TAFE
-
వెయ్యికోట్ల సామ్రాజ్యానికి తిరుగులేని అధినేత్రి - సక్సెస్ స్టోరీ
Mallika Srinivasan Success Story: ప్రపంచం అభివృద్ధి పైపు పరుగులు పెడుతున్న సమయంలో ఆడవాళ్లు అన్ని రంగాల్లోనూ మేము సైతం అంటున్నారు. పని ఏదైనా మనసు పెట్టి చేస్తే తప్పక విజయం సాధిస్తావన్నది లోకోక్తి. అలాంటి కోవకు చెందిన 'ట్రాక్టర్ క్వీన్' గా పిలువబడే 'మల్లిక శ్రీనివాసన్' (Mallika Srinivasa) గురించి ఈ కథనంలో తెలుసుకుందాం. భారతదేశంలో వ్యాపార రంగంలో దూసుకెళ్తున్న కొంత మంది మహిళల్లో మల్లిక శ్రీనివాసన్ ఒకరు. 1959 నవంబర్ 19న జన్మించిన మల్లికకు చిన్నప్పటి నుంచి బిజినెస్ స్టడీస్‌పై ఉన్న ఆసక్తి కారణంగా మద్రాస్ యూనివర్సిటీలో ఎమ్ఏ పూర్తి చేసి, ఆ తరువాత ఉన్నత చదువులు కోసం విదేశాలకు పయనమైంది. వార్టన్ స్కూల్ ఆఫ్ పెన్సిల్వేనియా యూనివర్సిటీలో ఎంబీఏ చేసి ఇండియాకు తిరిగి వచ్చింది. చదువు పూర్తయిన తరువాత 1986లో, చెన్నైని 'డెట్రాయిట్ ఆఫ్ ఇండియా'గా మార్చడంలో కీలక పాత్ర పోషించిన దివంగత ప్రముఖ పారిశ్రామికవేత్త ఎస్ అనంతరామకృష్ణన్ స్థాపించిన కుటుంబ వ్యాపారంలో మల్లిక జనరల్ మేనేజర్‌గా చేరింది. రోజు రోజుకి TAFE కంపెనీని అభివృద్ధి మార్గంలో తీసుకెళ్లడానికి మల్లిక చాలా కృషి చేసింది. అతి తక్కువ కాలంలోనే కంపెనీ మంచి లాభాలను ఆర్జించగలిగింది. TAFE (ట్రాక్టర్స్ అండ్ ఫార్మ్ ఎక్విప్మెంట్ లిమిటెడ్) కంపెనీ ఆదాయం & అమ్మకాల పరిమాణంలో మహీంద్రా ట్రాక్టర్ల తర్వాత భారతదేశపు రెండవ అతిపెద్ద ట్రాక్టర్ కంపెనీ. మల్లిక నాయకత్వంలో, టాఫె సంస్థ 2022లో ఫ్రెంచ్ సంస్థ ఫౌరేసియా (Faurecia) ఇండియా వ్యాపారాన్ని రూ. 400 కోట్ల డీల్‌తో, 2018లో IMT వంటి కంపెనీలను కొనుగోలు చేసింది. (ఇదీ చదవండి: కేవలం 18 నెలలు.. రూ. 100 కోట్ల టర్నోవర్ - ఒక యువతి సక్సెస్ స్టోరీ!) మల్లికా శ్రీనివాసన్ గవర్నింగ్ బోర్డ్ ఆఫ్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (IIT) చెన్నై, ఎగ్జిక్యూటివ్ బోర్డ్ ఆఫ్ ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ (ISB) హైదరాబాద్, AGCO, టాటా స్టీల్ అండ్ టాటా గ్లోబల్ బెవరేజెస్ వంటి పెద్ద సంస్థలలో ఉన్నారు. ఆమె ఇటీవల బిలియన్ డాలర్ల స్టార్టప్ స్విగ్గీ బోర్డులో కూడా అడుగుపెట్టడం గమనార్హం. (ఇదీ చదవండి: సత్య నాదెళ్ల కంటే ఎక్కువ ఆస్తులున్న మహిళ గురించి తెలుసా?) మల్లిక శ్రీనివాసన్ ఒక వైపు కంపెనీ విషయాలను చూసుకుంటూనే.. తిరునెల్వేలిలోని అనేక ఆరోగ్య సంరక్షణ, విద్యా సౌకర్యాలకు కూడా మద్దతు ఇస్తున్నారు. అంతే కాకుండా ఆమె ఇందిరా శివశైలం ఎండోమెంట్ ఫండ్ ద్వారా చెన్నై శంకర నేత్రాలయలోని క్యాన్సర్ ఆసుపత్రికి మద్దతు ఇస్తుంది. కర్ణాటక సంగీతం సంగీత సంప్రదాయాన్ని కూడా ప్రోత్సహించడంలో తన వంతు కృషి చేస్తోంది. ట్రాక్టర్ ఇండస్ట్రీ పురుషుల ఆధిపత్యంలోనే ఉంటుందని భావిస్తారు. అలాంటి భావనకు చరమగీతం పాడి ప్రపంచంలో మూడవ అతిపెద్ద ట్రాక్టర్ కంపెనీగా, భారతదేశంలో రెండవ అతిపెద్ద ట్రాక్టర్ కంపెనీగా తీర్చిదిద్ది 'ట్రాక్టర్ క్వీన్' పేరు పొందింది. మల్లిక శ్రీనివాసన్ మొత్తం ఆస్తుల విలువ రూ. 200 కోట్లకంటే ఎక్కువ అని తెలుస్తోంది. ఈమె భర్త టీవీఎస్ మోటార్స్ సీఎండీ వేణు శ్రీనివాసన్. పారిశ్రామిక రంగంలో ఈమె చేసిన కృషికి గాను భారత ప్రభుత్వం పద్మశ్రీ అవార్డు ప్రధానం చేసింది. ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన కథనాలు తెలుసుకోవడానికి సాక్షి బిజినెస్ చూస్తూ ఉండండి. -
టాఫే చేతికి ఫోరేషియా భారత వ్యాపారం
చెన్నై: అంతర్జాతీయ ట్రాక్టర్ల తయారీ దిగ్గజం టాఫే (ట్రాక్టర్స్ అండ్ ఫార్మ్ ఎక్విప్మెంట్) తాజాగా ఫ్రాన్స్ సంస్థ గ్రూప్ ఫోర్వియాలో భాగమైన ఫారేషియా భారతీయ ఇంటీరియర్ వ్యాపారాన్ని కొనుగోలు చేసింది. ఫోక్స్‌వ్యాగన్, టాటా మోటర్స్, హ్యుందయ్ తదితర ఆటోమోటివ్ సంస్థలకు సీటింగ్, ఇంటీరియర్స్ మొదలైన వాటి డిజైనింగ్, తయారీ సేవలను ఫారేషియా అందిస్తోంది. డీల్ ప్రకారం ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపురం, మహారాష్ట్రలోని చకాన్, తమిళనాడులో ఫారేషియా ప్లాంట్లు టాఫేకు దక్కుతాయి. ఇప్పటికే అనంతపురం, చకాన్ ప్లాంట్లకు సంబంధించిన లావాదేవీలు పూర్తయ్యాయని, తమిళనాడు ప్లాంటు లావాదేవీ త్వరలో ముగుస్తుందని కంపెనీ తెలిపింది. తమ ప్లాస్టిక్స్ వ్యాపార విభాగంలో ఫారేషియా ఇంటీరియర్ సిస్టమ్స్ విలీనం ద్వారా కస్టమర్లకు మరింత ప్రయోజనకరమైన సేవలు అందించగలమని టాఫే సీఎండీ మల్లికా శ్రీనివాసన్ తెలిపారు. -
టఫే నుంచి ప్రీమియం ట్రాక్టర్లు
హైదరాబాద్: ట్రాక్టర్స్ అండ్ ఫార్మ్ ఎక్విప్మెంట్ (టఫే) తాజాగా ఐషర్ బ్రాండ్‌లో ప్రైమా జీ3 సిరీస్ పేరిట ప్రీమియం ట్రాక్టర్లను ఆవిష్కరించింది. స్టైల్, దృఢత్వం కోరుకునే కొత్త తరం రైతుల అవసరాలకు అనుగుణంగా వీటిని రూపొందించినట్లు తెలిపింది. సామర్థ్యంపరంగా 40–60 హెచ్‌పీ శ్రేణిలో ఇవి ఉంటాయని టఫే సీఎండీ మల్లికా శ్రీనివాసన్ తెలిపారు. ఇంధనం ఆదా చేయడంతో పాటు ఉత్పాదకత అత్యధిక స్థాయిలో ఉండేలా వీటిని తీర్చిదిద్దినట్లు ఆమె పేర్కొన్నారు. ఎత్తు సర్దుబాటు చేసుకోగలిగే సీటు, వైవిధ్యమైన ఏరోడైనమిక్ హుడ్, డిజి నెక్ట్స్ డ్యాష్‌బోర్డు, వన్ టచ్ ఓపెన్ బానెట్ తదితర ఫీచర్లు ఈ ట్రాక్టర్లలో ఉంటాయి. దేశీయంగా యువ రైతులు వ్యవసాయ రంగంలో సాంకేతికత ఊతంతో గరిష్ట రాబడులు అందుకోవడంపై మరింతగా దృష్టి పెడుతున్న నేపథ్యంలో వారికి అనువుగా ఉండేలా జీ3 సిరీస్ ట్రాక్టర్లను ఆవిష్కరించినట్లు మల్లికా శ్రీనివాసన్ వివరించారు. చదవండి: ఎలక్ట్రిక్ వెహికల్స్ తయారీ, టయోటా వేలకోట్ల పెట్టుబడులు! -
టఫే చేతికి సెర్బియా ట్రాక్టర్ కంపెనీ
న్యూఢిల్లీ: సెర్బియాకు చెందిన ట్రాక్టర్ కంపెనీ ఐఎంటీని టఫే కంపెనీ కొనుగోలు చేసింది. సెర్బియాకు చెందిన ట్రాక్టర్లు, ఇతర వ్యవసాయ యంత్రాలు తయారు చేసే ఐఎంటీని కొనుగోలు చేశామని టాఫే కంపెనీ మంగళవారం తెలిపింది. అయితే, ఈ డీల్‌కు సంబంధించిన లావాదేవీలను వివరాలను టఫే (ట్రాక్టర్స్ అండ్ ఫార్మ్ ఎక్విప్మెంట్) వెల్లడించలేదు. భవిష్యత్ వృద్ధికి ఐఎమ్‌టీ కీలకం... ఐఎమ్టీతో తమకు దీర్ఘకాలంగా అనుబంధం ఉందని టఫే చైర్పర్సన్, సీఈఓ మల్లిక శ్రీనివాసన్ తెలిపారు. తూర్పు యూరప్, ఉత్తర ఆఫ్రికా, బాల్కిన్ దేశాల్లో ఐఎమ్‌టీ బ్రాండ్ చాలా పాపులర్ అని, ఈ కంపెనీ 35 హెచ్‌పీ నుంచి 210 హెచ్‌పీ రేంజ్లో ట్రాక్టర్లను తయారు చేస్తుందని ఆమె వివరించారు. ఇరు కంపెనీల మధ్య విడిభాగాల సరఫరా, టెక్నాలజీ సపోర్ట్, తదితర అంశాల్లో కొన్ని దశాబ్దాలుగా వాణిజ్య అనుబంధం ఉందని వెల్లడించారు. భవిష్యత్తు వృద్ధి, వ్యూహాత్మక ప్రణాళికలకు ఐఎమ్‌టీ కొనుగోలు కీలకం కానున్నదని వ్యాఖ్యానించారు. ఈ డీల్‌లో భాగంగా ఐఎమ్‌టీ బ్రాండ్, డిజైన్లు, ట్రేడ్‌మార్క్‌లు, కాపీ రైట్స్ వంటి మేధోపరమైన హక్కులను వినియోగించుకునే హక్కు తమకు లభిస్తుందని వివరించారు. -
తెలంగాణలో తొలి టఫే ప్లాంటు ఏర్పాటు