Tagarapuvalasa
-
వావ్.. వాటే బర్డ్
సాక్షి, విశాఖపట్నం: ఒకటి కాదు.. రెండు కాదు.. 30 రకాలకు చెందిన స్వదేశీ, వలస పక్షుల్ని చూసి వారంతా సంభ్రమాశ్చర్యాలకు గురయ్యారు. స్టింట్స్.. గుల్స్.. ఇలా.. విభిన్న రకాల పక్షులతో ఓ రోజంతా గడుపుతూ సరికొత్త అనుభూతికి గురయ్యారు. మెరైన్ ఫెస్టివల్–2021 మూడో ఎడిషన్‌లో భాగంగా వరల్డ్ వైల్డ్ లైఫ్ ఫండ్ ఫర్ నేచర్(డబ్ల్యూడబ్ల్యూఎఫ్), వైల్డ్ లైఫ్ కన్జర్వేషన్ త్రూ రీసెర్చ్ అండ్ ఎడ్యుకేషన్(డబ్ల్యూసీటీఆర్‌ఈ) సంయుక్తంగా షోర్ బర్డ్ వాచింగ్ వాక్ సెషన్‌ని తగరపువలసలో ఆదివారం నిర్వహించారు. ఈ వాక్ని డబ్ల్యూడబ్ల్యూఎఫ్ ఇండియా సీనియర్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ సుధా ప్రారంభించారు. 4 ఏళ్ల నుంచి 50 ఏళ్లు పైబడిన వారు వాక్‌లో పాల్గొని ప్రకృతి అందాల్ని తిలకిస్తూ.. పక్షుల్ని చూస్తూ సరదాగా గడిపారు. వైజాగ్‌లో శీతాకాలంలో కనిపించే పక్షుల వైవిధ్యం గురించి డబ్ల్యూసీటీఆర్‌ఈ బయాలజిస్ట్ భాగ్యశ్రీ వివరించారు. అరుదైన పక్షుల ఉనికి, వాటి ప్రాముఖ్యత, జీవిత చక్రం, పర్యావరణంతో వాటికున్న అనుబంధం గురించి ప్రజలకు చాటిచెప్పేందుకు ఈ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు నిర్వాహకులు తెలిపారు. -
అర్ధరాత్రి ఎగసిన అగ్నికీలలు
తగరపువలస ప్రాంతంలో అతిపెద్ద ప్రైవేటు మార్కెట్ ఇది. కూరగాయల నుంచి అన్ని నిత్యావసర వస్తువులు ఇక్కడ అందుబాటులో ఉంటాయి. రోజూ రూ.5 లక్షలకు పైగా వ్యాపారం జరుగుతుంది. ఆశీలు రూపంలో నిర్వాహకులకు పెద్ద ఎత్తున ఆదాయం వస్తున్నా కనీసం సెక్యూరిటీ గార్డు కూడా ఇక్కడ ఉండరు. సాయంత్రం ఆరు.. ఏడు గంటల తరువాత వ్యాపారులంతా దుకాణాలు కట్టేసి వెళ్లిపోతారు. ఆ తరువాత ఆకతాయిలు చొరబడి ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తుంటారు. ఈ నేపథ్యంలో గురువారం అర్ధరాత్రి తరువాత పెద్ద ఎత్తున అగ్నికీలలు చుట్టిముట్టి సర్వం బూడిదైంది. సాక్షి, తగరపువలస (భీమిలి) : ఇక్కడి ప్రైవేట్ మార్కెట్ గురువారం అర్ధరాత్రి తరువాత అగ్నికి ఆహుతైపోయింది. ఈ ప్రమాదంలో 73 దుకాణాలు కాలి బూడిదైనట్టు రెవెన్యూ అధికారులు నిర్ధారణకు వచ్చారు. మొత్తం రూ. 47.29 లక్షల ఆస్తి నష్టం నష్టం సంభంవించినట్లు ప్రాథమిక అంచనా. ఇందులో కాలిపోయిన వస్తువుల విలువే రూ.27.29 లక్షలు, షెడ్ల విలువ రూ. 20 లక్షల వరకు ఉంటుందని రెవెన్యూ అధికారులు చెప్పారు. రాత్రి ఒంటి గంటన్నర ప్రాంతంలో మొదలైన మంటలు తెల్లవారు జామున నాలుగు గంటల వరకు ఎగిసి పడుతూనే ఉన్నాయి. ముందుగా మెయిన్ రోడ్డుకు చేరువలో ఉన్న తట్టలు, చాపలు అంటుకుని ఆరు లైన్లలో ఉన్న దుకాణాలను చుట్టుముట్టడంతో అగ్నికీలలు మార్కెట్‌ను చుట్టుముట్టాయి. ఈ ప్రమాదంలో కాయగూరలు, ఉల్లి, ఫ్యాన్సీ, గాజులు, అరటిపండ్లు, కోడిగుడ్లు, నూనె, కిరాణా, మిర్చి, పసుపు, కుంకుమ, చీపుళ్ల దుకాణాలు కాలిపోయాయి. ఒక్కో వ్యాపారి రూ.50వేల నుంచి రూ.5 లక్షల వరకు నష్టపోయారు. ఇది గుర్తుతెలియని వ్యక్తులు ఉద్దేశపూర్వకంగానే చేసిన పనే అని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. రెండు ఫైరింజన్లు శ్రమించినా.. ప్రమాదం జరిగిన వెంటనే రోడ్డు సేఫ్టీ సిబ్బంది తాళ్లవలస అగ్నిమాపక సిబ్బందిని వెంట పెట్టుకుని ప్రమాద స్థలానికి చేరుకున్నారు. కొద్దిసేపటికే నీరు అయిపోవడంతో నగరం నుంచి మరో ఫైరింజన్‌ను తీసుకువచ్చారు. సమయానికి నీరు అందుబాటులో లేకపోవడంతో మంటలు అదుపులోకి రాలేదు. దీంతో శుక్రవారం మధ్యాహ్నం వరకు మార్కెట్‌ను మిర్చి, మసాలా కాలిన ఘాటు పొగతో నిండిపోయింది. దీంతో రెండు బాబ్కాట్లు, జేసీబీతో మార్కెట్లో బూడిద తరలించడానికి అంతరాయం ఏర్పడింది. తరచూ అగ్ని ప్రమాదాలు.. మార్కెట్లో తరచూ అగ్నిప్రమాదాలు జరుగుతున్నా ఇంత పెద్దఎత్తున ఎప్పుడూ జరగలేదు. వ్యాపారులకు సరైన గిడ్డంగి వసతులు లేకపోవడంతో దుకాణాల్లోనే సామగ్రి భద్రపరచుకుని వెళ్లిపోతుంటారు. ఆరు మండలాలకు కేంద్రంగా ఉన్న ఈ మార్కెట్‌కు ఆశీళ్ల రూపంలో రోజుకు రూ.40 వేలు, ఆదివారం సంత సమయంలో రూ.1.50 లక్షల వరకు ఆదాయం లభిస్తుంది. ప్రతిరోజు రూ.2 కోట్ల విలువైన వస్తువులు ఉంటున్నా ప్రయివేట్ యాజమాన్యం కాపలాదారులను ఉంచకపోవడంపై విమర్శలు వినిపిస్తున్నాయి. దీంతో మందుబాబులు రాత్రి 8 దాటితే మార్కెట్లో దుకాణాలను బార్లుగా మార్చేస్తుంటారు. తిని తాగి దుకాణాలపై ప్రతాపం చూపిస్తుంటారు. ఈ అగ్ని ప్రమాదానికి కూడా మందుబాబులే కారకులై ఉంటారని కొందరు అనుమానిస్తున్నారు. -
యువెల్డన్
తగరపువలస : పిట్ట కొంచెం కూత ఘనం అన్న సామెత తొత్తడి యువల్కు అతికినట్టు సరిపోతుంది. ఆరేళ్ల ఎనిమిది నెలల వయసు గల యువల్ శంకరమఠం వద్ద శ్రీకష్ణ విద్యామందిర్‌లో రెండో తరగతి చదువుతున్నాడు. రామాయణ, మహాభారతాలలో పాత్రల పేర్లు అతడికి కొట్టిన పిండి. అంతేనా జనరల్ నాలెడ్జ్‌లో కూడా పోటీపరీక్షల విద్యార్థులకు దీటుగా సమాధానాలు చెప్పగలుగుతున్నాడు. స్థానిక గీతా ప్రచార సమితి మందిరంలో నిర్వహించిన కార్యక్రమంలో యువల్ ప్రతిభ ప్రదర్శించాడు. ఏడు నిమషాలలో మహాభారతం నుంచి తయారు చేసిన 110 ప్రశ్నలకు గుక్కతిప్పుకోకుండా సమాధానాలిచ్చాడు. వెనువెంటనే మూడు నిముషాల వ్యవధిలో రామాయణంలోని 50 ప్రశ్నాలకు జవాబు చెప్పాడు. ఇక జనరల్ నాలెడ్జ్‌లో అయితే ప్రపంచ దేశాల్లో రాజధానులు, కరెన్సీలు, మంత్రులు, ఓడరేవులు, చరిత్రకు సంబంధించిన ప్రశ్నలను ఎదుర్కొని నిర్వాహకులను అబ్బురపరిచాడు. కేవలం రెండు మాసాల్లోనే ఈ ఘనత.. గత వేసవి సెలవులలో యువల్ టీవీకి అతుక్కుపోకుండా ఉండేందుకు బీఎస్సీ,బీఈడీ పూర్తిచేసిన తల్లి దుర్గ ఆలోచనే పురాణ,ఇతిహాసాలపై యువల్కు ఆసక్తి పెంపొందించగలిగింది. చిన్నపిల్లలకు ఇష్టమైన కార్టూన్ నెట్వర్క్, యానిమేషన్ చిత్రాల ద్వారా వీటిపై అవగాహన కలిగించగలిగింది. ప్రశ్నల రూపంలోనే కాకుండా కథల రూపంలో కూడా రామాయణ,మహాభారతాలను వివరించగలిగింది. దీంతో పాటు ప్రస్తుతం సాయంత్రం వేళల్లో కొంతసమయం జనరల్ నాలెడ్జ్ కోసం కేటాయించడం ద్వారా యువల్ బాలమేధావిగా పలువురి మన్ననలు పొందగలుగుతున్నాడు. యువల్ ప్రతిభను పరీక్షించిన గీతాప్రచారసమితి అధ్యక్షుడు సీహెచ్.అప్పలనాయుడు, ఉపాధ్యాయులు పోతిన సత్యనారాయణ, యాగాటి వెంకటరమణ, ఆర్యవైశ్య మహిళ అధ్యక్షురాలు పలివెల లలిత తదితరులు యువల్ను, అతని తల్లిదండ్రులు శివస్మరణ్,దుర్గలను అభినందించారు. ఇండియన్ బుక్ రికార్డ్స్‌కు.. యువల్లో ప్రతిభను నమోదు చేసేందుకు తల్లిదండ్రులు ఇండియన్ బుక్ రికార్డ్స్, తెలుగు బుక్ రికార్డ్స్‌కు వీడియోలు పంపించారు. త్వరలో వీటిలో యువల్ పేరు నమోదయ్యే అవకాశం ఉందని ఆశాభావం వ్యక్తం చేశారు. -
ఏసీబీకి పట్టుబడిన వీఆర్వో
తగరపువలస: విశాఖ జిల్లా తగరపువలస వీఆర్వో ఏసీబీ అధికారులకు పట్టుబడ్డాడు. తగరపువలసకు చెందిన టి.పరశురామ్ అనే వ్యక్తికి వారసత్వ ధ్రువీకరణ పత్రాన్ని ఇచ్చేందుకు వీఆర్వో కె.ఈశ్వర్రావు లంచం డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలో పరశురామ్ ముందస్తుగా ఏసీబీ అధికారులకు సమాచారం అందించారు. బుధవారం ఉదయం పరశురామ్ నుంచి వీఆర్వో ఈశ్వర్రావు రూ.8వేలు లంచం తీసుకుంటుండగా మాటువేసిన ఏసీబీ అధికారులు ఆయన ను పట్టుకున్నారు. వీఆర్వోని అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశారు. -
ర్యాగింగ్ వల్లే ప్రమాదం: ప్రశాంత్ తండ్రి
విశాఖపట్నం: ర్యాగింగ్ కారణంగా జరిగిన ప్రమాదం వల్లే తమ అబ్బాయి భవనంపై నుంచి కిందపడ్డాడని విద్యార్థి ప్రశాంత్ తండ్రి చెప్పారు. తగరపువలస ఎన్ఆర్ఐ కాలనీ హాస్టల్ 4వ అంతస్తుపై నుంచి నిన్న ప్రశాంత్ కింద పడ్డాడు. ర్యాగింగ్ వల్ల ఇబ్బంది పడుతున్నానని, బయట వేరే రూమ్‌లో ఉంచి చదివించాలని తన కొడుకు ఫోన్లో చెప్పినట్లు ఆయన చెప్పారు. సీఎం పాలెం పోలీసులు కేసు దర్యాప్తు చేసి చర్యలు తీసుకుంటామని చెప్పారు. ** -
రోడ్డు ప్రమాదంలో జూట్ కార్మికుడి మృతి
జీరుపేట(తగరపువలస),న్యూస్‌లైన్: తగరపువలస-భీమునిపట్నం రహదారిలో జీరుపేట కూడలి వద్ద శనివారం జరిగిన రోడ్డుప్రమాదంలో జూట్ కార్మికుడు దుర్మరణం పాలయ్యా డు. మరో విద్యార్థినికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు, పోలీసుల కథనం ప్రకారం.. విజ యనగరం జిల్లా భోగాపురం మం డలం పోలిపల్లికి చెందిన పిన్నింటి చిరంజీవి(30) విజయనగరంలోని అరుణా జూట్‌మిల్లులో కార్మికుని గా పని చేస్తున్నాడు. ఇంటర్ ప్రథమ సంవత్సరం చదువుతున్న తన మేనకోడలు కర్రోతు శ్రీదేవి (16)ని భీమిలిలో బెటర్మెంట్ పరీక్షల కోసం ద్విచక్రవాహనంపై తీసుకెళ్తున్నాడు. జీరుపేట కూడలి వద్దకు వచ్చేసరికి భీమిలి నుంచి తగరపువలస వైపు వేగంగా వస్తున్న గూడ్స్ ఆటో వీరిని ఢీకొంది. ఆటో ముందు భాగంలో అద్దం వద్ద అమర్చిన రేకు అంచులు చిరంజీవి భుజాన్ని నడుం వరకు చీరేసి పదిగజాల దూరంలో విసిరేసింది. దీంతో అతను అక్కడికక్కడే మృతి చెందా డు. చిరంజీవి మృతదేహాన్ని చూసి బంధువులు కన్నీరుమున్నీరుగా విలపించారు. మృతునికి ఏడాది న్నర క్రితం వివాహమైంది. ప్రస్తుతం అతని భార్య గర్భిణి. ఇదే ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన శ్రీదేవిని సంగివల స ఎన్ఆర్ఐ జనరల్ ఆస్పత్రికి తరలించారు. ఆనందపురం ట్రాఫిక్ ఎస్ఐ సూర్యారావు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
తగరపువలసలో వైఎస్ జగన్ ప్రసంగం
-
ఎన్నికల కిక్కు.. తమ్ముళ్ల తలకెక్కు!
తగరపువలస,న్యూస్‌లైన్: అసలే ఎన్నికలు.. ఆపై నామినేషన్లు.. ఇక తమ్ముళ్ల సందడికి అంతేముందీ? అంతే.. మూడు సీసాలు, ఆరు‘గళాసుల’ తీరులో ఉత్సాహం ఉరకలు వేసింది.. ఎంపీటీసీ నామినేషన్ల చివరిరోజైన గురువారం భీమిలిలో తెలుగుదేశం కార్యకర్తల ‘క్రమశిక్షణ’ మాబాగా కనిపించింది. ఓపక్క అభ్యర్థులు నామినేషన్లు వేస్తుండగా కార్యకర్తలు పచ్చటోపీలు,కండువాలు దరించి రోడ్లపై తూలుతూ సందడి చేయడం ‘ఔరా’ అనిపించింది. -
గాడిద పాలకు యమ గిరాకీ!
కడివేనైననేమి ఖరము పాలు అనే మాట పాతబడి పోయింది. గాడిద పాలు గుక్కెడైన చాలు అంటున్నారు విశాఖ జిల్లా వాసులు. గాడిద పాల కోసం ఎగ బడుతున్నారు. దీంతో ఖరము పాలకు విశాఖ జిల్లాలో గిరాకీ పెరిగింది. గాడిద పాలు తాగితే ఆస్తమా, ఉబ్బసం, నెమ్ము, ఆయాసం, దగ్గు వంటి రోగాలు రావన్న నమ్మకంతో వీటిని కొనేందుకు ప్రజలు ముందుకు వస్తున్నారు. ఇటీవల పెరిగిన చలికి సామాన్యులే వణికిపోతున్నారు. ఇక జలుబు, ఉబ్బసంతో బాధపడేవారి పరిస్థితి మరీ దారుణం. అలాంటివారికి గాడిదపాలు ఔషధంలా పనిచేస్తాయని అంటున్నారు విశాఖ వాసులు. ముఖ్యంగా భీమిలి, తగరపువలసలో ఈ నమ్మకం బాగా ఎక్కువగా ఉంది. దాంతో అక్కడ గాడిదపాలకి గిరాకీ ఎక్కువైంది. వీధుల్లో తిరుగుతూ గాడిద పాలు అమ్ముతున్న వారి వద్ద స్థానికులు క్యూ కడుతున్నారు. గాడిదను వెంట బెట్టుకుని ఇళ్లకు వద్దకు వచ్చి అక్కడికక్కడే పిండి ఇస్తున్న పాల కోసం ఎగబడుతున్నారు. అయితే గాడిద పాలు కొనాలంటే చుక్కలు కనిపిస్తున్నాయి. మిల్లీలీటర్ల పాలకే వందల రూపాయలు పెట్టాల్సివస్తోంది. లీటర్ పాలు 5 వేల రూపాయల వరకు పలుకుతున్నాయి. అన్ని గ్రామాల్లో ఈ పాలకు డిమాండ్ ఉందని గాడిదలను తీసుకొచ్చిన వారు చెబుతున్నారు. పలు చోట్ల పాలను అమ్ముతున్నట్లు వారు చెబుతున్నారు. గాడిద పాలతో ఉపయోగముందో తెలియదు గాని జనం మాత్రం ఎగబడి పాలను కొంటున్నారు. -
విభజనపై ముందుకెళితే తీవ్ర నిర్ణయాలు: గంటా
తగరపువలస: రాష్ట్ర విభజనపై కాంగ్రెస్ అధిష్టానం ముందుకు వెళితే తీవ్రమైన నిర్ణయాలు తీసుకుంటామని మంత్రి గంటా శ్రీనివాసరావు పేర్కొన్నారు. సోమవారం విశాఖ జిల్లా భీమునిపట్నంలో రచ్చబండ ప్రారంభం అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. అధిష్టానం ఓట్లు, సీట్లు కోసమే రాష్ట్ర విభజనకు పూనుకున్నదన్న సంకేతాలు ప్రజల్లోకి వెళుతున్నాయన్నారు. కాంగ్రెస్‌కు దేశంలో అనేక రాష్ట్రాల్లో సీట్లు బాగా తగ్గిపోయిన సందర్భంలో ఆంధ్రప్రదేశ్‌లో సాధించిన సీట్లు ప్రభుత్వ ఏర్పాటులో కీలకంగా మారాయన్నారు. కొందరు ఢిల్లీ పెద్దల కన్ను ఆంధ్రపై పడిందని.. అందుకే రాష్ట్రాన్ని ముక్కలు చేయడానికి పూనుకున్నారని విమర్శించారు. అయితే కేంద్రం తెలుగు ప్రజల మనోభావాలను గౌరవిస్తుందనే నమ్మకముందన్నారు. వెస్టిండీస్-ఇండియా మ్యాచ్‌ను తాము అడ్డుకుంటామని వస్తున్న కథనాలను ఖండించారు. భీమిలి పోర్టు పనులు త్వరలో ప్రాంరంభమవుతాయని చెప్పారు. ప్రాజెక్టు రిపోర్టు కోసం కన్సెల్టెన్సీకి అప్పగించామన్నారు.