
రోడ్డు ప్రమాదంలో జూట్ కార్మికుడి మృతి
జీరుపేట(తగరపువలస),న్యూస్‌లైన్: తగరపువలస-భీమునిపట్నం రహదారిలో జీరుపేట కూడలి వద్ద శనివారం జరిగిన రోడ్డుప్రమాదంలో జూట్ కార్మికుడు దుర్మరణం పాలయ్యా డు. మరో విద్యార్థినికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు, పోలీసుల కథనం ప్రకారం.. విజ యనగరం జిల్లా భోగాపురం మం డలం పోలిపల్లికి చెందిన పిన్నింటి చిరంజీవి(30) విజయనగరంలోని అరుణా జూట్‌మిల్లులో కార్మికుని గా పని చేస్తున్నాడు. ఇంటర్ ప్రథమ సంవత్సరం చదువుతున్న తన మేనకోడలు కర్రోతు శ్రీదేవి (16)ని భీమిలిలో బెటర్‌మెంట్ పరీక్షల కోసం ద్విచక్రవాహనంపై తీసుకెళ్తున్నాడు.
జీరుపేట కూడలి వద్దకు వచ్చేసరికి భీమిలి నుంచి తగరపువలస వైపు వేగంగా వస్తున్న గూడ్స్ ఆటో వీరిని ఢీకొంది. ఆటో ముందు భాగంలో అద్దం వద్ద అమర్చిన రేకు అంచులు చిరంజీవి భుజాన్ని నడుం వరకు చీరేసి పదిగజాల దూరంలో విసిరేసింది. దీంతో అతను అక్కడికక్కడే మృతి చెందా డు. చిరంజీవి మృతదేహాన్ని చూసి బంధువులు కన్నీరుమున్నీరుగా విలపించారు. మృతునికి ఏడాది న్నర క్రితం వివాహమైంది. ప్రస్తుతం అతని భార్య గర్భిణి. ఇదే ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన శ్రీదేవిని సంగివల స ఎన్‌ఆర్‌ఐ జనరల్ ఆస్పత్రికి తరలించారు. ఆనందపురం ట్రాఫిక్ ఎస్‌ఐ సూర్యారావు కేసు దర్యాప్తు చేస్తున్నారు.