కశ్మీర్ స్వేచ్ఛ కోసం పాక్ ఉగ్రవాది సంస్థ!
ఇస్లామాబాద్: జమాత్ ఉద్ దవా కార్యక్రమాలపై పాకిస్థాన్ ప్రభుత్వం నిఘా పెట్టడం.. ఆ సంస్థ అధినేత, ఉగ్రవాది హఫీజ్ సయీద్‌ను గృహ నిర్బంధం చేసిన నేపథ్యంలో తెరవెనక సరికొత్త పరిస్థితులు చోటుచేసుకుంటున్నాయి. ముంబయి దాడుల సూత్రధారి అయిన హఫీజ్.. తన గృహనిర్బంధానికి వారం ముందే కశ్మీర్ స్వేచ్ఛ కోసం తెహ్రీక్ ఎ ఆజాదీ జమ్మూకశ్మీర్(టీఏజేకే) అనే సంస్థను ప్రారంభిస్తున్నట్లు సూచించాడు.
ఆ మేరకే సయీద్ ఆధ్వర్యంలో పనిచేస్తున్న జమాత్ ఉద్ దవా, ఫలా ఎ ఇన్సానియత్ ఫౌండేషన్ల కార్యక్రమాలను టీఏజేకే అనే కొత్త సంస్థ పేరుతో చేపట్టేందుకు రంగం సిద్ధంచేశాడని అధికారులు ధ్రువీకరిస్తున్నారు. వేర్పాటువాదులు ఫిబ్రవరి 5న పాకిస్థాన్‌లో కాశ్మీర్ డే పేరుతో కార్యక్రమం జరుపుతారు. దానికి సంబంధించిన బ్యానర్లు తెహ్రీక్ ఎ ఆజాదీ జమ్ము కశ్మీర్ పేరుతో లాహోర్ చుట్టుపక్కల ప్రాంతాల్లో కన్పించాయి.