అన్లైన్ ఫ్యాషన్.. సేవల ఓషన్
శ్రీనగర్‌కాలనీలో నివసించే దివ్య గచ్చిబౌలిలోని బొటిక్‌లో డ్రెస్ స్టిచ్చింగ్ కి ఇచ్చారు.. స్టిచ్చింగ్ పూర్తయ్యాక వాళ్ల ఇంటికి ర్యాపిడో ద్వారా పంపారు. తీరా ఇంటికి వచ్చిన డ్రెస్ ధరించి చూస్తే కొన్ని ఆల్టరేషన్స్ అవసరం అని అర్థమైంది.. బొటిక్ వారిని సంప్రదిస్తే.. తమకు ఆ డ్రెస్‌ని ఇస్తే ఆల్టరేషన్స్ చేసి మరో రెండు రోజుల్లో పంపిస్తామన్నారు. కానీ దివ్య అదే రోజు ఫంక్షన్‌కు వెళ్లాల్సి ఉంది.. మరేం చేయాలి? ‘ఇలాంటి సమస్య మాతో రాదు మేం డ్రెస్‌ని మాత్రమే ఇంటికి పంపం. టైలర్, కుట్టుమిషన్‌తో సహా పంపిస్తాం. ఏవైనా మార్పు చేర్పులు ఉంటే క్షణాల్లో చేసేసి ఇస్తాం’ అంటోంది ఓ ఆన్లైన్ స్టిచ్చింగ్ సంస్థ. అమెరికాలో ఉంటున్న నగరవాసికి సిటీలోని ఓ ప్రముఖ వస్త్ర షోరూమ్‌లో ఓ చీర నచ్చింది. అయితే అది కొని తన దగ్గరకు పంపించినా, ఆ చీరకు మ్యాచింగ్ బ్లౌజ్, సీకో వర్క్ వగైరాల కోసం అమెరికాలో వెదకడానికి సమయంతో పాటు వ్యయం కూడా ఎక్కువే..! మరేం చేయాలి? ‘అంత కష్టం మీకక్కర్లేదు. ఆ షోరూమ్‌లో మీరు కొన్న చీర నేరుగా మాకే వస్తుంది. దానికి అవసరమైన బ్లౌజ్, వర్క్స్ పూర్తి చేసి భద్రంగా అమెరికా చేర్చే బాధ్యత మాదే’ అంటోంది మరో స్టిచ్చింగ్ సంస్థ. ఒకటా రెండా.. దుస్తులు/ఫ్యాబ్రిక్స్ కొనడం, వాటిని కుట్టించడం, అంతేనా.. అందంగా చీర కట్టించడం.. దాకా కాదు ఏ సేవాకు ఆన్లైన్లో అసాధ్యం అంటున్నాయి నగరంలో పుట్టుకొచి్చన పలు ఆన్లైన్ ఫ్యాషన్ బ్రాండ్స్. దాదాపు రెండేళ్ల క్రితం ప్రారంభమైన ఆన్లైన్ టైలరింగ్ సేవలు ఇంతింతై వటుడింతై అన్నట్టు విజృంభిస్తూ.. అనూహ్యమైన రీతిలో దూసుకుపోతున్నాయి. ఈ తరహా ఆన్లైన్ విప్లవాలకు సారథ్యం వహిస్తున్న సంస్థల్లో అత్యధిక భాగం మహిళల ఆధ్వర్యంలోనే ఉండడం విశేషం. యాప్‌లోని మార్కెట్ ప్లేస్ ద్వారా.. ‘పలు చోట్ల పరిమిత విస్తీర్ణంలో ఎక్స్‌క్లూజివ్ బ్రాండెడ్ ఔట్లెట్స్ ఏర్పాటు చేశాం. వీటిలో ఒక డిజైనర్, ఒక కుట్టుమిషన్ వగైరాలు అందుబాటులోకి తెచ్చాం. కస్టమర్లు నేరుగా సంప్రదింపులు చేసి అక్కడే ఆర్డర్స్ ఇచ్చి వెళ్లొచ్చు. చిన్న చిన్న ఆల్టరేషన్స్ కూడా చేయించుకోవచ్చు.. ఇలాంటివెన్నో కస్టమైజ్డ్ డ్రెస్సింగ్‌కు జత చేస్తున్నాం. అలాగే కస్టమర్స్ మా యాప్‌లోని మార్కెట్ ప్లేస్ ద్వారా నగరంలోని పలు షోరూమ్స్ నుంచి కొనుగోలు చేసిన చీరలు, డ్రెస్‌మెటీరియల్స్ మాకు చేరిపోతాయి. వాటికి అవసరమైన హంగులన్నీ జతచేసి తిరిగి కస్టమర్‌కు చేరవేసే బాధ్యత మాది. చీరకు బ్లౌజ్ వగైరాలు కుట్టడం మాత్రమే కాదు, అవసరమైతే చీర కట్టడం కూడా మా సిబ్బందే చేస్తారు.. విభిన్న రకాల శారీ డ్రేపింగ్స్ సైతం చేస్తారు. అంటూ నగరవాసులకు తాము అందిస్తున్న సేవల జాబితాను ‘సాక్షి’కి వివరించారు సుషి్మత. నగరవ్యాప్తంగా దాదాపుగా 80కిపైగా డిజైనర్లు, పదుల సంఖ్యలో షోరూమ్స్‌తో కలిసి పనిచేస్తున్నామని చెప్పారామె. నగరంలో మాత్రమే కాకుండా బెంగళూరు, చెన్నై తదితర నగరాల్లోనూ క్లౌడ్ టైలర్ సేవలు అందుబాటులో ఉన్నాయన్నారు.సాఫ్ట్వేర్ నుంచి డిజైనర్ వేర్ దాకా.. ‘ఐటీ బ్యాక్‌గ్రౌండ్ లేకుండా ఇప్పుడు ఏ సంస్థ లేదండీ. అలా చూస్తే ఇప్పుడు అన్నీ సాఫ్ట్వేర్ కంపెనీలే’ అంటారు సుషి్మత. మంచి ఆదాయాన్నిచ్చే కార్పొరేట్ ఉద్యోగాన్ని వదులుకుని, అంతకు మించిన ఆత్మసంతృప్తిని ఆశిస్తూ.. ఓ రెండేళ్ల క్రితం నగరంలో క్లౌడ్ టైలర్ పేరిట టైలరింగ్ సేవల్ని ప్రారంభించా. ఇంటి దగ్గరకే వచ్చి కొలతలు తీసుకుని ఫ్యాబ్రిక్స్ తీసుకెళ్లి, స్టిచి్చంగ్ పూర్తి చేసి తిరిగి ఇంటికే తెచ్చి ఇవ్వడం అనే ఏకైక సేవతో వేసిన తొలి అడుగుకే అద్భుతమైన స్పందన వచి్చంది. దీంతో ఇనుమడించిన ఉత్సాహంతో మా సేవల్ని కూడా విస్తరించాం. – సుష్మిత లక్కాకుల, ఫ్యాషన్ డిజైనర్కుట్టుమిషన్తో సహా పంపిస్తాం.. విదేశాల్లో ఎక్స్‌పోర్ట్స్, ఇంపోర్ట్స్ బిజినెస్‌లు చేసిన అనుభవం ఉన్న రుహిసుల్తానా.. నగరానికి వచ్చి ఆన్లైన్ టైలరింగ్ సేవల్ని అర్బన్ సిలాయీ పేరుతో ప్రారంభించారు. అనతికాలంలోనే పెద్ద సంఖ్యలో కస్టమర్లకు చేరువయ్యారు.. పిక్, స్టిచ్, డెలివర్ అనే కాన్సెప్‌్టతో ఆమె ప్రారంభించిన ఈ సంస్థ పూర్తిగా ఆన్లైన్ ద్వారా తమ కార్యకలాపాలు నిర్వర్తిస్తున్నారు. ‘ఇప్పుడీ రంగంలో మరికొందరు కూడా ఉన్నారు. అయితే చెప్పిన సమయానికి ఏ మాత్రం తేడా రాకుండా ఖచ్చితత్వంతో ఇచ్చే డెలివరీలో మాకు సాటి లేదు. అదే విధంగా ఇంటికి డ్రెస్ మాత్రమే కాదు ఆల్టరేషన్స్ అవసరమైతే కస్టమర్ కళ్ల ముందే దాన్ని కంప్లీట్ చేయడానికి ఓ మాస్టర్ని కుట్టుమిషన్‌తో సహా పంపిస్తాం’ అంటూ చెప్పారు. బంజారాహిల్స్‌లో ఓ కార్యాలయాన్ని నిర్వహిస్తున్నా.. విదేశాల్లో సైతం మాకు కస్టమర్స్ ఉన్నారు. వారికి షిప్పింగ్ ద్వారా సేవలు అందిస్తున్నాం. త్వరలోనే ఇతర నగరాలకూ విస్తరించనున్నాం. – రుహిసుల్తానా, అర్బన్ సిలాయీ నిర్వాహకురాలు