ ప్రక్రియలో భాగంగా ఎయిర్ బాయిలర్లో ఎక్కువ మోతాదులో ఖనిజాలను వేయడంతో ఒత్తిడి ఎక్కువై అది పేలిపోయినట్లు తెలుస్తోంది. ప్రమాద సమయంలో బాయిలర్కు కొద్దిదూరంలో నలుగురు కార్మికులు విధుల్లో ఉన్నారు. పేలుడు ధాటికి అంకు, అభినవ్ అనే కార్మికులు స్వల్పంగా గాయపడగా తాడిపత్రి ప్రభుత్వాస్పత్రిలో చికిత్స చేయించామని ఇన్చార్జ్ తహసీల్దార్ రాజారాం తెలిపారు. ప్రస్తుతం వారి పరిస్థితి నిలకడగా ఉన్నట్లు చెప్పారు. కాగా, సుగ్న స్పాంజ్ అండ్ పవర్ పరిశ్రమలో భారీ ప్రమాదం చోటుచేసుకున్నట్లు తెలియడంతో మీడియా ప్రతినిధులు పెద్దసంఖ్యలో అక్కడికి చేరుకున్నారు. అయితే వారిని లోపలికి వెళ్లకుండా ఫ్యాక్టరీ సిబ్బంది అడ్డుకున్నారు. జనరల్ మేనేజర్ మహబూబ్ అలీకి ఫోన్ చేయగా.. ఆయన లిఫ్ట్ చేయలేదు. కాగా..ఈ ఘటనపై పోలీసులకు ఎలాంటి ఫిర్యాదూ అందలేదు. -
ప్రబోదానందస్వామి ఆశ్రమంను ధ్వంసం చేసిన పోలీసులు
-
సర్ధుమణిగిన తాడిపత్రి.. కలెక్టర్ పూర్తి భరోసా
-
ఊపిరి పీల్చుకున్న తాడిపత్రి
సాక్షి, అనంతపురం : తాడిపత్రిలో గత రెండు రోజులుగా కొనసాగుతున్న వివాదం చల్లారింది. వినాయక నిమజ్జనం సందర్భంగా తాడిపత్రిలో ప్రబోదానందస్వామి భక్తులు, జేసీ సోదరుల మధ్య చెలరేగిన ఘర్షణలకు తెరపడింది. ఆశ్రమ నిర్వాహకులతో కలెక్టర్ వీరపాండ్యన్ సోమవారం జరిపిన చర్చలు ఫలించాయి. ఆశ్రమం వదిలి స్వగ్రామాలకు వెళ్లేందుకు భక్తులు అంగీకరించారు. తాము ఏ ఒక్కరికీ అనుకూలం కాదని... ఆశ్రమానికి రక్షణ కల్పిస్తామని కలెక్టర్ భరోసా ఇవ్వడంతో భక్తులు శాంతించారు. ఆశ్రమం నుంచి ఆర్టీసీ బస్సుల్లో అధికారులు వారిని తరలించారు. పోలీసుల తీరు వివాదాస్పదం మరోవైపు ప్రబోదానందస్వామి ఆశ్రమంపై పోలీసులు వ్యవహరించిన తీరు వివాదస్పదమవుతోంది. దీనికి సంబంధించిన సీసీ ఫుటేజ్ తీవ్ర ప్రకంపనలు రేపుతోంది. శాంతి భద్రతలను అదుపులోకి తీసుకురావాల్సిన పోలీసుల్లో కొంతమంది బాధ్యతారాహిత్యంగా వ్యవహరించారు. ప్రబోదానందస్వామి ఆశ్రమంలోని సీసీ కెమెరా ను సాక్షాత్తు పోలీసులే ధ్వంసం చేయటం దుమారం రేపుతోంది. ఆదివారం రోజున ఈ దృశ్యాలు రికార్డయ్యాయి. కొందరు పోలీసులు తమ వద్ద ఉన్న లాఠీలతో సీసీ కెమెరాలను పగులగొట్టారు. జేసీ వర్గీయులకు మేలు చేసేందుకు ఇలా వ్యవహరించారన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ప్రబోదానందస్వామి ఆశ్రమంలో ఉన్న కొందరు భక్తులను లాఠీలతో కొడుతున్న దృశ్యాలు తీవ్ర సంచలనం కలిగిస్తున్నాయి. దీంతోపాటు జేసీ వర్గీయుల రాళ్ళ దాడి, వాహనాల ధ్వంసం చేసిన తీరు ప్రజలను భయాందోళనలకు గురి చేస్తున్నాయి. తక్షణమే చంద్రబాబు సర్కారు జోక్యం చేసుకుని తాడిపత్రిలో శాంతిభద్రత పునరుద్ధరించాలని ప్రజలు కోరుతున్నారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా చర్యలు చేపట్టాలని కోరుతున్నారు. తాడిపత్రిలో తీవ్ర ఉద్రిక్తత -
అవన్నీ ఊహాగానాలే: జేసీ ప్రభాకర్ రెడ్డి
అనంతపురం : కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీమంత్రి జేసీ దివాకర్ రెడ్డి 'పార్టీ మారుతారు...రాజకీయాలకు దూరంగా ఉంటార'న్న ఊహాగానాలకు ఆయన సోదరుడు జేసీ ప్రభాకర్ రెడ్డి తెర దించారు. ఆయన బుధవారమిక్కడ విలేకర్లతో మాట్లాడుతూ దివాకర్ రెడ్డి పార్టీ మారుతారన్న వార్తలను కొట్టిపారేశారు. అవన్నీ ఊహాగానాలేనని స్పష్టం చేశారు. కార్యకర్తల అభీష్టం మేరకే జేసీ నిర్ణయం తీసుకుంటారని ప్రభాకర్ రెడ్డి తెలిపారు. కాగా వచ్చే ఎన్నికల్లో తాడిపత్రి నుంచి ఎవరు పోటీ చేస్తారనే విషయాన్ని త్వరలోనే ప్రకటిస్తామన్నారు. రాష్ట్ర విభజన ప్రకటనతో సీమాంధ్రలో కాంగ్రెస్ మరో 20 ఏళ్ల వరకూ కోలుకునే పరిస్థితి లేదన్నారు. తాము స్వతంత్రంగా పోటీ చేసినా గెలిచే సత్తా తమకు ఉందని, ఖచ్చితంగా 2014 ఎన్నికల్లో గెలిచి తీరుతామని ప్రభాకర్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు.ఇక జేసీ దివాకర్ రెడ్డి...తెలుగుదేశం పార్టీలో చేరుతారనే వార్తలు ఊపుందుకున్న విషయం తెలిసిందే.