తగరపువలస: విశాఖ జిల్లా తగరపువలస వీఆర్వో ఏసీబీ అధికారులకు పట్టుబడ్డాడు. తగరపువలసకు చెందిన టి.పరశురామ్ అనే వ్యక్తికి వారసత్వ ధ్రువీకరణ పత్రాన్ని ఇచ్చేందుకు వీఆర్వో కె.ఈశ్వర్రావు లంచం డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలో పరశురామ్ ముందస్తుగా ఏసీబీ అధికారులకు సమాచారం అందించారు. బుధవారం ఉదయం పరశురామ్ నుంచి వీఆర్వో ఈశ్వర్రావు రూ.8వేలు లంచం తీసుకుంటుండగా మాటువేసిన ఏసీబీ అధికారులు ఆయన ను పట్టుకున్నారు. వీఆర్వోని అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశారు.