13 ఏళ్ల నాటి విషాద ఛాయలు..రతన్ టాటా ఆవేదన
ముంబై: ముంబైలో 26/11 ఉగ్రదాడులు జరిగి నేటికి 13 ఏళ్లు అవుతున్నాయని, పైగా ఆనాటి విషాదాంతాన్ని అంత తేలికగా మర్చిపోలేమంటూ దిగ్గజ పారిశ్రామికవేత్త, టాటా గ్రూప్ మాజీ ఛైర్మన్ రతన్ టాటా ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు నాటి ఉగ్రదాడుల్లో ధ్యంసం అయిన తాజ్ మహల్ ప్యాలెస్ చిత్రాన్ని ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేస్తూ నాటి దాడులకు సంబంధించిన విషాధ ఛాయలను నెటిజన్లుతో పంచుకున్నారు.
(చదవండి: కొడుక్కి అరుదైన వ్యాధి.. తండ్రి హైస్కూల్ డ్రాపవుట్.. సొంతంగా మందు తయారీ)
ఈ మేరకు రతన్ టాటా మాట్లాడుతూ.... 13 సంవత్సరాల క్రితం మేము అనుభవించిన బాధ, కోల్పోయినవారిని ఎప్పటికీ తిరిగి పొందలేం. అయితే మనం కోల్పోయిన వారిని గౌరవించడం ద్వారా మనల్ని విచ్ఛిన్నం చేయడానికి ఉద్దేశించి జరిపిన ఉగ్రదాడుల తాలుకా స్మృతులను మన బలానికి మూలంగా మార్చుకోవాలి" అని అన్నారు. అంతేకాదు ఆనాటి ఉగ్రదాడిలో ప్రాణాలను పణంగా పెట్టి పోరాడిని అమరవీరులకు రతన్‌టాటా ఈ సందర్భంగా నివాళులర్పించారు. అయితే నవంబర్ 26, 2008న ముంబైలో నాలుగు రోజుల పాటు జరిగిన భయంకరమైన ఉగ్రదాడిలో సుమారు 166 మంది మృతి చెందడమే కాక దాదాపు 300 మందికి పైగా గాయపడిన సంగతి తెలిసిందే. ఈ మేరకు రతన్ టాటా ఇన్‌స్టాగామ్‌లో చేసిన ఈ పోస్ట్ ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ అవుతోంది.
(చదవండి: ఒక్క యాక్సిడెంట్!...ఆరు కార్లు ధ్వంసం !: షాకింగ్ వైరల్ వీడియో)
View this post on Instagram
A post shared by Ratan Tata (@ratantata)